Jump to content

Irrigation works @ AndhraPradesh


Guest Urban Legend

Recommended Posts

  • Replies 921
  • Created
  • Last Reply
  • 2 weeks later...
అచ్చెన్నాయుడు చొరవతో.. 3,300 ఎకరాలు సస్యశ్యామలం!
15-12-2018 09:35:09
 
636804634137873645.jpg
  • ప్రారంభానికి సిద్ధమైన మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం
 
టెక్కలి/శ్రీకాకుళం: మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. దీనివల్ల రెండు మం డలాల్లో 22 గ్రామాల్లోని 3,300 ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి. దీంతో ఆయా ప్రాంతరైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా చినుకు పడితే తప్ప ఇక్కడి రైతులు పంట ముఖం చూసేవారు కాదు. ఏటా కరువు పరిస్థితులనే ఎదుర్కొనేవారు. సీజన్‌లో వర్షం పడితే వరినాటు.. లేదంటే పశువుల మేతగా మారేది. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఈ ప్రాంతానికి గుర్తించి ఎలాగైనా సాగునీరు అందించాలని ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత 2014లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ప్రాంత రైతులకు కరువు, కాటకాల నుంచి దూరం చేయాల ని భావించారు. మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. రూ.34కోట్ల35లక్షల అంచనా వ్యయంతో టెక్కలి, నందిగాం మండలాల పరిధిలో 22 గ్రామాల్లో 3,300 ఎకరాలకు సాగునీరు అందించాలని భావించారు.
 
వంశధార ప్రధాన ఎడమకాలువ నుంచి సీతాపురం దరి సంప్‌వెల్‌ వరకు 42మీటర్ల ఎత్తు మేర గ్రావిటీ సిస్టంతో పైపులైన్‌ ద్వారా సాగునీరు సరఫరా చేసేందుకు రూపకల్పన చేశారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామ హేశ్వరరావును ఒప్పించి నిధులు మంజూరు చేయించారు. ఈ మేరకు గత ఏడాది ఏప్రిల్‌ 19న మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథ కం పనులకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ అధికారులు రాత్రనక, పగలనక దీనిపై దృష్టి సారించారు. 20 నెలల వ్యవధిలోనే ఈ పథకాన్ని పూర్తిచే యగలిగారు. ఇదిలా ఉండగా గురువారం కాంట్రాక్టర్‌ ట్రైల్‌రన్‌ వేయగా.. ఇది విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభి వృద్ధి సంస్థ ఇంజనీరింగ్‌ అధికారుల గ్రీన్‌సిగ్న ల్‌తో ఈనెల 19న ప్రారంభోత్సవానికి ప్రతినిదులు, అధికారులు రంగం సిద్ధం చేశారు.
 
 
సాగునీరు అందనున్న గ్రామాలివీ..
గూడెం, సవరసీతాపురం, పిట్టలసరియా, గొల్లూరు, నీలాపురం, సవరకిల్లి, డమర, నర్సి ంగపల్లి, కిట్టాలపాడు, రాంపురం, సొంటినూ రు, చిన్నారిగోకర్లపల్లి, సోమనాథపురం, బెల్లు కోల, నీలాపురం, రధజనబొడ్డపాడు, బైరూరు, కొల్లివలస, జగన్నాథపురం, చిరుతునాపల్లి, పాత్రపురం, నరహరిపురం తదితర గ్రామాల ప్రజలకు సాగునీరు అందనుంది. ఇక కొండల ప్రాంతంలో ఇన్నాళ్లు సాగునీటికి దూరమైన గ్రామాలకు ఈ పథకం వరంగా మారనుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం జిల్లాలో అమలవుతున్న ఎత్తిపోతల పథకాల్లో ఈ పథకానిదే మొదటి స్థానంగా చెప్పొచ్చు.
 
 
రెండు పంటలు పండించుకోవచ్చు
కరువుతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలన్నదే లక్ష్యంగా భావించాం. ఈ మేరకు మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకానికి రూ.34కోట్ల35లక్షలు చేయించగలిగాను. ఈ పథకం ద్వారా టెక్కలి, నందిగాం మండలాలకు సంబంధించి సుమారు 22 గ్రామాల రైతాంగానికి పుష్కలంగా సాగునీరు లభించనుంది. డెల్టా భూముల తరహాలో ఇక్కడ రైతులు రెండు పంటలు పండించుకోవచ్చు. దివంగత నేత ఎర్రన్నాయుడు కలలు గన్న ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తికావడం ఆనందంగా ఉంది. ఇది ఈ ప్రాంత ప్రజానీకం అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తానని రైతాంగానికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నందుకు సంతోషంగా ఉంది. - కింజరాపు అచ్చెన్నాయుడు, మంత్రి
 
