sonykongara Posted October 6, 2018 Author Posted October 6, 2018 ఇంద్రకీలాద్రికి యుగాల చరిత్ర.. ‘దశమి’ వెలుగుల కారణం ఇదీ..!06-10-2018 08:05:52 కొండంత మార్పులు దేవతలు నడయాడిన కొండ ఇది దేవర్షుల పూజల నుంచి సామాన్య జనుల వరకు ఎన్నెన్ని మార్పులో! దశలవారీగా దేవస్థానం అభివృద్ధి ‘దశమి’ వెలుగుల చరిత్ర ఇదీ! బ్రహ్మ, విష్ణు, రుద్రాది దేవతలు.. అగస్త్య, వశిష్ట, గౌతమి, విశ్వామిత్రాది మహర్షులు, ఆదిశంకరాచార్యుల వంటి మహనీయుల ఆరాధనలను అందుకున్న ఆది పరాశక్తి. అమ్మలగన్నయమ్మ.. చాల పెద్దమ్మ.. ఇంద్రకీలాద్రిపై ఆ అమ్మ ఏనాడు స్వయంభువై వెలసిందో! కొండల గుట్టల మధ్య, కీకారణ్యంలో ఆ స్వయంభువును తొలుత ఎవరు చూశారో! ఏ రీతిన పూజించారో! ఎన్ని తరాలు ఆ అమ్మనే ఇలవేల్పుగా పూజించారో! ఇదంతా తెలిసిన వాళ్లెవరూ లేరు. ఆ నోటా ఈ నోటా కథలు కథలుగా వినడం తప్ప. తొలుత కొండలు, గుట్టల మధ్య సంచరించే ఎరుకలు, బెస్తవారి పూజలందుకున్న కాలం నుంచి అమ్మవారు లక్షలాది మంది జేజేలందుకుంటున్న నేటి కాలం వరకు ఎన్ని మార్పులో. దసరా మహోత్సవాల నేపథ్యంలో ఆ మార్పుల గురించి ప్రత్యేక కథనం. విజయవాడ: అమ్మవారిని దర్శించుకునేందుకు వంద మంది భక్తులు వస్తే ఒకనాడు చాలా గొప్ప. నేడు ఉత్సవాలంటే లక్షల మంది భక్తులు తండోపతండాలుగా తరలిరావడమే మనకు తెలుసు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆలయ రూపు రేఖలూ మారుతూ వచ్చాయి. చిన్న గుడి నుంచి విశాలమైన ఆలయం.. ఆ తరువాత బంగారు తాపడంతో స్వర్ణ కాంతుల గర్భాలయ గోపురం, తొమ్మిది అంతస్తుల రాజగోపురం, వీటి చుట్టూ రూపుదిద్దుకుంటున్న హంగులు.. మొత్తం ఇంద్రకీలాద్రి రూపురేఖలే మారిపోతుండడం మన కాలంలో జరుగుతున్న అభివృద్ధి. రాజుల పాలనలో.. మొగలాయిల పాలనకు పూర్వం అమ్మవారి ఆలయ నిర్వహణ బాధ్యతలను ఎవరు చూశారో చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు. తానీషా తదితరులు, ఆ తర్వాత అక్కన్న, మాదన్న మంత్రులుగా అమ్మవారి ఆలయాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. తర్వాత బెజవాడ జమిందార్ల నిర్వహణ, ఆ తరువాత వారి కరణాలు, తదనంతరం బ్రాహ్మణ వంశస్తులైన ఉప్పులూరి వారి ధర్మకర్తృత్వంలో కొంతకాలం, అర్చకుల నిర్వహణలో మరికొంత కాలం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉన్నట్లు తెలుస్తోంది. పదో శతాబ్దంలో చోళులు పాలించారు. బెజవాడను చోళ రాజేంద్రపురమని పిలిచేవారు. వీరు నిత్యం అమ్మవారిని కొలిచినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తరువాత రెడ్డిరాజులు వచ్చారు. అనపోతారెడ్డి అనే రాజు 1350లో బెజవాడను రాజధానిగా చేసుకుని పాలించారు. ఆయన అమ్మవారికి కైంకర్యం సమర్పించేవారని తెలుస్తోంది. తరువాత తెలుకల శెట్టి కులానికి చెందిన వారు కొన్ని దశాబ్దాలు విజయవాడను కేంద్రంగా చేసుకుని పాలించినట్లు తెలుస్తోంది. వీరిలో మువన్నం రామిశెట్టి భ్రమరాంబ మల్లేశ్వరాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఆయనే ఇక్కడ వేయి స్తంభాల మండపాన్ని నిర్మించడానికి ప్రయత్నించారని చెబుతారు. అనంతర కాలంలో బెజవాడ రాజధానిగా చేసుకుని ఏలిన రాజులందరూ అమ్మవారిని కొలిచినవారే. 1919 నుంచి ధర్మకర్తల పాలనలో.. 1948 నుంచి ఈవో పర్యవేక్షణలో.. రాజుల కాలం అంతరించిన తర్వాత బెజవాడ సబార్డినేట్ కోర్టు ఉత్తర్వుల (ఓఎస్ నెంబరు 1/1919) ప్రకారం కనకదుర్గమ్మ దేవస్థానానికి ధర్మకర్తల నియామకం జరిగింది. అప్పటి నుంచి వారి నేతృత్వంలో ఆలయ నిర్వహణ జరిగింది. 