Jump to content

Amitshah kaki lekkalu


Recommended Posts

చెవిలో కమలం!
27-03-2018 02:33:45
 
636577148259641977.jpg
  • విశాఖ ఉక్కుపై ‘తుప్పు’ మాటలు
  • 38,500 కోట్లు ఇచ్చామన్న అమిత్‌షా
  • పచ్చి అబద్ధమని తేల్చిన కార్మికులు
  • మొదట్లో ఇచ్చిన 4900 కోట్లతో సరి
  • కష్టాల్లో కూరుకున్నా చేయూత లేదు
  • హుద్‌హుద్‌ సాయానికీ దిక్కులేదు
  • నాడు వెయ్యి కోట్లిస్తామన్న మోదీ
  • ఇప్పటికి మేమే 36 వేల కోట్లు కట్టాం
  • ఉక్కుతో రాజకీయాలు చేయొద్దు
  • బీజేపీకి కార్మిక సంఘాల హెచ్చరిక
 
 
(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి): ‘ఏపీకి చాలా చేశాం... ఎంతో ఇచ్చాం!’... అంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాసిన లేఖలోని డొల్లతనం ‘విశాఖ ఉక్కు’ సాక్షిగా బయటపడింది. ఇది మా హక్కు అని సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారం బాగుకోసం తాము రూ.38,500 కోట్లు పెట్టుబడిగా పెట్టినట్లు అమిత్‌షా తన లేఖలో పేర్కొన్నారు. దీనిపై విశాఖ స్టీల్స్‌ అధికారులు, కార్మికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అమిత్‌ షా కనీసం అవగాహన లేకుండా, అచ్చమైన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు.
 
విశాఖ ఉక్కు ప్రారంభం సమయంలో ఇచ్చిన 4900 కోట్లు మినహాయిస్తే... కేంద్రం ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తేల్చి చెప్పారు. నిజానికి... పోరాడి సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్రానిది ఎప్పుడూ చిన్నచూపేనని, మూతపడే ప్రమాదం వచ్చినప్పుడు కూడా కనీస సహాయం చేయలేదని కార్మిక సంఘాలు పేర్కొన్నాయి. అంతేకాదు... హుద్‌హుద్‌ తుఫాను దెబ్బకు విశాఖ ఉక్కు తీవ్రంగా నష్టపోయింది. సంస్థకు రూ.వెయ్యి కోట్లు ఇస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అది మాటలకే పరిమితమైంది.
 
ఆది నుంచీ నిర్లక్ష్యమే...
ఉక్కు కర్మాగారానికి 1971లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పదేళ్లు కాలం గడిపి 1981లో పనులు ప్రారంభించారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహరావు ప్లాంట్‌ను జాతికి అంకితం చేశారు. కర్మాగారం ప్రారంభంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.4,900 కోట్లు మాత్రమే ఇచ్చింది. దానికి మరో ఐదు వేల కోట్లు అప్పు తెచ్చి అప్పట్లో ప్లాంట్‌ పనులు పూర్తిచేశారు. ప్రారంభంలో అనేక ఇబ్బందులు తలెత్తి ఒకానొక దశలో కర్మాగారం బీఐఎ్‌ఫఆర్‌కు కూడా వెళ్లింది. ఆ సమయంలో కేంద్రం ముందుకొచ్చి రుణాలు మంజూరు చేయించింది. విశాఖ ఉక్కు 2002-03 నుంచి నష్టాల బారినుంచి బయటపడి లాభాల్లో పయనించింది.
 
