Jump to content

బాధని దిగమింగుతూ.. నాన్నకు ఓదార్పుగా


Vinod

Recommended Posts

నందమూరి హరికృష్ణ కుమారుడు జానకీరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారన్న వార్త విన్న సినీ నటుడు, ఆయన తమ్ముడైన జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. నాన్న హరికృష్ణ తర్వాత మళ్లీ తమ కుటుంబానికి అన్నీ తానే అయిన అన్నయ్య ఇక లేరనే వార్తని విని ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ సమాచారం అందిన వెంటనే భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలినిలతో పాటు ఆయన హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.

 

అప్పటికే విషాదంలో మునిగిపోయిన తన తండ్రిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దేవుడు తనని మోసం చేసి ఎదిగొచ్చిన కొడుకుని తీసుకెళ్లిపోయాడే అంటూ శోకసంద్రంలో మునిగిపోయిన ఆ తండ్రి మనసుని ఓదార్చడం ఎవరితరంకాలేకపోయింది. హరికృష్ణ సోదరులు, వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లు... ఇలా నందమూరి కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు అందరూ హరికృష్ణ నివాసానికి చేరుకున్నారు.

 

పండగే అనుకున్నారు.. విధి వెక్కిరిస్తుందనుకోలేదు

 

షెడ్యూల్ ప్రకారం కల్యాణ్ రామ్ హీరోగా సొంత బ్యానర్‌లో తెరకెక్కిన పటాస్ మూవీ ఆదివారం ఆడియో లాంచింగ్ ఫంక్షన్ జరుపుకోవాల్సి వుండగా జానకీ రామ్ మృతి నేపథ్యంలో ఆ కార్యక్రమం అప్రకటితంగానే వాయిదా పడింది. ఈమధ్య కాలంలో నందమూరి కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయని పుకార్లు వచ్చిన తరుణంలో ఈ ఆడియో లాంచింగ్ ఫంక్షన్ వేదికగా ఆ పుకార్లని తిప్పి కొట్టాలని, తమ కుటుంబంలోని ఐకమత్యాన్ని చాటుకోవాలని నందమూరి కుటుంబసభ్యులు భావించినట్లుగా వార్తలొచ్చాయి. ఫిలింనగర్ అప్‌డేట్స్ ప్రకారం.. హరికృష్ణ, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, జానకీ రామ్, తారకరత్న.. ఇలా నందమూరి వంశస్తులంతా ఒక్కచోట చేరి కాసేపు సరదాగా గడపాలని భావించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా ముఖ్య అతిథిగా వస్తారని నందమూరి అభిమానులు ఆశించారు. 

అంతా అనుకున్నట్లుగానే జరిగితే, 'పటాస్' ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ఓ పండగలా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం జానకీ రామ్‌ని బలిగొంది. అనుకోని రోడ్డు ప్రమాదం ఆయన ఊపిరి తీసింది. దీంతో ఈ ఆదివారాన్ని పండగలా జరుపుకుందామని అనుకున్న నందమూరి కుటుంబానికి చివరికి తీరని విషాదమె మిగిలింది.   

 

Deepest Condolences to NHK family 

 

RIP Janaki Ram :( :( :(

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...