sonykongara Posted August 31, 2016 Author Posted August 31, 2016 Police tech-tower at Mangalagiri Guntur: The AP police will build a dedicated office from where officials will use technology to deal with crime. The four-storey tech tower costing `10.67 crore is expected to be built in Mangalagiri in the capital region. The state government on Wednesday approved DGP J.V. Ramudu's proposals to set up the office. According to the police, the Police Computer Services and Standardisation and Police Communications Organisation will be housed in the tower. Mr Ramudu said that in view of criminals using advanced technology and communications, the police had proposed to bring its two technological wings, the PCS &S and PCO, under one umbrella. The building with state of the art equipment is proposed to be built in a 5,000-square metre area in the premises of the APSP’s 6th Batallion at Mangalagiri. The Tech Tower will have an area of 34,100 sq. ft overall, with 8,525 sq. ft in each floor. The building will be structurally designed to allow for an additional two floors at a later date. Since 1948, the PCO provides communication facilities to the police and requires a lot of tech support and space to operate in view of the increased responsibilities. The PCS&S, set up in 1999, oversees the computerisation of police facilities and has facilities to develop software applications, capacity building, design and standardising departmental procedures.
sonykongara Posted October 3, 2016 Author Posted October 3, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/373712-ap-police/
sonykongara Posted October 3, 2016 Author Posted October 3, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/379709-dna-index-system/?hl=police&do=findComment&comment=1312553405
sonykongara Posted October 5, 2016 Author Posted October 5, 2016 కనిపించని నాలుగో సింహం! టెక్నాలజీకి పోలీసుల పెద్దపీట.. ప్రతి జిల్లాలో కమాండ్ కంట్రోళ్లు బెజవాడ తరహాలో అనంతలో నిఘా పర్యవేక్షణ కేంద్రం ట్వీట్లకూ స్పందిస్తున్న గుంటూరు అర్బన్ పోలీసులు టెక్నాలజీ బాటలో అన్ని జిల్లాల ఎస్పీలు అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): టెక్నాలజీతో నేరగాళ్ల ఆట ఎలా కట్టించవచ్చో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ చెబుతోంది. కృష్ణా పుష్కరాల సందర్భంగా విజయవాడలో నెలకొల్పిన సెంట్రల్ కమాండ్ కంట్రోల్ మూడు జిల్లాల్లో మొత్తం పుష్కర కార్యక్రమాలు సజావుగా నడిచేందుకు దోహదపడింది. పుష్కర ఘాట్లలో రద్దీ మొదలుకొని కృష్ణమ్మ దారుల్లో ట్రాఫిక్ వరకూ ఎప్పటికప్పుడు తెలియజేసింది. దొంగలను సైతం పట్టించి భక్తుల సొమ్మును కాపాడి.. పోలీసులకు అండగా నిలిచింది. ఈ క్రమంలో.. టెక్నాలజీకి అధిక ప్రాధాన్యమిచ్చే సీఎం చంద్రబాబు, డీజీపీ సాంబశివరావు ఆలోచనలకు అనుగుణంగా జిల్లా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రాజమండ్రి, గుంటూరు, తిరుపతి అర్బన్ జిల్లాల్లో ఈ ప్రక్రియ కొంత ఊపందుకోగా అక్ష ర క్రమంలో ముందుండే అనంతపురం జిల్లాలో పోలీసులు టెక్నాలజీ వినియోగంలోనూ ముందున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి సంఘవిద్రోహ శక్తుల పాలిట నాలుగో సింహమయ్యారు. ముఖ్యమంత్రి విజన్... డీజీపీ దార్శనికతతో టెక్నాలజీని అందిపుచ్చుకొని వేగంగా అడుగులేస్తూ.. బెజవాడ కమాండ్ కంట్రోల్ తరహాలో అనంతలోనూ నిఘా పర్యవేక్షణ కేంద్రాన్ని (సర్వైలెన్స్ సెంటర్) ఏర్పాటు చేశారు. అక్కడ కెమెరాల ఫుటేజీని నిరంతరం పర్యవేక్షిస్తూ ట్రాఫిక్ నియంత్రణతోపాటు దొంగతనాల కేసులను ఛేదిస్తున్నారు. ఈ ప్రత్యేక నిఘాతో ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులేర్పడితే అక్కడకు సిబ్బందిని హుటాహుటిన పంపుతున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే మూడో కన్నుతో చూసి పోలీసు సిబ్బందిని మోహరింపజేస్తున్నారు. మెట్రోపాలిటన్ నగరాల్లో ఉన్న తరహాలో ఈ-చలానా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బందిపై అవినీతి ఆరోపణల్లేకుండా, ఉల్లంఘించిన వాహన చోదకులు తప్పించుకొనే వీల్లేకుండా ఈ-చలానా ఇంటికి పంపుతున్నారు. ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇస్తోన్న పోలీసులు జిల్లాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. మొదటి అడుగులో ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రెండో అడుగు సబ్ డివిజన్లకు, మూడో అడుగు సర్కిళ్లకు అలా స్టేషన్ స్థాయికి తీసుకెళతామంటున్నారు. అనంతపురంలో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి టెక్నాలజీ గురించి మాట్లాడుతూ.. వారం క్రితం ఓ మహిళ ఒక షాపు ముందు కారు ఆపి లోపలకు వెళ్లివచ్చేలోపు అందులో ఉన్న డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఇద్దరు దొంగలను కొద్ది గంటల్లోనే పట్టుకొని డబ్బు రికవరీ చేశామని చెప్పారు. ఈ-చలానా ఇంటికి పంపినప్పుడు తాను ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడలేదని చెప్పిన యువకుడికి.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తున్న ఫోటో చూపించారు. అతడు జరిమానా కట్టక తప్పలేదు. ఇటీవల ఒక నాయకుడు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఎవరో రాయి విసిరినట్లు.. ఆయన చేతికి గాయమైనట్లు ఆ నాయకుడికి చెందిన టీవీలో ప్రసారం చేశారు. కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఫుటేజీ పరిశీలించిన పోలీసులు.. పార్టీ జెండా కర్ర ఆ నాయకుడికి తగిలిందని కనిపెట్టారు. ఆ వీడియో ఫుటేజీని చూపించడంతో ఆ పార్టీ కార్యకర్తలు హడావుడి తగ్గించారు. అనంతపురం పురపాలక సంఘం 80 కెమెరాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు 120 కెమెరాల ఏర్పాటుకు సహకరించగా.. రూ.90 లక్షల ఖర్చుతో నూతనంగా ఈ నిఘా పర్యవేక్షణ కేంద్రాన్ని నిర్మించి అనంతపురం మొత్తాన్ని నిఘా గుప్పిట్లోకి తీసుకున్నారు. ఒక సీఐ నేతృత్వంలో మెరికల్లాంటి సిబ్బందిని నియమించి వారి ద్వారా గమనిస్తూ పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతలు, ట్రాఫిక్‌పై పర్యవేక్షిస్తున్నారు. సర్వైలెన్స్ బ్రహ్మాస్త్రం: ఎస్పీ ముఖ్యమంత్రి విజన్... డీజీపీ దార్శనికతను అందిపుచ్చుకుని జిల్లాలో టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నట్లు టెక్నాలజీ వినియోగం విషయమై అనంతపురం ఎస్పీ రాజశేఖర్‌బాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా అనంతపురంలో టెక్నాలజీని బలోపేతం చేసున్నామని చెప్పారు. నగరాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఈ సర్వైలెన్స్ సెంటర్ ద్వారా నడిచే కార్యక్రమాలను మొబైల్ యాప్ ద్వారా అప్లోడ్ చేస్తున్నట్లు వివరించారు. మూడోదశలో.. మరింత అభివృద్ధి చేసి టెక్నాలజీ ద్వారా లభించే ఫలాలను సత్వరమే ప్రజలకు చేర్చుతున్నట్లు తెలిపారు. నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. ఈ సమస్యలన్నిటికీ టెక్నాలజీనే బ్రహ్మస్త్రం, అందుకే అనంత మొత్తంలో నిఘా పెట్టాం... తర్వాత సబ్ డివిజన్, ఆ తర్వాత సర్కిళ్లకు తీసుకెళ్లి దొంగతనాలే కాదు బైకుపై సెల్‌ఫోన్ డ్రైవింగ్, ఆటోల్లో