 
20 నెలల కాలంలో పూర్తిచేశాం
మదనగోపాలసాగరం ఎత్తిపోతల పథకాన్ని 20 నెలల్లో పూర్తి చేయగలి గాం. సంపువెల్‌, పంప్‌హౌస్‌, మూడు కిలోమీర్లు మేర 1000ఎంఎం డయా మీటర్‌ గల ప్రజర్‌ పైపులైన్లు, డిస్టిబ్యూషన్‌ పీవీసీ పైపులైన్లు, 400ఎంఎం డయాస్‌ నుంచి 200 డయాస్‌ వరకు 16కిలోమీటర్లు మేర పైపులైన్లు వేయగలిగాం. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 350 హెచ్‌పీ మోటార్లను నాలుగింటిని వినియోగించాం. సాంకేతిక పరికరాలు పూణే, సేలాం, గాజియాబాద్‌, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి తెప్పించాం. 1000కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు రెండింటిని వినియోగించి సాంకేతిక పరికరాల సహకారంతో పథకాన్ని విజయవంతంగా నిర్వహించగలిగాం. సుమారు 3,300 ఎకరాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. - బి.లక్ష్మీపతిరావు, ఈఈ, ఆంధ్రప్రదేశ్‌ నీటిపారుదల అభివృద్ధి సంస్థ
Link to comment
Share on other sites

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు... ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు... ఆంధ్రప్రదేశ్ లో రెండు కోట్ల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆ లక్ష్యంలో భాగంగా ఈ నాలుగున్నరేళ్ళలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.56,587 కోట్లు ఖర్చుచేశారు. ఒక కోటి 5 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించారు.

రాష్ట్రవ్యాప్తంగా 57 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టగా ఇప్పటివరకు 10 ప్రాజెక్టులను పూర్తిచేసింది ప్రభుత్వం. మరో 12 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకో 29 ప్రాజెక్టులు శరవేగంగా పనులు జరుపుకుంటున్నాయి.

 

 

Link to comment
Share on other sites

Priority Projects

62 projects spread across the state are prioritized for speedy completion. Out of these 17 projects are already inaugurated and 6 are ready for inauguration.

 

Projects Inaugurated – 17

  • Gorakallu balancing reservoir
  • Owk tunnel
  • Gandikota reservoir
  • Gandikota-CBR LI schemes
  • SH-31 road work
  • Pulakurthy LI scheme
  • Pulikanuma LI scheme
  • Siddapuram LI scheme
  • Marala reservoir
  • Mutchumarri LI scheme
  • Purushottapatnam LI scheme
  • Kandaleru Left Canal LI scheme
  • Construction of anicut across Sarada river
  • Formation of Pogonda reservoir
  • Modernization of Yerakalava
  • Kondaveeti vagu pumping scheme
  • Chinasana LI scheme

 

Projects ready for Inauguration – 6

  • Pulichintala project
  • Adavipalli reservoir and lift
  • Cherlopally reservoir
  • Madakasira branch canal
  • Gundlakamma reservoir
  • Pedapalem LI scheme

 

Ongoing Projects – 26

  • Mallemadugu reservoir
  • Balaji reservoir
  • Venugopalasagar reservoir
  • Kuppam branch canal
  • Water supply to Mulapalli and 4 other tanks
  • Widening of HNSS main canal
  • Lifting of Water from Jeedipalli to upper Pennar project
  • Lifting of Water from Jeedipalli to Bhairavanitippa project
  • Community lift cum drip irrigation project
  • Modernization of mid Pennar south canal
  • Water supply to western mandal of Kurnool Dt.
  • GNSS Phase-II works up to Kodur in Kadapa Dt.
  • Somasila Swarnamukhi link canal
  • Lifting of water from SSG canal to Althurupadu reservoir and Althurupadu lift
  • Nellore barrage
  • Sangam barrage
  • Veligonda project
  • Korisapadu lift irrigation scheme
  • Chintalapudi lift irrigation scheme
  • Interlinking of Godavari-Penna phase-I
  • Uttarandhra Sujala Sravanthi phase-I
  • Vamsadhara stage-II phase-II
  • Interlinking Vamsadhara-Nagavali rivers
  • Offshore Reservoir on Mahendratanaya river
  • Tarakarama Thirtha Sagaram project
  • Modernization of Thotapalli old canal system works

 