1948 సంవత్సరంలో దేవస్థానానికి కార్యనిర్వహణాధికారిని నియమించారు. నాటి నుంచి ఈవోల పర్యవేక్షణలోనే ఆలయ నిర్వహణ ఉంది. ప్రస్తుతం ఐఏఎస్, ఐఆర్ఎస్ స్థాయి అధికారులను కార్యనిర్వహణాధికారులుగా నియమించే స్థాయికి ఆలయం చేరుకుంది. చిన్న గుడి నుంచి మహాలయం వరకు.. ఒకనాడు అమ్మవారి ఆలయం చాలా చిన్నదిగా ఉండేది. అప్పట్లో ఒకే గుమ్మం గల గర్భగుడి ఉండేది. అమ్మవారిని భక్తులు చాలా దగ్గరగా చూసే అవకాశం ఉండేది. అప్పట్లో అమ్మవారిని తాకి నమస్కారం చేసుకునే వీలు కూడా ఉండేది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన రాజులు అమ్మవారి దేవస్థానంలో ధూపదీప నైవేధ్యాల నిర్వహణ కోసం వందల ఎకరాల భూములను ఈనాంగా ఇచ్చారని చెబుతారు. ఆ భూములన్నీ అన్యాక్రాంతమైపోయాయని పూర్వీకులు చెబుతారు. దాంతో దేవస్థానం వంశపారంపర్య అర్చకులు పెద్దల నుంచి విరాళాలు తీసుకువచ్చి దుర్గాదేవికి శరన్నవరాత్రులను నిర్వహించేవారు. అప్పట్లో ఆగమ పండితులు పప్పు పేరయ్యశాస్త్రి అమ్మవారి గర్భాలయంలో కలశారాధన చేసేవారు. దాతల సాయంతోనే దసరా తొమ్మిది రోజులూ కలశారాధన చేసేవారు. ఉత్సవాల్లో ఫ్యాన్సీ బాణాలతో పిల్లలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారి విగ్రహంపై గులాములు చల్లేవారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలకు ఆలయాన్ని కొంచెం విస్తరించారు. 1970లో మరికొంతగా విస్తరించారు. మరో 22 సంవత్సరాల వరకు కూడా ఆలయ అభివృద్ధి గురించి పట్టించుకున్నవారే లేరు. 1992 నుంచి క్రమంగా ఆలయ అభివృద్ధికి వడివడిగా అడుగులు పడ్డాయని చెప్పొచ్చు. 1999లో మరికొంత, 2005లో ఇంకొంత అభివృద్ధి చెందింది. ప్రస్తుతం తొమ్మిది అంతస్థుల రాజగోపురంతో ఆలయం ఆధ్యాత్మిక శోభతో వెలుగులు విరజిమ్ముతోంది. నిత్య పూజలు.. ఉత్సవాల నిర్వహణ దేవస్థానంలో స్మార్తవైదిక ఆగమానుసారం అర్చనలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున స్నపన కార్యక్రమాల అనంతరం ప్రత్యేక పూజలను నిర్వహిస్తున్నారు. నిత్యం శ్రీచక్రనవావరణార్చనలు, అష్టోత్తర, సహస్రనామ, లక్ష కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. ఉగాది పర్వదినాన పంచాంగ శ్రవణం, సాయం సంధ్యవేళ దుర్గామల్లేశ్వరుల ఊరేగింపు నిర్వహిస్తున్నారు. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి వసంతోత్సవాలు నిర్వహిస్తారు. వసంత మాసంలోనే దుర్గామల్లేశ్వరస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా ఆశ్వయుజ పాఢ్యమి నుంచి దశమి వరకు దసరా ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. విజయ దశమి రోజున తెప్పోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాల సందర్భంలోనే కాక ప్రతి నిత్యం అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే వేలాది మంది భక్తులతో ఇంద్రకీలాద్రి కళకళలాడుతూ ఉంటుంది.
sonykongara Posted December 27, 2018 Author Posted December 27, 2018 పర్యాటక కేంద్రంగా ఇంద్రకీలాద్రి పరిసరాలు27-12-2018 08:13:37 బృహత్తర ప్రణాళిక రూపకల్పనకు శ్రీకారం కేంద్ర నిధుల కోసం ‘ప్రసాద్’ పథకానికి దరఖాస్తు అమరావతిలో 15 ఎకరాల స్థలం కేటాయించాలని లేఖ కృష్ణానది మీదుగా భక్తుల రాకపోకలకు ప్రతిపాదనలు ఇంద్రకీలాద్రి ఇక పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక సొబగులద్దుకోనుంది. కొండపై నిండుగా కొలువైన దుర్గమ్మను కొలిచేందుకు తరలి వచ్చే భక్త కోటికి కొండ పరిసరాలు సకల సౌకర్యాలతో, పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక చింతనను, ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని భావించిన దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ చొరవతో ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే అందమైన సందర్శనీయ క్షేత్రంగా.. అమరావతికి ప్రపంచస్థాయి ఐకాన్‌గా