Jump to content

CII Partenership summit-2018 Vizag


sonykongara

Recommended Posts

  • Replies 487
  • Created
  • Last Reply

సదస్సుకు విస్తృత ఏర్పాట్లు 
ప్రారంభోత్సవానికి సీఎం, ఉపరాష్ట్రపతి రాక 
మంత్రి గంటా వెల్లడి
వన్‌టౌన్‌(విశాఖపట్నం), న్యూస్‌టుడే: విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఏర్పాట్లన్నీ చేస్తున్నామని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈనెల 24 నుంచి 26 వరకూ జరగనున్న సదస్సు ఏర్పాట్లపై సోమవారం విశాఖలో మంత్రి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సీఐఐ ప్రతినిధులు, పరిశ్రమల శాఖ అధికారులు హాజరయ్యారు. అనంతరం మంత్రి గంటా విలేకర్లతో మాట్లాడారు. ప్రారంభ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రులు పాల్గొంటారని చెప్పారు. 18 దేశాలకు చెందిన 2,000మంది ప్రతినిధులు హాజరవుతున్నారన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తామని, దీనికి 26న ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. ముగింపు వేడుకలకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పండిట్‌ శ్రీశ్రీ రవిశంకర్‌ హాజరవుతారన్నారు.
అమల్లోకి ఒప్పందాలు..: విశాఖలో రెండుసార్లు జరిగిన సదస్సులో రూ.10.97లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి 876 ఒప్పందాలు కుదిరాయని, వీటిద్వారా 14.96లక్షల మందికి ఉపాధి లభించనుందని మంత్రి గంటా తెలిపారు. వీటి అమలు వివిధ దశల్లో ఉందన్నారు.

Link to comment
Share on other sites

Vizag getting ready for CII partnership summit

The city is getting ready for the third Confederation of Indian Industry (CII) partnership summit in succession from February 24 to 26 and all arrangements are being made to make the event a grand success, like the previous two, according to State HRD Minister G Srinivasa Rao.

After reviewing the arrangements with the officials here on Monday, he told the media that Vice-President M Venkaiah Naidu, Chief Minister N Chandrababu Naidu, Union Ministers Suresh Prabhu, P Ashok Gajapathi Raju and Sujana Choudary, besides Reliance Chairman Mukesh Ambani will attend the inaugural function.

Srinivasa Rao said that nearly 2,000 delegates from 18 countries such as Korea, Japan, Sri Lanka, Myanmar, Bngladesh and the UAE would take part in the summit expected to attract about 150 per cent more investments than in the past.

He said that in the past two summits as many as 876 MoUs for investments to the extent of 10.97 lakh crore and employment to 14.96 lakh were signed. Some of them were under implementation while efforts were on to get the remaining projects off the ground.

He said the inauguration of the Kia Motors plant under construction in Anantapur district would also be performed on the final day of the summit.

Last week, Chief Minister N Chandrababu Naidu toured Dubai to attract investors from the UAE to the summit and the response was overwhelming, he added.

Link to comment
Share on other sites

భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక దిగ్గజాలు 
26 దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు 
15 దేశాల మంత్రులు వస్తారని అంచనా
విశాఖపట్నం, న్యూస్‌టుడే: విశాఖపట్నంలో ఈ నెల 24న ప్రారంభం కాబోతున్న అంతర్జాతీయ భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కానున్నాయి. జిల్లా కేంద్రానికి అందిన సమాచారం ప్రకారం దేశీయంగా పేరొందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థల ముఖ్యులు తరలివస్తున్నారు. ఇందులో రిలయన్స్‌, అదానీ గ్రూపుల అధినేతలూ ఉన్నారు. 15 దేశాలకు చెందిన మంత్రులు సదస్సుకు హాజరవుతున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. కేంద్ర ప్రభుత్వం, భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) భాగస్వామ్యంతో ఆర్కేబీచ్‌ రోడ్డులోని ఎపీఐఐసీ మైదానంలో జరగనున్న మూడు రోజుల సదస్సును ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ప్రారంభిస్తారు. అందుకోసం ఆయన ఈనెల 23న విశాఖకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు సురేష్‌ప్రభు, నితిన్‌ గడ్కరి తదితరుల పర్యటనలు ఖరారయ్యాయి. విదేశాల నుంచి వచ్చే మంత్రులను ప్రభుత్వ అతిథులుగా పరగణించి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 దేశాల నుంచి పారిశ్రామిక ప్రతినిధి బృందాలు వస్తున్నాయి. 2వేల మంది వరకు విదేశీ ప్రతినిధులు, మరో వెయ్యి మంది వరకు దేశీయ పారిశ్రామికవేత్తలు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రోటోకాల్‌ పరిధిలో 117మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్న యంత్రాంగం అందుకు తగ్గట్టుగా వసతి, రవాణా, భద్రత ఏర్పాట్లను చేస్తోంది. ఇతర ప్రతినిధుల వసతి, ఏర్పాట్లను సిఐఐ ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ వస్తారన్న సమాచారం ఉన్నా ఏ తేదీల్లో వస్తారో స్పష్టత రాలేదు.
24నే కన్వెన్షన్‌ సెంటర్‌కు భూమిపూజ 
విశాఖనగరం ఆర్కేబీచ్‌ రోడ్డు ఎపీఐఐసీ మైదానంలో లూలూ గ్రూపు తలపెట్టిన భారీ కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మాణానికి ఈ నెల 24న భూమిపూజ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా రానున్నారు.

