Jump to content

stop working >8 hours .... tharuvaatha mee ishtam


Cyclist

Recommended Posts

డబ్బులు వెనకేసుకోవాలి అనే కాంక్షతో  చాలా మంది ఓవర్‌టైమ్ డ్యూటీలు చేస్తుంటారు. అయితే రోజుకు 8 గంటలకు మించి పని చేస్తే ప్రమాదం అని  తాజా  అధ్యయనం  చెబుతోంది. 8 గంటలకు మించి పనిచేసే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం దాకా ఉన్నాయని లండన్ లో నిర్వహించిన అధ్యయనంలో తేలింది.
ఇటీవల కాలంలో వేలాది మంది ఉద్యోగులు తరచు గుండె పోట్లు, హృద్రోగాల బారిన పడడానికి ఎక్కువ గంటలు పనిచేయడమే కారణమని శాస్త్రవేత్తలు ఒక నిర్ధారణకు వచ్చినట్లు ‘డైలీ మెయిల్’ పత్రిక పేర్కొంది . ఫిన్నిష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆక్యుపేషనల్ హెల్త్ సంస్థ ఈ అధ్యయనం నిర్వహించింది  చాలా మంది తమ ఉద్యోగం ఊడిపోకుండా ఉండడానికి ఎక్కువ గంటలు పనిచేస్తున్నారని, అది వారి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తోందని ప్రధాన పరిశోధకుడు డాక్టర్ మరియానా పేర్కొన్నారు.కాబట్టి జాగ్రత్త గా వుండటం మంచిదని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...