Jump to content

krishna politics


Recommended Posts

జలీల్‌ఖాన్‌కు బదులు ఆయన కూతురు.. కొడాలి నానిపై ఎవరు?
25-06-2018 11:38:46
 
636655235267425059.jpg
  • టీడీపీలో కొన్నిచోట్ల కనిపించని గెలుపు దీమా
  • ఎవరి వల్ల పార్టీకి నష్టం?
  • కొందరు ప్రజాప్రతినిధులపై ప్రజలు విసుగుతో ఉన్నారా?
  • జిల్లాలో ఐదు నియోజకవర్గాలపై అధిష్ఠానం ప్రత్యేక దృష్టి
  • 27న యనమల సమీక్ష
సంక్షేమం.. ప్రజల సంతృప్తి ఓకే. డెల్టా రైతుల్లో సంతోషమూ సరే.. తలసరి ఆదాయంలో తిరుగే లేదు. ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణలు, పచ్చదనం, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న విమానాశ్రయం.. అంతా బాగానే ఉంది. అయినా ఏ మూలో కాస్త భయం. జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామన్న ధీమా టీడీపీ నేతల్లో కనిపించట్లేదు. ఎక్కడుంది లోపం...? ఎవరి వల్ల పార్టీకి నష్టం? ఇప్పుడు టీడీపీ ముందున్న ప్రశ్నలివి. 2019 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి రకరకాల సర్వేల ద్వారా జిల్లా పరిస్థితులపై అధ్యయనం చేసిన పార్టీ అధిష్ఠానం ఇప్పుడిక తన వద్ద ఉన్న సమాచారంతో రంగంలోకి దిగుతోంది. జూన్‌ 27న జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు.
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
సంక్షేమ పథకాల పట్ల ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. డెల్టాకు సకాలంలో నీరివ్వడంతో రైతుల ముఖంలో ఆనందం తాండవిస్తోంది. తలసరి ఆదాయంలో ‘కృష్ణా’ దేశంలోనే టాప్‌ టెన్‌లో ఉంది. ఫ్లైఓవర్లు, రోడ్ల విస్తరణలు, ఎటు చూసినా పచ్చని గ్రీనరీ, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న గన్నవరం విమానాశ్రయం.. అంతా బాగానే ఉన్నా గెలుస్తామన్న ధీమా నేతల్లో కనిపించట్లేదు. మరిఎక్కడుంది లోపం. ..? ఎవరి వల్ల పార్టీకి నష్టం? ఎమ్మెల్యేలు, నేతలపై ఎక్కడైనా అసంతృప్తి ఉందా? 2019 ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయడానికి రకరకాల సర్వేల ద్వారా జిల్లా పరిస్థితులపై అధ్యయనం చేసిన టీడీపీ అధిష్ఠానం తన వద్ద ఉన్న సమాచారంతో రంగంలోకి దిగుతోంది. జూన్‌ 27న జిల్లా ఇన్‌చార్జి మంత్రి యనమల రామకృష్ణుడు జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఆ తరువాత నెలాఖరులో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో మరోసారి సమీక్ష జరుగుతుంది. అప్పుడు కూడా ముఖాముఖి సమావేశాలు ఉంటాయి. అయితే, జిల్లాలోని ఐదు నియోజక వర్గాల్లో పార్టీ గెలుపుపై వ్యక్తమవుతున్న అనుమానాలు అధిష్టానాన్ని కలవరపరుస్తోంది.
 
గెలుపే ధ్యేయంగా..
2019 ఎన్నికల్లో జిల్లాలోని అన్ని సీట్లను గెలుచుకోవాలని టీడీపీ అధిష్టానం పట్టుదలతో ఉంది. 2014 ఎన్నికల్లో జిల్లాలో టీడీపీ పది సీట్లు గెలుచుకోగా, మిత్రపక్షమైన బీజేపీ ఒక సీటు గెలుచుకుంది. విజయవాడ, మచిలీపట్నం పార్లమెంట్‌ సీట్లను టీడీపీ గెలుచుకుంది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను ఉపయోగించుకుని రాబోయే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలవాలని చంద్రబాబు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు సర్వేల ద్వారా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జుల పనితీరుపై ఆయన నివేదికలు తెప్పించు కుంటున్నారు. ప్రజల్లో చంద్రబాబు పాలనకు వస్తున్న మార్కు లు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ చార్జులకు రావట్లేదు. సర్వే వివరాలను అధి ష్టానం ఎప్పటికప్పుడు నియోజకవర్గ నేతలకు తెలియజేస్తోంది. కొన్నిచోట్ల మెరుగవు తున్నా.. మరికొన్ని చోట్ల పార్టీ నేతల పనితీరు మెరుగు పడకపోవడాన్ని అధిష్టానం గమనిస్తోంది.
 
 
కొనకళ్ల అసెంబ్లీకేనా..
పెడన నియోజకవర్గం నుంచి కొత్త అభ్యర్థిని దింపుతారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ వరసగా రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఆయనను ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయించవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బందరు లేదా పెడన అసెంబ్లీ స్థానాల్లో ఒకచోట నుంచి ఆయనను ఎమ్మెల్యేగా బరిలో దింపే అంశంపై చర్చ జరుగుతోంది. పెడన అభ్యర్థిని మార్చాలనే నిర్ణయంపై ఉన్న అధిష్టానం పార్టీ సీనియర్‌ నేత, చంద్రబాబుకు విధేయుడు అయిన కాగితకు ఎమ్మెల్సీ ఇచ్చి న్యాయం చేస్తారని చెబుతున్నారు. బందరు నుంచి వైసీపీ తరఫున పేర్ని నాని పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
 
పోర్టు పనులు జాప్యం కావడం పట్ల చంద్రబాబు స్థానిక నేతలపై అసంతృప్తితో ఉన్నారు. భూసమీకరణపై రైతుల్లో సరిగ్గా అవగాహన కల్పించలేకపోవడం వల్లే భూములు ఇవ్వలేదన్న అభిప్రాయం చంద్రబాబులో ఉంది. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ బాడిగ రామ కృష్ణను పార్టీలోకి తీసుకుని.. పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మచిలీపట్నం పరిధిలో జరిగే మార్పుల ప్రభా వం అవనిగడ్డపై కూడా పడే అవకాశం ఉంది. బుద్ధప్రసాద్‌కు సౌమ్యుడు, గాంధేయవాదిగా మంచి పేరు ఉంది. అయినా సర్వేల్లో ఆయనకు ఫస్ట్‌క్లాస్‌ మార్కులు రాకపోవడం పార్టీలో కాస్త కలవరాన్ని కలిగి స్తోంది. ఇక విజయవాడ తూర్పు, సెంట్రల్‌, గన్నవరం, పెనమలూరు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో పరిస్థితి పర్వాలేదనే భావన ఉంది. వీటిపై నిర్వహిస్తున్న సర్వేల ఫలితాలు అనుకూలంగా వస్తున్నాయి.
 