New Projects – 13

  • Construction of new barrage (10 TMC) across Krishna river near Vykuntapuram (V)
  • Construction of new barrage across Krishna river near Chodavaram (V)
  • Muktyala lift irrigation scheme
  • Extension of Guntur channel
  • Varikapudisela lift scheme (Macharla lift)
  • Vissannapet-Chanubanda lift schemes
  • Lifting of water from Somasila Swarnamuki link canala to Mallemadugu reservoir and Mallemadugu to Balaji reservoir
  • Minor irrigation works and lift schemes are proposed to be taken up in Kuppam constituency
  • CBR to HNSS Project
  • Hagari (Vedavathi) lift irrigation scheme
  • RDS right canal
  • Gundrevula reservoir
  • Inter linking of Vamsahara-Bahuda rivers
Link to comment
Share on other sites

సాగునీటికి 63 వేల కోట్లు 

 

32 లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించాం 
పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నాం 
పట్టిసీమ ఎత్తిపోతలతో 263 టీఎంసీలు తెచ్చాం 
రూ.44 వేల కోట్ల ఆదా చేశాం 
సహజవనరుల నిర్వహణపై ప్రభుత్వ శ్వేతపత్రం

 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన తరువాత సహజవనరుల నిర్వహణలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. సాగునీటి రంగం, నీటి నిర్వహణ, పునరుత్పాదక విద్యుదుత్పత్తి, అడవులు, కాలుష్య నియంత్రణ, గనులు-ఖనిజాలు వంటి రంగాల్లో పురోగతిలో ఉన్నామని తెలిపింది. 2014 తర్వాత సాగునీటి రంగంలో రూ.63,657.52 27ap-main11b.jpgకోట్లు ఖర్చు చేసి 32.02 లక్షల ఎకరాలకు నీటి భరోసా కల్పించినట్లు పేర్కొంది. నదుల అనుసంధానం, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో వేగంగా పరుగులు పెడుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం సాయంత్రం విడుదల చేసిన ‘సహజవనరుల నిర్వహణ’పై శ్వేతపత్రంలో పేర్కొన్నారు. అందులోని ముఖ్యాంశాలు..

నాడు అన్నీ పూర్తి కాని ప్రాజెక్టులే! 
2004-14 మధ్య 86 ప్రాజెక్టులను రూ1,90,569 కోట్ల అంచనా విలువతో చేపట్టారు. 
2012 కాగ్‌ నివేదిక ప్రకారం ప్రభుత్వం సరైన ప్రణాళిక అనుమతులు లేకుండా ఒకేసారి అన్ని ప్రాజెక్టులు చేపట్టడంతో నిధులు సద్వినియోగం కాలేదు. ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేకపోయారు.

2014 తరువాత సాధించిన విజయా లెన్నో 
1. వేగంగా పోలవరం నిర్మాణం 

2014 తర్వాత ఈ ప్రాజెక్టుపై చేసిన ఖర్చు: రూ.10,227.92 కోట్లు. 
కేంద్రం తిరిగిచ్చిన నిధులు: 6,727.26 కోట్లు. 
మొత్తం పోలవరంపై ఖర్చు: రూ.15,363.79 కోట్లు. 

2019 ఖరీఫ్‌కల్లా పోలవరం నీళ్లిస్తాం. డిసెంబర్‌కు ప్రాజెక్టు పూర్తి చేసేస్తాం.

2. పట్టిసీమ ఎత్తిపోతలతో గోదావరి-కృష్ణా అనుసంధానం. 
27ap-main11a_1.jpg4 ఏళ్లలో 263 టీఎంసీల గోదావరి వరద జలాల సద్వినియోగం. 
ఈ నీటితో కృష్ణా డెల్టాలో రూ.44,000 కోట్ల విలువైన పంట ఉత్పత్తి. 
రాయలసీమ కరవు ప్రాంతాలకూ నీటి సరఫరా. పోతిరెడ్డిపాడు ద్వారా ఈ ఏడాది 115.40 టీఎంసీలు, ముచ్చుమర్రి ద్వారా 31.65 టీఎంసీల తరలింపు

3. 23 ప్రాధాన్య ప్రాజెక్టుల పూర్తి 
రాష్ట్రంలో మొత్తం 62 ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తింపు. నిర్మాణ పురోగతిపై దృష్టి. 
ఇప్పటికే 17ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రారంభించారు. మరో 6 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధం. 
26 ప్రాజెక్టుల్లో వేగంగా పనులు సాగుతున్నాయి. 
మరో 13 ప్రాజెక్టులు కొత్తగా నిర్మించేందుకు వివిధ దశల్లో ఉన్నాయి.