ఈ నేపథ్యంలో ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని 3.3 నుంచి 6.3 మిలియన్‌ టన్నులకు పెంచడానికి విస్తరణ పనులు చేపట్టారు. విస్తరణకు రూ.8,800 కోట్లు అవసరం కాగా... లాభాల సొమ్ము ఐదు వేల కోట్ల రూపాయలకుతోడు రూ.3,800 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా తీసుకున్నారు. అంతే తప్ప కేంద్రం పైసా ఇవ్వలేదు. విస్తరణ, ఆధునికీకరణ కోసం తీసుకున్న రుణాల భారం పెరిగి ప్రస్తుతం ప్లాంట్‌కు రూ.12 వేల కోట్ల వరకు అప్పులు ఉన్నాయని కార్మిక నేత కృష్ణంరాజు వెల్లడించారు. ఏఐటీయూసీ నేత డి.ఆదినారాయణ మాట్లాడుతూ, కేంద్ర బడ్జెట్‌లో ప్రతిసారి విశాఖ ఉక్కుకు నిధులు కేటాయించినట్టు చూపించడం మామూలేనన్నా రు. రానున్న ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన పనులు, చెల్లింపులకు సంబంధించి ప్రతిపాదనలు రూపొందించి ఉక్కు మంత్రి ద్వారా కేంద్ర ఆర్థిక మంత్రికి పంపిస్తారని, నిధులు ఎలా సమీకరిస్తారనే విషయం వాటిల్లో చూపుతారన్నారు. ‘మీ రాజకీయాలకు విశాఖ ఉక్కును వాడుకోవద్దు’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. రూ.38,500 కోట్లు ఇచ్చామని బీజేపీ ప్రకటించడంపై సీఐటీయూ సీనియర్‌ నేత ఎన్‌.రామారావు మండిపడ్డారు. హుద్‌హుద్‌ తుఫాన్‌లో తీవ్రంగా దెబ్బతిన్న ఉక్కు కర్మాగారానికి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ...పైసా ఇవ్వలేదని గుర్తుచేశారు.
 
 
ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
9vsp03-150.jpgవిశాఖ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. స్టీల్‌ప్లాంట్‌ స్థాపన నుంచి నేటి వరకు 36 వేల కోట్లను పన్నుల రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించింది. స్టీల్‌ప్లాంట్‌ ఆపదలో వున్నప్పుడు కనీసం ట్యాక్స్‌ మినహాయింపు ఇమ్మని బతిమాలినా ఇవ్వలేదు. వేల కోట్లు నిధులు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఉంటే చాలు.
- జె.అయోధ్యరాం, అధ్యక్షుడు, సీఐటీయూ
 
 
 
మోసానికి నిదర్శనం
9vsp04-150.jpgవిశాఖ ఉక్కుకు వేల కోట్లు ఇచ్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా చెబుతున్నారంటే... తెలుగు ప్రజలను ఏ స్థాయిలో మోసం చేస్తూన్నారో అర్థమవుతుంది. స్టీల్‌ప్లాంట్‌ విస్తరణ కూడా సొంతంగా చేసుకున్నాం. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏటా బడ్జెట్‌లో కేటాయింపులు చేశామని చెబుతున్నారు. ఇది పచ్చి అబద్ధం. రాజకీయాల కోసం లేని పోని లెక్కలు చూపి ప్రజలను మోసం చేసేందుకు అమిత్‌షా కుట్ర చేశారు.
- మంత్రి రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి, ఇంటక్‌
 
 
 
అసత్య ప్రచారం మానుకోవాలి....
9vsp05-150.jpgవేల కోట్లు ఇచ్చామని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. స్టీల్‌ప్లాంట్‌ నిర్మాణ సమయంలో ఇచ్చిన రూ.4,900 కోట్లు వినా... ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి విస్తరణ సమయంలో కూడా ఇవ్వలేదు. హుద్‌హుద్‌ వల్ల స్టీల్‌ప్లాంట్‌ ఎంతో నష్టపోయింది.
- ఎన్‌.రామారావు, సీఐటీయూ
 
 
 
 
రాజకీయం కోసం వాడుకోవద్దు
9vsp06-150.jpgస్టీల్‌ప్లాంట్‌ నిర్మాణం నుంచి నేటి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వివిధ పన్నుల రూపంలో రూ.36 వేల కోట్లు చెల్లించాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఏనాడూ పైసా సాయం చేయలేదు. వేల కోట్లు ఇచ్చామని అసత్యాలు చెపుతూ రాజకీయం చేస్తున్నారు.
- డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, ఏఐటీయూసీ
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...