Jump to content

అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు


Recommended Posts

అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపులు

 తాజా ఎన్నికల్లో టికెట్‌ దక్కని  అసంతృప్త నేతలను చంద్రబాబు బుజ్జగిస్తున్నారు. 

Published : 08 Apr 2024 20:41 IST
 
 
 
 
 
 

124068077_080424chandrababu1a.jpg

హైదరాబాద్‌: ఎన్డీయే కూటమి పొత్తు వల్ల టికెట్‌ దక్కని తెదేపా అసంతృప్త నేతలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ప్రభాకర్‌ చౌదరి, జితేందర్‌ గౌడ్‌, తిక్కారెడ్డిలు కలిశారు. ఈ ముగ్గురూ అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం అసెంబ్లీ స్థానాలను ఆశించారు. పొత్తులో భాగంగా ఆయా స్థానాలను మిత్ర పక్షాలకు కేటాయించడంతో వారు భంగపడ్డారు. ఈ ముగ్గురు నేతలతోపాటు ప్రాంతీయ సమన్వయకర్తలు భూమిరెడ్డి గోపాల్‌రెడ్డి, బీదా రవిచంద్ర యాదవ్‌లు చంద్రబాబును కలిసి మాట్లాడారు. ముగ్గురు నేతలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు నిర్ణయించారు. రాజకీయ భవిష్యత్‌పై హామీ ఇవ్వడంతో పాటు.. అధికారంలోకి వచ్చాక ప్రత్యామ్నాయ పదవులిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. సీట్ల సర్దుబాటు పరిస్థితులను అర్థం చేసుకొని సహకరించాలని సూచించినట్లు తెలుస్తోంది. ఆయన హామీతో సంతృప్తి చెందిన నేతలు తమకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం.

Link to comment
Share on other sites

3 minutes ago, sonykongara said:

Image

Good so s.kota kooda one sided with Krishna supporting party & kolla family. Such leaders should be rewarded. Not people like Pothina, chengalrayudu...

Link to comment
Share on other sites

విజయమే లక్ష్యంగా పనిచేయండి

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:51 PM

 

ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య సూచించారు.

 
విజయమే లక్ష్యంగా పనిచేయండి
విశాఖలో జరిగిన టీడీపీ సమావేశంలో జిల్లా నేతలు
 

 

పార్వతీపురం, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి దామచర్ల సత్య సూచించారు. సోమవారం విశాఖలో పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. చంద్రబాబునాయుడిని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచే యాలన్నారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ప్రజల భవిష్యత్తు కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సుజయ్‌కృష్ణారంగారావు, టీడీపీ అరకు పార్లమెంట్‌ అధ్యక్షుడు కె.శ్రావణ్‌ , ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల టీడీపీ అభ్యర్థులు బోనెల విజయచంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, తోయక జగదీశ్వరి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ డి.రామకృష్ణ , ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, మాజీ ఎమ్మెల్యే భంజ్‌దేవ్‌, మాజీ ఎంపీపీ పి.తిరుపతిరావు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ డి.లక్ష్మణరావు, పాలకొండ నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...