Jump to content

TDP to contest elections from Odisha


sonykongara

Recommended Posts

  • Replies 65
  • Created
  • Last Reply
ఒడిశా ఎన్నికల్లో తెదేపా పోటీ

0245220912TDP-ODISHAA.jpg

అమరావతి: జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ.. ఇతర రాష్ట్రాల్లోనూ పోటీకి సిద్ధమవుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే రాష్ట్రాలపై దృష్టి సారించింది. వచ్చే ఎన్నికల్లో పొరుగు రాష్ట్రం ఒడిశాలో పోటీకి ప్రణాళికలు రచిస్తూ క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై కసరత్తు ప్రారంభించింది.

ఒడిశాలోని బరంపురం, కటక్‌, రాయగడ, కోరాపుట్‌ ప్రాంతాల్లో తెలుగువారు అధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పోటీ చేయాలంటూ ఎప్పటి నుంచో స్థానికుల నుంచి తెదేపాకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. 1999 వరద సమయంలో తీర ప్రాంత ప్రజలను ఆదుకోవడంలో సీఎంగా ఉన్న చంద్రబాబు ఎంతో చొరవ చూపించారు. అప్పటి నుంచి ఆయా ప్రాంతాల్లో తెదేపా పట్ల సానుభూతి ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయా ప్రాంతాల్లోని దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని పార్టీ సిద్ధమవుతోంది.

తెలుగు ఓటర్లు అధికంగా ఉన్న రాయగడ, కోరాపుట్‌, మల్కన్‌గిరి, గజపతి, గంజాం, నవరంగపూర్‌ జిల్లాల్లో తెదేపా పోటీ చేసే అవకాశాలున్నాయి. 2000 సంవత్సరంలోనే ఒడిశాలో తెదేపా పోటీ చేయాల్సిందని.. 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తామని ఒడిశాకు చెందిన తెదేపా నేత రాజేశ్‌ పుత్ర తెలిపారు. ఒడిశాను కూడా తన దార్శనికతతో అభివృద్ధి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన చెప్పారు. వచ్చే ఎన్నికలకు సంబంధించి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెదేపా సర్వే జరుగుతోందని, 147 స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామని రాజేశ్‌పుత్ర వివరించారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...