4. ప్రాజెక్టులు... ప్రయోజనాలు 
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పూర్తి - రూ.1638 కోట్ల ఖర్చు - రెండు పంట కాలాల్లో 15 టీఎంసీల గోదావరి వరద నీరు ఏలేరు జలాశయానికి మళ్లింపు 
వంశధార రెండో భాగం రెండో దశ పూర్తి చేసి హిరమండలం జలాశయంలో 3 టీఎంసీల నీరు నింపడం. 
సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టు పూర్తితో లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు.   64 వేల ఎకరాల స్థిరీకరణ. 
గుండ్లకమ్మ పాక్షికంగా పూర్తి చేసి 60 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు. 
ముచ్చుమర్రి ఎత్తిపోతల నిర్మాణం పూర్తి చేసి మూడు సీజన్లలో దాదాపు 7 టీఎంసీల నీరు శ్రీశైలంలో కనీస నీటిమట్టాల దిగువ నుంచి ఎత్తిపోసి కేసీ కాలువకు, హంద్రీనీవాకు ఇచ్చారు. 
గాలేరు నగరి రెండు దశల్లో పూర్తయిన నిర్మాణాల వల్ల గోరకల్లు జలాశయంలో మొదటిసారి 8 టీఎంసీల నీరు నిల్వ చేయడం. అవుకులో 3.15 టీఎంసీలు నింపడం. అవుకు టన్నెల్‌ పూర్తి చేసి గండికోట జలాశయానికి నీళ్లు మళ్లింపు. 
2018-19 కాలంలో గండికోటలో 12 టీఎంసీల నీళ్లు నింపడం. 
గండికోట చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు ఎత్తిపోతల పూర్తి చేసి 2.685 టీఎంసీల నీరు చిత్రావతి జలాశయానికి మళ్లింపు. మైలవరం జలాశయంలో 4.82టీఎంసీల నీటి నిల్వ. పైడిపాలెం 
హంద్రీనీవా రెండు దశల్లో దశల వారీగా పనులు పూర్తి చేసి నాలుగు పంట కాలాల్లో 91.03 టీఎంసీల నీటి మళ్లింపు. 
వచ్చే జనవరిలో మడకశిర, చెర్లోపల్లి బ్రాంచి కాలువలకు నీటి మళ్లింపు ప్రయత్నాలు సాగుతున్నాయి. కుప్పం కాలువకు జనవరిలోనే నీళ్లు ఇవ్వాలనే తలంపుతో ప్రయత్నాలు.

5. నదుల అనుసంధానంతో మహా సంగమం 
రాష్ట్రంలోని నదులన్నింటినీ అనుసంధానించి మహాసంగమం జరపాలనే నిశ్చయంతో కృషి. ఇప్పటికే పట్టిసీమతో గోదావరి కృష్ణా అనుసంధానం. 
గోదావరి పెన్నా అనుసంధానం ద్వారా 320 టీఎంసీల గోదావరి వరద జలాలు మళ్లించడం. ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు కరవు ప్రాంతాల్లో నీటి కొరత తీర్చడం. టెండర్లు పూర్తయ్యాయి. పనులు చేపట్టబోతున్నారు. 
వంశధార-నాగావళి నదుల అనుసంధానం పనులు సాగుతున్నాయి. 37,053 ఎకరాల స్థిరీకరణ, 5 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీరు. 
నాగావళి నదిని సువర్ణముఖి, వేగావతి, చంపావతి నదులతో అనుసంధానించి విజయనగరం జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కారం. గడిగడ్డ జలాశయం ఆయకట్టు స్థిరీకరణ. పనులు సాగుతున్నాయి. 
హిరమండలం జలాశయం నుంచి ఎగువ కాలువ నిర్మించి మహేంద్రతనయ, బాహుదా, వంశధార నదులను అనుసంధానించడం. పూర్తి స్థాయి ప్రాజెక్టు నివేదిక దాదాపు పూర్తయింది.

6. నీటి నిర్వహణ 
రాష్ట్రంలో వరుసగా (-34శాతం), (-5శాతం), (-29శాతం), (-14శాతం) ప్రస్తుత సంవత్సరం ఇప్పటివరకు -35శాతం వర్షాభావం ఉన్నా నీటి నిర్వహణ విధానాలు అవలంబించి వృద్ధి సాధన. 

27ap-main11c.jpgపట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీటి మళ్లింపు వల్ల ఆ మేరకు శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి మళ్లింపు వీలైంది. 
2015-16, 2016-17 రబీ కాలాల్లో గోదావరి నీటికి కొరత వచ్చినా సమర్థ నీటి విధానాలతో 8.69లక్షల ఎకరాలకు నీటి సరఫరా. 
2015-16లో సమర్థ నీటి నిర్వహణ విధానాలతో పంట కాపాడినందుకు సీబీఐపీ అవార్డు సైతం దక్కింది. 11.30 లక్షల ఎకరాలకు సూక్ష్మనీటి విధానంలో నీటిని అందిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నా వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నాం.


