Jump to content

Latest TS news


baggie

Recommended Posts

కేసీఆర్‌, కేటీఆర్‌పై వాట్సాప్‌‌లో అనుచిత వ్యాఖ్యలు, ఇద్దరి అరెస్టు
22-10-2018 12:53:52
 
636758097088331938.jpg
హైదరాబాద్: సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై సోషల్‌ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరిని బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఫిలింనగర్‌కు చెందిన మల్లేష్‌, డాన్‌ రాజులు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌పై వాయిస్‌ మెసేజ్‌ రూపంలో వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశారు. అంతేకాకుండా వారి ఫొటోలను మార్ఫింగ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనికి కారణమైన మల్లేష్‌, డాన్‌ రాజులను అరెస్టు చేశారు.
Link to comment
Share on other sites

‘100 సీట్లు కాదు.. కేసీఆర్‌కు 104 జ్వరం వస్తుంది’

031104022VIJAYA100A.JPG

హైదరాబాద్‌: తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచారంలో దూసుకుపోతున్న అధికార, ప్రతిపక్షపార్టీల నేతలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌పై వ్యంగ్య బాణాలు సంధించారు. ఎన్నికల్లో తెరాసకు వంద సీట్లు రావడం కాదు.. ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం కేసీఆర్‌కు 104 జ్వరం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయశాంతి ఓ ప్రకటన విడుదల చేశారు. మహాకూటమి పొత్తుల్లో భాగంగా భాగస్వామ్య పార్టీలు గెలిచేందుకు స్థానాలను అడగాలి తప్ప కాంగ్రెస్‌ గెలిచే స్థానాలను అడగొద్దని ఆమె సూచించారు.

Link to comment
Share on other sites

హద్దులు దాటుతున్న అభిమానం! 
సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచార యుద్ధం 
హోరెత్తుతున్న విమర్శలు 
పోలీసుల నిఘా 
ఈనాడు, హైదరాబాద్‌ 
hyd-gen55a.jpg

సామాజిక మాధ్యమాల వేదికగా రాజకీయ యుద్ధం సాగుతోంది. అభిమానం హద్దులు దాటుతోంది. ప్రచారంలో విమర్శలు పరాకాష్టకు చేరుతున్నాయి. ప్రతి రాజకీయపార్టీ, పోటీలో నిలిచే అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకున్నాయి. ‘నువ్వొకటంటే.. నేను పదంటా.. మీ నుంచి పది విమర్శలు వస్తే.. మేం వంద చేస్తాం.’ అన్న రీతిలో ఉంది వ్యవహారం. ఎదుటివారిని విమర్శించడమే లక్ష్యంగా అభిమానులు మరింత చెలరేగుతున్నారు. మార్ఫింగ్‌ ఫొటోలతో ప్రత్యర్థులపై ఘాటైన విమర్శలకు దిగుతున్నారు. గొంతు మార్చి అసభ్య పదాలను చేర్చుతున్నారు. నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతాలతో మరికొందరు రాసేందుకు వీల్లేని భాషను ప్రచారానికి ఉపయోగిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కీలకమైన నాయకుల ఫొటోల స్థానంలో ఇబ్బందికరమైన చిత్రాలను ఉంచి అభ్యంతరœకర వ్యాఖ్యలు ఉంచుతున్నారు. అభ్యర్థులను ఇరుకున పెట్టేలా తీవ్రమైన పదాలతో పోస్టింగ్స్‌ చేస్తున్నారు.

గొడవలకు కారణమవుతూ.. 
నగరంలోని పలు బస్తీల్లో సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్స్‌ యువత మధ్య గొడవలకు కారణమవుతున్నాయి. ఇటీవల బంజారాహిల్స్‌లో ఇరుపార్టీల కార్యకర్తలు బాహాబాహీ తలపడ్డారు. ప్రశాంతంగా ఉండే బస్తీలో తమ అభిమానం చాటేందుకు ఇరువైపుల కార్యకర్తలు ఉంచిన పోస్టింగ్స్‌ దీనికి కారణమని పోలీసులు గుర్తించారు. చదువుకుంటున్న యువకులు కావడంతో ఇరువర్గాలను మందలించి వదిలేసినట్లు సమాచారం. నగర శివారు నార్సింగ్‌లో వాట్సాప్‌ గ్రూపులో చక్కర్లు కొడుతున్న సందేశం ప్రత్యర్థులు వల్లనేనంటూ ఓ పార్టీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ వర్గ మనోభావాలు దెబ్బతీసేలా నకిలీ ఫొటోలను ఉంచి ప్రచారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో పోలీసు నిఘా పెంచినట్లు సమాచారం. ఎన్నికల వేళ వర్గాలుగా విడిపోయి మరీ సామాజిక మాధ్యమాల్లో విమర్శల యుద్ధానికి తెరలేపారు. పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.

అదుపుతప్పితే అరదండాలే 
శనివారం నగరంలో ముగ్గురు యువకులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ఫిల్మ్‌నగర్‌కు చెందిన డాన్‌రాజు, మల్లేష్‌లపై బంజారాహిల్స్‌ ఠాణాలో కేసు నమోదైంది. కేసీఆర్‌పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నిజాంపేటకు చెందిన దూళిపాళ్ల రాజేష్‌ను బాచుపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ట్రోలింగ్‌ అయ్యే విషయాలు విద్వేషాలను రెచ్చగొడతాయని పోలీసులు ఆందోళన చెందుతున్నారు. మూడు కమిషనరేట్‌ల పరిధిలోని సోషల్‌ మీడియా విభాగాలను అప్రమత్తంచేశారు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ తదితర గ్రూపుల్లో ట్రోల్‌ అవుతున్న అంశాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినేలా పోస్టింగ్స్‌ పెట్టినా, నకిలీ సమాచారం ఉంచినా కేసులు పెట్టి అరెస్ట్‌ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...