 
రాజకీయ అవినీతి... గ్రూపులు
2014 ఎన్నికల్లో గుడివాడ, నూజివీడు, తిరువూరు, పామర్రు, విజయవాడ వెస్ట్‌ సీట్లను వైసీపీ గెలుచుకుంది. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, విజయవాడ వెస్ట్‌ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ టీడీపీలో చేరారు. అయితే, ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న వ్యతిరేక వాతావరణంపై అధిష్ఠానం దృష్టి సారించింది. పామర్రు నియోజకవర్గ నాయకులపై పెరిగిన ఇసుక ఆరోపణలు, రాజకీయ అవినీతి పార్టీ ప్రతిష్టను దిగజారుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇటీవల జరిగిన పామర్రు మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నియామక విషయం వివాదాస్పదమై పార్టీని ఎప్పటినుంచో అంటి పెట్టుకుని ఉన్న బలమైన వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. దాదాపు అన్ని మండలాల్లో రెండేసి గ్రూపులు పనిచేస్తున్నాయి. విజయవాడ వెస్ట్‌లో జలీల్‌ఖాన్‌ బదులు ఆయన కుమార్తెను రంగంలోకి దింపే విషయం పార్టీ పరిశీలనలో ఉంది.
 
 
మార్పులు తప్పవా..
జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు తప్పక పోవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం అయిదారు నియోజకవర్గాల్లో మార్పు అవసరమని సీనియర్ల సంభాషణల్లో వినిపిస్తోంది. ప్రత్యర్థులు బలంగా ఉండే నియోజక వర్గాల్లో అందుకు దీటైన వారిని నిలబెట్టకపోతే ఇబ్బందులు తప్పవేమోనన్న భయం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
 
మార్పులు, చేర్పుల విషయంలో పైస్థాయిలో కసరత్తు జరుగుతోందని అంటున్నారు. ఈసారి గుడివాడలో గెలిచి తీరాలన్న పట్టుదల, కసి ఆ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా క్యాడర్‌ మొత్తంలో ఉంది. అక్కడ ప్రత్యర్థుల జిమ్మిక్కులను దీటుగా ఎదుర్కోలేకపోతున్నామనే బాధ అందరిలో ఉంది. వరుసగా నాలుగో సారి ఎమ్మెల్యేగా గెలవాలనే ఉత్సాహంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గెలుపును ఎలాగైనా అడ్డుకోవాలని నాయకులు అంటున్నారు. నానితో ఢీ అంటే ఢీ అనే అభ్యర్థిని గుడివాడ బరిలో నిలపాలనే కసి టీడీపీలో ఉంది. కైకలూరు 2014లో బీజేపీకి ఇవ్వడంతో పార్టీ అక్కడ కొంచెం బలహీన పడింది. ప్రస్తుతం అక్కడ నియోజకవర్గ ఇన్‌చార్జిగా జయమంగళ వెంకటరమణ ఉన్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
విజయవాడ నుంచి పోటీ అంటేనే వైసీపీ వెనకడుగు వేస్తుందా..?
06-07-2018 10:44:39
 
636664706807747272.jpg
విజయవాడ లోక్‌సభ అభ్యర్థి కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అన్వేషణ మొదలుపెట్టింది.. 50 నుంచి 70 కోట్ల వరకు వెచ్చించే వారు ఎవరున్నారా ? అని ఆరా తీస్తోంది... ప్రస్తుతానికైతే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదట! ఎందుకు రావడం లేదో... అసలు ఏం జరుగుతుందో... తెరవెనుక జరుగుతోన్న ఆసక్తికరమైన విషయాలేమిటో ఈ  స్టోరీలో తెలుసుకోండి.
 
 
         విజయవాడ లోక్‌సభ స్థానం చాలా చాలా ప్రత్యేకమైనది! ఈ స్థానానికి జరిగే పోటీపై సర్వత్రా ఆసక్తి ఉంటుంది.. ఎవరు గెలుస్తారా అన్న ఉత్కంఠ ఉంటుంది.. విజయవాడ తూర్పు.. పశ్చిమ.. సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు నందిగామ... జగ్గయ్యపేట...తిరువూరు.. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ లోక్‌సభ పరిధిలోకి వస్తాయి.. గత ఎన్నికలలో తెలుగుదేశంపార్టీ తరఫున కేశినేని నాని... వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి కోనేరు ప్రసాద్‌.. కాంగ్రెస్‌పార్టీ సింబల్‌పై దేవినేని అవినాష్‌లు పోటీ చేశారు. ఈ ముక్కోణపు పోటీలో కేశినేని నాని 78 వేల ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తదనంతర కాలంలో కోనేరు ప్రసాద్‌ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేశారు.. క్రీయాశీలక రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నారు.. ఇక దేవినేని అవినాష్‌.. ఆయన తండ్రి దేవినేని నెహ్రూలు కాంగ్రెస్‌ను వీడి తెలుగుదేశంపార్టీలో చేరారు.. ప్రస్తుతం విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయగల సమర్థుడైన అభ్యర్థి కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అగ్రనేతలు అన్వేషిస్తున్నారు..
 
 
        ఒక దశలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని విజయవాడ లోక్‌సభ బరిలో దింపాలనుకుంది హైకమాండ్‌.. ఎందుకో తెలియదు కానీ.. విజయసాయిరెడ్డి మాత్రం విశాఖపట్నంపై దృష్టి పెట్టారు.. ఆ తర్వాత నగరంలోని ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త దగ్గరకు రాయబారం పంపింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధిష్టానం.. అయితే పోటీ చేయడానికి ఆయన నిరాకరించారు.. వ్యాపారాన్ని వదిలి రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి లేదని మధ్యవర్తులకు సదరు పారిశ్రామికవేత్త స్పష్టం చేశారట! గత ఎన్నికలలో కడప జిల్లా రాజంపేట లోక్‌సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఓ దశలో విజయవాడ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించారట! అదే విషయాన్ని సన్నిహితులతో పంచుకున్నారట! బీజేపీ నుంచి పోటీ చేస్తే ప్రస్తుత పరిస్థితిలో డిపాజిట్‌ కూడా రాదని వారు చెప్పడంతో ఆమె తన నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు..
 
    అయితే బీజేపీని వదిలేసి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేశారట! ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు విజయవాడకు వచ్చినప్పుడు కొంతమంది మీడియా ప్రతినిధులు ఆయనను నేరుగానే ఈ ప్రశ్న అడిగారు.. ఈసారి మేడమ్‌ ఎక్కడి నుంచి పోటీచేస్తారు.. ? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు..? అని అడిగారు.. దానికి ఆ విషయాన్ని మేడమ్‌నే అడగండి అని జవాబిచ్చారు.. పురంధేశ్వరి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరి విజయవాడ నుంచి పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారాన్ని కూడా వెంకటేశ్వరరావు దగ్గర ప్రస్తావించారు.. ఇందులో ఏ మాత్రం నిజం లేదని తేల్చేశారాయన! తాను బీజేపీలోనే కొనసాగుతానని.. పార్టీ మారే ప్రసక్తే లేదని.. ఇటీవల విజయవాడకు వచ్చిన పురంధేశ్వరి కూడా స్పష్టం చేశారు..
 
