Jump to content

స్కామ్‌కు కొత్త భాష్యం చెప్పిన కుటుంబరావు

sonykongara

Recommended Posts

స్కామ్‌కు కొత్త భాష్యం చెప్పిన కుటుంబరావు
20-10-2018 16:27:37
 
636756499630415827.jpg
అమరావతి: ఇప్పుడు దేశ వ్యాప్తంగా స్కామ్ అనే నినాదం మార్మోగుతోంది. ఏపీలో అయితే టీడీపీ, బీజేపీ నేతలు ఆ మాటను పదేపదే వళ్లిస్తుంటారు. ఈ పేరును రోజులో ఎక్కడో ఓ చోట ప్రస్తావించకుండా ఉండని నేతలు లేరంటే అతిశయోక్తి కాదు. టీడీపీ, బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీల నేతలు నిత్యం స్కామ్ నామస్మరణ చేస్తుంటారు. అయితే ఏపీ ప్రణాళిక ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్కామ్‌కు కొత్త భాష్యం చెప్పారు. స్కామ్ అంటే సేవ్ కంట్రీ ప్రమ్ అమిత్ షా అండ్ మోడీ అంటూ కొత్త అర్థాన్ని చెప్పారు.
 
అగ్రిగోల్డ్‌ ఆస్తులు వేలం జరగకుండా బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ యాజమాన్యంతో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కుమ్మక్కయ్యారని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను ఏజెంట్లకు అప్పజెప్పాలన్నా, కన్నా డిమాండ్‌ చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్‌ పెద్ద ఎత్తును డిపాజిట్లు సేకరిస్తుంటే.. అప్పటి కాంగ్రెస్‌ నేతలు గాడిదలు కాశారా అంటూ నిలదీశారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ. 6400 కోట్లకు పెరగడానికి, పరోక్షంగా అప్పటి కాంగ్రెస్‌ మంత్రి కన్నా కూడా కారణమని కుటుంబరావు దుయ్యబట్టారు.
 
‘‘హాయ్‌ ల్యాండ్‌ విలువ రూ. 3 వేల కోట్లని దుష్ప్రచారం చేస్తున్నారు. రూ. వెయ్యి కోట్లతో హాయ్‌ల్యాండ్‌ను కన్నా సొంతం చేసుకోవచ్చు. అగ్రిగోల్డ్ కేసులో బీజేపీ-వైసీపీ-జనసేన పార్టీలు ఇంప్లీడ్ కావచ్చు. బీజేపీ నేత జీవీఎల్‌పై చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాస్తున్నా. బీజేపీ నేత జీవీఎల్‌ నరసింహరావు చేస్తున్న ఆరోపణలపై కోర్టుకువెళ్లొచ్చు. బీజేపీ అధినేత అమిత్ షా, రాఫెల్ స్కాంపై విచారణ ఎందుకు చేయించుకోరు’’ అని కుటుంబరావు ప్రశ్నించారు.
Link to comment
Share on other sites

8 minutes ago, sonykongara said:

Very depressing to see this.. ilanti aalochanalu vachinapudu, daniki base unte.. anukunnade thadavu ga cheseyyali... anthe gani media ki cheppi wait cheyyadaniki emundi?

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...