Jump to content

APDevFreak

Members
  • Posts

    1,060
  • Joined

  • Last visited

  • Days Won

    1

Posts posted by APDevFreak

  1. మూడేళ్లు.. 3 వేల కోట్లు
    11-12-2017 03:43:51
     
    636485606354770600.jpg
    • ప్రకాశం జిల్లా సాగర్‌ ఆయకట్టులో నష్టపోయిన రైతులు
    • వరద నీటిపై ప్రకాశానికి మిగులు హక్కు.. ఐనా, నీరు కరువే!
    • తిండిగింజలూ, పశుగ్రాసానికి తీవ్ర ఇక్కట్లు
    • పాడి పరిశ్రమా దెబ్బతిని, రైతుల వలస బాట
    • డ్యామ్‌ నిండినా నీరు ఇవ్వడం లేదని ఆవేదన
    ఒంగోలు, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): నీరే నమ్మకం! ఆ నమ్మకంతో సాగర్‌ జలాలపై ఆధారపడి యేటా పంటలు వేస్తున్నారు. ఆయకట్టంతా కళ్లేసుకొని నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈరోజు రేపు అంటూ ఆశలు ఊరడమే తప్ప జలాలు రావడం లేదు. చేసేది లేక వేసిన పంటను పీకేసి పశువులకు వేస్తున్నారు. ఇదీ మాగాణి రైతుల కథ! సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు కాలువ నీరు అంతగా అందదు. కొంత వర్షాలపై, మరికొంత తడులపై ఆధారపడి ఆరుతడి పంటలు వేస్తున్నారు. సాగు కాలమంతా కాకపోయినా మధ్య మధ్య రెండుమూడు గట్టి తడులు తగిలితే చాలనుకొంటున్నారు. కానీ, కంట తడి తప్ప పంటకు తడి అందదు. ఇది మెట్ట రైతుల కథ! ప్రకాశం జిల్లాలోని సాగర్‌ ఆయకట్టు ప్రాంతంలో చాలా మాగాణి భూములను బీడుగా వదిలేస్తే.. మెట్ట పొలాల్లో ఎండిపోయిన కంది పంట రైతు కడుపు మండిస్తోంది.
     
     
    గత మూడేళ్లలో దాదాపు మూడు వేల కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారు. ఏడాదికి రెండు మూడు పంటలు తీసిన ఆయకట్టు రైతులు.. ఇప్పుడు పనుల కోసం వలస పోవడం కనిపిస్తోంది.
     
    అటు కర్నూలుతో, ఇటు నెల్లూరు, గుంటూరుతో సరిహద్దును పంచుకొంటున్న ప్రకాశం జిల్లాకు నీటి వనరులు తక్కువ. సాగర్‌ కుడి కాలువే సాగుకు ప్రాణం. జిల్లా మొత్తం విస్తీర్ణం సుమారు 17.14 లక్షల హెక్టార్లు. అందులో సాగు భూమి 5.84 లక్షల హెక్టార్లు. ఇందులో 40శాతం భూములు సాగర్‌ కుడి కాలువపైనే ఆధారపడుతున్నాయి. ఆరు నియోజకవర్గాలు.. 28 మండలాల్లోగల 4.30 లక్షల ఎకరాలు.. సాగర్‌ కుడి కాలువ ఆయకట్టు కింద ఉన్నాయి. ఇందులో లక్ష ఎకరాలు ఆయకట్టు శివార్లలో ఉన్నాయి. ఇక్కడ మెట్ట పంటలు వేస్తున్నారు. మిగతా విస్తీర్ణమంతా వరి వేస్తున్నారు.
     