27ap-main11d.jpg

గురువారం ఉండవల్లి ప్రజావేదికలో.. సహజవనరులపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పక్కన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్‌చంద్ర పునేఠ, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ 


2 కోట్ల ఎకరాలకు నీరు

రాష్ట్రాన్ని కరవు రహితంగా చేయడం, 2 కోట్ల ఎకరాలకు సాగునీరందించడం ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో సహజ వనరుల నిర్వహణపై ఆయన గురువారం ఉండవల్లిలోని ప్రజావేదికలో శ్వేతపత్రం విడుదల చేశారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ... కరవును జయించడం, పచ్చదనం పెంపొందించడం, కాలుష్య రహిత ఇంధన ఉత్పత్తి పెంచడం తమ లక్ష్యాలుగా పేర్కొన్నారు. భవిష్యత్తులో నదుల అనుసంధానానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తామని, బహుద, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల్ని అనుసంధానిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 62 సాగునీటి ప్రాజెక్టుల్లో గోదావరి-పెన్నా అనుసంధానం, బొల్లాపల్లి దగ్గర రిజర్వాయర్‌ నిర్మాణం తప్ప మిగతావన్నీ మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. ఇప్పటి వరకు 32 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడంతో పాటు, స్థిరీకరణ చేశామని తెలిపారు. దీన్నో చరిత్రగా అభివర్ణించారు. సూక్ష్మ సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, తక్కువ నీటిని వినియోగించుకుని ఎక్కువ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. తాము చేపట్టిన చర్యల వల్ల ఉద్యాన పంటల్లో దక్షిణ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి చెప్పిన ముఖ్యాంశాలు...! 
మా ప్రభుత్వం వచ్చాక జలవనరులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. 
రాష్ట్రంలో 140 చిన్న, పెద్ద నదులున్నాయి. వాటన్నింటినీ కాలువలకు అనుసంధానం చేస్తే గ్రావిటీ, లిఫ్ట్‌ల ద్వారా 2 కోట్ల ఎకరాలకు నీరు ఇవ్వగలం. 
రాష్ట్రంలో అన్నీ విద్యుత్‌ వాహనాలే వినియోగించేలా చర్యలు తీసుకుంటాం. 
2024 నాటికి రాష్ట్రంలో మొత్తం పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయమే జరిగేలా చూస్తాం. 
గ్రీన్‌ హౌస్‌ వాయువుల ఉద్గారాలు తగ్గిస్తున్నాం. రాష్ట్రాన్ని సీఓ2 న్యూట్రల్‌గా తీర్చిదిద్దడం లక్ష్యం. 
సముద్రంలోని సహజవాయువు, ఇతర ఖనిజాలను వెలికితీసేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకుంటాం.

- ఈనాడు, అమరావతి

 

 

 

 

Link to comment
Share on other sites

జల వనరులపై త్రిముఖ వ్యూహం
28-12-2018 03:56:33
 
636815661929386347.jpg
  •  నీటి సంరక్షణ, అనుసంధానం, సూక్ష్మసేద్యం
  •  భవిష్యత్‌లో పంచనదుల మహాసంగమం
  •  త్వరలో గోదావరి-పెన్నా తొలి దశ
  •  పోలవరం లక్ష్యాలను అధిగమిస్తున్నాం
  •  2014కి ముందు సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం
  •  జలయజ్ఞం పేరిట నిధుల దుర్వినియోగం
  •  రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యం
  •  ఐదో శ్వేతపత్రంలో ప్రభుత్వం వెల్లడి
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): జల వనరులకు సంబంధించి త్రిముఖ వ్యూహం అనుసరిస్తున్నామని రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది. నీటి సంరక్షణ, పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి-నదుల అనుసంధానం, సూక్ష్మ, బిందు సేద్య విధానం పటిష్ఠంగా అమలు చేస్తున్నామని.. భూగర్భ జలాలను పెంచుతున్నామని తన శ్వేతపత్రంలో తెలిపింది. 2014కి పూర్వం సాగునీటి ప్రాజెక్టులపై పూర్తిగా నిర్లక్ష్యాన్ని చూపారని, రాష్ట్ర విభజన జరిగి ఆర్థికంగా చితికిపోయినప్పటికీ నాలుగున్నరేళ్లలోనే గోదావరి-కృష్ణా నదులను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా అనుసంధానం చేశామని పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు దాకా వంశధార-నాగావళి-గోదావరి -కృష్ణా-పెన్నా నదుల మహా సంగమానికి ప్రణాళికలు రచించామని.. గోదావరి-పెన్నా అనుసంధానం మొదటి దశ పనులు ప్రారంభిస్తున్నామని తెలిపింది. జల యజ్ఞం పేరిట గత ప్రభుత్వాలు చేసిన నిధుల దుర్వినియోగాన్ని అరికట్టి.. ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని తెలిపింది. కరువును పారదోలేలా వేగంగా ప్రాజెక్టులను చేపడుతున్నామని వివరించింది. 32.02 లక్షల ఎకరాలను స్థిరీకరించామని తెలిపింది. రెండు కోట్ల ఎకరాలకు సాగునీరందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని ప్రకటించింది. శ్వేతపత్రంలో ఇంకా ఏమున్నదంటే..
 
