Jump to content

ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారు?


sonykongara

Recommended Posts

ఎస్పీ, బీఎస్పీ పొత్తు ఖరారు?
26-12-2018 02:42:12
 
636813889341309742.jpg
  •  లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో కలిసి పోటీ
లఖ్‌నవూ, డిసెంబరు 25: లోక్‌సభ ఎన్నికలకు ఎస్పీ, బీఎస్పీల పొత్తు ఖరారైందా? ఉత్తరప్రదేశ్‌లో ఇరుపార్టీలు కలిసే ఎన్నికల బరిలో నిలవనున్నా యా? బీఎస్పీ వర్గాలు అవున నే అంటున్నాయి. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఢిల్లీ నుంచి లఖ్‌నవూ రాగానే కూటమికి తుది మెరుగులు దిద్దనున్నట్లు ఆ పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెప్పారు. రాష్ట్రంలో కొద్ది సీట్లు మినహా ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయిందని వెల్లడించారు. కూటమిని ప్రకటించినతర్వాత మిగిలిన సీట్లపైనా సమస్యలను పరిష్కరించుకుంటామన్నారు. బీజేపీ, కాంగ్రె్‌సతో సంబంధం లేకుండా థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు మాయావతి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
 
 ఎస్పీ తో పాటు ఐఎన్‌ఎల్‌డీ, జనతా ఛత్తీ్‌సగఢ్‌ కాంగ్రెస్‌ నేతలు ఇప్పటికే కూట మి తరఫున మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఇప్పటికే జేడీఎస్‌ నేత దేవెగౌడ, ఛత్తీ్‌సగఢ్‌ మాజీ సీఎం అజిత్‌ జోగి, ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్‌సింగ్‌ చౌతాలా, జేఎంఎం నేత హేమంత్‌ సోరెన్‌లతో చర్చలు జరిపినట్లు తెలిసింది. తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూడా మాయావతితో చర్చలు జరిపే అవకాశం ఉందని బీఎస్పీ నేత చెప్పా రు. బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిసా సీఎం నవీన్‌ పట్నాయక్‌లను కూడా థర్డ్‌ఫ్రంట్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపారు
Link to comment
Share on other sites

యూపీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరేనా?
26-12-2018 02:46:59
 
636813892206301741.jpg
  • పొత్తుకు ముందుకు రాని ఎస్పీ-బీఎస్పీ!
  • లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ ప్లాన్‌ ‘బి’?
న్యూఢిల్లీ, డిసెంబరు 25: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో ఒంటరిగా బరిలో దిగేందుకూ కాంగ్రెస్‌ సిద్ధమైందా..? ఎస్పీ-బీఎస్పీ కూటమితో కలిసి పోటీ చేయకపోతే ఏం చేయాలనే విషయమై ప్రణాళిక సిద్ధం చేసుకుందా? అంటే ఆ పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. కాంగ్రె్‌సతో పొత్తుకు ప్రస్తుతం ఎస్పీ, బీఎస్పీ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 10న జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశానికీ గైర్హాజరయ్యాయి. మరోవైపు మాయావతి 63వ జన్మదినం సందర్భంగా జనవరి 15న లఖ్‌నవూలో బీఎస్పీ నేతలు సమావేశం కానున్నారు. ఆ సమావేశానికి బీఎస్పీ నేతలు భావసారూప్యత కలిగిన పార్టీల నాయకులనూ ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ యూపీలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది.
 
లోక్‌సభ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను ఖరారు చేసేందుకు ఇప్పటి నుంచే పార్టీ నాయకులతో భేటీలు నిర్వహిస్తోంది. తాము ఇప్పటికీ ఎన్నికల వాతావరణంలోనే ఉన్నామని, 2019 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్నామని కాంగ్రెస్‌ యూపీ వ్యవహారాల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జోషి తెలిపారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బూత్‌స్థాయి కార్యకర్తలతో భేటీలు నిర్వహించామన్నారు. మహాకూటమిగా పోటీ చేయడమా? లేక ఒంటరిగానా? అనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని.. తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేశారు.
 
మరోవైపు ఎస్పీ-బీఎస్పీ కూటమి తమకు ఎక్కువ సీట్లు ఇచ్చేలా లేదని, ప్లాన్‌ ‘బీ’ సిద్ధంగా ఉంచుకోవాలని పార్టీ రాష్ట్ర నేతలు ఇప్పటికే అధిష్ఠానానికి తెలిపినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఎస్పీ, బీఎస్పీలతో చర్చలు జరపనప్పటికీ.. ఆ పార్టీలు కాంగ్రె్‌సకు అమేఠీ, రాయ్‌బరేలీ సీట్లు మాత్రమే ఇస్తామన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొందరు కాంగ్రెస్‌ నేతలు మాత్రం తాము 15 సీట్లు డిమాండ్‌ చేశామని, ఎస్పీ-బీఎస్పీ 8 నుంచి 10 సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ జాగ్రత్తగా ఆలోచించి వ్యూహాన్ని రూపొందించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...