Jump to content

Hindutvam


MSDTarak

Recommended Posts

Courtesy : Kiran Mva garu ....

నువ్వు హిందువువే !!!

1. నేను దేవుడిని నమ్ముతాను – మంచిది, నువ్వు ఆస్తికుడివి, హిందువువి
2. నేను దేవుడిని నమ్మను – ఏమి ఫరవాలేదు, నువ్వు నాస్తికుడివి అయినా హిందువువి
3. నేను విగ్రహారాధన చేస్తాను – నువ్వు సాకార ఉపాసన చేస్తున్నావు, నువ్వు హిందువువి
4. నేను విగ్రహాల జోలికి వెళ్ళను, కానీ దేవుడు ఉన్నాడు అని నమ్ముతాను, అతడికి రూపం వుండదు- మంచిది, నివ్వు నిర్గుణ నిరాకార ఉపాసన చేస్తున్నావు, నువ్వు హిందువువి.
5. నాకు హైందవంలో ఈ విషయం నచ్చలేదు – విమర్శించు, తర్కించు, శోధించు, నిజం తెలుసుకో, నువ్వు హిందువువి
6. నేను వాంగ్మయంలో చెప్పిన విషయాన్ని నమ్ముతాను – తప్పక ఉద్ధరింపబడతావు. నువ్వు హిందువువి
7. నాకు భగవద్గీత నచ్చింది. అది మాత్రమె చదువుతాను- భగవంతుడు స్వయంగా చెప్పిన విషయాలను పాటించడం కన్నా గొప్ప విషయం ఏముంది. నువ్వు హిందువువి.
8. నాకు ఉపనిషత్తుల సారం నచ్చింది, పురాణాలు నచ్చాయి – తప్పక తెలుసుకో. పరమ సత్యాలు ఋషులు అందించారు. ఆస్వాదించు. నువ్వు హిందువువి
9. నేను శూద్రుడిని. అవేవో పుస్తకాలలో మమ్మల్ని నిరసించారు – ఎవరు చెప్పారు? నువ్వు చదివావా? నీకున్న గొప్పదనం ఏమిటో తెలుసా. మిగిలిన ద్విజులలాగ నువ్వు ఉపాసనలు చెయ్యక్కర్లేదు. కేవలం భక్తితో ముక్తిని సాధించగలవు. నువ్వు హిందువువి.
10. నేను పంచముడిని. నేనసల హిందువునా? – పంచముడు అన్న పదం వేదంలో లేదు. నిన్ను ఎవరో తప్పుదోవ పట్టించారు. ఉన్నవి నాలుగు వర్ణాలే. మధ్యలో కొందరు స్వార్ధపరులు నిన్ను ఏదో మిషతో వేరు చేసారు. కానీ ఎందరో మహానుభావులు అటువంటి చెత్తను కడిగేశారు. అయినా నువ్వు హిందువువి
11. నేను పుస్తకాలు చదవలేను. ఏదో దేవుడిని స్మరిస్తాను – నువ్వు భక్తి యోగంలో ఉన్నావు. నువ్వు హిందువువి.
12. ఈ భక్తి భుక్తి నాకు తెలియవు. నేను చేసే పని నమ్ముతాను – నువ్వు కర్మ యోగాన్ని నమ్ముతున్నావు. నువ్వు హిందువువి.
13. నాకు ఈ విషయాలన్నీ తెలీవు. మనిషిగా బ్రతుకుతాను, ఆనందంగా నాకు తోచినట్టు జీవిస్తాను. – నువ్వు దేవుడిని నమ్మకపోతే నరకం అని చెప్పదు మన ధర్మం. నీ ఇష్టం వచ్చినట్టు హాయిగా వుండు. ఎందుకంటె నువ్వు హిందువువి.
14. నేను ఈ ప్రాపంచిక విషయాలు పట్టించుకోను, నాకు స్వర్గం కావాలి – దానికేమి భాగ్యం. మంచిగా వుండు, మంచి కర్మలు చెయ్యి. నీకు రావలసిన స్వర్గం నీకు వస్తుంది. ఎందుకంటె నువ్వు హిందువువి.
15. నేను దేవుడు మొక్కలలో పక్షులలో ఉంటాడని నమ్ముతాను – ఏమీ ఫరవాలేదు. నువ్వు ప్రకృతి ఆరాధకుడివి. ప్రకృతి కూడా దైవమె. నువ్వు హిందువువి.
16. అందరిలోనూ దేవుడు ఉన్నాడని నమ్ముతాను. మనమంతా దైవరూపాలు – నిజం. నువ్వు అద్వైతంలో ఉన్నావు. నువ్వు హిందువువి
17. నాకు స్వర్గం కావాలి. 72 కన్యలు కావాలి – ఇక్కడున్న జీవితం మంచిగా గడుపు. నీకు నీ కర్మ నీ స్థానం ప్రసాదిస్తుంది. నువ్వు హిందువువి.
18. నాకు గురువుల మీద నమ్మకం లేదు. నా ప్రయత్నం నేను చేస్తాను – తప్పకుండా చెయ్యి. అవసరమైతే గురువే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకంటె నువ్వు హిందువువి.
19. నాకు ఆడవారిలో అమ్మ కనబడుతుంది. – నువ్వు సరైన అమ్మ ఉపాసకుడివి- నువ్వు హిందువువి.
20. నాకు అందరూ ఒక్కటే – అద్భుతం. వసుధైక కుటుంబం గురించి నీకు సరైన అవగాహన వుంది. ఎందుకంటె నువ్వు హిందువువి.
