Jump to content

Interlinking of lakes


Recommended Posts

ఇక చెరువుల అనుసంధానం!
 
హైదరాబాద్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ నదుల అనుసంధానంపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ... తాజాగా జిల్లాల్లోని ప్రధాన చెరువులన్నింటినీ అనుసంధానం చేస్తూ గతంలో మాదిరిగా గొలుసుకట్టు చెరువులుగా మార్చేందుకు సన్నద్ధమవుతోంది. ముందుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించింది. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ.15.69 లక్షలు కేటాయించారు. దశలవారీగా రాష్ట్రమంతా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

 

ఇక చెరువుల అనుసంధానం!

 

హైదరాబాద్‌, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకూ నదుల అనుసంధానంపైనే ప్రధానంగా దృష్టి సారించిన ఆంధ్రప్రదేశ్‌ జల వనరుల శాఖ... తాజాగా జిల్లాల్లోని ప్రధాన చెరువులన్నింటినీ అనుసంధానం చేస్తూ గతంలో మాదిరిగా గొలుసుకట్టు చెరువులుగా మార్చేందుకు సన్నద్ధమవుతోంది. ముందుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించింది. జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సాధ్యాసాధ్యాల అధ్యయనానికి రూ.15.69 లక్షలు కేటాయించారు. దశలవారీగా రాష్ట్రమంతా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

 

 

 

Better do interlink from top Nagarjuna sagar to Somasila all canals ni link chesthe we can transfer water directly from Nagarjuna sagar to Somasila.

 

Even ila cheyadam valla easy ga godavari water ni oka place/canal lo dump chesthe easy ga somasila ki connect ayela plan cheyali

Link to comment
Share on other sites

చెరువుల అనుసంధానంపై దృష్టి పెట్టాలి

ఏపీ సీఎం చంద్రబాబు

18brk59a.jpg

విజయవాడ: శ్రీశైలం ఎగువకు మరో మూడు రోజుల్లో వరద నీరు చేరుతుందని... దాన్ని రాయలసీమకు మళ్లించి పట్టిసీమ స్ఫూర్తి సార్ధకం చేస్తామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నీరు-చెట్టు, నీరు-ప్రగతి పురోగతిపై 8వేల మంది అధికారులు, సిబ్బందితో సోమవారం ఉదయం హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి సీఎం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నదుల అనుసంధానం విజయవంతంగా పూర్తి చేశామని.. ఇక చెరువుల అనుసంధానంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని సూచించారు.

రాష్ట్రంలో ఏ రైతు పైనా కరవు ప్రభావం కనిపించకూడదని... కరవుతో ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడే పరిస్థితి కనిపించకూడదని అధికారులకు చంద్రబాబు సూచించారు. పంట సంజీవనిపై జాతీయ మీడియాలో అనుకూల కథనాలు రావడాన్ని స్ఫూర్తిగా తీసుకుని మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. గొలుసుకట్టు చెరువుల అనుసంధానం, వాగులు, వంకలు పూడికతీత, కట్టల పటిష్టం తదితర చర్యలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. కరవు రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ఖ్యాతి గడించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 9 months later...
551 కోట్లతో చెరువుల అనుసంధానం.. 160 గ్రామాలకు జల‘సిరి’
 