 
      ఇదిలా ఉంటే విజయవాడ.. మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థుల కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పలువురితో సంప్రదింపులు జరుపుతోంది. గత ఎన్నికలలో మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పార్థసారథి మళ్లీ పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చడం లేదు.. ఆయన పెనమలూరు అసెంబ్లీ స్థానం టికెట్‌ను ఆశిస్తున్నారు. విజయవాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థుల కోసం జనసేన.. కాంగ్రెస్‌.. బీజేపీ.. వైకాపాలు వెతుకులాట మొదలుపెట్టాయి.. సిట్టింగ్‌ ఎంపీ కేశినేని నానికి ప్రస్తుతానికి తిరుగులేదు.. పైగా పార్టీ కూడా పటిష్టంగా ఉంది.. బెంజి సర్కిల్‌... కనకదుర్గ గుడి దగ్గర ఫ్లయ్‌ఓవర్‌... బెజవాడ రహదారుల విస్తరణ.. గ్రీనరీ.. విజయవాడ ఎయిర్‌పోర్టు ఆధునీకరణ.. వీటన్నింటినీ మించి విజయవాడ లోక్‌సభ నియోజకవర్గంలో టాటా ట్రస్ట్‌ సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో కేశినేని నాని మంచి మార్కులు సంపాదించారు..
 
           విద్య.. వైద్యం.. మౌలిక వసతుల కల్పనలో టాటా ట్రస్ట్‌ విశేష కృషి చేస్తుంది.. ఈ ట్రస్టును విజయవాడకు తీసుకురావడంలో... విజయవాడ లోక్‌సభను ట్రస్ట్‌ దత్తత తీసుకోవడంలో నాని కృషి ఎంతో ఉంది.. దీంతో నానికి నియోజకవర్గంలో సానుకూలత లభించింది. ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉండటం... పార్టీ నేతలతో సమన్వయం చేసుకోవడం.. నగరం నడిబొడ్డులో ఎంపీ కార్యాలయం ఉండటం.. పని కోసం వచ్చిన వారికి వెంటనే ఆ పని చేసి పెట్టడం వంటివి ఆయనకు పార్టీ పరంగా కూడా కలిసి వచ్చింది. అందుకే విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడానికి వైకాపా తరఫున ఎవరూ ముందుకు రావడం లేదు.. నగరంలో ముగ్గురు పారిశ్రామికవేత్తలను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు కాంటాక్ట్ చేసినప్పటికీ వారంతా ఈ ప్రతిపాదనలను ప్రాథమిక దశలోనే తిరస్కరించారు.
 
     గత ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ నుంచి పోటీ చేయాలని చివరి నిముషం వరకు ప్రయత్నించిన పొట్లూరి వరప్రసాద్ ఈసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నప్పటికీ అది కేవలం ప్రచారం మాత్రమేనని అంటున్నారు కొందరు. ఇప్పుడు విజయవాడ బరిలో టీడీపీ మినహా మిగతా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధులెవరనేది తేలక అందరూ మల్లగుల్లాలు పడుతున్నారు. కనీసం 50 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవారు ఎవరున్నారు అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆరా తీస్తోంది..చూద్దాం ఎవరు ముందుకొస్తారో...!
Link to comment
Share on other sites

జగన్‌కు హ్యాండిస్తున్న వైసీపీ కీలక నేతలు
07-07-2018 09:48:00
 
636665536813491954.jpg
  • విజయవాడ, బందరు అభ్యర్థుల కోసం అన్వేషణ
  • సంప్రదింపులు మొదలు
  • విముఖత వ్యక్తం చేస్తున్న కొందరు నాయకులు
  • చివరికి బరిలో నిలిచేదెవరో..?
 
జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంది. ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలూ రానున్నాయి. ఇంత హడావుడి ఉన్నా.. ఇంకా వైసీపీ.. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో తర్జనభర్జనలు పడుతూనే ఉంది. తెలుగుదేశం పార్టీకి ధీటుగా బలమైన నేతలను రంగంలోకి దింపాలని చూస్తోంది. అయితే, గత ఎన్నికలను గుణపాఠంగా నేర్చుకున్న కొందరు కీలక వైసీపీ నేతలు పోటీకి ససేమిరా..! అనడంతో అధినేత సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది.
 
 
విజయవాడ: విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలతోపాటు నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలు విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉంటాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కేశినేని నాని, వైసీపీ తరఫున కోనేరు రాజేంద్ర ప్రసాద్‌, కాంగ్రెస్‌ తరుఫున దేవినేని అవినాశ్‌ పోటీపడ్డారు. త్రిముఖ పోరులో నాని సుమారు 75వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆయనపై పోటీ చేసిన కోనేరు ప్రసాద్‌ ఆ తర్వాత వైసీపీకి రాజీనామా చేయడంతోపాటు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అవినాశ్‌ ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. విజయవాడ ఎంపీగా గెలుపొందిన నాని టీడీపీ తరఫున మరోసారి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.
 
తన ముక్కు సూటితనం కారణంగా కొన్ని అంశాల్లో వివాదాస్పదమైనా అభివృద్ధి కార్యక్రమాల పరంగా.. ప్రజలకు అందుబాటులో ఉండటంలోనూ నాని ముందంజలో ఉన్నారు. బెంజి సర్కిల్‌ ఫ్లైవోర్‌, దుర్గగుడి ఫ్లైవోర్‌, బెజవాడ రహదారుల విస్తరణ, గ్రీనరీ అభివృద్ధి, విజయవాడ విమానాశయ్రం ఆధునికీకరణ, వీటన్నింటికీ మించి విజయవాడ పార్లమెంటు పరిధిలో టాటా ట్రస్ట్‌ సేవలను నాని పూర్తిస్థాయిలో వినియో గించుకుంటున్నారు. తన నియోజకవర్గంలోని ఎమ్మెల్యేలందరితో సఖ్యతగా ఉండటం, పార్టీ నేతలను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు నిర్వహించడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఈ నేపథ్యంలో ఆయన్ను ఢీకొనాలంటే బలమైన అభ్యర్థి తప్పనిసరి అని వైసీపీ నేతలు భావిస్తున్నారు.
 
జోరుగా అన్వేషణ..!
వైసీపీ తరఫున విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థి కోసం ఆ పార్టీ అగ్రనేతలు పలువురిని సంప్రదిస్తున్నారు. వీరు సంప్రదిస్తున్న వారిలో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఒక దశలో ప్రస్తుతం ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డి విజయవాడ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆయన విశాఖ ఎంపీ స్థానంపై దృష్టి పెట్టారు. విజయవాడ నుంచి పార్టీ ఎంపీగా పోటీ చేయించేందుకు నగరంలో హోటళ్ల వ్యాపారంలో స్థిరపడిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త వద్దకు ఆ పార్టీ నేతలు రాయబారం పంపారు. వారి ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. తాను వ్యాపారంలో ఉన్నానని తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఆయన వారికి స్పష్టం చేసినట్లు తెలిసింది. మరో ముగ్గురు పారిశ్రామికవేత్తలనూ వైసీపీ నేతలు సంప్రదించినా వారు కూడా ప్రాథమిక దశలోనే ఆ ప్రతిపాదనలను తిరస్కరించినట్లు సమాచారం.
 
గత ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ఒక దశలో విజయవాడ నుంచి పోటీ చేయాలని ఇక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. బీజేపీ నుంచి పోటీ చేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో డిపాజిట్లు కూడా దక్కవని కొంత మంది సన్నిహితులు ఆమెకు చెప్పినట్లు సమాచారం. అయితే పురంధేశ్వరి వైసీపీలో చేరి పోటీ చేస్తే ఎలా ఉంటుందని మరికొందరు ఇటీవల విజయవాడలో ఆరా తీయడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని ఇటీవల నగరానికి వచ్చిన పురంధేశ్వరి ఖండించారు. తాను బీజేపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి పార్థసారథిని విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలన్న ఆలోచన ఉన్నా, ఆయన మళ్లీ ఎంపీ బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపడం లేదు.
 