పోలవరంలో రూ.3,500 కోట్ల బకాయిలు
రాష్ట్ర జీవన రేఖలాంటి పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా రూ.15,363.79 కోట్లను వ్యయం చేశాం. రాష్ట్ర విభజన జరిగాక రూ. 10,227.92 కోట్లను వ్యయం చేస్తే కేంద్రం ఇప్పటిదాకా కేవలం రూ.6727.92 కోట్లు రీయింబర్స్‌ చేసింది. ఇంకా రూ.3,500.66 కోట్లు బకాయిపడింది. జాతీయ హోదా ప్రాజెక్టుగా పోలవరానికి కేంద్రం నిధులు మంజూరు చేయకపోయినా.. నిర్మాణ పనులు శరవేగంగా జరిపిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి పూర్తి చేస్తాం. గ్రావిటీ ద్వారా నీరందిస్తాం.’
 
చెట్ల పెంపకానికి ప్రాధాన్యం..
‘కరువు నివారణ చర్యలలో భాగంగా చెట్ల పెంపకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 1,62,970 చదరపు కిలోమీటర్ల మేర హరిత వనాలను పెంచి .. దేశంలో 8వ స్థానంలో ఉన్నాం. 2004-14 మధ్య కాలంలో జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేసి. రూ.79,357.45 కోట్లు వ్యయం చేసినా 19.53 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందింది. 2012లో జల వనరుల శాఖలో చోటు చేసుకున్న అవినీతిని కాగ్‌ తప్పుబట్టింది. భూసేకరణపై నిర్లక్ష్యం చేయడం వల్ల అంచనా వ్యయం పెరిగిపోయింది. కేంద్ర జల సంఘం నుంచి సకాలంలో పలు ప్రాజెక్టులకు అనుమతులూ తీసుకురాలేదని ఆక్షేపించింది. డీపీఆర్‌ లేకుండానే పలు ప్రాజెక్టులు చేపట్టడాన్ని కూడా ఎండగట్టింది.’
 
రెండు రాష్ట్రాల మధ్య వివాదం..
రాష్ట్ర విభజన కారణంగా కృష్ణా -గోదావరి జలాల వాటాలపై తెలంగాణ, ఆంధ్ర మధ్య వివాదం చెలరేగింది. ఈ నదుల నిర్వహణకు బోర్డులు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది.
 
ఇవన్నీ చకచకా..
‘పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను నిర్ణీత సమయంలో పూర్తిచేశాం. గోరకల్లు, అవుకు టన్నెల్‌, గండికోట రిజర్వాయరు, గండికోట-చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయరు, పులికనుమ, సిద్దాపురం, మరాల రిజర్వాయరు, ముచ్చుమర్రి, కండలేరు, శారదా నదిపై ఆనకట్ట, పోగొండ రిజర్వాయరు, ఎర్రకాలువ ఆధునీకరణ, కొండవీటివాడు పంపింగ్‌ స్కీమ్‌, చిన్నసాన ప్రాజెక్టులను ప్రారంభించాం.’
 
పర్యాటకానికి ప్రాధాన్యం..
పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. ఎకో టూరిజం, నగర వనాలను ప్రోత్సహిస్తున్నాం. గాలి, శబ్ద కాలుష్య నివారణకు కార్యాచరణను అమలుచేస్తున్నాం. పునురుత్పాదక విద్యుదుత్పత్తికి ప్రాధాన్యమిస్తూ ఆదర్శంగా నిలిచాం. 4059 మెగావాట్ల పవన, 2591 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాం. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 4000 మెగావాట్ల సోలార్‌ పార్కులను స్థాపిస్తున్నాం. గనుల శాఖలో అవినీతిని అరికట్టి పారదర్శకంగా లీజులు ఇస్తూ.. రాబడిని పెంచుతున్నాం.’
 