ఇంద్రకీలాద్రిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. (విజయవాడ, ఆంధ్రజ్యోతి) ఇంద్రకీలాద్రిని సంపూర్ణ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండో పెద్ద దేవాలయం కనకదుర్గమ్మ ఆలయమే. తిరుమల తర్వాత ఎక్కువ మంది భక్తులు వచ్చేది కూడా ఇక్కడికే. శతాబ్దాల చరిత్ర కలిగిన కనకదుర్గమ్మ దేవాలయానికి సామాన్య భక్తులతోపాటు వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. అయితే భక్తులు ఆలయ పరిసరాల్లో ఆధ్యాత్మిక చింతనతో ఎక్కువ సమయం గడిపేందుకు అనువైన వాతావరణం ఇక్కడ కొరవడింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులు ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో గడిపి మధురానుభూతులను మూటగట్టుకుని తిరిగి వెళ్లేందుకు దోహదపడే విధంగా ఆధునిక మౌలిక సౌకర్యాలు కల్పించనున్నారు. దీంతో పాటు పర్యాటకులను విశేషంగా ఆకర్షించే సరికొత్త సందర్శనీయ క్షేత్రంగా.. నవ్యాంధ్ర రాజధానిలో ప్రపంచస్థాయి ఐకాన్‌గా ఇంద్రకీలాద్రిని తీర్చిదిద్దేందుకు దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ చొరవతో బృహత్తర ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది. నిధుల కోసం ‘ప్రసాద్’ పథకానికి దరఖాస్తు ఇంద్రకీలాద్రిని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిధుల కోసం దుర్గ గుడి ఈవో కోటేశ్వరమ్మ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరుచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (పీఆర్ఏఎస్ఏడీ) పథకానికి దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర టూరిజం శాఖ అధికారులు సమగ్ర పథక నివేదిక (డీపీఆర్)ను పంపించాలని సూచిస్తూ.. ఒక కన్సల్టెన్సీ సంస్థను కూడా అటాచ్ చేశారు. దాంతో ఇంద్రకీలాద్రిని వరల్డ్ క్లాస్ పిలిగ్రిమేజ్ టూరిజం సెంటర్‌గా అభివృద్ధి చేసేందుకు డీపీఆర్ రూపకల్పనకు దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. డీపీఆర్‌ను సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మోనిటరింగ్ కమిటీ (సీఎస్ఎంఎస్) పరిశీలించి ఆమోదిస్తుంది. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి వంద శాతం నిధులు మంజూరవుతాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ పర్యవేక్షణలో ఈ పథకాన్ని అమలు చేస్తారు. ప్రణాళిక ఇలా.. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ‘ప్రసాద్’ పథకానికి దుర్గగుడిని ఎంపిక చేస్తే ఇంద్రకీలాద్రి ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది. స్థానిక కళలు, సంస్కృతి, హస్తకళలు, వంటలను ప్రోత్సహిస్తారు. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లుంటాయి. ఈ పథకం కింద ఎర్త్‌ఫిల్లింగ్, ల్యాండ్‌స్కేపింగ్, ఫెన్సింగ్, లైటింగ్, పేవ్మెంట్స్,, పుట్‌పాత్‌లు, వాక్‌వేస్, డ్రైవ్ వేస్, షీటింగ్ ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్, స్ట్రామ్ వాటర్ డ్రైనేజీలు, ఎలకిట్రసిటీ, రోడ్లు, రైలు, జల రవాణాతోపాటు ఎకోఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్, రోప్ వేల అభివృద్ధికి అవకాశం ఉండటంతో ఇంద్రకీలాద్రిని అటు కుమ్మరిపాలెం వైపు నుంచి టీటీడీ స్థలం వరకు పిలిగ్రిం టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేసేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ పథకం ద్వారా దుర్గమ్మ భక్తులకు మౌలిక సదుపాయాలు (ఇన్ఫ్రాస్ట్రక్చర్) సమకూరతాయి. దేవస్థానం పరిసరాల్లో స్ట్రీట్‌లైటింగ్, సౌండ్ అండ్ లైట్ షో, ఏటీఎంలు, సూచిక బోర్డులు, వాహనాల పార్కింగ్, టాయిలెట్స్, క్లోక్‌రూంలు, షాపులు, వాచ్ టవర్లు, రెయిన్ హట్స్, ప్రథమ చికిత్స కేంద్రాలు, అవసరమైతే హెలిప్యాడ్స్ కూడా నిర్మించుకునేందుకు అవకాశం ఉంది. దిగువన కృష్ణానదిని ఆనుకుని ఉన్న ఆలయ పరిసరాల్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పే విధంగా అభివృద్ధి చేసేందుకు పథక రచన చేస్తున్నారు. ఇవన్నీ కార్యరూపం దాలిస్తే ఇంద్రకీలాద్రి స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. అమరావతిలో వీఐపీ కాటేజీల నిర్మాణానికి ప్రతిపాదనలు దుర్గమ్మ దేవస్థానానికి వీఐపీల తాకిడి క్రమంగా పెరుగుతుండటంతో వారికి తగిన వసతులు కల్పించడంపై దేవస్థానం అధికారులు దృష్టి సారించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి తరహాలో కాటేజీలు, సత్రాలు నిర్మించేందుకు ఇంద్రకీలాద్రిపై స్థలం లేకపోవడంతో అమరావతిలో అతిథి గృహాలు, కాటేజీలు, కల్యాణ మండపం, యాగశాల, పూజా మందిరాలు నిర్మించేందుకు 15 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ మూడు నెలల క్రితమే సీఆర్డీఏ అధికారులకు లేఖ రాశారు. ప్రభుత్వం స్థలం కేటాయిస్తుందని దేవస్థానం అధికారులు ఎదురుచూస్తున్నారు. స్థల కేటాయింపు జరిగిన వెంటనే శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులను ప్రారంభించేందుకు దేవస్థానం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కృష్ణానది మీదుగా రాకపోకలకు సన్నాహాలు ప్రభుత్వం అమరావతిలో స్థలం కేటాయిస్తే, ఆ స్థలంలో వీఐపీలకు కాటేజీలు, అతిథి గృహాలు, ఇతర నిర్మాణాలన్నీ పూర్తయితే అమ్మవారి భక్తులకు పూర్తిస్థాయిలో వసతి సమకూరుతుంది. అక్కడి నుంచి దేవస్థానానికి భక్తులు రాకపోకలు సాగించేందుకు దేవస్థానం తరపునే రవాణా ఏర్పాట్లు చేసి.. అన్నింటికి కలిపి భక్తులకు ఒక ప్యాకేజీని రూపొందించాలని ఆలోచిస్తున్నారు. అమరావతిలో నిర్మించే కాటేజీల్లో బస చేసిన భక్తులను బస్సుల్లో కృష్ణానది తీరానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి ఆధ్యాత్మిక ఆకృతులతో చక్కగా అలంకరించిన పంట్లు ద్వారా నది ఇవతల ఉన్న దుర్గాఘాట్‌కు తీసుకువచ్చి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇలా చేయడం వల్ల భక్తులకు మధురానుభూతి కలుగుతుందని, మరోవైపు పిలిగ్రిం టూరిజం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అమరావతిలోని వెంకటపాలెం, మందడం ప్రాంతాల్లో స్థలం కేటాయిస్తే దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు జలరవాణా ఏర్పాట్లు చేయడానికి అనువుగా ఉంటుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. ప్రయత్నాలు కార్యరూపం దాలిస్తే.. దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాం. కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న ‘ప్రసాద్’ పథకం ద్వారా ఇంద్రకీలాద్రి అభివృద్ధికి నిధుల కోసం ప్రయత్నిస్తున్నాం. మరోవైపు అమ్మవారి దేవస్థానానికి పెరుగుతున్న వీఐపీలు, భక్తులకు వసతి, సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా అమరావతిలో 15 ఎకరాలు స్థలం కేటాయించాలని కోరుతూ డీఆర్డీఏ అధికారులకు లేఖ రాశాం. మా ప్రయత్నాలు కార్యరూపం దాలిస్తే రెండు మూడేళ్లలో దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంతోపాటు ఇంద్రకీలాద్రి స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయి.. ప్రపంచస్థాయిలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకు అందరి సహకారం కోరుతున్నాం. - వి.కోటేశ్వరమ్మ, కార్యనిర్వహణాధికారి, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం
sonykongara Posted February 16, 2019 Author Posted February 16, 2019 బృహత్తర ప్రణాళిక16-02-2019 09:21:26 ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా దుర్గగుడి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ... ‘ప్రసాద్’ స్కీం కింద కేంద్ర నిధులకు డీపీఆర్ సిద్ధం (విజయవాడ, ఆంధ్రజ్యోతి): బెజవాడ కనకదుర్గమ్మ స్వయంభువుగా వెలిసిన ఇంద్రకీలాద్రిని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇందుకు అవసరమైన నిధులను కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ అమలుచేస్తున్న పిలిగ్రిమేజ్ రెజువెనేషన్ అండ్ స్పిరుచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్ (పీఆర్ఏఎస్ఏడీ) ద్వారా పొందేందుకు దుర్గగుడి అధికారులు సమగ్ర పథక నివేదిక (డీపీఆర్)ను సిద్ధం చేశారు. ఈ నివేదికను రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్రానికి పంపిం చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతా అను కున్నట్లు జరిగితే ఇంద్రకీలాద్రికి మహర్దశ పట్టనుంది. రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత రెండో పెద్ద దేవాలయం కనకదుర్గమ్మ ఆలయమే. నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో కృష్ణానది ఒడ్డున 65వ జాతీయ రహదారిని అనుకుని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతున్న ఇంద్రకీలాద్రికి ప్రతిరోజూ 35 నుంచి 40 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. వారంతాల్లో వచ్చే భక్తుల సంఖ్య లక్ష దాటుతోంది. ప్రతిఏటా నిర్వహించే దసరా ఉత్సవాలల్లో అయితే పది రోజుల్లో సుమారు 20 లక్షల మంది భక్తులు తరలివస్తున్నారు. వీఐపీల తాకిడి కూడా ఎక్కువే. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత భక్తులు ఆలయ పరిసరాల్లో కాసేపు కూర్చునేందుకు అనువైన ఆధ్యాత్మిక వాతావరణం కొరవడింది. ఆలయంలో భక్తులకు మౌలిక సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇంద్ర కీలాద్రికి సమీపంలోనే ఉన్న కృష్ణానదిలో తరచూ వాటర్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్నారు. నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. దుర్గగుడి నుంచి ఎలా వెళ్లినా 30 నిముషాల్లో చేరుకునేంత దగ్గరగా ప్రకాశం బ్యారేజీ, ఉండవల్లి గుహలు, గాంధీహిల్స్, గుణదలచర్చి తదితర పర్యాటక ప్రదేశాలున్నాయి. ఇంద్రకీలాద్రిని పర్యాటకులను విశేషంగా ఆకర్షించే సరికొత్త సందర్శనీయ క్షేత్రంగా.. ప్రపంచస్థాయి ఐకాన్‌గా దిద్దాలని దుర్గగుడి కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వ రమ్మ పట్టుదలగా ఉన్నారు. కేంద్ర పర్యటక శాఖ అమలుచేస్తున్న ప్రసాద్’ స్కీం ద్వారా నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇప్పటికే ఆమె దరఖాస్తు చేశారు. ఆ దరఖాస్తును పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ అధికారులు డీపీఆర్ పంపిం చాలని సూచిస్తూ ఓ కన్సల్టెన్సీ సంస్థను కూడా అటాచ్ చేశారు. కేంద్ర పర్యాటకశాఖ నుంచి సానుకూల స్పందన రావడంతోనే దుర్గగుడి ఈవో కోటేశ్వరమ్మ, ఎగిక్యూటివ్ ఇంజనీరు డి.వి.భాస్కర్ల నేతృత్వంలో నిపుణులు ప్రాథమిక డీపీఆర్‌ను సిద్ధం చేశారు. దానిని రాష్ట్ర పర్యాటకశాఖ ద్వారా కేంద్ర పర్యాటక శాఖకు పంపించనున్నారు. కేంద్రానికి చేరిన డీపీఆర్‌ను సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మోనిటరింగ్ కమిటీ (సీఎస్ఎంఎస్) పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తం ఎక్కడా అడ్డంకులు లేకుండా సాగిపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వంద శాతం నిధులు గ్రాంటుగా మంజూరవుతాయి. నిధులు మంజూరైతే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజ్ మెంట్ కమిటీ పర్యవేక్షణలోనే పథకాన్ని అమలు చేస్తారు. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం ‘ప్రసాద్’ పథ కానికి ఎంపిక కావడంతో ప్రస్తుతం రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అదే తరహాలో దుర్గమ్మ దేవస్థానం అభివృద్ధికి కూడా కేంద్రం నిధులు మంజూరు చేస్తుందన్న నమ్మకంతో దుర్గగుడి అధికారులు ఉన్నారు. అభివృద్ధి ప్రణాళిక ఇదీ.. భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా మౌలిక వసతులు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు దేవస్థానానికి చెందిన కుమ్మరిపాలెంలోని 2.6 ఎకరాల స్థలం, మహామండపం ముందు, దక్షిణ వైపున ఉన్న ఖాళీ స్థలాలు, కనకదుర్గనగర్‌లో అక్కన్న మాదన్న గుహల పక్కన ఉన్న ఖాళీ స్థలం, అర్జునవీధి, ఘాట్‌రోడ్డు, దుర్గాఘాట్ పరిసరాలను గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటరు, సాంస్కృతిక ప్రదర్శనలు, వేదసభల నిర్వహణకు ఉపయోగపడేలా మల్టీపర్పస్ హాల్స్, గ్రీన్‌ఫీల్డ్ డెవలప్ మెంట్లో భాగంగా పార్కులు, హేంగింగ్ గార్డెన్స్, వాటర్‌ఫాల్స్, సోలార్ లైటింగ్, హైమాస్ట్ లైటింగ్, పేవ్డ్ పార్కింగ్, భక్తులకు రక్షిత మంచినీటి సరఫరాకు ఆర్వో ప్లాంట్లు, ఎక్కడికక్కడ సీసీ టీవీలు, దేవస్థానం పరిసరాల చుట్టూ కాంపౌండ్ వాల్స్, స్వాగత ద్వారాలు (ఆర్చిలు), స్కైవాల్స్, దుర్గాఘాట్ నుంచి బోటింగ్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు చేశారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల తయారీకి సకల సౌకర్యాలతో కూడిన కాంప్లెక్స్ నిర్మాణం, మహామండపాన్ని అనుసంధానిస్తూ బహుళ అంతస్థుల క్యూ కాంప్లెక్స్ వంటి భారీ భవనాల నిర్మాణాలకు ప్రతిపాదనలతో సుమారు రూ.75 కోట్ల అంచనాలతో నివేదికను రూపొందించారు.
sonykongara Posted March 13, 2019 Author Posted March 13, 2019 ఆధ్యాత్మికం.. పర్యాటకం.. ఇంద్ర వైభోగం!13-03-2019 09:50:27 కనకదుర్గమ్మ అలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక కేంద్ర పర్యాటక శాఖకు రూ.75 కోట్లతో డీపీఆర్ ‘ప్రసాద్’ స్కీం కింద నిధుల విడుదలకు ప్రయత్నాలు ఇంద్రకీలాద్రిని ప్రపంచస్థాయి పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా మరోఅడుగు ముందుకు పడింది. ఇందుకోసం సుమారు రూ.75 కోట్ల అంచనాలతో బృహత్తర ప్రణాళిక సిద్ధమైంది. దుర్గగుడి అధికారులు ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా డీపీఆర్‌ను తయారు చేయించారు. ఈ ప్రణాళికను రాష్ట్ర దేవదాయ, ధర్మదాయశాఖ, రాష్ట్ర పర్యాటక శాఖల ద్వారా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖకు పంపించారు. డీపీఆర్‌ను సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మోనిటరింగ్ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ నిధులు మంజూరైతే ఇంద్రకీలాద్రి దశ మారనుంది. విజయవాడ (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ గుడికి ఏడాది పొడవునా రెండు కోట్లమంది భక్తులు వస్తు న్నందున కొండపై తగిన మౌలిక వసతులు కల్పించడంతోపాటు కనకదుర్గ దేవస్థానం పేరుప్రతిష్ఠలను ఇనుమడింపజేసేలా ఇంద్ర కీలాద్రిని ఫిలిగ్రిమ్ టూరిజం సెంటర్‌గా అభి వృద్ధి చేయాలని దుర్గగుడి ఈవో వి.