Jump to content

Bday wishes from Raghu sir (NBK)


GOLI SODA

Recommended Posts

ఆయనకి 63 ఏళ్ళు!! కానీ టీనేజ్ కి వచ్చిన 13 వ ఏటే ఆయన Age అనే Concept వదిలేసారు, 

వామ్మో ఈయన్ని నేను గెలవలేనులే అని Age కూడా ఆయన్ని వదిలేసింది....

అందుకే ఆయనలో ఉరుకులు పరుగులూ ఉత్సాహం కేరింత అన్నీ రోజురోజుకీ రెట్టింపు అవుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గడం లేదు....

ఈయన్ని చూస్తే వయసుని అంకెలతో కాదు,  హుషారుతో లెక్కెట్టాలేమో అనిపిస్తది, అనిపించడం కాదు అలాగే లెక్క పెట్టాలి అని చెప్పి ఓ బ్రాండ్ క్రియేట్ చేసేసారు మా బాలయ్య గారు, ఎందుకంటే సంవత్సరం సంవత్సరంకీ ఆయన హుషారు డబుల్ త్రిబుల్ పెరుగుతుంది....

బాలయ్య అంటే ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంతే!! ఎనర్జీ విషయంలో ఇప్పటి జనరేషన్ వాళ్ళు కూడా, అంతెందుకు ఆయన మనవళ్ళు కూడా బాలయ్య గారితో పోటీ పడాలి అంటే పాట్లు పడాల్సిందే.... 

అద్ది ఆయన క్రియేట్ చేసిన అంచనా, దాన్ని ఎవ్వరూ రీచ్ అవ్వలేరు, కనీసం రీచ్ అవ్వడానికి ప్రయత్నించలేరు కూడా....

సింహం కడుపున సింహమే పుడుతుంది అంటారు, కానీ సింహం కడుపున మరింత గర్జించే వీర సింహం పుట్టింది, 

వారసత్వం అంటే బ్లడ్ బ్రీడ్ అన్నారని ఆయన్ని రకరకాలుగా విమర్శించారు, కానీ వారసత్వం అంటే బ్లడ్ బ్రీడ్ మాత్రమే కాదు, వారసుడిగా ఆయన తండ్రి పెద్దాయన ఆశయాలని, ఆచరణలని, అలవాట్లని, క్రమశిక్షణనీ, కార్యదీక్షనీ అన్నింటినీ ముందుతరాలకి తన ద్వారా తెలియచేస్తూ, భావితరాల వారికి అన్నగారి బాటని చైతన్య దీప్తులుగా అందిస్తూ, ఆయన జీవితాన్ని ఎందరికో ఆదర్శ ప్రాయంగా చేస్తూ, మాటిమాటికీ మా నాన్న అంటాడు అనే వారి చెంప చెళ్ళుమానిపించేలా వారసత్వం అంటే ఏంటో తెలియచేసిన మహామనిషి మా బాలయ్య....

ఆయన ఎస్ అంటే ఎస్సే, నో అంటే నోనే!! ఇంకో మాట ఇంకో మినహాయింపు ఏం వుండదు, చెప్పింది చేస్తారు, చేయడానికి ఎంతదూరం అయినా వెళ్తారు, 

ఆయనకి ఒక మనిషి నచ్చితే, ఆయన ఒక మనిషిని నమ్మితే, ఇక ఆయనకి ఆ మనిషి చిన్న పెద్ద తేడాలు ఉండవ్, ఆ మనిషికి బాలయ్య గారు ఇచ్చే విలువ, స్థానం మరే మనిషి ఇంకో మనిషికి ఇవ్వలేరు!! అంత గొప్ప స్థానం ఇస్తారు....

ఎవరన్నా Help అడిగితే అది తన ఫ్యానా లేక ఇంకో హీరో ఫ్యానా అనే ఆలోచనా స్వార్ధం ఇవేం వుండవ్ మా బాలయ్యలో ఎవ్వరైనా తన వంతు సాయం చేయడానికి ఏమాత్రం వెనకడుగు వేయరు, చేసిన సాయం చెప్పుకుని అందరిలా సన్మానాలు చేయించుకోరు.... ఆయన వేరే లెవెల్ అంతే....

ఒక్కోసారి మా బాలయ్యలో ఉండే కొన్ని లక్షణాలు పెద్దాయన లో కూడా లేవేమో, వుండడం అసాధ్యమేమో అనిపిస్తది.... అంతే తానొక ప్రత్యేకం అంతే....

