Jump to content

Krishna Pushkaralu


Recommended Posts

  • Replies 2.2k
  • Created
  • Last Reply

మహా సంరంభంలా… అద్భుతాన్ని క్రిష్ణా రేవుకి దింపినంత ఆహ్లాదంగా… వేడుకంటే ఇదే అని చెబుతున్నట్టు… పుష్కరం అంటే ఇదా అని ఆశ్చర్యపరిచేట్టు సాగిన బెజవాడ పుష్కరం గిన్నీస్ బుక్ లో ఎక్కబోతోందా ? అవుననే అంటోంది ఏపీ.


క్లీన్లీ నెస్ లో… సామూహిక భోజనాల్లో అద్భుత ప్రమాణాలు పాటించడమే కాదు…ఇంతకు ముందెప్పుడూ సాధ్యం కానంత జనబాహుళ్యానికి ఆతిథ్యాన్ని రుచి పుష్కరం అపూర్వమైన స్పందననే కాదు రికార్డు కూడా కొల్లగొట్టబోతోంది. అవును. రోజూ లక్షల మందికి భోజనం అంటే అసామాన్యం. మరో మూడురోజులున్నప్పటికీ ఆతిథ్యం స్వీకరించిన వారి సంఖ్య కోటి దాటింది. అనన్య సామాన్యం. అది క్రిష్ణా పుష్కరాల్లో మాత్రమే సాధ్యమైంది. అదేం కేవలం చేయి కడిగించిన భోజనం కాదు. నాల్గు రకాల వెరైటీలతో వేడివేడిగా కొసరికొసరి వడ్డించిన సహపంక్తి. అందుకే ఇపుడు గిన్నీస్ లో చోటు కోసం లేఖ వెళుతోంది ఏపీ నుంచి.



ఇక క్లీన్ లీ నెస్. వందలు వేలమంది ఒక్కచోటకి చేరితేనే మురికెత్తిపోయే స్వభావాలు మనవి. అలాంటిది వందలు కాదు. వేలు కాదు లక్షలు దాటిన కోట్లు. అయినా ఎక్కడా వీసమెత్తు నిర్లక్ష్యం లేదు. చెత్తాచెదారం కనిపించలేదు. శుభ్రత అంటే నీళ్ల మీద ప్లాస్టిక్ కవర్లు వెదకడమే పని అన్నట్టు ఉండేది ఇప్పటి వరకూ ‍! కానీ బెజవాడలో జరిగింది అది కాదు. నీటి అడుగున గులాబి రేకులుండిపోతే కుళ్లి పోయి నీళ్లు కలుషితం అవుతాయట. అందుకే అవి కూడా శుభ్రం చేశారు. వార్నీ…నంతటి ప్రమాణాలు మొన్న రియో ఒలింపిక్స్ లో ఫెల్స్స్ ఈదిన స్విమ్మింగ్ పూల్ లో కూడా లేవేమో ! అందుకే అటు శుభ్రత ఇటు భోజన నాణ్యత, నంబర్ ఇవన్నీ కలిసి క్రిష్ణ పుష్కరాల్ని గిన్నీస్ స్థాయికి చేర్చబోతున్నాయ్. అదుర్స్ అనిపించబోతున్నాయ్.


Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...