     
    అప్పుడలా...
    ప్రకాశం జిల్లా పరిధిలోని ఆయకట్టులో ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి లభిస్తుంది. బస్తా ధర రూ.1200 అనుకొన్నా, ఎకరాకు రూ.50వేల రాబడి ఉంటుంది. వరిగడ్డి ఖరీదు రూ. 8వేల నుంచి పది వేలను కలుపుకొంటే.. ఎకరాకు రూ.60వేల వరకు వస్తుంది. ఇలా ఏడాదికి వరి ధాన్యం ద్వారా రూ.850 కోట్లు, వరిగడ్డి ద్వారా రూ.150 కోట్లు వెరిసి రూ.వెయ్యి కోట్లు వస్తుంది. అంటే, ఆ మూడేళ్లలో ప్రకాశం ఆయకట్టు రైతులు రూ.మూడు వేల కోట్ల రాబడిని కోల్పోయారన్నమాట. కాలువ నీరు ఆగిపోయే సమయంలో రైతులు పెద్దఎత్తున పశుగ్రాసం వేస్తారు. దీనివల్ల పశువుల మేతకు కొదవ ఉండకపోవడంతోపాటు, పాడిపరిశ్రమ బాగా ఉండేది. రోజుకు రెండువేల లీటర్ల పాలను ఉత్పత్తి చేసే గ్రామాలెన్నో కనిపించేవి. ఇది మూడేళ్ల క్రితం మాట.
     
     
    ఇప్పుడిలా..
    వరుసగా మూడేళ్లు సాగర్‌ నీరు వదలలేదు. నాగార్జునసాగర్‌ డ్యామ్‌లో నీరు లేకపోవడంతో.. మొదటి రెండేళ్లు మాగాణి భూములు తడవలేదు. ఇక మెట్టపైర్ల గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయకట్టు చివరి భూములకు అతికష్టంపై ఒకటి, రెండు తడులు ఇవ్వగలిగారు. ఈసారి డ్యామ్‌కు వరద నీరు పోటెత్తింది.
     
    అయినా.. సాగర్‌ ప్రధాన కుడికాలువ కింద వరిసాగుకు ప్రభుత్వం నీరు ఇవ్వకపోవడం రైతుల కష్టాలను పెంచింది. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు, శ్రీశైలంలోని నీటిని రాయలసీమ ప్రాంతానికి ప్రభుత్వం అందించింది. అలాంటప్పుడు నికర జలాల హక్కు ఉన్న సాగర్‌ కుడికాలువకు ఎందుకు నీరు వదలడం లేదని అన్నదాతలు వాపోతున్నారు. ఒకటి, రెండేళ్లు ఎలాగో తట్టుకోగలిగిన రైతులు.. ‘మా వల్ల ఇక కాదు’ అంటూ మాగాణి భూములను బీడు పెట్టారు. గ్రామాలను ఖాళీ చేసి పనులు వెతుక్కొంటూ వలసబాట పడుతున్నారు.
     
     
    రూ. 35 వేలకు గడ్డి కొంటున్నాం
    మూడేళ్లుగా పంటలు చేతికి రావడం లేదు. ఈ ఏడాది కందిపైరు ఎకరాకు మూడు బస్తాలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. సాగర్‌ జలాలు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి వరిగడ్డి తెచ్చుకొంటున్నాం. తెనాలి, విజయవాడ ప్రాంతాల నుంచి లారీ గడ్డి రూ.35వేలకు కొనుగోలు చేస్తున్నాం.
    - పేరం రమణారెడ్డి, కొత్తరెడ్డిపాలెం, దర్శి మండలం
     
     
    తిండి గింజలు కొంటున్నాం
    సాగర్‌లో నీరు ఉండి కూడా ఈసారి వరి సాగుకు విడుదల చేయలేదు. వర్షాభావంతో పంటలు దెబ్బంటున్నాయి. తిండి గింజలు కొనుక్కొంటున్నాం. పశు గ్రాసం కోసం పక్క జిల్లాలకు వెళుతున్నాం
    - యాగంటి వెంకటరావు, చెన్నుపల్లి, బల్లికురవ మండలం
     
     
    ఆరుతడికీ అందడం లేదు!
    మా భూములు చివరి ఆయకట్టులో ఉన్నాయి. ఆరుతడి పంటలకు సాగర్‌ జలాలు వదిలిన సందర్భంలోనూ.. మా పొలాలు తడవడం లేదు. పంటలు ఎండిపోతున్నాయి. ఈ ఏడాది వేసిన కంది పంట చేతికి రాలేదు. పనుల కోసం వలసలు పోతున్నాం
    - నరిశెట్టి కోటేశ్వరరావు, గుంటుపల్లి, బల్లికురవ మండలం
  2. ఖరీఫ్‌కు ఇప్పట్నుంచే సిద్ధం కావాలి: చంద్రబాబు 
    11brk68a.jpg

    అమరావతి: రాబోయే ఖరీఫ్‌ సేద్యానికి ఇప్పట్నుంచే అన్ని శాఖలు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా డెల్టాలో రబీ పనులు త్వరగా ముగించేలా చూడాలని సూచించారు. ఖరీఫ్‌ మూడు వారాలు ముందుగా వచ్చింది కాబట్టి రబీ కూడా మూడు వారాలు ముందుగానే ముగించాలని, తద్వారా ఆదా అయ్యే నీటిని వచ్చే ఏడాది ఖరీఫ్‌ అవసరాలకు వినియోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. నీరు-ప్రగతి, వ్యవసాయం-పురోగతిపై చంద్రబాబు ఈరోజు ఉదయం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సదస్సులో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జూన్‌లోనే నీటిని అందించి ముందస్తు నాట్లకు వెళ్లడం వల్ల ఖరీఫ్‌లో అధిక దిగుబడి సాధ్యమైందని చంద్రబాబు వెల్లడించారు.

    ముందస్తు నాట్ల వల్ల రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం తగ్గించగలిగామని సీఎం అన్నారు. మైక్రో న్యూట్రియంట్స్‌ ఉచితంగా అందించడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో హెల్దీ సాయిల్‌ తయారుకావాలని, హెల్దీ క్రాప్‌ రావాలని ఇదే మన లక్ష్యమని పేర్కొన్నారు. నకిలీ విత్తనాల తయారీదారులతో పాటు వాటిని విక్రయించే వారిని వెంటనే అరెస్ట్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

  3. 1 hour ago, rk09 said:

    Govt. kuda schools, transportation facilities (bus stand, depot, rail connection) and hospitals kuda plan cheyyali

    choostha vunte leader vatini asalu pattinchukovatla

    same thing happened with Hitech city area

     

    antha private ante - total money minded avuthundi

    First Penukonda revamp cheyali. Roads widen cheyali and sanitation care teesukovali. Penukonda is the nearest town for basic shopping. Road to puttaparthi is in pathetic condition and should be doubled.

    As you said, Railway station develop cheyali, trains halt ivvali and ROB's, doubling and electrification are already planned and will finish in feb 2019.

    Only govt hospital, no famous private hospital in penukonda, but Puttaparthi hospital and saveera hospital in Anathapur might cater the needs for time being.

    Local leaders should bring up all these issues to the CM and get them sorted out.

     

     

     

     

     

     

     

     

     

     

     