636289946029584505.jpg
హంద్రీ నీవా కాల్వ నుంచి 106 చెరువులకు కృష్ణా జలాల ఎత్తిపోతల ప్రాజెక్టుకు జలవనరుల శాఖ అధికారులు తుది రూపు ఇచ్చారు. నివేదికను కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ద్వారా గురువారం ప్రభుత్వానికి పంపారు. ప్రాజెక్టు అధ్యయనానికి 2015 జూలై 15న జీవో నం:479 జారీ అయింది. హైదరాబాదుకు చెందిన ఐడెల్‌ సంస్థ సర్వే చేసి రూ.879 కోట్ల అంచనాతో నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం తగ్గించాలంటూ ఈఎన్ సీ ఫైలును వెనక్కి పంపారు. దీంతో ఇరిగేషన్ ఇంజనీర్లు చెరువులను అనుసంధానం చేస్తూ ప్రతిపాదనలు రూ.551 కోట్లకు తగ్గించారు. డిప్యూటీ సీఎం కేఈ
కృష్ణమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను ఒప్పించి నిధులు రాబడితేనే పశ్చిమ ప్రాంతంలో 160 గ్రామాలకు జల‘సిరి’.
  •  హంద్రీ నీవా నుంచి ఎత్తిపోతలకు తుది రూపు 
  •  తుది నివేదిక పంపిన జలవనరుల అధికారులు 
  •  చెరువుల అనుసంధానంతో తగ్గిన వ్యయం 
  •  ముఖ్యమంత్రిని ఒప్పిస్తేనే జల కల సాకారం 
ప్రాజెక్టు స్వరూపం
ప్రాజెక్టు : 106 చెరువులకు కృష్ణా జలాల ఎత్తిపోతల పథకం
ప్రతిపాదన వ్యయం : రూ.879 కోట్లు
సవరించిన అంచనా : రూ.551 కోట్లు
 అవసరమైన నీరు : 2.44 టీఎంసీలు (హంద్రీనీవా కాల్వలో జిల్లా వాటా 9 టీఎంసీలలో)
 ఆయకట్టు : ప్రత్యక్షంగా 16 వేల ఎకరాలు, పరోక్షంగా 20 వేల ఎకరాలు
 తాగునీరు : 1.20 లక్షల మందికి
 ప్రయోజనం : నందికొట్కూరు, పాణ్యం, కర్నూలు, డోన, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 16 మండలాల పరిధిలో 160 గ్రామాలు.
 విధానం : గొలుసుకట్టు చెరువుల అనుసంధానం.
ఆంధ్రజ్యోతి-కర్నూలు: కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల జనాభాకు తాగునీరు లక్ష్యంగా హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. శ్రీశైలం ఉపరితలంలో మల్యాల ప్రధాన లిఫ్ట్‌ నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద జలాలు ఎత్తిపోసుకోవాలి. జిల్లాకు 9 టీఎంసీలు వినియోగించుకుని 80 వేల ఎకరాలకు నీరివ్వాలి. అయితే హంద్రీ నీవా కాలువ పరీవాహకం ఎగువన చెరువులు ఉన్నా.. వర్షాభావం వల్ల అవి ఒట్టికుండలుగా మారాయి. వాటి కింద ఆయకట్టుకు వర్షమే ఆధారమైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు జిల్లా మీదుగా వెళ్తున్నా తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. కాల్వ తీరం వెంబడి ఉన్న నందికొట్కూరు, డోన, పాణ్యం, కర్నూలు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల పరిధిలో 106 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసి కరువును పారదోలాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి 2015 జూలై 15న అధ్యయనం కోసం రూ.90 లక్షలు కేటాయిస్తూ జీవో నెం.479 జారీ చేశారు. హైదరాబాదుకు చెందిన ఐడెల్‌ సంస్థ రూ.879 కోట్లతో సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్‌) ప్రభుత్వానికి ఇచ్చింది. ‘10 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులకు రూ.879 కోట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయా? హైడ్రాలికల్‌ పర్టిక్యులర్స్‌ ఉన్నాయా?’ అని కొర్రీలు పెడుతూ ఉన్నతాధికారులు ఈ ఫైలును వెనక్కి పంపారు. ప్రతిపాదన వ్యయం తగ్గించాలని ఈఎనసీ సూచించారు. రీ సర్వేకి ఐడెల్‌ సంస్థ చేతులేత్తేయడంతో ఇరిగేషనశాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో మైనర్‌ ఇరిగేషన ఏఈఈ వేణు మూడు నెలలు కసరత్తు చేసి ప్రతిపాదన వ్యయం రూ.551 కోట్లకు తగ్గిస్తూ తుది నివేదిక తయారు చేశారు. దీన్ని కలెక్టర్‌ సత్యనారాయణ ద్వారా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

 
డిప్యూటీ సీఎం చొరవ తీసుకుంటేనే..
నదుల అనుసంధానం స్ఫూర్తితో ‘గొలుసుకట్టు చెరు వుల అనుసంధానం’ ద్వారా వంకలు, వాగులు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని చెరువులకు ఎత్తిపోసేలా రీ సర్వే చేశారు. హంద్రీ నీవా నుంచి కనిష్ఠంగా 3 మీటర్లు, గరిష్ఠం గా 116 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 160 గ్రామాలకు తాగు, సాగునీటితో పాటు 106 చెరువులకు కృష్ణాజలాలు ఎత్తిపోసే ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చారు. 16 ప్యాకేజీలలతో రూ.551 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడితేనే కరువు పల్లెలు సస్యశ్యామలమవుతాయి.
 
తుది నివేదిక ప్రభుత్వానికి పంపించాం
గొలుకుట్టు చెరువుల అనుసంధానం ద్వారా రూ.551 కోట్లకు అంచనా వ్యయం తగ్గించాం. kunl.jpgతుది నివేదిక కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చాం. నిధులు ఇస్తే పశ్చిమ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నివారించవచ్చు. 1.20 లక్షల మందికి దాహం తీరుతుంది.
 చంద్రశేఖర్‌రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ, కర్నూలు
Link to comment
Share on other sites

  • 1 year later...
  • 1 month later...
  • 2 months later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...