21. ఏమిటిన్ని పండుగలు. ఇవన్నీ నేను పాటించను. మరొక సెలవ వస్తోంది. ఆనందంగా వుండు. ఆనందాన్ని పంచు. నువ్వు హిందువువి.
22. నాకు ఈ నియమాలు వ్రతాలు తెలియవు, నాకు పాటించే తీరిక లేదు. – అయినంత మాత్రాన నువ్వు మనిషివి కావా. నువ్వు హిందువువి.
23. నాకు గుడులలో దేవుడు కనబడడు – నీకు ఎక్కడ కనబడితే అక్కడకే వెళ్ళు. మనుషులో ప్రకృతిలో, సేవలో ఎక్కడ లేడు దేవుడు. నువ్వు హిందువువి.
24. నాకు సంబంధించి నా జీవన విధానమే నా మతం. ఇక్కడ కొన్ని నియమాలు పెట్టుకుని గిరి గీసుకుని కూర్చోవడం ఇష్టం లేదు. నిన్ను ఎవడూ ఇలా ఉండమని నిర్బంధించడు. ఎలా చేస్తే ఇహపరాలు వస్తాయో చెబుతారు తప్ప నిన్ను ఒత్తిడి చెయ్యరు. ఎందుకంటె మనం హిందువులం.
25. నాకు నా తల్లిదండ్రులే దేవుళ్ళు- నిజమే. ఇదే వేదం కూడా చెబుతోంది. తల్లితండ్రులను మించిన దైవం లేరని. కాబట్టి నువ్వు హిందువువే.
26. నా పద్ధతులు నాకున్నాయి. నేననుకున్నట్టు బ్రతుకుతాను. ఎవడినో గౌరవించడం నాకు ఇష్టం లేదు. – సమాజంలో ఎలా ఉండాలో అలా ఉండు. ఎవరికి గౌరవం ఇవ్వాలనిపిస్తుందో, వారినే గౌరవించు. తప్ప పక్కవారిని తక్కువ చెయ్యకు, ఎందుకంటె నువ్వు హిందువువి.
27. నన్ను చిన్నప్పటి నుండి అణగదోక్కారు. నేను హిందువును ఎట్లైత? – తొక్కింది ఎవరు మనుషులు. నీకు వీరితో ఏమిటి సంబంధం. వారు ఒక మతానికి ప్రతినిధులు కారే. వారిని పక్కన పెట్టు. మనిషిని మనిషిగా చూడగలగుతున్నావు. అంటే నువ్వు హిందువువి.
28. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. ఎవరికి మొక్కాలో తెలియక మొత్తం వదిలేసాను – నీకు పంచభక్ష్య పరమాన్నాలు ఉన్నాయి. ఏది కావాలో అది తిను. నీకు ఏ దేవుడు నచ్చాడో ఆ ఉపాసన చెయ్యి. నువ్వు హిందువువి.
29. పక్క మతం అక్కడకు వెళ్తే స్వర్గం అంటోంది. మరి ఇక్కడ? – స్కూల్ లో జాయిన్ అయితే పాస్ చేస్తాను అంటే అది ఎంత దౌర్భాగ్యమైన స్కూలో తెలుసుకో. ఏ స్కూలైనా చదవాలి, ఉత్తీర్ణత సాధించాలి. నీకు అదే స్వర్గం ఇక్కడ ఉండి సరిగ్గా బ్రతికితే దొరుకుతుంది కదా? మతవ్యభిచారుల వలలో పడకు. అది వారి జీవనభ్రుతి. నీది జీవన విధానం. ఎందుకంటె నువ్వు హిందువువి. నీ తాత హిందువు, నీ ముత్తాత హిందువు, నీ ముత్తాతల ముత్తాత హిందువు. అంటే వీరంతా మూర్ఖులా? కాదు . నీలోను ప్రవహించేది వారి రక్తం. నువ్వు నివసించేది వారున్న చోటే. దుమ్ము పట్టిందని ఇల్లు ఖాళీ చేస్తావా? శుభ్రం చేసుకుని ఉండడం లేదా? దూరపు కొండలు నునుపు. ఉన్నచోట నిలబడి సాధించు. ఎందుకంటె నువ్వు హిందువువి
30. గాయత్రి మంత్రం చదవకపోతే హిందువు కాదట కదా? మరి నేను చదవను. – భోజనం చేస్తే బలం వస్తుంది. డబ్బు సంపాదిస్తే దాచుకుంటే ముందు ఉపయోగపడుతుంది. మంత్రం ఉపాసన చేస్తే శ్రేయస్సు కలుగుతుంది. తప్ప చెయ్యకపోతే నువ్వు మనిషివి కాకపోవు, డబ్బు దాచుకోక పోతే జీవించనూలేకపోలేవు. చేసినా చెయ్యక పోయినా నువ్వు హిందువువి.

కొందరు గొర్రెలు, పందులు మనలో మనకు మీరు ఇది చెయ్యకపోతే హిందువులు కారు అని విషం నూరిపోస్తున్నారు. వారికి బయట లభించిన సమాచారంతో కొంత నా అనుభవం కలిపి రాసిన టపా. ఇంకా ఎన్నో ప్రశ్నలు అన్నింటికీ ఒక్కటే సమాధానం. హిందుత్వం మతం కాదు, ఒక జీవన విధానం. నువ్వు పాటించు పాటించకపో, నువ్వు మాత్రం హిందువువే.

!! ఓం నమో వేంకటేశాయ !! 
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...