  4. వ్యవసాయ రంగంలో.. 45శాతం రికార్డు స్థాయి వృద్ధిరేటు

    Published Tuesday, 5 December 2017

    మచిలీపట్నం, డిసెంబర్ 4: జిల్లాలో వ్యవసాయ రంగం దేశంలోనే అత్యధికంగా 45శాతం వృద్ధిరేటు సాధించినట్లు జిల్లా కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో జిల్లా 22.9 శాతం వృద్ధిరేటు సాధించినట్లు తెలిపారు. 45శాతం వృద్ధిరేటుతో వ్యవసాయ రంగం రికార్డు సృష్టించిందన్నారు. దేశం మొత్తం మీద వ్యవసాయ రంగంలో 6 శాతం కూడా వృద్ధిరేటు లేదని, మన జిల్లాలో మాత్రం 45శాతం వృద్ధిరేటు సాధించడం హర్షణీయమన్నారు. ముందస్తు సాగు కారణంగానే ఈ వృద్ధిరేటు సాధ్యమైందని తెలిపారు. దీనివల్ల తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతు పండించిన దిగుబడులు అమ్మితే తలసరి ఆదాయం భారీగా పెరుగుతుందని చెప్పారు. జిల్లాలో ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించడంలో విఫలమైన వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. పంట రుణాల మంజూరు విషయంలో వెనుకబాటు తగదన్నారు. రూ. 3వేల 500 కోట్లు పంట రుణాలు అందించాల్సి ఉండగా కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇవ్వడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉయ్యూరు, పమిడిముక్కల, ముసునూరు, ఆగిరిపల్లి మండలాల్లో నిర్మించిన మండల మహిళా సమాఖ్య భవనాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ప్రతి సోమవారం మండలాల్లో నిర్వహించే ‘మీ కోసం’కు గైర్హాజరయ్యే అధికారులకు చార్జ్ మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో 1.39 లక్షల మంది విభిన్న ప్రతిభావంతులు ఉన్నారని, వీరిలో అర్హులైన వారందరికీ ఉపకరణాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. గొల్లపూడిలో జిల్లా మహిళా సమైక్య భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని విజయవాడ ఆర్డీవోను ఆదేశించారు. మచిలీపట్నంలో కాపు భవన్, బీసీ భవన్‌ల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో జేసీ-2 పి బాబూరావు, డీఆర్వో బీఆర్ అంబేద్కర్, ఆర్డీవో జె ఉదయ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

  5. పట్టాలెక్కుతున్న సాగరమాల 
    పలు ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో కదలిక 
    దశల వారీగా పనులు చేపట్టేందుకు ప్రణాళికలు 
    ఈనాడు, కాకినాడ 
    eag-top1a.jpg

    కాకినాడ కేంద్రంగా సాగరమాల కింద ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు దశలవారీగా పట్టాలెక్కుతున్నాయి.2018-19 నాటికి ఎక్కువ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.కాకినాడ పోర్టుతో రోడ్డు, రైల్వే అనుసంధానం కోసం నాలుగు వరుసల రహదారుల విస్తరణ, వంతెనల నిర్మాణం, వస్తు రవాణాకు డెడికేటెడ్‌ రైల్వే లైనుకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.2025 నాటికి కాకినాడ పోర్టు ఆధారిత పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా పనులు ప్రతిపాదించారు. కాకినాడ పోర్టులో 2020-25 నాటికి కోస్టల్‌ఫుడ్‌ ఎక్స్‌పోర్టు బెర్త్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.దీనిని కాకినాడకు బదులు ఎస్‌.యానాం వద్ద ఏర్పాటు చేయాలని చివరకు నిర్ణయించారు. ఈ పనులను రూ.150 కోట్ల అంచనాలతో పోర్టు ఆధ్వర్యంలో చేపట్టనున్నారు.కాకినాడ యాంకరేజి పోర్టులో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫీజుబులిటీ నివేదిక పంపారు. 2018-19 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. దీని అంచనా రూ.90 కోట్లు కాగా పోర్టు ఆధ్వర్యంలో పనులు నిర్వహిస్తారు. ఎన్‌ఎఫ్‌సీఎల్‌ పశ్చిమం వైపు నుంచి కొత్త బైపాస్‌ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్‌ సిద్ధమైంది. 2018-19 నాటికి బైపాస్‌ నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. జాతీయ రహదారుల సంస్థ ద్వారా రూ.70 కోట్లతో దీనిని నిర్మించనున్నారు.దుమ్ములపేట వద్ద ఆర్వోబీ నిర్మాణం, కాకినాడ డీప్‌వాటర్‌ పోర్టు, కాకినాడ యాంకరేజి పోర్టు వద్ద ఆర్వోబీల నిర్మాణాన్ని చేపడతారు. రూ.80 కోట్లతో ఎన్‌హెచ్‌ ద్వారా 2018-19 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ దశలో ఉంది.కుంభాభిషేకం వద్ద పైవంతెన నిర్మాణాన్ని చేపట్టాలని ప్రతిపాదించారు. 2019-20 నాటికి దీనిని పూర్తి చేయాలని సంకల్పించారు కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి ఉప్పాడ బీచ్‌ రోడ్డును నాలుగు లైన్లుగా నిర్మించనున్నారు. దీనిని ఎన్‌హెచ్‌-16కు అనుసంధానం చేస్తారు.కత్తిపూడి నుంచి కాకినాడ అచ్చంపేట కూడలి వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. రాజానగరం నుంచి కాకినాడ పోర్టుకు ప్రస్తుతం ఉన్న రెండు లైన్ల రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఏపీఆర్‌డీసీ ద్వారా రూ.600 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఈ పనులు టెండర్ల దశలో ఉన్నాయి.

