Jump to content

నేను.. నా NTR...and his 10 YEARS.. (from - RAM MUPPALLA)


Ram muppalla

Recommended Posts

పదేళ్ళ ప్రస్థానం లో ఎన్నో మైలురాళ్ళు...

పడినా పోరాడే ఓర్పు...ప్రతి దానిలో పోరాడి గెలిచే నేర్పు..

అడుగు ఏదైతేనేం...! అంతిమ అడుగు విజయం దగ్గర ఆగేటప్పుడు...!

 

సినీ ప్రపంచం లో అలాంటి అడుగు 15 - Nov పడినప్పుడు ఎవరూ గమనించలేదేమో...అపుడే మొలుస్తున్న గడ్డి పరకలా చుసిన వాళ్ళూ లేకపోలేదు... కాని, అది నేలని చీల్చుకు పుట్టిందని భావించే వాళ్ళెందరు...!

కాని, దానికి తెలుసు.. వయసు లేతది అయినా, పుట్టుక కొత్తదైనా, నెల గుండెల్నిచీల్చుకొచ్చేది/వచ్చింది తానేనని...!

అప్పటిదాక నా నీడలో ఇంకెవ్వరు పైకేదగలేరు అని విర్రవీగుతున్న 'మెగా' వ్రుక్షాలకే తెలియలేదు, తన కింద చిన్న మొక్క పుట్టుకతో భూమి కదులుతుందని..!

 

 

ఈ కల్పన ఇక్కడ అసందర్భమే కావచ్చు..కానీ కరిగిన కాలం లో, అప్పటి సందర్భం అదే...!

 

అప్పటికే "నిన్ను చూడాలని" అనిపిస్తే చూసాం.. అబ్బ..! " నెంబర్ - 1 " లాగా ఉన్నాడు అనుకున్నాం...

 

తరువాత, రావాల్సిన ఆ రోజు రానే వచ్చింది.. అడుగు మొదటిది కాకపోయినా "ఆది" గా వచ్చి అదే సినిమాతో ఒక అడుగు తనని మోస్తున్నదన్న అభిమానంతో నేల మీద, ఇంకో అడుగు అప్పటికే ఉన్న రికార్డుల మీద పెట్టి..నేలలోకి తోక్కేసావ్...

 

"విజయం అంటే ఇదే...!" అని అంటున్న అభిమానుల్ని ఆప్యాయం గా "సదా మీ ప్రేమకి బానిసని.." అని నీ విజయాన్ని అభిమాన సోదరులకి అంకితం ఇచ్చావ్...

తరువాత "సింహాద్రి" తో TELUGU FILM INDUSTRY లో సింహభాగం కొట్టేసావ్...

 

కాలగమనం లో మార్పులనేకం...అలాంటి మార్పులు మనిషి జీవితంలో సహజం...

 

తనకి మీరిన విజయాల్ని సొంతం చేసుకున్న తనకి, జీవితం అంటే తెలుసునే అవకాసం వచ్చింది.. తెలిసో, తెలియకో పొరపాటు చేసాడు.. పొరపాటు అని కూడా అనలేం, తన ఇమేజ్ తనకి తీసుకొచ్చిన 'మోయలేని భారం'. కొన్నాళ్ళు అందరి నోటికి మాట అయ్యాడు...గట్టిగా కొడితేనే కదా! బంతి ఐనా బాగా పైకి లేచేది.. అలా ఎన్నో పడ్డాడు..ఎన్నో నేర్చాడు.. ఏది ఏమైనా ఒకటే అనుకున్నాడు, ఇక్కడే నా జీవితం...ఇదే నా సర్వస్వం...

 

అయినా 'ఓటమి' నుండి 'అనుభవం'...'విజయం' నుండి 'కొత్తధనం' తేసుకోవటం మన బుడ్డోడికి పుట్టుకతో వచ్చిన విద్య..

 

జీవితాన్ని చదివిన యోగి లా..తన అనుభవాన్ని ఒక్క మాటలో 'పరిపూర్ణం' చేసాడు... "విజయానికి చుట్టాలు ఎక్కువ...ఓటమి అనాధ" అని...!

 

కారణ జన్ముడికి అవతారలేక్కువ...! తన కోసం చేసే వాడు మనిషి...తను 'మన కోసం' చేసేవాడు మహర్షి...అన్నట్టు తనే మారిపోయాడు..

అప్పుడే..విజయప్రస్థానం లో మరో కలికితురాయి.. "యమ దొంగ" రూపం లో.... దోచుకున్నాడు, అనే పదం చిన్నదౌతుందేమో...ఆంధ్ర ప్రజల మనసు కొల్లగొట్టాడు, తన నటనతో, ఆహార్యంతో, అభినయం తో, వాచకంతో.. ఒక్క మాట లో చెప్పాలంటే..'అందరి DOUBTS క్లియర్ చేసాడు'..!

 

ఎవరైన అడిగితే..ఎంతటి విజయాన్ని అయినా, నిమిషం లో అభిమానులకి అంకితం ఇస్తాడు..

 

ఇక విజయం కూడా...నీతో పోటి పడలేక, తలవంచింది..దాంతో, ఇక ఎవరు చేరిపెయలేరనుకుని 'యమదొంగ' ని రికార్డుల్లోకి ఎక్కించి, frame చేయించి గోడ మీద పెట్టాలనుకున్నా..కానీ కుదరలేదు...! మళ్ళి దించాల్సి వచ్చింది.. 'కంత్రి' కోసం కిందకి దించి కొత్త రికార్డు రాసి మళ్ళి పైకి ఎక్కించా...!

 

ఇక్కడ చిన్న గ్యాప్...ప్రజలతో మమేకం అవ్వటానికి వెళ్లి...ప్రభంజనాన్ని సృష్టించాడు...'ఎక్కడైనా కన్నామా...ఎప్పుడైనా విన్నామా' అన్నట్టు... దేశం మొత్తం 'తెలుగు దేశం' గురించి, దాని కోసం తిరిగే బుడ్డోడి గురించి మాట్లాడడం స్టార్ట్ చేసింది... అది నబూతో నభవిష్యత్...అది చూస్తే, బాలయ్య సినిమా లో చెప్పిన - "చరిత్ర సృష్టించాలన్న మేమే...దాన్ని తిరగ రాయాలన్న మేమే.." అన్న మాట ఖచ్చితంగా నిజమేమో అనిపించక మానదు...

 

మళ్ళి, అంతలోనే 'అదుర్స్' అనిపించాడు..మళ్ళి, గోడ మీదున్న వాల్ frame కిందకి దించి రాసి పైకి ఎక్కించే లోపే...! "బృందావనం" వచ్చింది...ఇక దించే ఓపిక లేదు... కిందే పెట్టేసా..ఇక నుండి సంవత్సరానికి 2 , 3 సార్లు రాసుకోవాల్సి వస్తదిగా... :)

 

నీ ఎత్తు శిఖరం...

నీ మనసు హిమాలయం...

నువ్వు మేరు పర్వతం...

అందుకే, నా ఈ 'పోస్ట్' మాకు అంకితం ఇచ్చిన నీ విజయాల వెనక ఉన్న కష్టానికి అంకితం...

 

విజయాల వారధి... తెలుగు యువత రదసారధి...!

సరిలేరు నీకెవ్వరు...తాత ఆస్తిగా, మనవడిగా నువ్వు కాక ఇంకెవ్వరు...!

 

నీ... RAM MUPPALLA.

 

PS: evaro adigaru TELUGU lo rayamani...I tried my best...please excuse, if it has any typo mistakes...

 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...