Jump to content

putta sudakar meda IT raids


Recommended Posts

తెదేపా అభ్యర్థి ఇంట్లో ఐటీ సోదాలు

3putta1a_1.jpg

ప్రొద్దుటూరు: తెదేపా అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లా మైదుకూరు తెదేపా అభ్యర్థి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో రెండు బృందాలు సుమారు గంట నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్‌ నివాసంలో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సమాచారం. ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండటంతో వారి సమక్షంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టు సమాచారం.

putta1a.jpg

ఇలాంటి దాడులకు భయపడను: పుట్టా
మరోవైపు, ఈ సోదాలను పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఖండించారు. తన ఇంటిపై కుట్ర పూరితంగానే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెదేపా నేతల ఇళ్లపై కావాలనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి లోబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయని, ఒక్క రూపాయి కూడా అవకతవకలు జరగలేదని స్పష్టంచేశారు. తెదేపా గెలుస్తుందనే భయంతోనే  జగన్‌, భాజపా కుమ్మక్కై కుట్రపూరితంగా తమను దెబ్బతీయాలనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆయన మీడియాకు చెప్పారు. ఐటీ దాడులు ఎన్ని చేసినా తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.

Link to comment
Share on other sites

టిడిపి నేతలు టార్గెట్ గా, మళ్ళీ విరుచుకుపడ్డ ఐటి... ఎన్నికల 10 రోజులు ముందు కూడా టార్గెట్....

Super User
03 April 2019
Hits: 5
 
itdaadulu-03042019.jpg
share.png

తెలుగుదేశం అభ్యర్థులే లక్ష్యంగా రాష్ట్రంలో ఆదాయ పన్ను శాఖ అధికారుల దాడుల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడప జిల్లా మైదుకూరు తెదేపా అభ్యర్థి, తితిదే ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో రెండు బృందాలు సుమారు గంట నుంచి సోదాలు కొనసాగిస్తున్నాయి. ఐటీ అధికారులు వచ్చిన సమయంలో పుట్టా సుధాకర్‌యాదవ్‌ నివాసంలో లేరు. ఆయన మైదుకూరు ఎన్నికల ప్రచారానికి వెళ్లినట్టు సమాచారం. ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉండటంతో వారి సమక్షంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు. కడప నుంచి వెళ్లిన ఐటీ అధికారి మహదేశ్‌ ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలోనే తనిఖీలు చేస్తున్నట్టు అధికారులు చెప్పినట్టు సమాచారం.

 

game 27032019

మరోవైపు, ఈ సోదాలను పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఖండించారు. తన ఇంటిపై కుట్ర పూరితంగానే దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెదేపా నేతల ఇళ్లపై కావాలనే దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. చట్టానికి లోబడే తమ కంపెనీలు పనిచేస్తున్నాయని, ఒక్క రూపాయి కూడా అవకతవకలు జరగలేదని స్పష్టంచేశారు. తెదేపా గెలుస్తుందనే భయంతోనే జగన్‌, భాజపా కుమ్మక్కై కుట్రపూరితంగా తమను దెబ్బతీయాలనే ఇలాంటి దాడులు చేయిస్తున్నారని ఆయన మీడియాకు చెప్పారు. ఐటీ దాడులు ఎన్ని చేసినా తాను భయపడే ప్రసక్తే లేదన్నారు.

game 27032019

ఇది ఇలా ఉంటే, పుట్టా పై మరో దాడి కూడా జరుగుతుంది. ఓటర్లను బోల్తా కొట్టించేందుకు కడప జిల్లాలో వైసీపీ ప్రయత్నిస్తోందంటూ మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. నమూనా బ్యాలెట్‌ను రూపొందించి వైసీపీ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అభ్యర్థుల జాబితా ప్రకారం టీడీపీ అభ్యర్థికి రెండవ నంబర్‌ను, వైసీపీ అభ్యర్థికి నాలుగవ నంబర్‌ను ఈసీ కేటాయించింది. అయితే వైసీపీ రూపొందించిన నమూనా బ్యాలెట్‌లో మాత్రం టీడీపీ అభ్యర్థి నంబర్‌ను మూడుగా చూపించారు. దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన పుట్టా, వైసీపీ నేతలపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 
Advertisements
 

Add comment

Link to comment
Share on other sites

ఐటీ అధికారుల్ని నిలదీసిన సీఎం రమేశ్

3cmramesh1a_1.jpg

ప్రొద్దుటూరు: కడప జిలా మైదుకూరు తెదేపా అభ్యర్థి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంట్లో ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాలు ముగిశాయి. దాదాపు రెండు గంటల పాటు కడప, ప్రొద్దుటూరుకు చెందిన ఐటీ అధికారులు పుట్టా నివాసంలో సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు, వస్తువులు, నగదు సైతం లభ్యం కాకపోవడంతో వారు ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే, అధికారులు అక్కడి నుంచి వెళ్లే సమయానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ పుట్టా నివాసానికి చేరుకున్నారు. అధికారులు తనిఖీలు చేసే గదికి నేరుగా చేరుకొని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా అభ్యర్థిగా నామినేషన్‌ వేసి ప్రచారం చేసుకుంటున్న సమయంలో ఎందుకు రావాల్సి వచ్చిందని వారిని ప్రశ్నించారు. ఎవరు పంపించారు.. అంతా వెతికారు గదా.. మీకేం దొరికిందో మీడియాకు చెప్పండి అంటూ  నిలదీశారు. దీంతో అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.  

మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఐటీ శాఖ అధికారులను కావాలనే తమ ఇళ్లపై దాడులు చేయిస్తోందని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. తెదేపా కార్యకర్తలు పుట్టా నివాసానికి భారీగా చేరుకొని ఐటీ అధికారుల తీరుకు నిరసనగా ధర్నా చేపట్టారు. ఐటీ దాడులు రాజకీయ కుట్రే అంటూ విమర్శలు చేశారు. జగన్‌, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

 
 
Tags :
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...