    నిరంతరం సమీక్షిస్తున్నాం 
    సాగరమాల ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ పోర్టుల తరఫున నిరంతరం సమీక్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం నుంచి చీఫ్‌ సెక్రటరీ స్థాయిలో ప్రతి నెలా సమీక్ష జరుగుతోంది. రైల్వే, జాతీయ రహదారుల సంస్థ, పర్యాటక శాఖ, ఏపీఆర్‌డీసీ, మత్స్య శాఖలు, ఇతర ఏజెన్సీలను సమన్వయం చేసుకుని వారు చేయాల్సిన పనులపై పర్యవేక్షిస్తున్నాం. దశల వారీగా ప్రాజెక్టులన్నీ పూర్తి చేసే దిశగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది.

    -డాక్టర్‌ కోయ ప్రవీణ్‌, డైరెక్టర్‌,
  6. 4 hours ago, KaNTRhi said:

    Ikkademo ila.. Akkada Tg emo unna neeti ketayimpulu inka thagginchamantunnaru :kick:

    • ఏపీకి 155 టీఎంసీలు చాలు.. తెలంగాణ వాదన
    • పట్టిసీమ నీళ్లు తెచ్చుకుంటున్నారు
    • పోలవరం నుంచి తరలిస్తారు
    • సీఆర్డీయే పరిధిలో సాగు ఉండదు
    • శ్రీశైలం నీటి ఆవిరి నష్టం మాకే
    • ట్రైబ్యునల్‌లో తెలంగాణ అఫిడవిట్‌
    • మరో 547 టీఎంసీలివ్వాలన్న ఏపీ
    • నేటి నుంచి క్రాస్‌ ఎగ్జామినేషన్‌
     
    ‘మా అవసరాలు ఇవి. ఆ మేరకు నీళ్లు కేటాయించండి’ అని అడగడమే చూశాం! ఇప్పుడు... పక్క రాష్ట్రం వాటాలకు కోతలు వేయాలనే వాదనలు చూస్తున్నాం. ఏపీకి కృష్ణా జలాల్లో భారీగా కోత వేయాలంటూ తెలంగాణ సర్కారు ట్రైబ్యునల్‌ను కోరింది.
     
     
    అమరావతి/హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): అదనపు జలాల్లో వాటాలు కావాలంటూ ఆంధ్రప్రదేశ్‌! అసలు కేటాయింపుల్లోనే తగ్గించాలంటూ తెలంగాణ! బ్రిజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ముందు బుధవారం నుంచి వాడివేడి వాదనలు సాగనున్నాయి. ‘ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీల కృష్ణా జలాలు అక్కర్లేదు. 155 టీఎంసీలు సరిపోతాయి’... అని తెలంగాణ సర్కారు వాదిస్తూ ట్రైబ్యునల్‌ ముందు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ‘‘అమరావతిని పంట పొలాల్లో నిర్మించుకున్నారు.
     
