Jump to content

కాంగ్రెస్ అన్యాయమే, బిజెపి నమ్మక ద్రోహమే చేసింది


Dravidict

Recommended Posts

ఆశ…కేవలం తొమ్మిదినెలల్లోనే ధైర్యంలా ఆవిరైపోయింది. దిగులు లాగ ముఖాన్ని కమ్ముకుంది. వెలుగు లాగ మసకబారింది. దీపం లాగ కొడిగట్టిపోయింది. అన్యాయమైపోయిన నిస్సహాయులకు దొరికే ఆశ నెరవేరకపోయినా కూడా అలాంటి భరోసా ఇచ్చిన వారి మీద ప్రేమను జీవితాంతం మరచిపోకపోవడమే ప్రజాసామాన్య లక్షణం. ఈ పాటి ఇంగితమైనా లేని బిజెపి ఆశను మోసంగా మార్చేసింది. పెంచుకుంటున్న ప్రేమను మెడపట్టి గెంటేసింది. కాంగ్రెస్ ఆంధ్రాకు కేవలం అన్యాయమే చేస్తే బిజెపి నమ్మక ద్రోహమే చేసింది. ఏబడ్జెట్ రోజునైనా ఇన్ కమ్ టాక్స్ లిమిట్ పెంచారా, నేను కొనే, కొనాలనుకునేవస్తువుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనిమాత్రమే చూసే వాణ్ణి…నిన్న కోట్లాది మందిలాగే నేను కూడా ఆంధ్రప్రదేశ్ కి ఏమేమి కేటాయించారని మాత్రమే చూశాను…చాలా మందిలా నా నిరాశ బిజెపి మీద అసహనైపోయింది. వాజ్ పాయ్, అధ్వాని లాంటి పెద్దమనుషులు నడిపించిన పార్టీలోకి మోడీ లాంటి నోరేసుకు పడిపోయే సీ్ట్రట్ ఫైటర్లు చొరబడిపోయాక ఇచ్చిన మాట నిలుపుకునే ధర్మగుణానికి చోటెక్కడన్న ఏవగింపే మిగిలింది.

 

ఆంధ్రప్ర దేశ్‌ రాషా్టన్రికి ప్రత్యేక హోదాని ఇచ్చే అంశం కేంద్ర బడ్జెట్‌లో అసలు ప్రస్తావనకే రాలేదు. ప్రత్యేక ప్యాకేజీపైనే కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈవిషయమై కేంద్ర ఆర్థిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆశల పై నీళ్లు చల్లారు. ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి ప్రత్యేక హోదాను కల్పిస్తామని యూపీఏ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ప్రక టించారు. అయితే ఎన్‌డీఏ బడ్జెట్‌లో ఈ విషమై కేంద్రం విస్మరించింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి కొత్త రాజధాని నిర్మాణ నిధుల విషయంలో కూడా కేంద్రం దాటవేత వైఖరి అవలంబించింది.

 

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణానికి దాదాపు రెండు లక్షల కోట్ల రూపా యలు ఖర్చవుతుందని గతంలోనే కేంద్ర ఐఐటీ నిపుణుల బృందం అంచనా వేసింది. రాజధాని నిర్మాణానికి అయ్యే ఖర్చుకు సంబంధించి నిధుల కేటాయిం పు విషయమై కేంద్ర ఆర్థిక మంత్రి ఎక్కడా ప్రస్తావించకపోవడంతో ఈ ఆర్థిక సాయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా ఏడాదికి 10 వేల కోట్ల రూపాయ ల చొప్పున ఐదేళ్ల పాటు ఆర్థిక సహాయాన్ని చేస్తామని గత కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దీనిగూర్చి అసలు మాట్లాకపోవడంతో ఈ ఆర్థిక సాయం రాషా్ట్రనికి ఇస్తుందా లేదా అనేది సందిగ్దమే అవుతోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి తొలి ఏడాది ఏర్పడే 15 వేల కోట్ల రూపాయల లోటును కేంద్రం భరిస్తుందని తేల్చిచెప్పినా అందుకు అనుగుణంగా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ఎక్కడా తీసుకురాలేదు. అంతేకాకుండా పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడంతో దాని నిర్మాణానికి అయ్యే నిధులను కేటాయించే విషయంలోనూ రాషా్ట్రన్ని విస్మరించింది. కేవలం పోలవరం ప్రాజె క్టుకు మొక్కుబడిగా 100 కోట్ల రూపాయలను మాత్రమే 2015-16 బడ్జెట్‌లో కేటాయించింది.