ఒక మనిషి ఇలా కూడా బ్రతుకుతారా, ఇలా పది రోజులు బతికినా చాలు అని ప్రతి మనిషి అనుకుని తీరేలా తన జీవితాన్ని ముక్కుసూటిగా, స్వచ్ఛంగా, నిష్కల్మషంగా, నిస్వార్ధంగా, నిజాయితీ, నిబ్బరంగా, నిక్కచ్చిగా, నిరాడంబరంగా, నిగర్విగా, నిర్మలంగా, నిశ్చింతగా తనకు నచ్చినట్టుగా తాను బతుకుతూ, ఎందరినో బతికిస్తూ, ఎందరికో స్పూర్తినిస్తూ, ఎంతోమందికి పాజిటివ్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తూ, 

"LIVE LIFE LIKE NBK STYLE" అని ఓ ముద్ర వేసేసి, ఇదిరా జీవితం, బతికితే బాలయ్యలా బతకాలిరా అనుకునేలా చేసిన One And Only Real Hero మా బాలయ్య.... 

ఆయన వ్యక్తిత్వాన్ని తనతో పరిచయం వున్న ప్రతీ మనిషీ అనుభూతి చెందేలా చేయగల గొప్ప మహోన్నత వ్యక్తిత్వం కలిగిన పసి బాలుడి నిష్కల్మష పసిడితత్వం మా బాలయ్య సొంతం....

ఆయనలా బతకాలని ఎందరో అనుకుంటారు, కానీ అబ్బే అది ఇంకా మరెవ్వరి వల్ల కాదు!! అలా హృదయపూర్వకంగా బ్రతకడం జీవితాన్ని గడపడం ఆయనొక్కరికే సాధ్యం, అందుకే "జై బాలయ్య" అయ్యారు....

ఇలాగే ఇంతే ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా  హృదయపూర్వకంగా కలకాలం కల్మషం లేని స్వచ్ఛమైన మనిషిగా సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు బాలయ్య గారు....    ....అభిలాష

- Raghoo Karanam (FB page)

name Raghavendra Prasad (Raghu sir)

sr NBK fan in x-roads (Ananthapur)

maths teacher, taking tuitions now

earlier he used to run Jr college near NBK Estate Musheerabad

(functions lo PK songs strictly not allowed, I will break tape recorder but will not play his songs ani students tho annadu, imagine it was at Khushi time😊)

I wish Chandas gets his interview... one day

Link to comment
Share on other sites

నమ్మక ద్రోహం అంటే...

చంద్రబాబు పైన కచ్చితో 1999 లో తెలంగాణ చిచ్చు పెట్టి, కృష్ణ నది మిగులు జలాలపైన ఆంధ్ర ప్రదేశ్ కు హక్కు లేదని లేఖ ఇచ్చి, 2004 & 2009 ఎన్నికల మేనిఫెస్టో లో తెలంగాణ ఇస్తాము అని పెట్టిన వైఎస్ చేసింది దారుణమైన ద్రోహం

"ప్రజారాజ్యం అనే పార్టీ పెట్టి, పూలె గాంధీ బొమ్మలు వెనకనే పెట్టుకుని టికెట్లు అమ్ముకుని కోట్లు కొల్లగొట్టి, నమ్మిన కోట్ల మందిని నట్టేట ముంచి, కాంగ్రెస్ కు అమ్ముడు పోయాడు చూడు... అది అసలు సిసలు నమ్మక ద్రోహం అంటే"

సమైక్యఆంధ్ర అని సభలు పెట్టి, మభ్య పెట్టి, ఒక్క అఖిల పక్షం లో కూడా సమైక్యఆంధ్ర కు అనుకూలం గా తీర్మానం చెయ్యకుండా బెయిలు కోసం ఆంధ్రా ముక్కలు అయినా పర్లేదు అని సోనియా కాళ్ళ దగ్గర పడ్డాడు చూడు అదే ఆంధ్రాకు జరిగిన మహా నమ్మక ద్రోహం. 

ముందు మనకి జరిగిన ద్రోహం గురించి ఆలోచించకుండా ఎన్టీఆర్ & చంద్రబాబు ల కుటుంబ గొడవని ఇంకా మన నెత్తి మీద మనమే రుద్దుకోవడం "మనకి మనమే చేసుకుంటున్న "అత్యంత ప్రమాదకరమైన నమ్మక ద్రోహం" 

కుటుంబ విషయానికే వస్తే ఇక పవన్ కళ్యాణ్ & జగన్, షర్మిల ల గురించి పేజీలు పేజీలు వ్రాయొచ్చు. ఎందుకు ఆ విషయాలు గెలకడం లేదు అంటే వ్యక్తిగతాహం వేరు, వ్యవహారం వేరు అనే వ్యత్యాసం నాకు తెలుసు కాబట్టి. 