ఓవర్‌లోడ్ ఎక్కించాలన్నా భయపడాల్సిందేనన్నారు. ఫలితంగా నేరాల నియంత్రణ, ప్రమాదాలు తగ్గి ప్రాణాలను కాపాడిన ఘనత టెక్నాలజీకి దక్కుతుందన్నారు. నేర రహిత జిల్లాగా అనంతపురాన్ని తీర్చిదిద్దడమే తన లక్ష్యంగా పేర్కొన్నారు. ట్వీట్ చేస్తే స్పాట్‌కు.. రాష్ట్ర రాజధాని పరిధిలో ఉండే గుంటూరు అర్బన్ పోలీసులు మరో అడుగు ముందుకేసి.. ట్వీట్ చేస్తే చాలు ఘటనా స్థలానికి వచ్చేస్తామంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ ఆండ్రాయిడ్ ఫోన్లు ఉండడంతో వాట్సాప్, ట్విట్టర్, వెబ్సైట్ ద్వారా పోలీసు సేవలందిస్తున్నారు. ఇంటర్నెట్ ద్వారా పోలీసు సేవలను ఇటీవలే అర్బన్ జిల్లా ఎస్పీ త్రిపాఠి ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిన నేటి యుగంలో సీఎం చంద్రబాబు స్పూర్తితో ప్రజలకు పోలీసింగ్‌ను మరింత దగ్గర చేసేందుకు టెక్నాలజీని విరివిగా వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఇదే బాటలో కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు నడుస్తున్నాయి. వీలైనంత త్వరలో రాష్ట్రమంతా జిల్లా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత సబ్ డివిజన్లకు, సర్కిళ్లకు, చివరకు పోలీసుస్టేషన్ పరిధిలోకి మూడోకన్నును తీసుకెళ్లి మెరుగైన పోలీసింగ్ నిర్వహించాలనేది అన్ని జిల్లాల ఎస్పీల లక్ష్యం. జాతర్లపై కమాండ్ కంట్రోల్ రాష్ట్రంలో జరిగే జాతర్లు, పండుగలు, ఇతరత్రా ఆందోళనలు, బహిరంగ సభల ప్రదేశాల్లో మొబైల్ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తమవుతోంది. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడతోపాటు కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సెంట్రల్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించిన పోలీసులు... ఇకపై జిల్లాల్లోనూ కమాండ్ కంట్రోళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లా పోలీసులు ఇప్పటికే ఈ విషయంలో ముందుండగా మిగతా జిల్లాల్లోనూ కసరత్తు జరుగుతోంది. ఒక్కో డీఐజీ పరిధిలో ఒక మొబైల్ కమాండ్ కంట్రోల్‌ను ఏర్పాటుచేసి ఆయా జిల్లాల పరిధిలో జరిగే జాతర్లు, ఆందోళనలు, బహిరంగ సభల్లో వినియోగించాలని పోలీసు శాఖ యోచిస్తోంది. ఒక బస్సులో కమాండ్ కంట్రోల్‌కు సంబంధించిన వీడియో ఫుటేజ్ విశ్లేషణ, ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పర్యవేక్షణ చూసేందుకు సిబ్బందిని నియమిస్తారు. మొదట ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మూడు వాహనాలను ఏర్పాటుచేసి.. ఆతర్వాత డీఐజీల పరిధిలో ఏర్పాటు చేయాలని అనుకొంటున్నట్లు తెలిసింది.
sonykongara Posted October 28, 2016 Author Posted October 28, 2016 (edited) v Edited December 16, 2024 by sonykongara
sonykongara Posted December 13, 2016 Author Posted December 13, 2016 ఏపీలో త్వరలో కమ్యూనిటీ పోలీసింగ్ రెండో విడతలో గుంటూరుకు అవకాశం డీజీపీ నండూరి సాంబశివరావు గుంటూరు: త్వరలో జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. నగరంలోని పాతగుంటూరు, నగరంపాలెంలో నిర్మాణంలో ఉన్న ఆదర్శ పోలీస్స్టేషన్ల పనులను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానం విజయవంతమైందని, దానిని ఈ నెల 15 నుంచి తొలి విడత నెల్లూరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. రెండో విడత జాబితాలో గుంటూరును చేరుస్తామన్నారు. తక్కువ సిబ్బందితో ఎక్కువ పోలీసింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే సాధారణ ప్రజలు పోలీసుల విధుల్లో భాగం పంచుకోవడమేనన్నారు. ఆసక్తి ఉన్న ప్రజలను ఎంపిక చేసి కమ్యూనిటీ పోలీసింగ్ ఆఫీసర్లు (సీపీవో)గా గుర్తిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో 2,500 మంది పోలీసులు ఉంటే