Jump to content

sonykongara

Members
  • Posts

    66,780
  • Joined

  • Last visited

  • Days Won

    90

Everything posted by sonykongara

  1. అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు తాజా ఎన్నికల్లో టికెట్‌ దక్కని అసంతృప్త నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. Published : 08 Apr 2024 20:41 IST హైదరాబాద్‌: ఎన్డీయే కూటమి పొత్తు వల్ల టికెట్‌ దక్కని తెదేపా అసంతృప్త నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌, తిక్కారెడ్డిలు కలిశారు. ఈ ముగ్గురూ అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలను ఆశించారు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించడంతో వారు భంగపడ్డారు. ఈ ముగ్గురు నేతలతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తలు భూమిరెడ్డి గోపాల్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్‌లు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ముగ్గురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇవ్వడంతో పాటు.. అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన హామీతో సంతృప్తి చెందిన నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.
  2. పోతిన మహేష్ వైసీపీలోకి..తొందరలో చేరిక గతంలో నా చేతి తో వేరే జండా పట్టుకుంటే ఆ చెయ్యి నరికెయ్యండి అని ఎమోషనల్ గా చెప్పిన పొతిన మహేష్ #VijayawadaWest
  3. ethanu rajakiyala ki set kadu.
  4. హైదరాబాద్‌ సంస్థ నుంచే టెక్నాలజీ! స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ప్రణీత్‌ బృందం అనధికారికంగా సాగించిన ఫోన్‌ట్యాపింగ్‌కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. Published : 08 Apr 2024 03:02 IST కేవలం ఎస్‌ఐబీ కేంద్రంగానే ఫోన్‌ ట్యాపింగ్‌ దందా కొనసాగింపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నిలిపివేత జప్తు సొమ్ము ఈసీఐ అధీనంలోకి వెళ్లకుండా హవాలా రంగు ఈనాడు, హైదరాబాద్‌: స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ)లో ప్రణీత్‌ బృందం అనధికారికంగా సాగించిన ఫోన్‌ట్యాపింగ్‌కు వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని హైదరాబాద్‌ నుంచే సమకూర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మాదాపూర్‌లోని ఓ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ ఇందుకు సంబంధించిన టెక్నలాజికల్‌ టూల్‌ను అందించే కన్సల్టెన్సీగా వ్యవహరించినట్లు తేలింది. టెలికమ్యూనికేషన్‌ రంగంలో అపార అనుభవమున్న ఆ కంపెనీ ద్వారానే సాఫ్ట్‌వేర్‌ను సమకూర్చుకున్న ప్రణీత్‌ బృందం.. దాన్ని అక్రమ వ్యవహారాలకు వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఎస్‌ఐబీలోనే రెండు ప్రత్యేక గదులు ట్యాపింగ్‌ వ్యవహారానికి కేంద్రంగా ఉన్నాయని.. బయటి ప్రాంతాల్లో సర్వర్లు పెట్టి నిఘా ఉంచలేదని ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. 2023 శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో ప్రణీత్‌ బృందం సాంకేతిక నిఘాను విస్తృతంగా వినియోగించింది. భారాస ప్రత్యర్థులైన అభ్యర్థులకు ఆర్థిక వనరులు అందించే వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేసి.. ఆ సమాచారాన్ని హైదరాబాద్‌ సహా జిల్లాల్లోని పోలీసులకు అందించారు. దాని ఆధారంగా సొమ్ము పట్టుకుని.. అది ఎన్నికల కమిషన్‌ అధీనంలోకి వెళ్లకుండా ప్రత్యేక ప్రణాళిక రచించారు. ఆ డబ్బుకు హవాలా రంగు పులిమి పోలీసు కేసులు నమోదు చేయించి జప్తు చేయించినట్లు