 
మహాసంగమం..
‘గోదావరి-చంపావతి-నాగావళి నదులను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా అనుసంధానం చేస్తాం. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు మొదలయ్యాయి. వంశధార-బహుదా నదులనూ కలుపుతాం. ఇందుకు సంబంధించి డీపీఆర్‌ సిద్ధమైంది. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
 
 
ముందే పోలవరం ఫలాలు..
పోలవరం పథకం ఫలాలను ముందుగానే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాం. ఈ ఎత్తిపోతల ద్వారా గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశాం. గత నాలుగేళ్ల పంట కాలంలో 263 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టు రైతులకు అందించాం. జూన్‌ నెలలోనే కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ ప్రారంభమైంది. త్వరితగతిన వరి పంట చేతికి అందడం వల్ల నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చే తుఫాన్లకు పంట దెబ్బతినకుండా కాపాడాం. శ్రీశైలం ద్వారా కృష్ణా జలాలను సంపూర్ణంగా రాయలసీమకు వాడుకునే వెసులుబాటు కలిగింది. కృష్ణా డెల్టా రైతులు గత నాలుగేళ్లలో రూ.1667 కోట్ల మేర రైతులు పెట్టుబడి పెడితే.. రూ.44,000 కోట్ల పంట చేతికొచ్చింది.’
 
 
నీరు చెట్టు-నీరు ప్రగతి..
.రాష్ట్రంలో నీరు చెట్టు - నీరు ప్రగతి కింద నీటి సంరక్షణ విధానాలను ఉధృతంగా అమలు చేస్తున్నాం. చెరువుల్లో పూడికతీత, చెరువుల మరమ్మతు, ఎత్తిపోతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. సూక్ష్మ , బిందు సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. రాష్ట్రంలో 3348 క్యాష్‌కడ్స్‌, 8.356 లక్షల పంట కుంటల నిర్మాణంతో భూగర్భంలో 84.51 టీఎంసీల నీటిని అదనంగా నిల్వ చేశాం. ఉమ్మడి ఆంధ్రలో 2004-14లో 86 ప్రాజెక్టుకు రూ.1,90,598 కోట్లు మంజూరయ్యాయి. ఇంత భారీ మొత్తంలో ఖర్చు చేసినా సాగు నీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తికాలేదు. కాలువల నిర్మాణం కూడా పూర్తి చేయలేదు. కేంద్రం నుంచి క్లియరెన్సులు రప్పించుకోవడంపైనా దృష్టి సారించలేదు.’
Link to comment
Share on other sites

అదిగదిగో మహాసంగమం
28-12-2018 04:04:41
 
636815666810556072.jpg
  •  5 నదులను అనుసంధానించి తీరతాం
  •  జల వనరులకు నాలుగేళ్లలో 63,657 కోట్లు
  •  కోటి ఎకరాలకు సూక్ష్మసేద్యం లక్ష్యం
  •  సీఎం చంద్రబాబు వెల్లడి
అమరావతి, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇప్పటికే గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల మహాసంగమం సాకారం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో 62 ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులను చేపట్టామని.. ఇందులో 17 ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు. మరో ఆరు ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. 26 నిర్మాణ దశలో, 13 ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయని తెలిపారు. ఈ మొత్తం ప్రాజెక్టులన్నింటినీ మూడేళ్లలో పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రకృతి వనరుల నిర్వహణలో భాగంగా సాగునీటి వనరులు, పచ్చదనం, గనులు తదితర అంశాలపై శ్వేతపత్రాన్ని గురువారమిక్కడ ఉండవల్లిలోని ప్రజావేదికలో ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రాజెక్టులు, చెరువులు, చెక్‌డ్యాంలు, పంటకుంటలు మొదలైన అన్ని జలవనరులకు వివిధ శాఖలు, పద్దుల కింద రూ.63,657 కోట్లు ఖర్చుచేశామని వెల్లడించారు. ఇంకా ఏమన్నారంటే..
 
11.53 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం
‘పూర్తిచేసిన ప్రాజెక్టుల వల్ల 38 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టు ఏర్పడింది. అప్పటికే ఉన్న ఆయకట్టును స్థిరీకరించాం. కాలువల ద్వారా ఒక ఎకరాకు ఇచ్చే నీటిని.. సూక్ష్మసేద్యంతో రెండెకరాలకు ఇవ్వొచ్చు. గత నాలుగేళ్లలో సూక్ష్మసేద్యం సాగును 5.63 లక్షల ఎకరాల నుంచి 11.53 లక్షల ఎకరాలకు పెంచాం. పదేళ్లలో కోటి ఎకరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సూక్ష్మసేద్యం కింద అత్యధిక సాగు విస్తీర్ణం ఉన్న జిల్లాల్లో తొలి 6 స్థానాల్లో అనంత, కడప, ప్రకాశం, కర్నూలు, చిత్తూరు, పశ్చిమగోదావరి నిలిచాయి.
 