సిపివోలు నాలుగు వేల మంది వరకు ఉన్నారని తెలిపారు. ట్రాఫిక్, జాతరలు, ఉత్సవాల వద్ద, రాత్రి గస్తీ వంటి విధులకు సీపీవోలను వినియోగించుకుంటామని చెప్పారు. బీటెక్ విద్యార్థులను పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా వినియోగించుకుంటామన్నారు. స్వయం నియంత్రణపై అవగాహన ప్రజల్లోనూ స్వయం నియంత్రణపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎవరికి వారు తామే పోలీస్‌గా భావించి ముందుకు వెళితే పోలీసుల అవసరం ఉండదన్నారు. పెద్ద పెద్ద జాతరుల సమయంలో స్వయం నియంత్రణ ఉందనే విషయం స్పష్టం అవుతుందన్నారు. దానికి తోడు సీపీవోలను నియమిస్తే పోలీస్ సిబ్బంది అవసరం లేకుండానే కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని తెలిపారు. సీపీవోలు ఎటువంటి అవకతవకలు, దుర్వినియోగం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని తీసుకోబోమన్నారు. వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటామన్నారు. పోలీస్ శాఖలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇప్పటికే ఖాకీ డ్రస్‌లో కాకుండా ప్రత్యేక వేషధారణలో పోలీస్ సేవాదళ్ పేరుతో సిబ్బంది సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. త్వరలో కొత్త తరం పోలీసులను ప్రజలు చూస్తారని తెలిపారు.ఆదర్శ పోలీస్ స్టేషన్లు అత్యాధునిక సదుపాయాలు, హంగులతో పోలీస్ స్టేషన్లను నిర్మించనున్నట్లు డీపీజీ స్పష్టం చేశారు. గుంటూరులో రెండు ఆదర్శ పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో వాటిని ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. లాకప్‌లోనూ ఫ్యాన్, మంచం వంటి సదుపాయాలు ఉంటాయన్నారు. పోలీస్ స్టేషన్ అంతా ఎయిర్ కండీషన్‌తో ఉంటుందని, స్టేషన్ అంతా అద్దాలే అమరుస్తామని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి మంచి వాతావరణం కలిగిస్తామని తెలిపారు.
AP_RaituBidda Posted December 13, 2016 Posted December 13, 2016 news and news paper chuse pani leedu mee posts ki
MVS Posted December 14, 2016 Posted December 14, 2016 ఏపీలో త్వరలో కమ్యూనిటీ పోలీసింగ్ రెండో విడతలో గుంటూరుకు అవకాశం డీజీపీ నండూరి సాంబశివరావు గుంటూరు: త్వరలో జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ నండూరి సాంబశివరావు తెలిపారు. నగరంలోని పాతగుంటూరు, నగరంపాలెంలో నిర్మాణంలో ఉన్న ఆదర్శ పోలీస్స్టేషన్ల పనులను పరిశీలించేందుకు సోమవారం వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానం విజయవంతమైందని, దానిని ఈ నెల 15 నుంచి తొలి విడత నెల్లూరు, ఉభయ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు. రెండో విడత జాబితాలో గుంటూరును చేరుస్తామన్నారు. తక్కువ సిబ్బందితో ఎక్కువ పోలీసింగ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్ అంటే సాధారణ ప్రజలు పోలీసుల విధుల్లో భాగం పంచుకోవడమేనన్నారు. ఆసక్తి ఉన్న ప్రజలను ఎంపిక చేసి కమ్యూనిటీ పోలీసింగ్ ఆఫీసర్లు (సీపీవో)గా గుర్తిస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో 2,500 మంది పోలీసులు ఉంటే సిపివోలు నాలుగు వేల మంది వరకు ఉన్నారని తెలిపారు. ట్రాఫిక్, జాతరలు, ఉత్సవాల వద్ద, రాత్రి గస్తీ వంటి విధులకు సీపీవోలను వినియోగించుకుంటామని చెప్పారు. బీటెక్ విద్యార్థులను పోలీస్ స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లుగా వినియోగించుకుంటామన్నారు.