Jump to content

Supreme court Chief Justice stopped for Amitshah


swarnandhra

Recommended Posts

అమిత్ షా కోసం చీఫ్ జస్టిన్‌ను నిలిపివేశారు!
23-10-2018 23:09:59
 
636759331767524969.jpg
గువాహటి: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కోసం  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ను నిలిపివేసిన ఘటన అసోంలో జరిగింది. దుర్గాష్టమి సందర్భంగా గొగోయ్ అక్టోబర్ 17న అసోంలోని కామాఖ్య ఆలయానికి వెళ్లారు. అయితే ఆలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉండటంలో రంజన్ గొగోయ్‌ను ఆలయంలోకి అనుమతించలేదు. అంతేకాదు అమిత్ షా వెళ్లే వరకు ఆయనను వేచివుండేలా చేశారు.
 
అంతకుముందు చీఫ్ జస్టిస్ కారు వస్తున్న సమయంలోనూ అగౌరవంగా ప్రవర్తించారు. దీంతో ప్రభుత్వం ముగ్గురు సీనియర్ అధికారులపై వేటు వేసింది. ప్రొటోకాల్ ధిక్కరించి, చీఫ్ జస్టిస్‌కు భద్రతా ఏర్పాట్లు చేయడంలో వైఫల్యం చెందినందుకు  అడిషనల్ డిప్యూటీ కమిషనర్ పులక్ మహంతాతోపాటు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ భన్వర్‌లాల్ మీనా, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత ప్రతిమ్ కథకోతియాను సస్పెండ్ చేశారు. 
 
గొగోయ్‌ను ఆలయంలోకి అనుమతించకపోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...