Jump to content

ఎంగిలి చేత్తో కాకిని తోలని జగన్


RamaSiddhu J

Recommended Posts

ఎంగిలి చేత్తో కాకిని తోలని జగన్
కడుపునిండా భోజనం పెట్టి పంపే చంద్రబాబు గారు

వైసిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఒక రాజకీయ పార్టీ. కానీ దాని ఆఫీస్ మాత్రం హైదరాబాదులోని బంజారాహిల్స్ ప్రాంతంలో లోటస్పాండ్ అనే చెరువు పక్కన ఉండేది. ఆఫీస్ అంటే ఏదో బిల్డింగ్ కాదు. జగన్ గారి ఇల్లే ఆఫీస్. జగన్ గారి ఇంటి ముందు భాగంలో జగన్ గారి కుటుంబం నివాసం ఉంటే వెనక భాగంలో ఆఫీస్ ఉండేది. 

ఏపీలో ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్న వైసీపీ పార్టీకి ఆఫీస్ హైదరాబాద్ లో ఉండటంతో అక్కడికి వెళ్లాలంటే చాలామందికి ఇబ్బంది అయ్యేది. అటు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం.. ఇటు రాయలసీమలోని చిత్తూరు, అనంతపురం.. మరోవైపు కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాల వంటి సుదూర ప్రాంతాల నుండి హైదరాబాద్ లోని లోటస్ పాండ్  ఆఫీస్ కి రావడం అంటే చాలా ఖర్చుతో పాటు ప్రయాసతో కూడుకున్న పని. 

ఆఫీస్ ఎలాగూ జగన్ గారికి సౌకర్యంగా ఉండటం కోసం హైదరాబాద్ లోనే తన ఇంటి వెనకే పెట్టుకున్నాడు. కానీ తనను చూడటం కోసమో లేక పార్టీ ఆఫీస్ లో పని నిమిత్తమో ఏపీలోని ఎంతో దూరాల నుండి ప్రయాణం చేసి వచ్చే వారి సంగతేంటి?? ఒక రాజకీయ పార్టీ అన్నాక అంత సుదూర ప్రాంతాల నుండి వచ్చే వారి సదుపాయాల గురించి ఆలోచించాలి కదా.. సదుపాయాల సంగతి తర్వాత కనీసం భోజన ఏర్పాట్లు అయినా చెయ్యాలి కదా! కానీ అంత దూరం నుండి వచ్చే వాళ్ళకి ఎప్పుడూ భోజనం పెట్టడం నేను చూడలేదు.. లోటస్ పాండ్ ఆఫీస్ లో భోజనం అంటే అందులో పని చేసే స్టాఫ్ కి, నాయకులకి, ఇంకా జర్నలిస్ట్ లకి.. అంతే.. మిగతా ఎవరు వచ్చినా కార్యకర్తలు, అభిమానులు ఎంతమంది వచ్చినా బయట హోటల్ లోనో లేక రోడ్డు పక్కన అమ్మే బిర్యానీనో తినాల్సిందే.. ఈ పోస్ట్ చదివే వైసీపీ అభిమానులకి చాలామందికి గుర్తుండే ఉంటుంది లోటస్ పాండ్ కి వచ్చే వాళ్ళు ఆఫీస్ ఎదురుగా రోడ్డు పక్కన అమ్మే బిర్యానీ తినేవాళ్ళు.. టేస్ట్ కూడా చాలా బాగుండేది.. నేను అక్కడ పని చేసినా ఆఫీస్ లో కంటే ఎక్కువగా ఆ రోడ్డు పక్కన బిర్యానీనే తినేవాడిని..

