Jump to content

CBN takes on Jagan


NAGA_NTR

Recommended Posts

అవిశ్వాసంపై వైసీపీకి టీడీపీ షాక్

అమరావతి: అవిశ్వాస తీర్మానంలో తన వ్యూహం ఫలించి, టీడీపీ తనను బలపరిచిందన్న ఆనందం వైసీపీకి కొన్ని గంటలయినా దక్కకుముందే, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హటాత్తుగా వ్యూహం మార్చారు. వైసీపీకి మద్దతునివ్వాలన్న గురువారం నాటి యోచనకు భిన్నంగా, తమ పార్టీనే లోక్‌సభలో అవిశ్వాసం ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించడం ద్వారా వైసీపీకి షాక్ ఇచ్చారు. శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన వెంటనే 173 మంది సభ్యులు దానికి మద్దతునివ్వడం ద్వారా వైసీపీని ఖంగు తినిపించారు. అందులో కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు ఉండటం విశేషం. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకూ పార్టీలో శరవేగంగా మారిన పరిణామాలు, సమీకరణలు ఆసక్తికలిగించాయి. హోదా ఇవ్వని కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలన్న వైసీపీ నిర్ణయానికి మద్దతునివ్వడం ద్వారా, తమ చిత్తశుద్ధి చాటుకోవాలని, పనిలోపనిగా ఆ క్రెడిట్ వైసీపీకి మాత్రమే దక్కకూడదని టీడీపీ నాయకత్వం గురువారం సాయంత్రం వరకూ భావించింది. ఆ మేరకు బాబు కూడా సభలో తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమైనందున అవిశ్వాసానికి మద్దతునిస్తామని చెప్పారు. దీనితో అటు వైసీపీ శిబిరంలో సంతోషం కనిపించింది. టీడీపీ తమ దారిలోకి రావడం ద్వారా, మొత్తం పొలిటికల్ మైలేజీ దక్కించుకోవచ్చని ఆ పార్టీ నేతలు అంచనా వేశారు. హోదాపై పోరాడటంతోపాటు, చివరకు తెలుగుదేశం పార్టీ మెడలు వంచి అవిశ్వాసానికి ఒప్పించామని ప్రచారం చేసుకునే వెసులుబాటు ఏర్పడుతుందని భావించింది. అటు కొందరు టీడీపీ నేతలు సైతం బాబు నిర్ణయంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయం ఏవిధంగా తీసుకున్నారనే చర్చ జరిగింది. అయితే ఇది తుది నిర్ణయం కాకపోయి ఉండవచ్చని, చివరి నిమిషంలో బాబు వ్యూహం మార్చినా ఆశ్చర్యపోవలసిన పనిలేదని కొందరు నేతలు వ్యాఖ్యానించారు. అటు వైసీపీ నేతలు కొందరు టీడీపీ నిర్ణయంపై సందేహాలతోనే ఉన్నారు. ఎలాంటి వ్యూహం లేకుండా బాబు ఇలాంటి నిర్ణయం తీసుకోరని పలువురు నేతలు సందేహం వ్యక్తం చేశారు. అయితే, అనుకున్నట్లుగానే గురువారం రాత్రి తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. వైసీపీ అవిశ్వాసానికి మనం మద్దతునివ్వడం ద్వారా, ఆ పార్టీకి మనమే పొలిటికల్ మైలేజ్ ఇచ్చినట్టవుతుందని కొందరు మంత్రులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే హోదా విషయంలో వైసీపీ ట్రాప్‌లో పడ్డామన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నందున, మళ్లీ అవిశ్వాస తీర్మాన విషయంలో అదే దారిన వెళ్లడం వల్ల రాజకీయ ప్రయోజనం ఉండదని సూచించారు. పైగా తాము దొంగల పార్టీ, అవినీతి పార్టీ, బీజేపీతో కుమ్మక్కయిందని ఓ వైపు విమర్శిస్తూ మళ్లీ అదే పార్టీ పెట్టే అవిశ్వాసానికి మద్దతునివ్వడం వల్ల తప్పుడు సంకేతాలు వెళతాయని గ్రహించిన టీడీపీ నాయకత్వం.. ఆ అవిశ్వాస తీర్మానమేదో తామే పెట్టాలని నిర్ణయించింది. తమ పార్టీ తీర్మానం పెడితేనే దేశంలోని అన్ని పార్టీలనూ ఆకర్షించే అవకాశం ఉంటుందని, కేవలం 5గురు సభ్యులున్న వైసీపీ పెట్టే అవిశ్వాసానికీ, టీడీపీ 16 మంది ఎంపీలతో ఇచ్చే నోటీసుకూ ఇతర పార్టీల దృష్టిలో విలువ, గౌరవానికి తేడా ఉంటుందని బాబు విశే్లషించారు. పైగా మన పోరాటానికి దేశంలోని వివిధ పార్టీలు, ఎన్డీఏ భాగస్వామ్యపార్టీలు కూడా మద్దతునిస్తున్నందున, మనం పెట్టే తీర్మానాన్ని బలపరిచేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందన్నారు. ఆ విధంగా బాబు వ్యూహం మార్చి వైసీపీకి షాక్ ఇచ్చారు. బాబు వ్యూహం ఫలించడంతో 173 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...