Jump to content

దిగొచ్చిన కేంద్రం..లోటు భర్తీకి సుముఖత!


John

Recommended Posts

దిల్లీ: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంపీల ఆందోళన ఫలించింది. రాష్ట్ర రెవెన్యూ లోటు భర్తీకి కేంద్ర ప్ర‌భుత్వం ఎట్ట‌కేల‌కు సానుకూల సంకేతాలు ఇచ్చింది. 2014-15 సంవత్సరానికి గాను 14వ ఆర్థికసంఘం నిబంధనల ప్రకారం 10 నెలల కాలానికి రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వెంటనే ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు మూడేళ్లకు సంబంధించిన మొత్తాన్ని కూడా ఒకేసారి విడుదల చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఏపీ అంశాలపై పరిష్కారానికి కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ, రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో సుజనా చౌదరి సమావేశమయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి ఇవ్వాల్సిన నిధులు, విశాఖ రైల్వేజోన్‌, పలు సంస్థల ఏర్పాటు వంటి కీలక అంశాలపై చర్చించారు. అమ‌రావ‌తి నిర్మాణానికి చేసిన ఖ‌ర్చుల వివ‌రాల‌ను అంద‌జేస్తే నిధులు ఇస్తామ‌ని చెప్పిన‌ట్టు తెలుస్తోంది. హోదావ‌ల్ల వ‌చ్చే నిధుల‌ను ఒకేసారి ఇచ్చేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తంచేసిన‌ట్టు స‌మాచారం. ప్ర‌త్యేక ప్యాకేజీ ప్ర‌కారం ఈఏపీ నిధుల స‌ర్దుబాటుకు సిద్ధంగా ఉన్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఏ నిమిషంలోనైనా రైల్వేజోన్‌ ప్రకటించాలని పీయూష్‌ గోయాల్‌ను అరుణ్‌జైట్లీ ఆదేశించిన‌ట్టు స‌మాచారం. అలాగే దుగరాజపట్నం పోర్టు విషయంలో రక్షణ పరమైన ఇబ్బందుల ఉన్న దృష్యా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, ఆ పోర్టును రాష్ట్ర ప్రభుత్వం చూపించిన ప్రదేశంలో నిర్మించేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తంచేసింది. దీనికి నిధులు విడుదల చేయడంతో పాటు అన్ని అనుమతులు ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. అయితే, పార్లమెంట్‌ నియమ నిబంధనలకు లోబడి ఈ ప్రకటనలేవీ సభలో ప్రస్తావించలేదని జైట్లీ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే పెట్రోకెమిక‌ల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు సైతం ఆదేశాలు పంపిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భుత్వ‌, ప్రైవేటు భాగ‌స్వామ్యంతో క‌డ‌ప ఉక్కుక‌ర్మాగారం నిర్మిస్తామ‌ని కేంద్రం చెప్పిన‌ట్టు తెలుస్తోంది. మెకాన్ సంస్థ ఈ నెల 12న నివేదిక అందించ‌నున్న‌ట్టు వెల్ల‌డించింది.

Link to comment
Share on other sites

Ivi nemmesi moosuku koorchunte malli 3 months taruvaatha venakki choosukunte emi vundadu. It will be too late for TDP by then.

Announcements & Funds relase edaina within 1 month ayithene with NDA ani clear ga cheppali. If announced & funds released to AP think about staying back in NDA otherwise give divorce.

Appatiki Divorce ivvaka pothe YSRCP BJP kosam ee aghayityam ki palpaduthundo.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...