13 వేల కోట్ల పంట.. పరిశ్రమలూ
‘పట్టిసీమ ప్రాజెక్టుతో గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం పూర్తిచేశాం. దీనిఫలితంగా కృష్ణా డెల్టాకు ముందస్తుగా నీరిచ్చాం. అదే సమయంలో శ్రీశైలం నుంచి కృష్ణా డెల్టాకు రావలసిన కృష్ణా జలాలను రాయలసీమకు తరలించాం. కృష్ణా డెల్టాకు 2015-16లో 4.21 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చాం. ఫలితం గా 8 లక్షల ఎకరాల్లోని రూ.2,500 కోట్ల విలువైన పంటను కాపాడాం. 2016-17లో 55.62 టీఎంసీల జలాలను మళ్లించి.. 13.08లక్షల ఎకరాల్లోని రూ.5,500కోట్ల విలువైన పంటలు కాపాడాం. 2017-18లో రూ.6వేల కోట్ల పంటలను కాపాడాం. మొత్తం రూ.13వేల కోట్ల పంట మూడేళ్లలో పట్టిసీమ ఫలితంగా వచ్చింది. ఫలితంగా హంద్రీ-నీవా, గాలేరు-నగరి ద్వారా రాయలసీమకు నీళ్లివ్వగలిగాం. హంద్రీనీవాకు నీళ్లు ఇవ్వడం వల్లే అక్కడ కియ పరిశ్రమ వచ్చింది. గండికోట నుంచి నీటిలభ్యత ఉండడంతోనే కడప జిల్లాలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టే అవకాశం వచ్చింది. అనంతపురం జిల్లాకు నీరిచ్చి మొత్తం చెరువుల్ని నింపాం. మరోవైపు భూగర్బజలాలు పెంచడంపై దృష్టిసారించాం. 8.4 లక్షల పంటకుంటలు తవ్వి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచాం. 3,348 గొలుసుకట్టు చెరువులను అభివృద్ధి చేసి నీరు నింపాం. 93వేల చెక్‌డ్యాములు, 27వేల ఊటచెరువులు నిర్మించాం.’
 
పోలవరం 62.86% పూర్తి
‘పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 62.86 శాతం పూర్తిచేశాం. ఇప్పటివరకు ప్రాజెక్టుపై మనం ఖర్చుచేసిన డబ్బులో రూ6,727 కోట్లు కేంద్రం విడుదల చేసిందని, ఇంకా రూ3,500 కోట్లు ఇవ్వాలి. పచ్చదనం పెంపులో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది.’
 
మన బ్రాండ్‌ అంబాసిడర్‌ సూర్యుడు
‘2022నాటికి రాష్ట్ర విద్యుదుత్పత్తిలో 40శాతం పునరుత్పాదక వనరుల నుంచే చేస్తాం. రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ సూర్యుడే. సౌరవిద్యుత్‌లో ప్రథమ స్థానానికి వెళ్లాం. 2014లో యూనిట్‌కు రూ.6.49గా ఉన్న సౌర విద్యుత్‌ ధరను ఇప్పుడు రూ2.70కి తగ్గించాం. భవిష్యత్‌లో మరింత తగ్గిస్తాం.
 
ఖనిజాదాయం భేష్‌..
‘ఖనిజ వనరుల ఆదాయాన్ని రూ.838 కోట్ల నుంచి రూ.2,147కోట్లకు పెంచాం. సముద్రంలో అపార ఖనిజ సంపద ఉంది. అంతర్జాతీయ సంస్థలతో కలిసి దాన్ని వెలికితీస్తాం. ఎంతో కష్టపడి ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టి.. ఏటా రూ.500 కోట్ల మేర ఆదాయం తెస్తున్నాం. మూడేళ్లలో రూ.1700 కోట్లు ఆర్జించాం.’
 
 
అందరికీ మరుగుదొడ్లు..
‘నేను పాదయాత్ర చేసిన సమయంలో ప్రతి ఊరిలోనూ రోడ్డుపక్కన బహిరంగ మలవిసర్జన జరిగేది. రాష్ట్రమంతా బహిరంగ మరుగుదొడ్డిలా ఉండేది. గ్రామాల్లో పేడకుప్పలు, మట్టి దిబ్బలు ఉండేవి. ఇప్పుడు అందరికీ మరుగుదొడ్లు కట్టించాం. గ్రామాల్లో పేడకుప్పలు లేకుండా చేశాం. అంతా స్వచ్ఛంగా చేశాం.’
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...