దర్యాప్తులో గుర్తించారు. బైక్‌పై ఒంటరిగానే హార్డ్‌డిస్క్‌ల తరలింపు అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే ఫోన్‌ ట్యాపింగ్‌ను నిలిపివేశారు. ఎస్‌ఐబీలో 17 కంప్యూటర్లలోని 42 హార్డ్‌డిస్క్‌లను పూర్తిగా తీసేశారు. వాటి స్థానంలో కొత్తవాటిని అమర్చారు. ఈ కారణంగా మావోయిస్టులకు సంబంధించిన సమాచారం సైతం లేకుండా పోయింది. అనంతరం ప్రణీత్‌ స్వయంగా ఎలక్ట్రీషియన్‌ను తీసుకెళ్లి ఎస్‌ఐబీలోనే హార్డ్‌డిస్క్‌లను ఎలక్ట్రిక్‌ కట్టర్లతో కట్‌ చేయించాడు. తర్వాత ఎవరికీ తెలియకుండా ఉండాలని.. తాను ఒక్కడే ద్విచక్ర వాహనంపై రెండు విడతలుగా మూసీ వద్దకు వెళ్లి ధ్వంసం చేసిన హార్డ్‌డిస్క్‌లను నదిలో పడేశాడు. పోలీసుల విచారణలో ప్రణీత్‌రావు నేరం అంగీకరించడంతోపాటు ధ్వంసమైన హార్డ్‌డిస్క్‌ల గురించి నోరు విప్పక తప్పలేదు. అతడిచ్చిన సమాచారం ఆధారంగానే నాగోలు బ్రిడ్జి కింద మూసీ నదిలో హార్డ్‌డిస్క్‌ల శకలాలను స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 13నే ప్రభాకర్‌రావు టికెట్‌ బుకింగ్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో అరెస్టయిన నిందితులందరి వాంగ్మూలాల్లోనూ ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు ప్రస్తావన వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావుపై మార్చి 10న ఎఫ్‌ఐఆర్‌ నమోదైన మరుసటి రోజే ప్రభాకర్‌రావు చెన్నై మీదుగా అమెరికాకు వెళ్లడం, అదే సమయంలో టాస్క్‌ఫోర్స్‌ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు బహ్రెయిన్‌కు పయనం, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మీడియా సంస్థ నిర్వాహకుడు సైతం అంతకు ఒకట్రెండు రోజుల ముందే విదేశాలకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ప్రణీత్‌ నోట తన పేరు బహిర్గతమవుతుందనే ఉద్దేశంతోనే ప్రభాకర్‌రావు విదేశాలకు వెళ్లారనే ప్రచారం విస్తృతంగా సాగింది. కానీ ఆయన అమెరికా వెళ్లేందుకు ఫిబ్రవరి 13నే టికెట్‌ బుక్‌ చేసుకున్నట్లు తేలింది. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న ఆయన శస్త్రచికిత్స నిమిత్తం వెళ్లినట్లు ఇమిగ్రేషన్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ప్రభాకర్‌రావును విచారించడం కీలకం కావడంతో అతడి కోసం వేచిచూస్తున్నారు.
  5. : సిట్‌ కార్యాలయం వద్ద పత్రాల దహనం.. హెరిటేజ్‌ సంస్థవేనంటూ తెదేపా ఆరోపణ తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. Updated : 08 Apr 2024 12:36 IST అమరావతి: తాడేపల్లి సిట్‌ కార్యాలయం కాంపౌండ్‌లో పలు పత్రాలను సిబ్బంది దహనం చేశారు. ఇది అనుమానాలకు తావిస్తోంది. వీటిని తగలబెట్టడాన్ని పలువురు స్థానికులు ప్రశ్నించడంతో పాటు వీడియోలు తీశారు. ఆ వీడియోలను తమకు ఇవ్వాలని స్థానికులపై సీఐడీ ఒత్తిడి తెస్తోంది. సీఐడీ చీఫ్‌ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు పత్రాలు తగలబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు. హెరిటేజ్‌ సంస్థ కీలక పత్రాలు సహా ఇతర దస్త్రాలు అందులో ఉన్నట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. జగన్‌ ఆదేశాలతో చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు సిట్‌ అక్రమ కేసులను పెట్టిందని చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అనేక మందిపై ఒత్తిడి చేసిందని తెలిపారు. అనుమతులు లేకుండా పలు దస్త్రాలు ఎలా వచ్చాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఇటీవల ప్రశ్నించారు. కేసుతో సంబంధం లేని పత్రాలు మీ చేతికి ఎలా వచ్చాయని నిలదీశారు.
×
×
  • Create New...