ఇకపోతే ఈమధ్య నేను ఒక పని మీద మంగళగిరి దగ్గరలోని టీడీపీ మెయిన్ ఆఫీస్ కి వెళ్ళాను. మా ఊరు నుండి బయల్దేరి బస్సులు మారుతూ టీడీపీ ఆఫీస్ కి వెళ్ళే సరికి చాలా టైం అయింది. ఆఫీస్ కి వెళ్ళగానే బాగా ఆకలి వేసేస్తుంది. వచ్చిన పని తర్వాత ముందు ఏమైనా తిందాం అని ఆఫీస్ బయట ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ షాప్ కి వెళ్ళాను. ఆ షాప్ బయట ఉన్న ఫ్రిడ్జ్ లో జున్ను తీసుకుంటూ అర్జెంట్ గా ఆకలి తీరడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి అన్నాను. ఆకలిగా ఉందా?? లోపల పెడతారు బాబు వెళ్ళు అంది ఆ షాప్ ఆవిడ.. అంటే నేను సడెన్ పని మీద వచ్చాలే, నేను వస్తున్నట్టు ఆఫీస్ లో ముందుగా ఇంటిమేట్ చెయ్యలేదు కాబట్టి నాకు ఫుడ్ ఉండదులే అని జున్ను తింటున్నాను. ఎవ్వరికైనా పెడతారు బాబు లోపల టోకెన్ ఇస్తారు తీసుకుని వెళ్లి తిను అంది. ఇలాంటివి ఎన్ని తింటే కడుపు నిండుతుందిలే అనుకుని జున్నుకి డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళాను.. టోకెన్ కోసం అటూ ఇటూ దిక్కులు చూసే పని లేకుండానే లోపలికి వెళ్ళగానే ఎదురుగా టోకెన్ ఇస్తున్నారు.. ముందుగా చెప్పలేదు కాబట్టి నాకు టోకెన్ ఇవ్వరేమో అని డౌట్ పడ్డాను.. కానీ అడగ్గానే టోకెన్ ఇచ్చారు.. టోకెన్ తీసుకుని వెనక వైపు భోజనాలు చేసే దగ్గరకి వెళ్ళాను. అప్పటికే చాలమంది తింటున్నారు. టోకెన్ ఇచ్చాక నాక్కూడా భోజనం పెట్టారు. వైట్ రైస్, టొమోటో చట్నీ, పప్పు, ములక్కాయ కర్రీ, సాంబార్, పెరుగు.. ఆహా ఎంత చక్కని రుచికరమైన భోజనమో.. బాగా ఆకలిగా ఉండటంతో పాటు రుచి కూడా బాగుండటంతో కాస్త ఎక్కువే తిన్నాను..

తినేటప్పుడు గుర్తొచ్చింది లోటస్ పాండ్ ఆఫీస్ కి టీడీపీ ఆఫీస్ కి తేడా ఏమిటో.. ఆఫీస్ కూడా ఎంత శుభ్రంగా, సిస్టమాటిక్ గా ఉందంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు టీ కాఫీ ఇవ్వడానికి స్టాఫ్ ఉన్నారు.. వాష్ రూమ్స్ అన్నీ వరల్డ్ క్లాస్ లెవెల్ లో శుభ్రంగా నీట్ గా ఉన్నాయి.. ఆఫీస్ చాంబర్స్ అన్నీ నాయకులకి తగ్గట్టు ఇరుకు లేకుండా స్పేసియస్ గా చాలా బాగున్నాయి..

నేను అంటున్నాను అని కాదు కానీ, తాడేపల్లి లోనే వైసీపీ ఆఫీస్ ఉంది కదా.. అక్కడికి ఒకసారి వెళ్లి మీరే చూడండి ఎలా ఉంటుందో.. వెళ్లిన వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదు.. అక్కడ మీటింగ్ పని మీద ఇంతమంది వస్తున్నారు అని ఏ నాయకుడైనా చెప్తే వాళ్ళకి మాత్రం ఏర్పాటు చేస్తారు.. ఆఫీస్ ఏమో భయంకరమైన ఇరుకు.. సిస్టమాటిక్ గా అసలే ఉండదు.. ఆ ఆఫీస్ చూడండి.. ఆ తర్వాత అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న టీడీపీ ఆఫీస్ కి వెళ్ళండి.. అక్కడ భోజనం చెయ్యండి.. ఆఫీస్ మొత్తం ఒక రౌండ్ తిరగండి.. అప్పుడు మీకే తెలుస్తుంది వరల్డ్ క్లాస్ లీడర్ కి మినిసిపాలిటీ లీడర్ కి తేడా ఏమిటో..

చంద్రబాబు గారు పేదల కడుపులు నింపే నాయకుడు కాబట్టి అన్న క్యాంటీన్ లాంటివి స్థాపిస్తే.. జగన్ కి తన కార్యకర్తలు అభిమానులు తినడం కూడా ఇష్టం ఉండదు కాబట్టి తన ఆఫీస్ కి వచ్చే వారికి కనీసం భోజనాలు కూడా పెట్టకపోవడంతో పాటు చంద్రబాబు గారు పేదల ఆకలి తీర్చడం కోసం పెట్టిన అన్న క్యాంటీన్లు కూడా ఎత్తేశాడు.. ఆయన తన డబ్బుతో పెట్టే అన్న క్యాంటీన్లను కూడా కూల్చేపిస్తున్నాడు..

జగన్ మోహన్ రెడ్డి గారు అత్యంత స్వార్థ పరుడు.. ఆయన తన సౌకర్యం వరకు చూసుకుంటాడు తప్ప ఇతరుల ఇబ్బందుల గురించి ఆలోచించడు.. అందుకే ఆఫీస్ తన ఇంటికి వెనకే పెట్టుకున్నాడు కానీ ఆఫీస్ కి వచ్చేవారికి కనీసం భోజనం కూడా పెట్టేవాడు కాదు..

Ajay Amruth  గారి వాలునుండి

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...