ఒక్క లైన్ లో చెప్పొచ్చు 
"పెళ్ళాం బిడ్డలకే న్యాయం చెయ్యలేని వాడు దేశానికి ఏం న్యాయం చేస్తాడు?" 
కానీ అనకపోవడం ఒకడి సంస్కారమే కానీ అబద్దం అని కానే కాదు. 

ఇపుడు మళ్ళీ అదే ద్రోహం మోడీ & షా బ్యాచ్ చేస్తున్నారు. చంద్రబాబు పైన మళ్ళీ కుట్ర...తద్వారా ఆంధ్రుల ను పాలించాలని మహా కుట్ర. అప్పుడు కాంగ్రెస్, ఇపుడు బిజెపి.

చంద్రబాబు అవిశ్వాస తీర్మానానికి సమాంతరంగా వైసిపి తీర్మానాన్ని పెట్టి చంద్రబాబు తీర్మానాన్ని పలచబరచడం

చంద్రబాబు మూడో కూటమికి కెసిఆర్ మూడో కూటమి తో చెక్ పెట్టాలనుకోవడం.

తెలుగు వాడికి తెలుగు వాళ్ళతోనే అడ్డుపుల్ల వేయిస్తూ, మన కళ్ళని మన వేలితోనే పొడిపించడం ఢిల్లీ విష వ్యూహం.

సమకాలీన రాజకీయ కొలమానాల ప్రకారం ఇది మామూలే కానీ అందులో కొద్దో గొప్ప మంచి చేసిన వాడు, మన కాళ్ళ మీద మనం నిలబడే అవకాశం ఇచ్చి మన కుటుంబాల ఆర్ధిక స్థాయిని పెంచాడు. ఆ ఒక్కటి చాలు నేను బాబు ను మెచ్చుకోవడానికి , మద్దతు ఇవ్వడానికి .

- Raghu Sir 

(2018)

Link to comment
Share on other sites

ఒక్కటి మాత్రం నిజం 

చంద్రబాబు ఉన్నంతవరకు 

చంద్రబాబు విలువ తెలియదు

బ్రతికుండగా మనిషి కష్టాన్ని గుర్తించం

జారిపోయిన తరువాత                                

అయ్యో పాపం అంటాము

శాయశక్తులా ఒంట్లో ఒపిక

ఉన్నంతవరకు రాష్ట్రం  రాష్ట్రం 

అంటునే ఉన్నాడు  

ఆయన విలువ మనకన్నా

బయట రాష్ట్రం వాళ్ళకే

బాగా తెలుస్తుంది. ఎందుకలా? 

మనలో లోపమా? 

లోపమే ఇగో లు ,కులం ,

పార్టీ ,స్వార్ధం  ,అవకాశవాదం

ఇవి నరనరనా జీర్ణం చేసుకొని

కళ్ళు కు పొరలు ఏర్పడి

ఆయన  గొప్పతనం మనకు

కనపడుటలేదు, ఆలోచించండి.

ఒక మనిషి మన గురించి

మన పిల్లల గురించి

గొడ్డులాగ కష్టపడుతుంటే

మనకు రాజకీయాలు కావాలా? 

మానవత్వం లేదా మనకు? 

మనుషులమే కాదా? 

ఆయనకు తిన్నది అరగక

పరిగెడుతున్నాడా,ఎవరిగురించి

మన గురించి ,మన పిల్లల భవిష్యత్తు

గురించే కదా?  ఆయన కూర్చోని తింటే

సరిపడా ఆస్తి ఉంది  మరి దేనికి ఆయనకు

ఈ కష్టం .  అవును ఆయనకి స్వార్ధం  ఉంది

ఈ ఆంధ్ర ప్రజల లో గొప్ప అభివృద్ధి కాముకుడు

అని,  వారి మనసులలో చిరస్ధాయి గా నిలిచి పోవాలని

చిన్న కోరిక  అదే ఆయన  వీక్ నెస్,  ఆ వీక్ నెస్ తోనే

మనం ఆడుకుంటున్నాము ,   ఆలోచించండి

కులం గోడలు బద్దలు కొడదాం,ఇగోలు ను వదిలిపెడదాం.

రాజకీయాలను పక్కన పెట్టి  అందమైన మన కలల సౌధం,

ఆంధ్ర రాజధాని అమరావతిని నిర్మించుకొని

మనిషికి ప్రాధమిక అవసరలైన  త్రాగునీరు ఆహారం ,విద్య,

వైద్య  , సాంకేతిక రంగాలలో అధ్భుతమైన పురోగతిని 

సాధించి మన పిల్లలకు మంచి భవిష్యత్తునిద్దాం 

మానవత్వంతో ఆలోచించండి  ముందడుగు వేయండి

జై ఆంధ్రప్రదేశ్  జై జై ఆంధ్రప్రదేశ్ 

జై అమరావతి జై జై అమరావతి

2017 - Raghu sir

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...