Jump to content

Good going - 17


Cyclist

Recommended Posts

ఆ హీరో ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఫోన్ చేసింది కూడా అలాంటిలాంటి హీరో కాదు. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో. ఆయనే చియాన్ విక్రమ్. అవును ఎన్టీఆర్‌కు విక్రమ్ ఒకే ఒక్క కాల్ చేసి ఆశ్చర్యానికి గురిచేశాడని టాలీవుడ్‌లో చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాను సెప్టెంబర్ 2వ తేదీన విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావించారు. అదే రోజున విక్రమ్ నటించిన ఇంకొక్కడు సినిమాను సైతం రిలీజ్ చేయాలనుకున్నారు. ఈ రెండు సినిమాలను ఒకే రోజున విడుదల చేస్తే రెండు సినిమాలకు సరిపడినన్ని థియేటర్లు దొరికే అవకాశం తక్కువగా ఉండడంతో ‘జనతా’ పెద్దలు... ఇంకొక్కడు పెద్దలతో చర్చలు జరిపారు. అయితే, విక్రమ్ ఏమాత్రం తగ్గలేదని టాక్. ఇంకొక్కడు సినిమాపై విక్రమ్‌కున్న నమ్మకం అలాంటిది మరి. కానీ, చివరికి అనవసరంగా రెండు సినిమాలు కొంతైనా నష్టపోవడం ఎందుకు అనే కోణంలో ఆలోచించిన ఇరు బృందాలు.. ఒక నిర్ణయానికి వచ్చాయి. దీంతో ఇంకొక్కడు హీరో విక్రమ్.. ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి ఇండస్ట్రీ కోసం తన సినిమాను వాయిదా వేసుకుంటున్నట్లు, జనతా గ్యారేజ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడట. అయితే, విక్రమ్ అంతటి టాప్ హీరో తనకు నేరుగా ఫోన్ చేసి, ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు ఆశ్చర్యానికి గురైన ఎన్టీఆర్ ఎంతో ఆనందంగా ఫీలయ్యారట. 

 

 

 

chiyaam all the best cheppadam gr8  :child:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...