Jump to content

AP's Teacher Eligibility Test, DSC schedule Announced


Recommended Posts

10న డీఎస్సీ నోటిఫికేషన్‌
06-10-2018 02:03:50
 
  • వచ్చే నెల రెండో తేదీ వరకూ దరఖాస్తులు
  • నవంబరు 30-డిసెంబరు 14 మధ్య టెట్‌ కమ్‌ టీఆర్టీ పద్ధతిలో పరీక్షలు: గంటా
అమరావతి, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2018 నోటిఫికేషన్‌ ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఆ రోజు నుంచి నవంబరు ఒకటో తేదీ వరకూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నవంబరు రెండో తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. వచ్చే నెల ఐదో తేదీ నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు అందుబాటులో ఉంటాయి. నవంబరు 20వ తేదీ నుంచి హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నవంబరు 30 నుంచి డిసెంబరు 14 వరకూ ఆన్‌లైన్‌లో డీఎస్సీ పరీక్ష నిర్వహించి.. వచ్చే ఏడాది జనవరి 3న ఫలితాలు ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. టెట్‌ కమ్‌ టీఆర్టీ పద్ధతిలోనే డీఎస్సీ జరుగుతుందన్నారు. నవంబరు 30 నుంచి డిసెంబరు ఆరు వరకూ ఎస్జీటీ అభ్యర్థులకు, ఏడో తేదీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
 
ఈ డీఎస్సీ ద్వారా మొత్తం 9,275 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుందని మంత్రి తెలిపారు. జెడ్పీ, ఎంపీపీ పాఠశాలల్లోని 5 వేల ఖాళీలు, మున్సిపల్‌ పాఠశాలల్లో 1,100, గురుకుల పాఠశాలల్లో 1,100, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 750, షెడ్యూల్‌ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 500, నాన్‌ షెడ్యూల్‌ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 300, బీసీ సంక్షేమ రెసిడెర్షియల్‌ పాఠశాలల్లో 350, ఏపీఆర్‌ఈఐ సొసైటీ అధీనంలోని పాఠశాలల్లోని 175 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...
25, 26 తేదీల్లో డీఎస్సీ ప్రకటన?
పాఠ్యాంశాలను ఖరారు చేసిన పాఠశాల విద్యాశాఖ
  ఆన్‌లైన్‌లోనే డీఎస్సీ నిర్వహణకు యోచన
  ఎస్జీటీ ఉపాధ్యాయ అర్హత, నియామక పరీక్షకు ఉత్తర్వులు జారీ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని నిరుద్యోగులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) ప్రకటనకు రంగం సిద్ధమైంది. ఎలాంటి అవాంతరాలు రాకపోతే ఈ నెల 25, 26వ తేదీల్లో డీఎస్సీ ప్రకటన విడుదల చేసేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం దస్త్రాన్ని సోమ, మంగళవారాల్లో ప్రభుత్వానికి పంపాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పరీక్ష ఆన్‌లైన్‌లోనే నిర్వహించనున్నారు. ఇందులో కొన్ని ఇబ్బందులున్నా ఆన్‌లైనే మేలని పాఠశాల విద్యాశాఖ పేర్కొంటోంది.

మరోపక్క డీఎస్సీకి సంబంధించి పాఠశాల విద్యాశాఖ పాఠ్యాంశాలను(సిలబస్‌) ఖరారు చేసింది. ఈసారి ఎస్జీటీలకు ఉపాధ్యాయ అర్హత(టెట్‌), నియామక పరీక్ష(టీఆర్టీ)లను కలిపి నిర్వహిస్తోంది. స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీ, పీజీటీలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించనుంది. ఎస్జీటీలకు 8వ తరగతి, స్కూల్‌ అసిస్టెంట్లు, టీజీటీలకు ఇంటర్మీడియట్‌, పీజీటీలకు డిగ్రీ స్థాయి వరకు ప్రశ్నలు ఇవ్వనున్నారు. టెట్‌, టీఆర్టీని కలిపి వంద మార్కులకే నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ వంద మార్కుల్లోనే 20% లెక్కించి టెట్‌ వెయిటేజీగా ఇవ్వాలని ఆలోచనగా ఉంది. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గిరిజన సంక్షేమ శాఖ నుంచి వచ్చిన షెడ్యూలు ఏరియా, నాన్‌ షెడ్యూలు ఏరియా ఆశ్రమ పాఠశాలల పోస్టుల్లో కొన్ని చిత్రలేఖనం, ఆర్ట్‌, క్రాఫ్ట్‌ పోస్టులు ఉన్నందున వీటికి సంబంధించిన పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. మూడు రోజుల్లో సిలబస్‌కు సంబంధించిన దస్త్రాన్ని పరీక్షల నిర్వహణ విభాగానికి అప్పగించనున్నారు.


వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు అనుమతి అవసరం

ఎస్జీటీలకు టెట్‌, టీఆర్టీ నిర్వహణకు అనుమతిస్తూ శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవి పాఠశాల విద్యాశాఖకు అందాయి. కొత్తగా మంజూరు చేసిన వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి లభించాల్సి ఉంది. అనుమతి లభించిన వెంటనే రిజర్వేషన్‌ రోస్టర్‌, సిలబస్‌ వివరాలతో దస్త్రాన్ని ప్రభుత్వానికి పంపనున్నారు. పురపాలిక, గిరిజన, బీసీ సంక్షేమ శాఖలు పోస్టుల వివరాలను పాఠశాల విద్యాశాఖకు అందించాయి. ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్ల రిజర్వేషన్‌పై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.


 
Link to comment
Share on other sites

డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల

09531425BRK56A.JPG

విజయవాడ: ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం విజయవాడలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డీఎస్సీ కొంచెం ఆలస్యమైన విషయం వాస్తమేనని.. అయితే ఈసారి ఎక్కువ మందికి ప్రయోజనం కలిగేలా నిర్వహిస్తామని తెలిపారు.

షెడ్యూల్‌ ఇలా..
* అక్టోబరు 26న నోటిఫికేషన్‌ విడుదల
* నవంబరు 1 నుంచి 16 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* నవంబరు 29 నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు
* నవంబరు 17న నుంచి ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్ట్‌లు
* డిసెంబర్‌ 6, 10 తేదీల్లో స్కూలు అసిస్టెంట్‌(నాన్‌ లాంగ్వేజెస్‌) రాత పరీక్ష
* డిసెంబర్‌ 12, 13న పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌ రాత పరీక్ష
* డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాత పరీక్ష
* డిసెంబర్‌ 17 పీఈటీ, మ్యూజిట్‌, క్రాప్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌, డ్రాయింగ్ రాత పరీక్ష
 
 
 
Link to comment
Share on other sites

  • 4 weeks later...
 
త్వరలో స్పెషల్‌ డీఎస్సీ!
23-11-2018 02:31:10
 
  • మోడల్‌ పాఠశాలల్లో వెయ్యి పోస్టుల భర్తీ
  • నూతన ప్రణాళికలతో పటిష్ఠమైన విద్య
  • అలసత్వం వహిస్తే వేటు తప్పదు
  • పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి
నెల్లూరు (విద్య) నవంబరు 22: త్వరలో ప్రత్యేక డీఎస్సీ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మోడల్‌ స్కూళ్లలో ఖాళీగా ఉన్న వెయ్యి పోస్టుల భర్తీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సంధ్యారాణి తెలిపారు. నెల్లూరులోని కస్తూరిదేవి బాలికల పాఠశాల ప్రాంగణంలో గురువారం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, చిత్తూరు, కడప జిల్లాల ఏపీ మోడల్‌ పాఠశాలల జోనల్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ మోడల్‌ పాఠశాలలన్నీ ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే పనిచేస్తాయని, వీటిని ఆయా జిల్లాల విద్యాశాఖాధికారులే పర్యవేక్షిస్తారని తెలిపారు. మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే సిబ్బంది జీతభత్యాలు కూడా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అందించిన రీతిలోనే ఉంటాయన్నారు.
 
ఈ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కూడా లేకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటునట్లు చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు తదితర జిల్లాల్లోని కొన్ని మోడల్‌ పాఠశాలలు ఫలితాల్లో వెనుకబడి ఉన్నాయని, బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మోడల్‌ పాఠశాలల్లో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌, ఎన్‌సీసీ, క్రీడలను ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ఏపీఎంఎస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ జి.విజయలక్ష్మి, గుంటూరు ఆర్‌జేడీ కె.శ్రీనివాసులరెడ్డి, కడప ఆర్‌జేడీ బి.ప్రతా్‌పరెడ్డి, ఆర్‌ఎంఎ్‌సఏ డైరెక్టర్‌ బి.ప్రభాకర్‌రావు, ఏపీఎంఎస్‌ అకౌంట్స్‌ అధికారి రామకృష్ణ, ఆయా జిల్లాల డీఈవోలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...