ఆయన పెనమలూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. చివరి ప్రయత్నంగా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయాలని ప్రయత్నించిన పొట్లూరి వరప్రసాద్‌ పేరును ఆ పార్టీ నేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందో వేచి చూడాలి. మచిలీపట్నం పార్లమెంటు స్థానంలోనూ వైసీపీకి అదే పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి కె.పార్థసారథి పోటీ చేసి కొనకళ్ల నారాయణ చేతిలో 81వేల తేడాతో ఓడిపోయారు. ఈసారి ఆయన ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన బాడిగ రామకృష్ణను ఆ పార్టీ నేతలు సంప్రదిస్తున్నట్లు సమాచారం. అయితే పోటీకి ఆయన సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
 
 
ఎందుకు వెనకడుగు..?
విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసేందుకు వెనకడుగు వేయడానికి ప్రధాన కారణం భారీ ఖర్చే. ఈ స్థానం నుంచి పోటీ చేసే వ్యక్తి కనీసం రూ.50 నుంచి 70 కోట్లు వరకు వెచ్చించాల్సి ఉంటుంది. నాని లాంటి ప్రత్యర్థిని తట్టుకోవడం అంత తేలిక కాదు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచేందుకు అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. విజయవాడలో పోలిస్తే మచిలీపట్నంలో భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకున్నా అక్కడ కూడా ఆ పార్టీ అభ్యర్థుల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఉండటం గమనార్హం.
Link to comment
Share on other sites

కీలక నేతకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్న వైసీపీ
12-07-2018 11:22:25
 
636669913446944328.jpg
  • వైసీపీ నగర సారథి.. ఎవరిగోల వారిది!
  • రసకందాయంలో వైసీపీ నగర అధ్యక్ష పదవి
  • వెలంపల్లికి ఉద్వాసన?
  • బొప్పన భవకుమార్‌వైపు అధిష్ఠానం మొగ్గు
  • త్వరలో నగరానికి విజయసాయిరెడ్డి
 
వైసీపీ నగర అధ్యక్ష పదవి రసకందాయంలో పడింది. వెలంపల్లి శ్రీనివాసరావు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అధిష్ఠానం ఆయనకు ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతోందని సమాచారం. రేసులో బొప్పన భవకుమార్‌ ఉన్నా.. నగరంలో నాలుగు దారుల్లో నడిచే నేతలతో తన వల్ల కాదని వెనక్కి తగ్గుతున్నట్టు తెలిసింది. దీంతో అటు తిరిగి.. ఇటు తిరిగి.. ఈ పదవి అధిష్ఠానం బోనులోకి చేరి చర్చనీయాంశంగా మారింది.
 
 
విజయవాడ : వైసీపీ నగర అధ్యక్షుడిగా వెలంపల్లి శ్రీనివాసరావుకు అధిష్ఠానం ఉద్వాసన పలకబోతున్నట్టు తెలుస్తోంది. ఆ స్థానంలో తూర్పు నియోజకవర్గ కన్వీనర్‌గా పనిచేసిన బొప్పన భవకుమార్‌కు బాధ్యతలు అప్పగించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు జరుపుతోంది. అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే విషయమై భవకుమార్‌ నుంచి స్పష్టత లేకపోవటంతో అధిష్ఠాన పెద్దలు ఆయనతో ఇంకా సంప్రదింపులు జరుపుతున్నారు. నగరంలో పార్టీని ముందుకు నడిపించే సరైన నాయకుడు లేక ఇబ్బందులు పడుతున్న వైసీపీ ఇటీవల కొత్తగా పార్టీలోకి చేరిన యలమంచిలి రవి పేరును ముందు పరిశీలించినట్టు సమాచారం. తూర్పు నుంచి వైసీపీ అభ్యర్థిగా రవి బరిలో ఉండనుండటంతో ఆయన పేరును తాత్కాలికంగా పక్కన పెట్టినట్టు తెలిసింది. పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న బొప్పన భవకుమార్‌కు నగర బాధ్యతలను అప్పగించాలన్న ఆలోచనను తెరపైకి తెచ్చింది.
 
భవకుమార్‌ అనాసక్తి?
వైసీపీ నగర పదవీ బాధ్యతలు అనగానే బొప్పన ససేమిరా అన్నట్టు సమాచారం. మూడు నియోజకవర్గాల పరిధిలో ఉన్న నేతలు ఎవరి తోవ వారే అన్నట్టు ఉన్నారని, వారిని తన నియంత్రణలో పార్టీ కోసం పనిచేయించటం కష్టంగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని భవకుమార్‌ అధిష్ఠాన పెద్దల దగ్గర కూడా వ్యక్తపరిచినట్టు సమాచారం. అలాంటిదేమీ ఉండదని, ఎవరైనా నగర అధ్యక్షుడి నియంత్రణలో పనిచేయాల్సిందేనని, వారితో ఈ విషయం స్పష్టంగా చెబుతామని అధిష్ఠానం బుజ్జగిస్తున్నట్లు వినికిడి. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లో నగరానికి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వస్తున్నారని, నేతలందరితో సమావేశమవుతారని వైసీపీ నగర నాయకులకు రాష్ట్ర పార్టీ నుంచి సందేశాలు వచ్చాయి. విజయసాయిరెడ్డి ఎప్పుడు వస్తున్నారన్న దానిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. విజయసాయిరెడ్డి రెండు, మూడు రోజులు నగరంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
 
వెలంపల్లీ.. ఇదేం లొల్లి..
ఈ క్రమంలో నేతలందరితో మాట్లాడి నూతన నగర అధ్యక్షుడిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు నగరాధ్యక్షుడిగా పనిచేసిన వెలంపల్లి శ్రీనివాసరావుపై అధిష్ఠానం అంత సంతృప్తిగా లేదని సమాచారం. వెలంపల్లికి నగర బాధ్యతలు అప్పగిస్తే సమర్థవంతంగా పనిచేయటం లేదని పార్టీ అభిప్రాయ పడుతోంది. నేతల మధ్య సమన్వయం లేకపోవటం, కిందిస్థాయి నేతల్లో వెలంపల్లి పనితీరుపై ఆక్షేపణలు వస్తుండటం అధిష్ఠానం దృష్టికి వెళ్లింది. విజయవాడ కార్పొరేషన్‌లో కౌన్సిల్‌ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ పదవిని భర్తీ చేయలేదు. కనీసం విప్‌ను కూడా నియమించలేదు. ఫ్లోర్‌లీడర్‌ పదవి ఐదేళ్లలో ముగ్గురు నిర్వహించేలా తీసుకున్న ఉమ్మడి నిర్ణయాన్ని వెలంపల్లి అమలు చేయలేదని ఆ పార్టీ కార్పొరేటర్లంతా గగ్గోలు పెడుతున్నారు.
 