కోటే శ్వరమ్మ సంకల్పించారు. కేంద్ర పర్యాటక మం త్రిత్వశాఖ అమలు చేస్తున్న పిలిగ్రిమేజ్ రెజు వెనేషన్ అండ్ స్పిరుచ్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్(పీఆర్ఏఎస్ఏడీ) పథకం ద్వారా నిధులు మంజూరు కోరుతూ కేంద్ర పర్యాటక మంత్రి త్వశాఖకు దరఖాస్తు చేశారు. దీనిపై సాను కూలంగా స్పందించిన కేంద్ర అధికారులు ఇం ద్రకీలాద్రి అభివృద్ధికి తగిన ప్రతిపాదనలతో సమగ్ర నివేదికను పంపించాలని సూ చించారు. దీంతో దుర్గగుడి అధికారులు ఓ ప్రై వేటు కన్సల్టెన్సీ సంస్థ ద్వారా డీపీఆర్‌ను త యారు చేయించారు. ఈ బృహత్తర ప్రణా ళికను రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖ, రాష్ట్ర పర్యాటక శాఖల ద్వారా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖకు పంపించారు. ఈ డీపీ ఆర్‌ను సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మోని టరింగ్ కమిటీ (సీఎస్ఎంఎస్) పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొ త్తం ఎక్కడా అడ్డంకులు లేకుండా సాగిపోతే కేంద్ర ప్రభుత్వం నుంచి వందశాతం నిధులు గ్రాంటుగా మంజూరవుతాయి. నిధులు మంజూరైతే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీ పర్యవేక్షణలోనే పథకాన్ని అమలు చేస్తారు. ప్రతిపాదిత అభివృద్ధి పనులు ఇవీ.. ఇంద్రకీలాద్రి నుంచి ఎటుచూసినా 30 ని మిషాల్లో చేరుకునేంత దగ్గరలో ఆరు పర్యా టక ప్రదేశాలున్నాయి. కృష్ణానదిలో తరచూ జలక్రీడలు నిర్వహిస్తున్న పున్నమిఘాట్, నది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్, మరోవైపు ప్ర కాశం బ్యారేజీ, ఉండవల్లి గుహలు, గాంధీహిల్స్, గుణదల చర్చి ఉ న్నాయి. అనుసంధానంగా పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షించే సరికొత్త సం దర్శనీయ క్షేత్రంగా.. ప్రపం చ స్థాయి ఐకాన్‌గా ఇంద్రకీలాద్రిని అభి వృద్ధి చేసేందుకు కార్యనిర్వహణాధికారి వి.కోటేశ్వరమ్మ నేతృ త్వంలో మెగా ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. మల్టీ స్టోరీడ్ పార్కింగ్ భవనం గుడికి రోజూ సగటున 600 కార్లు, సుమా రు 2 వేల ద్విచక్ర వాహనాలపై భక్తులు వస్తు న్నారు. ఈ వాహనాలను పార్కింగ్ చేసు కునేందుకు అవసరమైన స్థలం లేక పోవ డంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు కుమ్మరిపాలెంలో దేవ స్థానానికి చెందిన 2.6 ఎకరాల స్థలంలో మల్టీ స్టో రీడ్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మిం చాలని ప్రతి పాదించారు. ఇందుకు రూ.13.35 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. హేంగింగ్ గార్డెన్స్, వాటర్ ఫాల్స్ భక్తులను, పర్యాటకులను ఆకట్టుకునేలా మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి పనులు చేపట్టేందుకు మల్లికార్జున మహామండపం ముందు, దక్షిణ వైపున ఉన్న ఖాళీ స్థలాలు, కనకదుర్గనగర్‌లో అక్కన్న మాదన్న గుహల పక్కన ఉన్న ఖాళీస్థలం, అర్జునవీధి, ఘా ట్‌రోడ్డు, దుర్గాఘాట్ పరిసరాలను గుర్తిం చారు. సందర్శకులను విశేషంగా ఆకటు ్టకునేలా మల్టీపర్పస్ హాల్స్, గ్రీన్‌ఫీల్డ్ డెవల ప్మెంట్లో భాగంగా పార్కులు, హేంగింగ్ గార్డెన్స్, వాటర్‌ఫాల్స్, సోలార్, హైమాస్ట్ లైటింగ్, మహామండపం ముందున్న ఖాళీస్థలంలో చుట్టూ ఆర్సీసీ రిటైనింగ్ వాల్ నిర్మాణం, మహామండపం ముందు కనకదుర్గ కాంప్లెక్స్, కనకదుర్గానగర్‌లో పేవ్డ్ పార్కింగ్ ఏరియా అభివృద్ధి, కనకదుర్గానగర్ మీదుగా అమ్మవారి దేవస్థానానికి వెళ్లేందుకు ఎంట్రన్స్ ఆర్చి నిర్మాణం, అర్జునవీధిలో ఫిలిగ్రిం ఎ మినీస్ కాంప్లెక్స్, అడుగడుగునా సీసీ కె మెరాలు, సీసీ టీవీలు, దేవస్థానం పరిసరాల చుట్టూ కాంపౌండ్ వాల్స్, స్వాగత ద్వారాలు (ఆర్చిలు), స్కైవాల్స్, దుర్గాఘాట్ నుంచి బోటింగ్ తదితర సౌకర్యాలు కల్పించేందుకు ప్రతిపాదనలు చేశారు. డ్రింకింగ్ వాటర్ కియోస్క్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణ యించారు. ఈ పనులన్నింటినీ 35.23 కోట్లు ఖర్చవుతుందని ఆంచనా వేశారు. ఘాట్‌రోడ్డును ఆనుకుని అభివృద్ధి దుర్గాఘాట్‌ను ఆనుకుని ఉన్న జాతీయ రహదారి మీదుగా ఘాట్‌రోడ్డు వెంబడి భక్తు లకు సౌకర్యాలు కల్పించాలని ప్రణాళిక రూ పొందించారు. ఘాట్‌రోడ్డు విస్తరణ, స్కై వాల్క్ల నిర్మాణం, ఘాట్‌రోడ్డు పొడవునా.. టీ టీడీ స్థలం నుంచి అర్జునవీధి ఎంట్రన్స్ వ రకు షెల్టర్డ్ పాత్వే నిర్మాణం, ఎక్కడికక్కడ ఎల్ఈడీ బోర్డులు, మార్గాలను సూచించే సైన్‌బోర్డులు, వృద్ధులు, వికలాంగులను తీసుకువెళ్లేందుకు వీలుగా బ్యాటరీతో నడిచే మినీ బస్సులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. శివాలయానికి వెళ్లే మెట్ల ఆధునికీకరణ, దుర్గాఘాట్‌లో బోటింగ్ తదితర సౌకర్యాలతో ఏర్పాటుకు రూ. 