    ఇంకా... సీఆర్డీయే పరిధిలో లక్షలాది ఎకరాల్లో వ్యవసాయం తగ్గుతుంది. ఆ మేరకు నీటి అవసరం కూడా తగ్గుతుంది. పైగా... పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను తరలిస్తున్నారు. అందువల్ల ఏపీకి జరిపిన కేటాయింపుల్లో 357 టీఎంసీలకు కోత విధించి, 155 టీఎంసీలు మాత్రం ఇవ్వండి’’ అని తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్‌ ముందు అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం... తమకు కేటాయించిన 512 టీఎంసీలను కొనసాగిస్తూనే, అదనపు అవసరాలు తెలుపుతూ అఫిడవిట్‌ వేసింది. దీనిపై బుధవారం నుంచి శుక్రవారం వరకు ఏపీ ప్రతినిధి కేవీ సుబ్బారావును తెలంగాణ తరఫు న్యాయవాది వైద్యనాథన్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయనున్నారు.
     
     
    ఇదీ నేపథ్యం..
    కృష్ణా నదిలోని 2130 టీఎంసీల నికర జలాలను గతంలో ట్రైబ్యునల్‌ మూడు రాష్ర్టాలకు పంపిణీ చేసింది. ఇందులో మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత... నవ్యాంధ్రకు 512, తెలంగాణకు 299 టీఎంసీల చొప్పున పంచారు. అయితే, ఉమ్మడి రాష్ట్రంలోనే నీటి కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని, దానిని సవరించాలని తెలంగాణ కోరింది. నాలుగు రాష్ర్టాలతో కలిపి నీటి కేటాయింపులపై పునఃసమీక్షించాలని తెలంగాణ, ఏపీలు కోరాయి. అయితే అందుకు ట్రైబ్యునల్‌ అంగీకరించలేదు. కర్ణాటక, మహారాష్ట్ర వాటాలు అలాగే ఉంచుతూ... ఏపీ, తెలంగాణ మధ్య పంపకాలను మాత్రం సమీక్షించాలని నిర్ణయించారు. ఇప్పటికే రెండు మూడుసార్లు బ్రజేశ్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ సమావేశాలు జరగాయి. ఇరు రాష్ర్టాలు తమ అవసరాలు, డిమాండ్లకు సంబంధించిన పత్రాలను సమర్పించాయి. దీనిపై బుధవారం నుంచి ట్రైబ్యునల్‌ ముందు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరగనుంది.
     
     
    తెలంగాణ ఏమంటోందంటే...
    ఏపీకి కేటాయించిన నీటిలో భారీగా కోత పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం ట్రైబ్యునల్‌కు అఫిడవిట్‌ను సమర్పించింది. ముఖ్యంగా ఏపీ నిర్మిస్తున్న రాజధాని కారణంగా భవిష్యత్తులో సాగునీటికి డిమాండ్‌ భారీగా పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. కృష్ణా డెల్టా కోసం కేటాయించిన 152 టీఎంసీల నీటి అవసరాలను తీర్చడానికి వీలుగా ఇప్పటికే పట్టిసీమ నుంచి 114.37 టీఎంసీల గోదావరి నీటిని తరలిస్తున్నారని గుర్తు చేసింది.
     
    కొత్త రాజధాని నిర్మాణం వల్ల ఆయకట్టు ప్రాంతంలో సాగు ఉండదని పేర్కొంది. భవిష్యత్తులో పోలవరం కుడికాల్వ ద్వారా 80 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తీసుకొస్తారని తెలిపింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని... కృష్ణా డెల్టాకు 17.55 టీఎంసీలు ఇస్తే సరిపోతాయని తెలంగాణ తెలిపింది. కొత్తగా నిర్మించే రాజధాని తాగునీటి అసవరాల కోసం 10 టిఎంసీల నీరు సరిపోతుందని అంచనా వేసింది. తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకూ నీటి కేటాయింపుల్లో కోత వేయాలని కోరింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి ఆవిరి నష్టం కింద ఏపీకి 22 టీఎంసీలను కేటాయించారని, దానిని తెలంగాణకు ఇవ్వాలని కోరింది.
  7. I guess the potireddypadu rule doesnt apply any more. Irrespective of the SS dam full/not full, govt will use PRP ,as water flows through gravity(above 850 ft). Its the local leaders that should put pressure for water, should learn from krishna leaders:brakelamp:

×
×
  • Create New...