కౌన్సిల్‌ సమావేశాల సందర్భంగా ఆసిఫ్‌, శివశంకర్‌, చందన సురేష్‌, పాలఝాన్సీలను మేయర్‌ సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో, వెలంపల్లి నగర పార్టీ తరఫున తమకు మద్దతుగా నిలబడలేదని, కనీసం కౌన్సిల్‌ బయట ఆందోళన కూడా చేపట్టకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. కౌన్సిల్‌ సమావేశాల్లో ఒక సందర్భంలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు బీజాన్‌బీ, జయమ్మలను సస్పెండ్‌చేస్తే ఆయన వెంటనే స్పందించారని, తమ విషయంలో అలా జరగలేదని మిగిలిన కార్పొరేటర్లు రగిలిపోతున్నారు. ఈ విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది.
 
 
‘పశ్చిమ’పైనే ప్రేమ
ఇటీవల వెలంపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నారని, ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరగటం కూడా వెలంపల్లిని అధ్యక్ష పదవి నుంచి తొలగించడానికి ఒక కారణంగా తెలుస్తోంది. పార్టీ నగర అధ్యక్షుడిగా ఉంటూ పశ్చిమ నియోజకవర్గంపైనే దృష్టి సారించటం పట్ల కూడా అధిష్ఠాన పెద్దలు వెలంపల్లిపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. సెంట్రల్‌ నియోజకవర్గంలో వంగవీటి రాధా, మల్లాది విష్ణు, గౌతమ్‌రెడ్డి మధ్య సమన్వయం లోపించటంతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి, భవకుమార్‌ల మధ్య కూడా అంతరం ఉంది.
 
పశ్చిమలో వెలంపల్లి వన్‌మ్యాన్‌ షో నడుస్తోంది. ఇంతమంది నేతలు ఉన్నా.. నగర స్థాయిలో తగిన విధంగా సమస్యలపై స్పందించటం లేదని, ఆందోళనలు కలిసికట్టుగా నిర్వహించకపోవటం ద్వారా పార్టీని కూడా ముందుకు తీసుకువెళ్లలేకపోతున్నారన్న భావన అధిష్ఠానం ఉంది. విజయవాడ నగరంలో సంస్థాగతంగా వైసీపీ బలంగా లేదు. డివిజన్‌ కమిటీలు, నియోజకవర్గ కమిటీలు కూడా పూర్తిస్థాయిలో లేవు. అనుబంధ సంఘాలు కూడా మొక్కుబడిగానే ఉన్నాయి. విజయసాయిరెడ్డి వచ్చిన తర్వాత వీటన్నింటినీ ఏ విధంగా సెట్‌రైట్‌ చేస్తారన్నది వేచి చూడాల్సిందే.
Link to comment
Share on other sites

షాకింగ్: ఏపీ మంత్రులకే తెలియకుండా జీవో జారీ
12-07-2018 11:28:45
 
636669917242715169.jpg
నూజివీడు: నూజివీడు ఏఎంసీ పదవి భర్తీ విషయంలో ఏర్పడిన విభేదాలపై ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించారు. జిల్లా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బుధవారం నూజివీడు ఇన్‌చార్జి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు ఫోన్‌చేసి మాట్లాడారు. ‘ఈరోజు కేంద్రమంత్రి గడ్కరీ పోలవరం ప్రాజెక్టు దగ్గరకు వస్తున్న దృష్ట్యా అందరం బిజీగా ఉన్నాం, రేపు ఈ వివాదంపై మాట్లాడదాం..’ అని చెప్పారని ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తన ఒక్కడితోనే కాదని, సమన్వయ కమిటీతో సహా సంప్రదించాల్సిన పరిస్థితిని కొందరు నాయకులు తెచ్చారని ఆయన మంత్రి దృష్టికి తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఏఎంసీ ఎంపిక నిర్ణయం తమకు తెలియదని మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావులు తనతో అన్నారని ముద్దరబోయిన పేర్కొన్నారు.
 
జీవో ఎలా వచ్చింది?
ఈ వ్యవహారాన్ని మొదటి నుంచి చూస్తున్న మంత్రులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమాలకు తెలియకుండా జీవో ఎలా జారీ అయింది? అనేది సమాధానం లేని ప్రశ్న. గతంలో ముద్దరబోయినను పిలిచి ఏఎంసీ ఎంపికపై చర్చించిన ఒక ఉన్నతాధికారి, రాష్ట్ర పార్టీ కార్యాలయంలో చక్రంతిప్పే ఒక ముఖ్య నాయకుడి వల్లే ఈ జీవో మంత్రులకు తెలియకుండా జారీ అయ్యిందనే ప్రచారం ముద్దరబోయిన వర్గీయుల నుంచి వినిపిస్తోంది. మంత్రులు ఇద్దరు ఈ ఎంపిక మాకు తెలియదని చెప్పడాన్ని బట్టే పై ప్రచారంలో నిజం ఉందేమోనని పలువురు భావిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఈనెల 14న నూజివీడు వస్తున్నారు. ఈలోపే ఈ వివాదాన్ని సర్దుబాటు చేయాలని యోచిస్తున్నారు.
 
పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపు
నూజివీడు నియోజకవర్గంలో పార్టీ పదవులకు రాజీనామాలు చేసినవారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు, ఇతర ముఖ్య స్థానిక నేతలు గురువారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని జిల్లా పార్టీ కార్యాలయానికి రావాలని పిలుపులు అందాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు నుంచి ఫోన్‌ వచ్చిందని ముద్దరబోయిన పేర్కొన్నారు. దీంతో గురువారం అందరూ జిల్లా పార్టీ కార్యాలయానికి వెళ్లటానికి సమాయత్తమవుతున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ప్రతినెలా 12వ తేదీన జరిగే రాష్ట్రస్థాయి సమీక్షా సమావేశం కూడా గురువారం విజయవాడలో జరగనుంది. ఈ సమావేశంలో నూజివీడు నియోజకవర్గానికి సంబంధించిన ఈ అంశంపై చర్చకు రాకముందే జిల్లా పార్టీ కార్యాలయంలో వీరిని బుజ్జగించి, వివాదాన్ని సమసిపోయేలా చేయటానికి పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 1 month later...
బాడిగ.. ఎటు చేరిక..? టీడీపీ, వైసీపీ నేతల ఇళ్లకు వెళ్లి మరీ..
28-08-2018 11:38:06
 
636710530872048438.jpg
  • ఆంతరంగికులు, కేడర్‌తో రహస్య సమావేశం
  • ఎంపీ కొనకళ్ల, మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో మంతనాలు
  • అధికార, ప్రతిపక్ష నేతలను కలవటంపై చర్చలు
  • బందరు పార్లమెంట్‌ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయాలు
మచిలీపట్నం పార్లమెంట్‌ రాజకీయ ముఖచిత్రం మారబోతుందా? దాదాపు పదేళ్లపాటు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న మచిలీపట్నం మాజీ పార్లమెంట్‌ సభ్యులు బాడిగ రామకృష్ణ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా? ఆంతరంగీకులు, కేడర్‌తో సోమవారం ఆయన నిర్వహించిన రహస్య సమావేశం దేనికి సంకేతం? రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు? ఎంపీ కొనకళ్ల, మాజీ ఎమ్మెల్యే పేర్ని నానితో విడివిడి భేటీ వెనుక ఆంతర్యం ఏమిటి? ఏ పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం ఉంది? అసలు ఆయన పయనమెటు?
 
