Jump to content

ఎన్టీఆర్ పర్సనల్ సీక్రెట్ బైటపెట్టేశారు బాబు !

sonykongara

Recommended Posts

ఎన్టీఆర్ పర్సనల్ సీక్రెట్ బైటపెట్టేశారు బాబు !

డైలాగ్ డెలివరీలో మాడ్యులేషన్స్ లో మంత్రముగ్దుల్ని చేయడంలో తెలుగు నాట అన్నగారికి తిరుగులేదు. మరి అంత హోల్డ్ ఆయనకి ఎలా వచ్చింది..? ఆకట్టుకోవడం ఎన్టీఆర్ ఎలా ఆరితేరిపోయారో చంద్రబాబు చెప్పేశారిప్పుడు. అది వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది.

అవును. ఏ పని చేసేప్పుడైనా కృషి, పట్టుదల, కొత్త స్టాండర్డ్స్ అందుకోవాలన్న తపన ఉండాలంటూ డీఎస్సీ అభ్యర్థులకి పట్టాలిస్తూ చంద్రబాబు చెప్పిన ఎగ్జాంపుల్ ఆశ్చర్యపరిచింది. పార్టీ అధినేతగానే కాదు అభిమానిగా కూడా మామ ఎన్టీఆర్ ని దగ్గరగా చూశారు చంద్రబాబు ఓ పదిహేనేళ్లపాటు ఆయన ట్రావెల్ చేశారు. రోజుకి 17, 18 గంటలు. ఆ సమయంలో పంచుకున్న అనుభవాలు… గ్రహించిన విషయాలూ ఆయన అప్పుడప్పుడూ కోడ్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా అదే చేశారు. అందరూ ఇప్పుడు ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ గురించి… ప్రసంగం చేసే తీరు గురించి మాట్లాడతారు తప్పితే ఆయన దాని కోసం ఎంత కష్టపడ్డారో చాలా తక్కువ మందికి తెలుసు అంటూ మొదలు పెట్టారు. నిమ్మకూరు నుంచి మద్రాస్ వెళ్లి అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో… అబ్బాయ్ నీ హావభావాలూ, రూపురేఖలు అద్భుతం కానీ వాచికం విషయంలో ఇంకా స్పష్టత రావాల్సిఉంది అన్నారట సినిమా పెద్దలు ఎన్టీఆర్ ని. అంతే… దాన్నో సవాల్ గా తీసుకొని బీచ్ కి వెళ్లి…అక్కడ చిన్న చిన్న గులకరాళ్లు పోగేసి, నోట్లో వేసుకొని రోజూ ప్రాక్టీస్ చేసేవారట. కంఠనాళం బలపడి పుంజుకోవడంతోపాటు అపూర్వమైన స్పష్టత ఆ తర్వాతే సాధ్యమైందట. అదీకాక… ఎక్కడ వాయిస్ పెంచాలి తగ్గించాలి అనే విషయంపై కూడా ఆయన బాగా దృష్టిపెట్టి ఓ కొత్త ఒరవడి సృష్టించారు ఆ తర్వాతే. ఈ గులక రాళ్ల ట్రీట్మెంట్ గురించి చెబుతూ మనలో ఎంతమంది అలా కష్టపడుతున్నా… మన నైపుణ్యం పెంచుకోడానికి అంటూ బాబు పాత సంగతులు గుర్తుచేశారు.

అన్నగారి గురించి బాబు ఇలాంటి సంగతులు చెప్పడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన ఆరోగ్యం గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేవారో, ఉదయం దినచర్య ఎలా ఉండేదో కూడా బాబు చెప్పారు. ఇలాంటివి విన్నప్పుడు కాస్త కొత్తగా అనిపించడంతోపాటు మహానుభావుడి గురించి మనకి తెలియని విషయాలు చాలానే ఉన్నాయ్ అనిపిస్తుంది.

Link to comment
Share on other sites

Particular ga DVSK movies kosam Marina Beach velli baga practice chesarani vinna

Link to comment
Share on other sites

  • 3 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...