Jump to content

జీవన్‌రెడ్డికి లగడపాటి ఫోన్‌


Saichandra

Recommended Posts

  • అన్నా గెలుస్తున్నావ్‌.. ప్రజాఫ్రంట్‌దే అధికారం
  • నీకు మంత్రి పదవి కూడా వస్తుంది.. కంగ్రాట్స్‌
జగిత్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, జగిత్యాల తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రజాఫ్రంట్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డికి ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్‌ ఫోన్‌ చేశారు. ‘‘అన్నా.. నువ్వు గెలుస్తున్నావ్‌. ప్రజాఫ్రంట్‌ అధికారంలోకి వస్తుంది. నీకు మంత్రి పదవి కూడా వస్తుంది.’’ అని జీవన్‌రెడ్డికి చెప్పారు. ఆదివారం సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న జీవన్‌రెడ్డి.. ఉదయం 11 గంటలకు ఇంటి వద్ద ఉండగా లగడపాటి నుంచి ఆయనకు ఫోన్‌ వచ్చింది. ఇద్దరూ కాసేపు వర్తమాన రాజకీయ పరిస్థితులపై ముచ్చటించుకున్నట్లు తెలిసింది. తనకు లగడపాటి ఫోన్‌చేశారన్న విషయాన్ని జీవన్‌రెడ్డి కార్యకర్తలకు చెప్పడంతో వారిలో ఉత్సాహం నెలకొంది. జగిత్యాల స్థానం టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంటుందంటూ రెండు రోజులుగా జోరుగా చర్చోపచర్చలు సాగుతుండగా.. లగడపాటి వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏ నలుగురు కలిసినా లగడపాటి ఫోన్‌ గురించే చర్చించుకోవడం కనిపించింది
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...