 
ఆంధ్రజ్యోతి, మచిలీపట్నం: పారిశ్రామిక రంగంలో బిజీగా ఉన్న బాడిగ రామకృష్ణ 2004లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. మచిలీపట్నం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నేరుగా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వేయించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫునే పోటీచేసి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణ ఆయనపై 12వేల ఓట్లతో గెలుపొందారు. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న బాడిగ 2014లో పలు పార్టీల నుంచి ఆహ్వానాలు అందినా ఎటూ వెళ్లలేదు. జాతీయ పార్టీల నుంచి పోటీచేస్తే బాగుంటుందని అప్పట్లో అనుకున్నారు. అయితే, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నా బాడిగ శేషగిరిరావు చారిటబుల్‌ ట్రస్ట్‌ తరఫున సేవలందిస్తున్నారు.
 
 
ఏడు నియోజకవర్గాల కేడర్‌తో రహస్య సమావేశం
దేశంలో, రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతున్న ఈ నేపథ్యంలో మళ్లీ బాడిగ రామకృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సోమవారం బందరులోని ఆయన కార్యాలయంలో ఆంతరంగికులు, కేడర్‌, ఫాలోవర్స్‌తో రహస్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బందరు పార్లమెంట్‌లోని మచిలీపట్నం, పెడన, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు, గన్నవరం, పామర్రు నియోజకవర్గాలకు చెందిన ఆయన కేడర్‌, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భవిష్యత రాజకీయ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. ఏ పార్టీలోకి వెళ్లాలి? ఎటు వెళితే బాగుంటుంది? నియోజకవర్గాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? తదితర అంశాలపై ఆయన క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అయితే, ఆయన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినప్పటికీ, తన నిర్ణయాన్ని ఈ సమావేశంలో వెల్లడించలేదని సమాచారం. మరో రెండు సిట్టింగ్‌ల తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించి, పత్రికాముఖంగా తెలియజేస్తారని విశ్వసనీయంగా తెలిసింది.
బందరు ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే పేర్ని నానిలతో బాడిగ రామకృష్ణ విడివిడిగా భేటీ కావటం సంచలనంగా మారింది.
 
సోమవారం కేడర్‌తో రహస్య సమావేశం అయిన అనంతరం ఆయన నేరుగా ఎంపీ కొనకళ్ల, పేర్ని నానిల ఇంటికి వెళ్లి, వారిని కలిసి కాసేపు ముచ్చటించి వచ్చారు. అయితే, ఆయనకు అటు టీడీపీ, ఇటు వైసీపీల నుంచి ఆహ్వానాలు అందుతున్నాయని, ఇదే సందర్భంలో ఆయన రెండు పార్టీలకు చెందిన ఎంపీ, మాజీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై బాడిగ రామకృష్ణను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదించగా, ఇప్పుడే తన నిర్ణయాన్ని చెప్పలేనన్నారు. కేవలం మర్యాదపూర్వకంగానే ఇద్దరితో భేటీ అయ్యానని చెప్పుకొచ్చారు. ఏదేమైనా బాడిగ చాలాకాలం తర్వాత బందరు రావటం, కేడర్‌తో సమావేశం నిర్వహించటం, అధికార, ప్రతిపక్షాలకు చెందిన నేతలను కలవటం చర్చనీయాంశమైంది.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
రచ్చకెక్కిన వంగవీటి రాధాకృష్ణ సీటు వివాదం.. రంగంలోకి కొడాలి నాని !
18-09-2018 10:36:51
 
636728638079160069.jpg
  • రాధా మచిలీపట్నం వెళ్లాలన్న ప్రతిపాదనపై అభిమానుల అసహనం
  • మల్లాది కోసమే ఇదంతా అంటూ మండిపాటు
  • రంగా విగ్రహం వద్ద ఆందోళన.. ఆత్మహత్యాయత్నాలు
  • రచ్చకెక్కిన వంగవీటి రాధాకృష్ణ సీటు వివాదం
  • అభిమానుల ఆగ్రహం
  • తూర్పు, పశ్చిమలోనూ వివాదాలే..
  • అధిష్ఠానం తీరుతో నేతల్లో అయోమయం
  • వైసీపీ అధిష్ఠానం తీరుపై కార్యకర్తల అసంతృప్తి
అనుకున్నదే అయ్యింది. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న నగరంలోని వైసీపీ సీట్ల పంపకాల సెగ ఒక్కసారిగా భగ్గుమంది. ఈ వేడి మూడు నియోజకవర్గాల్లోని పార్టీ శ్రేణుల్లో దావాలంలా వ్యాపిస్తుండగా, సోమవారం సెంట్రల్‌ అట్టుడికింది. ఇప్పటివరకు సెంట్రల్‌ నియోజకవర్గంపై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకృష్ణను బందరుపై దృష్టిపెట్టమని వైసీపీ అధిష్ఠానం ఆదేశించడంతో మంటలు చెలరేగాయి. అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా, నగర వైసీపీలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.
 
వైసీపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. నగర నేతల ఆధిపత్యపోరుకు, అధిష్ఠానం తీరుకు పొసగడంలేదు. సెంట్రల్‌ నియోజకవర్గంలో రాధాకు చెక్‌ పెట్టేందుకు వెలంపల్లి, పశ్చిమంలో వెలంపల్లికి గండి కొట్టేందుకు రాధా పావులు కదుపుతున్నారనేది అందరికీ తెలిసిందే. సెంట్రల్‌లో మల్లాది విష్ణుకు లైన్‌ క్లియర్‌ చేసేందుకే రాధాను మచిలీపట్నం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా పంపేందుకు రంగం సిద్ధం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారం వైసీపీ వాణిజ్య విభాగం సమావేశంలో జిల్లా పార్టీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి చేసిన ఈ ప్రతిపాదనపై రాధా వర్గం భగ్గుమంది. నగరానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, రాధా అభిమానులు సోమవారం రంగా విగ్రహం వద్ద బైఠాయించారు. వారిలో ఇద్దరు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.
 
 
విజయవాడ, ఆంధ్రజ్యోతి: విజయవాడ నగర వైసీపీలో అసంతృప్తి వెల్లువెత్తింది. కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి సెంట్రల్‌ నియోజకవర్గం రూపంలో ఒక్కసారిగా భగ్గుమంది. నగర నేతల నడుమ నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరుతో నగరంలోని మూడు నియోజకవర్గాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ ఇన్‌చార్జులుగా రోజుకొకరు తెరపైకి వస్తుండటంతో ఇటు నాయకుల్లో.. అటు కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.
 
 
ఎత్తుకు పైఎత్తు..!
వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా ఉన్న వెలంపల్లి శ్రీనివాస్‌ వర్గానికి, వంగవీటి రాధాకృష్ణ వర్గానికి కొంతకాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సెంట్రల్‌ నియోజకవర్గం నుంచి రాధాకు కాకుండా మరొకరికి టికెట్‌ ఇప్పించాలని వెలంపల్లి వర్గం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా మల్లాది విష్ణుతో వెలంపల్లి వర్గం సన్నిహితంగా మెలుగుతోంది. వెలంపల్లి సూచన మేరకే ఆదివారం జరిగిన వైసీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర సమావేశంలో పార్టీ జిల్లా ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. రాధాను మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానంపై దృష్టి సారించాలని కోరినట్లు సమాచారం. రాధాను మచిలీపట్నం పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దించితే సెంట్రల్‌ స్థానం నుంచి మల్లాది విష్ణు పోటీ చేసేందుకు మార్గం సుగమమవుతుందని వెలంపల్లి వర్గం భావిస్తోంది. మరోవైపు వెలంపల్లి శ్రీనివాస్‌ పోటీ చేస్తారని భావిస్తున్న విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఆయన వ్యతిరేక వర్గాన్ని రాధా వర్గం ప్రోత్సహిస్తోందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరికొకరు చెక్‌ పెట్టుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు.
 