22.70 కోట్లతో అంచనాలు రూపొందించారు. భవనాల నిర్మాణం ప్రస్తుతం మహామండపంలోని రెం డో అంతస్థులో రోజుకు 4 వేల మందికి మిం చి భక్తులకు అన్నదానం చేయలేకపోతున్నారు. ఈ సమస్య పరిష్కరించి రోజుకు 10 నుంచి 15 వేల మంది భక్తులకు అన్నదానం చేసేందుకు వీలుగా రూ. 25 కోట్లతో జి+3 ప్రాతిపదికన బహుళ అంతస్థుల భవనం, ప్రసాదాల తయారీకి, మరో భవనాలను సకల సౌకర్యాలతో నిర్మించాలని డీపీఆర్‌లో ప్రతిపాదించారు.
sonykongara Posted April 18, 2019 Author Posted April 18, 2019 ఇంద్రకీలాద్రికి...ఆకుపచ్చసోయగం రూ.1.5 కోట్లతో మూడు దశల్లో పనులు ఘాట్ రోడ్డుకు కాలిబాట మార్గం అనుసంధానం న్యూస్‌టుడే, ఇంద్రకీలాద్రి రాష్ట్ర రాజధానిలో కీలకమైన దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం పరిధిలో పచ్చదనం అభివృద్ధితో పాటు హెడ్‌వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో కాలిబాట మార్గం రూ.1.5 కోట్లతో అభివృద్ధి చేసే పనుల తొలి దశ పూర్తయ్యింది. మూడు దశల్లో అభివృద్ధి చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్(ఏడీసీ)కు అప్పగించింది. ఏడాదిగా హెడ్ వాటర్ వర్క్స్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో మూడు వరుసల్లో చదును చేశారు. దిగువ భాగంలో కొబ్బరి మొక్కలను పెంచారు. చుట్టూ ప్రహరీ నిర్మించి గేటును ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం కనకదుర్గ పైవంతెన నిర్మాణం సందర్భంగా కొండ ప్రాంతంలో ఉన్న ఇళ్లను తొలిగించారు. ఆ సమయంలో అప్పటి కలెక్టర్ అహ్మద్‌బాబు కాలిబాట నిర్మాణం పనులను దుర్గగుడి అధికారులు చేపట్టాలని సూచించారు. అప్పటి దుర్గగుడి ఈవో సూర్యకుమారి తమ దగ్గర ఉన్న నిధులు రాజగోపురం, పెర్గొల, ఇళ్ల సేకరణ పనులకు ఖర్చు చేశామని, ఇప్పడు కాలిబాట పనులు చేయలేమని చెప్పడంతో ఆ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు అప్పగించింది. పచ్చదనం అభివృద్ధితో పాటు కాలిబాట పనులు కూడా చాలా వరకు తొలి దశలో పూర్తి చేసింది. మిగతా రెండు దశల్లో కాలబాటను దుర్గగుడి ఘాట్ రోడ్డుకు అనుసంధానం చేయడానికి మధ్యలో లోయ ఉంది. దానిని పూడ్చేందుకు అక్కడ వంతెన నిర్మించాలన్న ప్రతిపాదనను అధికారులు తీసుకొచ్చారు. ప్రతిపాదన కార్యరూపం దాల్చకపోవడంతో పచ్చదనం అభివృద్ధికి మాత్రమే పనులు పరిమితమయ్యాయి. మూడు దశల్లో అభివృద్ధి హెడ్‌వాటర్ వర్క్స్ సమీపంలోని కొండ ప్రాంతంలో చేపట్టిన పచ్చదనం అభివృద్ధిపై ఏడీసీ సూపరింటెండెంట్ సూర్యనారాయణను వివరణ కోరగా మూడు దశల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలవడిన తరువాత రెండో దశ పనులను ప్రారంభిస్తామన్నారు. మొదటి దశలో సివిల్ వర్క్స్ పూర్తి చేయడంతో పాటు కొంత మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రెండో దశలో శిఖరాగ్రాన రివర్ వ్యూ సెల్ఫీపాయింట్, విశ్రాంతి తీసుకునేందుకు బల్లలు, వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ వంటి పనులతో పాటు ఆకర్షణీయంగా పచ్చదనం అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. - సూర్యనారాయణ, ఏడీసీ సూపరింటెండెంట్ ఇంజినీర్
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now