 

దీంతోపాటు గిరిజన విశ్వవిద్యాలయానికి 2 కోట్ల రూపాయ లు, ఆంధ్రప్రదేశ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి కోటి రూపాయలు, విశాఖపట్టణం మెట్రోకు 5.63 కోట్ల రూపాయలు, ట్రిపుల్‌ ఐటీకి 45 కోట్ల రూపాయలు, ఐఐఎన్‌సీఈఆర్‌, ఐఐటీకి, నిట్‌, ఐఐఎంలకు ఒక్కొక్క దానికి 40 కోట్ల రూపా యలు చొప్పున బడ్జెట్‌ కేటాయింపులు చేసి చేతులు దులుపుకొంది. ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తదుపరి ఆంధ్రప్రదేశ్‌లో సరైన వైద్య సౌకర్యా లు లేకపోవడంతో విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు రాషా్ట్రనికి ఎయిమ్స్ మంజూరు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం గతం నుండి కేంద్రాన్ని కోరుతోంది. దీనిపై గత సెప్టెంబర్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటు చేస్తామని, ఇందుకు 500 కోట్ల రూపాయలను ఆ బడ్జెట్‌ లో కేటాయించినా ఆ నిధులను ఇప్పటి వరకూ విడుదల చేయలేదు సరికదా 2015-16 బడ్జెట్‌లో తదుపరి నిధులను కేటాయించ లేదు. ఉమ్మడి రాష్ట్రం రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతల అంశాన్ని గవర్నర్‌కు ఇస్తూ పునర్విభ జన చట్టంలో పేర్కొని దాదాపు తొమ్మిది నెలలు కావస్తున్నా అది ఇంత వరకూ అమలు చేయలేదు. దీనిపై కూడా బడ్జెట్‌లో ప్రస్తావిచకుండానే కేంద్రం జాగత్ర… పడడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా తయారైంది. దీంతో పాటు పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పన్నుల రాయితీలు, ప్రోత్సాహకాలు, ద్రవ్యజవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం నిబంధనలను సడలించడం వంటి అంశాలను అమలు చేయాల్సి ఉన్నా వాటి ఊసే ఎక్కడా లేకుండా పోయింది.

 

వెనుక బడిన ప్రాంతాలకు ఇచ్చే నిధుల నుండి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇటీవల 500 కోట్ల రూపాయలను మంజూరు చేసి కేంద్రం చేతులు దులుపుకుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత 2015-16 వార్షిక బడ్జెట్‌లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సాయం అందించనున్నట్లు పేర్కొంది. దీనికి తగినట్లుగా బీహార్‌, బెంగాల్‌ రాషా్టల్రతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాషా్టన్రికి వెనుక ప్రాంతాలకిచ్చే ఆర్థిక సాయాన్ని ఇస్తామని వెల్లడించినా దానిపై స్పష్టత మాత్రం లేకపోవడంతో అది ఎంత వరకూ అమలు చేస్తుందనేది సందేహాస్పదమే అవుతోంది. వీటికి తగినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం సెప్టెంబర్‌ బడ్జెట్‌లో వెల్లడించింది. దీంతోపాటు, విశాఖపట్టణం-చెనై్న పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధి, కాకినాడ పోర్టుపై ప్రత్యేక దృష్టిసారిస్తామని, దాని అభివృద్ధికి ప్రోత్సాహకాలను కల్పిస్తున్నట్లు ఆ బడ్జెట్‌ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. కాకినాడ పోర్టుకు సమీ పంలోని ప్రాంతాలను ఆర్థికాభివృద్ధి కేంద్రాలుగా గుర్తిస్తారు. అలాగే నెల్లూ రు జిల్లా కృష్ణపట్నం ఓడరేవుకు అదనపు నిధులు లభించనున్నాయి. కృష్ణపట్నం లో ప్రత్యేక నిధులతో ఇండసి్ట్రయల్‌ స్మార్ట్ సిటీని కూడా ఏర్పాటు చేయను న్నట్లు తెలిపారు. వీటితోపాటు అనంతపురం జిల్లా హిందూపూర్‌లో నేషనల్‌ కస్ట మ్‌‌స అండ్‌ ఎకై్సజ్‌ అకాడమీని ప్రతిపా దించారు. అయితీ వీటిని గూర్చి ప్రస్తా వించకపోగా, అందుకు అవసరమయ్యే నిధులను 2015-16 బడ్జెట్‌లో ఎక్కడా కేటాయించక పోవడంతో ఆంధ్రప్రదేశ్‌ రాషా్ట్రనికి ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రకటించిన ఈ ప్రాజెక్టు లు అసలు అమలు జరుగుతుందా లేదా అనేది సందేహాస్పదమవుతోంది.

Link to comment
Share on other sites

too much saami asalu.... chaduvuthunte blood boil avuthundi..... UPA1 govt is 100000 times better than this anti-national alias NDA govt.....

UPA2 form ayye sariki Congress, party ga balaheena padi Sonia strengthen aindi,.. ade asalu musalam techindi ledante better gaane undedi situation

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...