మల్లాది వైపే మొగ్గు
సెంట్రల్‌ నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జిగా తొలుత గౌతంరెడ్డి ఉండేవారు. ఆ తర్వాత వంగవీటి రాధా తెరపైకి వచ్చారు. 2014 ఎన్నికల్లో రాధా విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయాక రాధా సెంట్రల్‌ నియోజకవర్గంపై దృష్టి సారించారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయనకు సెంట్రల్‌ బాధ్యతలు అప్పగించింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో మల్లాది విష్ణు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపడం ప్రారంభించింది. ఆదివారం నాటి సమావేశంలోనూ పెద్దిరెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో రాధా వర్గం భగ్గుమంది. ఈ నేపథ్యంలో రాధా సోదరుడు, ఉయ్యూరు నగర పంచాయతీలో వైసీపీ ఫ్లోర్‌లీడర్‌ అయిన వంగవీటి శ్రీనివాసప్రసాద్‌ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
 
 
వంగవీటి అనుచరుల ఆందోళన
నగరానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, అభిమానులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున రాధా కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. సెంట్రల్‌ సీటు రాధాకే ఇవ్వాలని, మద్యం కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మల్లాది విష్ణుకు సీటు ఇస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ నినాదాలు చేశారు. ఆందోళనలో భాగంగా బందరురోడ్డులోని రంగా విగ్రహం ఎదుట బైఠాయించారు. రాధా అభిమానులు ఇద్దరు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అదే సమయానికి రాధా రావడంతో రెచ్చిపోయిన అభిమానులు రంగా కుటుంబం కోసం, రాధా కోసం ప్రాణాలిస్తామంటూ నినదించారు. పెట్రోలు పోసుకున్న వారిపై రాధా నీళ్లు చల్లి సముదాయించారు. అయితే, రాధాను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం గుడివాడ ఎమ్మెల్యే నాని, తూర్పు వైసీపీ నేత యలమంచిలి రవిని రంగంలోకి దింపింది. వీరు రాధా కార్యాలయానికి చేరుకుని చాలాసేపు ఆయనతో మంతనాలు జరిపారు. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, పార్టీ అధిష్ఠానం రంగా కుటుంబానికి అన్యాయం చేయబోదని ఇద్దరు నాయకులు రాధాను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
 
 
తూర్పు, పశ్చిమల్లోనూ ఇదే పరిస్థితి
నగరంలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లోనూ వైసీపీ నాయకుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. తూర్పు నుంచి గతంలో బొప్పన భవకుమార్‌, ఎంవీఆర్‌ చౌదరి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ తర్వాత టీడీపీ నుంచి వైసీపీలో చేరిన యలమంచిలి రవికి తూర్పు బాధ్యతలు అప్పగించారు. తాజా పరిణామాలతో రవి వర్గీయుల్లోనూ అయోమయం నెలకొంది. మచిలీపట్నం పార్లమెంట్‌ సీటు నుంచి పోటీ చేసేందుకు రాధా విముఖత వ్యక్తం చేస్తే తూర్పు సీటు ఆయనకు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
 
దీంతో రవి వర్గీయుల్లో ఆందోళన నెలకొంది. పశ్చిమ నియోజకవర్గంలో వెలంపల్లికి సీటు దక్కకుండా చూడాలని రాధావర్గం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రియల్టర్‌ కోరాడ విజయకుమార్‌ను రంగంలోకి దించి పశ్చిమ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నారని వినికిడి.
Link to comment
Share on other sites

జనసేన కూడా ఈ ఏపీ మంత్రినే టార్గెట్ చేసింది
21-09-2018 10:37:44
 
636731230616272039.jpg
విజయవాడ: మంత్రి దేవినేని ఉమాపై పోటీకి దింపటానికి రాజకీయంతో సంబంధంలేని ఓ ప్రముఖుడితో మంతనాలు జరుగుతున్నాయి. పామర్రు నుంచి సీటు ఇస్తే పోటీ చేయడానికి కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే ఒకరు ప్రయత్నాల్లో ఉన్నారు. గన్నవరం సీటు కొప్పుల వెలమ సామాజికవర్గానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ అడుగుతున్నారు. గుడివాడ సీటు ఇస్తే పార్టీలో చేరతానని కాంగ్రెస్‌కు చెందిన మాజీమంత్రి ఒకరు సంకేతాలు పంపుతున్నారు. గుడివాడ, కైకలూరు, పెడన నియోజకవర్గాల నుంచి బీసీ అభ్యర్థులను రంగంలోకి దించాలనే ఆలో చనతో నాయకుల కోసం అన్వేషిస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ జిల్లాలో పర్యటించిన తరువాత రాజకీయ సమీకరణలలో మార్పులు ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

వైసీపీకి షాక్.. జనసేన నేతల టచ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు
21-09-2018 10:33:55
 
636731228329527550.jpg
విజయవాడ: ఎన్నికల కురుక్షేత్రానికి జనసేన పార్టీ సిద్ధం అవుతోంది. ఇంతవరకు ఆ పార్టీ జిల్లా కమిటీలను కాని, బూత్‌ కమిటీలను కాని ఏర్పాటు చేసుకోలేదు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు జిల్లావ్యాప్తంగా అభి మానులు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పార్టీ ఉనికి కనిపించడం లేదు. పవన్‌ కల్యాణ్‌ కూడా జిల్లాలో పర్యటించలేదు. త్వర లోనే ఆయన పర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం జనసేన, సీపీఐ, సీపీఎంలు కలిసి పయనిస్తున్నాయి. ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని ప్రకటించాయి. ఆప్‌, లోక్‌సత్తా కూడా వీరితో జత కలిసే అవకాశం ఉంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో జనసేన గ్రౌండ్‌వర్క్‌ చేసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆ పార్టీ సర్వేలు చేయించు కుంటోంది. ఢిల్లీకి చెందిన దేవ్‌ అండ్‌ కో అనే టీమ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన రెండు యూనివర్సిటీల సిబ్బందితో సర్వేలు చేయిస్తున్నారు.
 
ఈ సర్వేల ఆధారంగా కొంత కసరత్తు జరుగుతోంది. పొత్తుల ఖరారు, సీట్ల సర్దుబాటు వంటి అంశాలపై ఇంకా స్పష్టత లేనప్పటికి నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల కోసం జనసేననేతలు అన్వేషణ ప్రారం భించారు. ఎన్నికలు దగ్గరవుతుండటంతో టికెట్లపై అపనమ్మకంతో ఉన్న ఇతర పార్టీల నేతలు కొందరు ఎందుకైనా మంచిదని జనసేనలో ముందే ఒక కర్చీఫ్‌ వేస్తున్నారు. కొంతమంది నేరుగా పవన్‌కల్యాణ్‌ను కలుస్తుంటే, మరికొందరు సంకేతాలు పంపుతున్నారు. వైసీపీకి చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జనసేన నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. సీటు రాని పక్షంలో జనసేనలోకి వస్తామని రాయబారాలు చేస్తున్నట్టు సమాచారం. వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కొంతమంది సీనియర్‌ నాయకులు కూడా జనసేనలో చేరే విషయమై డోలాయమానంలో ఉన్నారు.
 
