Jump to content

దబిడి దిబిడే


Ramesh39

Recommended Posts

దబిడి దిబిడే 

30sit-item1a.jpg

నందమూరి బాలకృష్ణ జోరు ట్వంటీ- ట్వంటీ ఫార్మాట్‌కి తగ్గట్టుగానే ఉంది. ఇదివరకు బ్యాట్స్‌మెన్‌ సెంచరీకి చేరువవుతున్నాడంటే తడబాటుకి గురయ్యేవాడు. ఆచి తూచి ఆడుతూ లక్ష్యాన్ని చేరుకొనేవాడు. కానీ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ కాలం. ముందున్నది హాఫ్‌ సెంచరీ అయినా, సెంచరీ మైలురాయి అయినా బౌండరీలు, సిక్సర్లు బాదడమొక్కటే పని. బాలయ్య జోరు కూడా అచ్చం అలాగే ఉంది. 99వ సినిమా విషయంలోనూ ఆయన వేగంగా నిర్ణయం తీసుకొన్నాడు. వందో చిత్రానికీ పెద్దగా సమయం తీసుకోలేదు. రెండు మూడు నెలల్లోనే ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’కి ఓకే చెప్పేసి పట్టాలెక్కించేశారు. వందో సినిమా తర్వాత కూడా అదే వేగాన్ని కంటిన్యూ చేయబోతున్నారు. 101, 102, 103వ చిత్రాల కోసం ఇప్పటికే కథల్ని ఓకే చేసినట్టు సమాచారం. ఆయన డైలాగ్‌లాగే బాక్సాఫీసు దగ్గర దబిడి దిబిడే అన్నమాట.

101వ చిత్రం ‘రైతు’ 

వందో చిత్రంగా తెరకెక్కుతున్న ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ తర్వాత బాలకృష్ణ నటించనున్న చిత్రం.. ‘రైతు’. కృష్ణవంశీ దర్శకత్వం వహించనున్న ఆ చిత్రం గురించి బాలకృష్ణ స్వయంగా ప్రకటించారు. నిజానికి వందో చిత్రంగానే ‘రైతు’ తెరకెక్కాల్సింది. కానీ ప్రత్యేకంగా ఉండేందుకని ‘గౌతమీపుత్ర శాతకర్ణి’వైపే మొగ్గు చూపారు బాలకృష్ణ. దీంతో రైతు 101వ చిత్రమైంది. బాలకృష్ణని దృష్టిలో ఉంచుకొని యువ దర్శకుడు అనిల్‌ రావిపూడి ‘రామారావుగారు’ అనే కథని సిద్ధం చేసుకొన్నారు. అలాగే బోయపాటి శ్రీను కూడా ఓ కథని సిద్ధం చేశారు. అటు యువ దర్శకులు, ఇటు సీనియర్లు బాలకృష్ణ కోసం కథలు సిద్ధం చేస్తుండడంతో నందమూరి అభిమానుల నుంచి ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి.

డైలాగులు అదిరిపోతాయట 

బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇటీవల ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అందులో బాలయ్య కనిపించిన విధానం, నేపథ్యం ఆకట్టుకొన్నాయి. సినిమాలో సంభాషణలు కూడా అదిరిపోతాయట. సంభాషణలు పలకడంలో బాలయ్య తీరే వేరు. సంస్కృత సమాసాలతో కూడిన పెద్ద పెద్ద డైలాగుల్ని కూడా అలవోకగా పలికేస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే ‘గౌతమీ పుత్ర...’లో డైలాగులుంటాయట. ‘కంచె’, ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ చిత్రాలతో మంచి డైలాగులు రాసి అందరినీ ఆకట్టుకొన్న బుర్రా సాయిమాధవ్‌ ఈ చిత్రానికి సంభాషణలు అందిస్తున్నారు. ఆయన రాసిన డైలాగులు పండితుల నుంచి పామరుల వరకు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయట.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...