స్వయం నియంత్రణపై అవగాహన ప్రజల్లోనూ స్వయం నియంత్రణపై అవగాహన కల్పిస్తామన్నారు. ఎవరికి వారు తామే పోలీస్‌గా భావించి ముందుకు వెళితే పోలీసుల అవసరం ఉండదన్నారు. పెద్ద పెద్ద జాతరుల సమయంలో స్వయం నియంత్రణ ఉందనే విషయం స్పష్టం అవుతుందన్నారు. దానికి తోడు సీపీవోలను నియమిస్తే పోలీస్ సిబ్బంది అవసరం లేకుండానే కార్యక్రమాలు ప్రశాంతంగా ముగుస్తాయని తెలిపారు. సీపీవోలు ఎటువంటి అవకతవకలు, దుర్వినియోగం చేయకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారి నుంచి ఎటువంటి సమాచారాన్ని తీసుకోబోమన్నారు. వారి సేవలను మాత్రమే వినియోగించుకుంటామన్నారు. పోలీస్ శాఖలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ఇప్పటికే ఖాకీ డ్రస్‌లో కాకుండా ప్రత్యేక వేషధారణలో పోలీస్ సేవాదళ్ పేరుతో సిబ్బంది సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. త్వరలో కొత్త తరం పోలీసులను ప్రజలు చూస్తారని తెలిపారు. ఆదర్శ పోలీస్ స్టేషన్లు అత్యాధునిక సదుపాయాలు, హంగులతో పోలీస్ స్టేషన్లను నిర్మించనున్నట్లు డీపీజీ స్పష్టం చేశారు. గుంటూరులో రెండు ఆదర్శ పోలీస్స్టేషన్లను నిర్మిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో వాటిని ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. లాకప్‌లోనూ ఫ్యాన్, మంచం వంటి సదుపాయాలు ఉంటాయన్నారు. పోలీస్ స్టేషన్ అంతా ఎయిర్ కండీషన్‌తో ఉంటుందని, స్టేషన్ అంతా అద్దాలే అమరుస్తామని చెప్పారు. ఫిర్యాదు చేయడానికి వచ్చే వారికి మంచి వాతావరణం కలిగిస్తామని తెలిపారు.</p> vallaki dabbulu istara
srinelluri Posted January 12, 2017 Posted January 12, 2017 police custody lo aa bed endi swami, AC kuda pettasindi papam. dani badulu police rest thisukovataniki room pedithe good......
sonykongara Posted January 19, 2017 Author Posted January 19, 2017 అత్యాధునిక హంగులతో సిద్ధమవుతున్న నవ్యాంధ్ర మోడల్ పోలీస్ స్టేషన్లు కాలం మారింది. సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. అన్ని వ్యవస్థల్లో అభివృద్ధి దిశగా అడుగులు పడుతూ మార్పులు వస్తున్నాయి. పోలీసు శాఖ కూడా ఆధునికత అందిపుచ్చకుంది. అధునాతన సాంకేతిక పరిజజ్ఞానం తోడుగా సమస్త సౌకర్యాలు ఉండేలా ఆధునిక పద్దతిలో మోడల్ పోలీస్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర పోలీస్ శాఖ శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా గుంటూరు అర్బన్ జిల్లా పరిధిలోని గుంటూరు నగరంలో రెండు మోడల్ పోలీస్టేషన్లను యుద్ధప్రాతిపదికన నిర్మిస్తున్నారు. రెండు మోడల్ స్టేషన్ ల పనితీరు ఫలితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని నిర్మించాలని పోలీసు శాఖ యోచిస్తోంది. ఒక్కో స్టేషన్ రూ, కోటి నిర్మాణం వ్యయం, 45 రోజుల కాలవ్యవధిలో ప్రీ ఫ్యాబ్రికేటెడ్ స్ట్రక్చర్ తో మోడల్ పోలీస్టేషన్లు నిర్మించారు. గుంటూరులోని నగరంపాలెం, పాత గుంటూరులో మోడల్ పోలీస్టేషన్ల నిర్మాణ పనులు 90 శాతం పూర్తయ్యాయి. ఇవి ఈ మోడల్ పోలీస్ స్టేషన్ ల ప్రత్యేకత మూడు వేల చదరపు అడుగుల విస్తీర్ణం అన్ని అధునాతన హంగులు స్టేషన్ మొత్తం సెంట్రల్ ఏసీ సీఐకు ప్రత్యేక రూం ముగ్గురు ఎస్ఐలకు మూడు రూంలు స్టేషన్ రైటర్ కు ప్రత్యేక రూం కంప్యూటర్ సెక్షన్ కు మరో రూం కంప్యూటర్ టెక్నాలజీతో ప్రతి విభాగానికి ప్రత్యేక గదులు సిబ్బంది సేద తీరేందుకు విశ్రాంతి మందిరాలు కానిస్టేబుళ్లు విశ్రాంతి తీసుకోవడానికి స్టాఫ్ రూమ్ తో పాటు, రెండు బెడ్ లతో ప్రత్యెక రూమ్ స్టేషన్ లోనే టాయిలెట్లు సిబ్బంది కార్యకలాపాలు సాగించడానికి వీలుగా ప్రత్యేక చాంబర్లను కార్పొరేట్ హంగులతో ఏర్పాటు ఈ స్టేషన్ల ప్రారంభోత్సవం పూర్తయ్యాక అన్ని సీసీ కెమెరాలను ప్రత్యేకంగా స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించనున్నారు. స్టేషన్ పరిధి లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసందానం చేస్తారు ఈ నెలాఖరున డీజీపీ నండూరి సాంబశివరావు ఈ మోడల్ పోలీస్ స్టేషన్లను ప్రారంభించనున్నారు.