తెరమీదకు కొత్త ముఖాలు
ఇతర పార్టీల్లో సీట్లు వచ్చే అవకాశం లేని నాయకులను తమ పార్టీలోకి తీసుకునేందుకు జనసేన నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్లు దొరకని నియోజకవర్గాల్లో కొత్త వారిని రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయని జనసేన పార్టీ నాయకుడొకరు చెప్పారు. ఇప్పటికే రాజకీయ కుటుంబాల వారసులు తమతో టచ్‌లో ఉన్నారని ఆయన అన్నారు. పొత్తులో భాగంగా విజయవాడ సెంట్రల్‌ సీపీఎం, పశ్చిమ నియోజకవర్గం సీపీఐ అడగాలనే ఆలోచనతో ఉన్నాయి. ఇవి కాక ఆ రెండు పార్టీలు జిల్లాలో మరికొన్ని సీట్లు కోరే అవకాశం ఉంది. సెంట్రల్‌ నుంచి సీపీఎం తరఫున గతంలో పోటీ చేసిన బాబూరావు బరిలోకి దిగే అవకాశం ఉంది. పశ్చిమ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పోటీ చేయవచ్చునని చెబుతున్నారు.
 
ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ రెండవ కుమార్తె విజయవాడ లేదా మచిలీపట్నం పార్లమెంటు సీటు అడుగుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు సన్నిహితుడు తోట చంద్రశేఖర్‌ భార్య అనురాధ అవనిగడ్డ ప్రాంతానికి చెందినవారు కావడంతో అవనిగడ్డ అసెంబ్లీ లేదా మచిలీపట్నం పార్లమెంటు నుంచి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్టు పార్టీ వర్గా లు తెలిపాయి. మాజీమంత్రి సింహాద్రి సత్య నారాయణ మనమడు రామచరణ్‌ పేరు కూ డా ఈ స్థానాలకు వినిపిస్తోంది. జగ్గయ్య పేట సీటు వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మేనల్లుడు అడుగుతున్నారు. ప్రస్తుతం ఆయన సాఫ్ట్‌వేర్‌రంగంలో ఉన్నారు.
Link to comment
Share on other sites

  • 3 weeks later...
వంగవీటి రాధా కోసం రంగంలోకి విజయసాయి.. ఏం తేలింది?
11-10-2018 11:36:36
 
636748545974250405.jpg
  • తొందరపడొద్దు!
  • రాధాకు విజయసాయి బుజ్జగింపు
  • రెండు గంటలకుపైగా ఏకాంత చర్చలు
  • ‘సెంట్రల్‌’ సీటు కోసం రాధా పట్టు
  • అది తప్ప ఏదైనా ఇస్తామన్న విజయసాయి
అసంతృప్తితో రగిలిపోతున్న వైసీపీ నేత వంగవీటి రాధాను బుజ్జగించేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం విజయవాడ వచ్చిన ఆయన నేరుగా రాధా ఇంటికెళ్లారు. అక్కడి నుంచి రాధాను ఓ హోటల్‌కు వెంటబెట్టుకెళ్లి సుమారు రెండు గంటలకుపైగా మాట్లాడారు. సెంట్రల్‌ సీటు విషయంలో కాస్త పట్టువిడుపులతో ఆలోచించాలని రాధాకు విజయసాయి సూచించినట్లు సమాచారం.
 
 
(విజయవాడ, ఆంధ్రజ్యోతి)
వైసీపీ అధిష్ఠానంపై అసంతృప్తితో రగిలిపోతున్న వంగవీటి రాధాను బుజ్జగించేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేత విజయసాయి రెడ్డి రంగంలోకి దిగారు. బుధవారం విజయవాడకు వచ్చిన ఆయన నేరుగా మొగల్రాజపురంలో ఉన్న రాధా ఇంటికి వెళ్లి కొద్దిసేపు ఆయనతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి నగరంలోని ఓ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడ సుమారు 2 గంటలకుపైగా వీరి నడుమ ఏకాంత చర్చలు సాగాయి. ఈ సందర్భంగా రాధాను బుజ్జగించేందుకు విజయసాయి ప్రయత్నించినట్లు సమాచారం.
 
 
విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ టికెట్‌ను తనకు కాదని మల్లాది విష్ణుకు పార్టీ దాదాపు ఖరారు చేయడంతో రాధా కినుక వహించారు. దీంతో సెప్టెంబరు 18 నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు విష్ణు సెంట్రల్‌ నియోజకవర్గంలో పూర్తిస్థాయిలో తిరుగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాధా పార్టీని వీడుతారన్న ప్రచారం ఊపందుకుంది. రాధాను దూరం చేసుకుంటే కాపు సామాజికవర్గంలో వ్యతిరేకత వస్తుందని భావించిన వైసీపీ అధిష్ఠానం విజయసాయిని రంగంలోకి దింపింది. బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఆలోచనతోనే మల్లాది విష్ణును సెంట్రల్‌ నియోజకవర్గానికి ఇన్‌చార్జిగా నియమించామని, అంతే తప్ప రాధాను దూరం చేసుకోవాలన్న ఆలోచన పార్టీకి లేదని రాధాకు విజయసాయి తెలిపినట్లు సమాచారం. ఈ వాదనపై రాధా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
 
 
తాను ఆశిస్తున్న స్థానాన్ని వేరే వ్యక్తికి ఇచ్చేటప్పుడు తనను కనీసం సంప్రదించకపోవడం ఏమిటని నిలదీసినట్లు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రెండు రోజులపాటు తన అనుచరులు ఆందోళన వ్యక్తం చేసినా పార్టీ తరఫున ఒక్క సానుకూల ప్రకటన వెలువడకపోగా, పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం పెట్టి మరీ సెంట్రల్‌ సీటు ఇచ్చేది లేదని తెగేసి చెప్పడంలో పార్టీ ఉద్దేశాన్ని రాధా ప్రశ్నించినట్లు తెలిసింది.
 
 
జిల్లాలో తనకు అనుకూలమైన ఏ స్థానం నుంచి పోటీ చేసినా పార్టీ అభ్యంతరపెట్టబోదని రాధాను విజయసాయి బుజ్జగించినట్లు సమాచారం. గతంలో రాధా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసినందున అక్కడి నుంచి పోటీ చేస్తానంటే అభ్యంతరం లేదని, మచిలీపట్నం ఎంపీ, అవనిగడ్డ అసెంబ్లీ స్థానాలు కూడా రాధాకు అనుకూలంగా ఉంటాయని విజయసాయి సూచించినట్లు తెలిసింది. పార్టీ అధిష్ఠానం ఈసారి ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలను రచిస్తోందని, అందులో భాగంగా సెంట్రల్‌ స్థానం నుంచి విష్ణును బరిలోకి దింపాలని నిర్ణయించిందని, ఈ విషయంలో రాధా కూడా కాస్త పట్టువిడుపులతో ఆలోచించాలని విజయసాయి సూచించినట్లు సమాచారం. తన నిర్ణయాన్ని ఒకటి రెండు రోజుల్లో తెలుపుతానని రాధా చెప్పినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.
Link to comment
Share on other sites

  • 4 months later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...