Jump to content

Rafale Scam Exposed


Yaswanth526

Recommended Posts

ఎఫ్‌16తో పోరాడేందుకు రఫేల్‌ అవసరం

రక్షణ ఒప్పందాలపై న్యాయ సమీక్ష తగదన్న కేంద్రం

కేసు విచారణ మార్చి 14కు వాయిదా

6brk-rafale-deal.jpg

దిల్లీ: రఫేల్‌ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌, పిటిషనర్ల మధ్య వాదోపవాదాలు జరిగాయి. రఫేల్‌ విషయంలో కేంద్రం కోర్టుకు తప్పుదోవ పట్టిస్తోందని పిటిషనర్లలో ఒకరైన సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ విమర్శించారు. అయితే ఎఫ్‌ 16 లాంటి యుద్ధ విమానాల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు రఫేల్‌ అత్యవసరమని ఏజీ వేణుగోపాల్‌ వివరించారు. వాద, ప్రతివాదనలు విన్న అనంతరం ఈ కేసులో తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

రఫేల్‌ తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై ఈ ఉదయం ధర్మాసనం విచారణ ప్రారంభించింది. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించిన కీలక పత్రాల్లో కొన్ని రక్షణ శాఖ నుంచి చోరీకి గురయ్యాయని ఏజీ కోర్టుకు తెలిపారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ గొగొయ్‌ స్పందిస్తూ.. చోరీపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని ఏజీని ఆదేశించారు. అయితే ఈ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తే.. దేశానికి భారీ నష్టం కలుగుతుందని చెప్పారు. అందుకే ఇప్పటివరకు ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయలేదన్నారు. అంతర్గత దర్యాప్తునకు యోచిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా భారత్‌, పాక్‌ మధ్య ఇటీవల చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులను కూడా ఏజీ వేణుగోపాల్ ప్రస్తావించారు. ‘ఇటీవల ఎఫ్‌ 16 యుద్ధవిమానాలను మన దేశంపై దాడికి వచ్చాయి. అలాంటి వాటి నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు రఫేల్‌ విమానాలు అవసరం. ఎఫ్‌ 16 యుద్ధ విమానాలపై మిగ్‌ 21లు అద్భుతంగా పోరాడినా.. రఫేల్‌ ఆవశ్యకత ఎంతైనా ఉంది. సెప్టెంబరు నాటికి భారత అమ్ముల పొదిలోకి రఫేల్‌ చేరుతుంది’ అని వేణుగోపాల్‌ తెలిపారు. రక్షణ శాఖకు సంబంధించిన ఒప్పందాలపై న్యాయపరమైన సమీక్ష చేయడం తగదని ఏజీ అన్నారు.

రఫేల్‌ ఒప్పంద ప్రక్రియను సందేహించడానికి ఎటువంటి ప్రాతిపదిక లేదంటూ కేంద్ర ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ గతేడాది డిసెంబరు 14న సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఒప్పందాన్ని సవాలు చేస్తూ వచ్చిన అన్ని పిటిషన్లను కొట్టి వేసింది. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పలువురు రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా, న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌, అరుణ్‌ శౌరీ కూడా ఉన్నారు. ఈ పిటిషన్లపై నేడు న్యాయస్థానం విచారణ చేపట్టింది.

 
Link to comment
Share on other sites

  • Replies 90
  • Created
  • Last Reply

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...