Link to comment
Share on other sites

63 భారీ ప్రాజెక్టులకు అవకాశం 
విశాఖలో భాగస్వామ్య, పారిశ్రామిక ఒప్పందాల ఫలితం
ఈనాడు, విశాఖపట్నం: రెండేళ్ల భాగస్వామ్య సదస్సుల్లో, ఇతర సందర్భాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా విశాఖ పరిధిలో దాదాపు రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఒప్పందాల సాకారానికి కలెక్టర్‌ ఆధ్వర్యంలో పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, పెట్టుబడిదారులతో ప్రతి నెలా సమీక్షలు నిర్వహించడం సత్ఫలితాలనిస్తోంది. దేశ తూర్పు తీరానికి మధ్యభాగాన ఉండడం, నౌకాశ్రయం, అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండడం విశాఖకు కలసివస్తోంది. 
* రూ.1800 కోట్ల పెట్టుబడితో ఆసియన్‌ పెయింట్స్‌ చేపట్టిన పనులు ఇప్పటికే చాలా వరకు పూర్తయ్యాయి. 
* పెరల్‌ బేవరేజెస్‌ సంస్థ రూ.150 కోట్లతో బాట్లింగ్‌ప్లాంటును ఏర్పాటుచేస్తోంది. వచ్చే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభించే దిశగా సన్నాహాలు చేస్తోంది. 
* దక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌ సంస్థ రూ.1200 కోట్లతో యూనిట్‌ నిర్మాణానికి ప్రభుత్వ అనుమతి పొందింది. 
* పెట్రో ఉత్పత్తుల రవాణా కోసం పారాదీప్‌ నుంచి హైదరాబాద్‌ వరకు పైపులైనును ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నిర్మిస్తోంది. ఇందులో భాగంగా అచ్యుతాపురంలో రూ.481 కోట్లతో భారీ టెర్మినల్‌, పంపింగ్‌స్టేషన్‌ ఏర్పాటుచేస్తోంది. బీ చిప్పాడలో రూ.500 కోట్లతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోడానికి దివీస్‌ సంస్థ  అనుమతులు తీసుకుంది. బీ విశాఖ ఉక్కు కర్మాగారం ఉత్పత్తి సామర్థ్యాన్ని 6.3 మి.టన్నుల నుంచి 7.3 మి.టన్నులకు పెంచడం, కోక్‌ఓవెన్‌ బ్యాటరీ-5, కేబీఆర్‌-2 నిర్మాణాలకు రూ.9300 కోట్లు వెచ్చించనున్నారు. ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యం 7.3 మి.టన్నులకు పెరిగింది. మిగిలిన పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ప్రగతి సానుకూలం: రామలింగేశ్వరరాజు, జీఎం పరిశ్రమల కేంద్రం 
భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు, అంతకుముందు ప్రతిపాదనల్లో సుమారు 63 భారీ ప్రాజెక్టులు సాకారమయ్యే అవకాశాలున్నాయి. ఆయా సంస్థలు అవసరమైన అనుమతులను తీసుకోవడం, నిధుల సమీకరణ, నిర్మాణ ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నాయి. ప్రతినెలా ఆయా ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షిస్తూ సాధ్యమైనంత వేగంగా నిర్మాణపనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నాం. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు స్థాపించడానికి సుమారు 2,589 ప్రతిపాదనలను ఆమోదించాం. మొత్తంగా రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేందుకు అవకాశాలున్నాయి.
 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...