Jump to content

ఆరోపణలకు ఆధారం చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటా


koushik_k

Recommended Posts

  • పథకం ప్రకారమే నా కుటుంబంపై కేసులు
  • కొత్త ప్రభుత్వం వచ్చాక దాడులు పెరిగాయి
  • అధికారాన్ని కక్షసాధింపులకు వాడకూడదు: కోడెల
గుంటూరు, నరసరావుపేట లీగల్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘నా కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి రారని గతంలోనే స్పష్టం చేశాను. కాని ఇప్పుడు నా కుటుంబ సభ్యులపై కేసులు పెట్టాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేస్తున్నారు. నా కుటుంబాన్ని ప్రభుత్వం వేధించడం మంచిపద్ధతి కాదు. నాపై చేసిన ఆరోపణల్లో ఒక్కదానికి ఆధారం చూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా. పథకం ప్రకారమే నా కుటుంబంపై కేసులు పెడుతున్నారు’ అని మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
 
 
‘కొత్త ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయి. రాజకీయ కక్షతో కేసులు పెడుతున్నారు. శిలాఫలకాలు, స్వాగత ద్వారాలు ధ్వంసం చేస్తున్నారు. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవటం లేదు. పోలీసులు రక్షణ కల్పించకుండా ‘కొద్దిరోజులు ఎక్కడికైనా వెళ్లండి’ అని సలహా ఇస్తున్నారు. అధికారాన్ని కక్షసాధింపు చర్యలకు వాడవద్దని సీఎం జగన్‌ను కోరుతున్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. టీడీపీ నాలుగుసార్లు అధికారంలోకి వచ్చినా ఎప్పుడూ ఇలాంటి దాడులు చేయలేదు. నేను స్పీకర్‌గా రాగద్వేషాలకు అతీతంగా పనిచేశా. సభాపతిగా హైదరాబాద్‌లోని ఇంటికి మాత్రమే అద్దె తీసుకున్నా. ప్రభుత్వం అవినీతిరహిత పాలన అందిస్తామంటే సహకరిస్తాం. అక్రమాలు చేస్తే మాత్రం పోరాటం తప్పదు. అధికారం అడ్డుపెట్టుకుని వేధిస్తే చూస్తూ ఊరుకోం’ అని కోడెల హెచ్చరించారు. ‘నా రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు. విజయసాయిరెడ్డి లాంటి వారు ప్రవేశించటంతో రాజకీయాలు దిగజారిపోయాయి’ అని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతుంటే సీఎం జగన్‌కు పట్టదా?’ అని పార్టీ జిల్లాఅధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ప్రశ్నించారు.
 
 
కోడెల కుమార్తెపై 3 కేసులు
మాజీ స్పీకర్‌ కోడెల కుమార్తె పూనాటి విజయలక్ష్మి, మరికొందరిపై కేసులునమోదయ్యాయి. కుల దూషణ, దాడి, బెదిరింపు తదితర ఆరోపణల కింద కేసులు నమోదు చేసినట్లు నరసరావుపేట రూరల్‌ సీఐ చినమల్లయ్య తెలిపారు. ‘సత్తెనపల్లికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జల్ది ప్రసాదు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. వన్‌టౌన్‌ పీఎస్‌లో కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు ఒకకేసు, టూటౌన్‌ పీఎస్‌లో నకరికల్లు మం డలం చీమలమర్రికి చెందిన శేఖర్‌ ఫిర్యాదు మేరకే మరో కేసు... మొత్తం 3 కేసులు విజయలక్ష్మి, మరి కొందరిపై నమోదయ్యాయి’ అని సీఐ తెలిపారు.
 
 
Link to comment
Share on other sites

Oka vela unna tappukivalsina avsarame ledu, oka pakkana siggulekunda caselu veskoni kotlu kotlu dochukuni tiruguthu cmlu avthunte enduku tappukivali

ala aithe allegations unna andaru tappukivali anni parties nunchi

 

colections jarigi untay not denying it and anni chotla jarigay including ycp, veellane target chesthunnaru and aa silaphalakalu pagalakottadam archlu pagalakottadam rakshasathvaniki para kashta

Link to comment
Share on other sites

3 hours ago, koushik_k said:

Oddu Sir.. Meru thappukonte party emaipovali..  CBN emaipovali.. Asale merante baga istam CBN ki. 

neevu nee sw job vadilesi vachi em cheyav malli chesevalli panganamalu avasarama bro neeku nachite vote vey lekapote maney andaram tdp party supporters ee akkadakik edo party mida sarva hakkulu neeku vunnattu enduku ee matalu 

neevu nenu chaddilu vesukunnappudu ayana home minister 

31 case lu vunnavadu cm 10th fail aina vadu minister ilanti vallani encourage chestunaduku first manam siggupadali 

Link to comment
Share on other sites

15 hours ago, KING007 said:

Ne baada endi ra babu, prathi daniki kindal chesthavu....

 Intha worst character ento....

asalu ee candidate ki cbn voddu, vere leaders evaru voddu.. may be he himself want to lead party and every body should be his puppet!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...