sonykongara Posted February 17, 2017 Author Posted February 17, 2017 మే నాటికి ఏపీ పోలీసు హెడ్‌క్వార్టర్స్ పూర్తి రూ.39.77 కోట్లతో మూడు భవనాలు గుంటూరు, మంగళగిరి: రాష్ట్ర పోలీసు హెడ్ క్వార్టర్స్ రూపుదిద్దుకుంటున్న మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్‌లో పలు నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. సుమారు 39.77 కోట్ల వ్యయంతో మూడు ముఖ్యమైన భవంతులను నిర్మిస్తున్నారు. జనవరి నాటికి హెడ్ క్వార్టర్స్ భవన సముదాయాన్ని పూర్తి చేయగలమని డీజీపీ నండూరి సాంబశివరావు ప్రకటించినప్పటికి.. విధాన ప్రక్రియలో కొంత జాప్యం అనివార్యమైంది. నిర్మాణ పనులకు అవసరమైన నిధులకు సంబంధించి ప్రభుత్వం మూడురోజలు కిందటే పాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. దీంతో ఆశించిన స్థాయిలో హెడ్‌క్వార్టర్స్ రూపుదాల్చేందుకు మరో మూడుమాసాల సమయం పట్టే అవకాశముందంటున్నారు. ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్‌లో డీజీపీ కార్యాలయ భవనాన్ని జీ+4 భవన సముదాయంగా నిర్మిస్తున్నారు. ఇందుకోసం రూ.13.77 కోట్లను ఖర్చు చేస్తున్నారు. ఇక టెక్ టెవర్ను జీ+3 భవన సముదాయంగా చేపట్టి ఇంచుమించు ఆ పనులను పూర్తి చేశారు కూడా! అయితే ప్రభుత్వం దీనిపైనే రాష్ట్రస్థాయి ఫొరెన్సిక్ ల్యాబ్‌ను నిర్మించాలని ప్రతిపాదించింది. దీంతో టెక్ టవర్‌పై మరో మూడు అంతస్తులను నిర్మించనున్నారు. అంటే టెక్‌టవర్, ఫొరెన్సిక్ ల్యాబ్‌లు కలిసి ఒకే భవన సముదాయంలో వుంటాయన్నమాట. మొత్తంగా జీ+6 భవన సముదాయంగా రూపుదాల్చనున్న ఈ నిర్మాణానికి ప్రభుత్వం రూ.16 కోట్లను ఖర్చు చేయనుంది. ఇక రాష్ట్ర పోలీసు ఆయుధగార భవనం ఇంచుమించు పూర్తయింది. దీనికి కొద్దిపాటి తుదిమెరుగులు మాత్రమే మిగిలివున్నాయి. ఆయుఽధగారాన్ని రూ.10 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. డీజీపీ సాంబశివరావు వారంలో రెండుమూడు పర్యాయాలు బెటాలియన్‌ను సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అన్నీ ముఖ్యమైన పోలీసు కార్యాలయాలన్నీ ఇక్కడే ఏర్పాటవుతున్న నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారుల నివాసాలను క్యాంపు ఆవరణలోనే నిర్మించాలని డీజీపీ భావిస్తున్నారు. జీ+5 భవన సముదాయంగా క్వార్టర్స్‌ను నిర్మించేవిధంగా ప్రతిపాదనలను తయారుచేయాలని డీజీపీ ఇప్పటికే పోలీసు హౌసింగ్ కార్పోరేషన్‌ను ఆదేశించారు. ఈ క్వార్టర్స్‌ను కూడ నిర్మించాలంటే మరో రూ.20 కోట్ల మేర నిధులు అవసరమవుతాయి. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయాల్సివుంది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now