Jump to content

విభజన హామీలపై భాజపా వాదనను తిప్పికొట్టిన తెదేపా


John

Recommended Posts

చేతల్లో గోరంత..మాటల్లో కొండంత 
విభజన హామీలపై భాజపా వాదనను తిప్పికొట్టిన తెదేపా 
11ap-politics1a.jpg

ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలతో పాటు, ఆ బిల్లుపైన పార్లమెంటులో చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ఇచ్చిన హామీల్లో 85 శాతం నెరవేర్చామని భాజపా చెబుతుండగా, అవన్నీ డొల్ల లెక్కలేనని తెదేపా వాదిస్తోంది. విభజన హామీలను నెరవేర్చేందుకు పదేళ్లు గడువున్నప్పటికీ 15 ఖండిస్తోంది. ఇరు పక్షాల వాదనలు క్లుప్తంగా ఇలా!

అంశం: రెవెన్యూ లోటు భర్తీ 
భాజపా: రాష్ట్రానికి రూ.3,979.5 కోట్లు రెవెన్యూ లోటు భర్తీ కింద ఇచ్చాం. ఇంకా ఎంత చెల్లించాలనేదానికి సంబంధించిన తుది లెక్కపై ప్రస్తుతం కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. 14వ ఆర్థిక సంఘం కాలవ్యవధి (2015-20) మధ్య అయిదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి మొత్తం రూ.22,133 కోట్లు వస్తాయి. 
తెదేపా: 2014-15లో ఆంధ్రప్రదేశ్‌ రెవెన్యూ లోటు రూ.16,078.76 కోట్లని అకౌంటెంట్‌ జనరల్‌ ధ్రువీకరించారు. కేంద్రం మాత్రం ఈ లోటు రూ.4,117.89 కోట్లేనని వాదిస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఆ కాలవ్యవధిలో మిగతా రాష్ట్రాలకు ఇచ్చినట్లే ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన వాటా ప్రకారమే నిధులు ఇస్తున్నారు తప్ప ప్రత్యేకంగా ఏమీ మేలు చేకూర్చలేదు.

రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి 
కేబీకే, బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ 
భాజపా: ఒక్కో ఆర్థిక సంవత్సరంలో రూ.350 కోట్లు చొప్పున గత మూడేళ్లలో ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ కింద వెనుకబడిన ఏడు జిల్లాలకు రూ.1,050 కోట్ల నిధులిచ్చాం. 
తెదేపా: ఆ ఏడు జిల్లాలకు రూ.24,350 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.1,050 కోట్లే ఇచ్చారు. బుందేల్‌ఖండ్‌ ప్యాకేజీలో అక్కడ రూ.7,266 కోట్లు ఇచ్చారు. 2016 డిసెంబరులో కరవు నివారణ ప్రత్యేక ప్యాకేజీ కింద బుందేల్‌ఖండ్‌కు రూ.7277 కోట్లు ఇచ్చారు.

విశ్వవిద్యాలయాల ఏర్పాటు, నిధుల కేటాయింపు 
భాజపా: అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు స్థలాలను ఎంపిక చేశాం. తాజా బడ్జెట్‌లో ఈ రెండు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు చెరో రూ.10 కోట్లు కేటాయించాం. 
తెదేపా: సెంట్రల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి రూ.1,100 కోట్లు, గిరిజన విశ్వవిద్యాలయం నిర్మాణానికి రూ.400 కోట్లు వ్యయమవుతుంది. ఈ రెండింటి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలాల విలువ, వాటి చుట్టూ ప్రహరీల నిర్మాణానికైన వ్యయం కలిపితే రూ.1,026 కోట్లు. ఈ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు వీలుగా సెంట్రల్‌ యూనివర్సిటీ చట్టం-2009కు, ఇందిరాగాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం చట్టం-2007కు సవరణలు చేయడానికి గాను ప్రత్యేక బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకూ జరగలేదు.

గ్రీన్‌ ఫీల్డ్‌ క్రూడ్‌ ఆయిల్‌ రిఫైనరీ అండ్‌ 
పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌ 
భాజపా: కాకినాడ గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోకెమికల్‌ కాంప్లెక్స్‌లో హెచ్‌పీసీఎల్‌, గెయిల్‌ కలిసి రూ.30 వేల కోట్లు పెట్టుబడులు పెడతాయి. 2017 భాగస్వామ్య సదస్సులో దీనికి సంబంధించిన ఎంవోయూపై ఇప్పటికే సంతకాలు చేశాయి. 
తెదేపా: ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేదు. ఆర్థిక సర్దుబాటు(ఫైనాన్స్‌ వయుబల్‌) కింద కేంద్రం రూ.5 కోట్లు ఇవ్వాలి. ఫలితం లేదు.

దుగరాజపట్నం పోర్టు 
భాజపా: పీపీపీ విధానంలో ఇక్కడ పోర్టు ఏర్పాటు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపింది. అయితే సాంకేతిక కారణాల రీత్యా ఇక్కడ పోర్టు ఏర్పాటు సాధ్యం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం చూపించే ప్రత్యామ్నాయ కేంద్రంలో పోర్టు ఏర్పాటు చేయడానికి అవసరమైన మద్దతిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. 
తెదేపా: ఎలాంటి పురోగతి లేదు. సాంకేతిక కారణాలను సాకుగా చూపుతున్నారు

కడప ఉక్కు కర్మాగారం 
భాజపా: కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై సెయిల్‌ ఇప్పటికే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చింది. అందులోని అంశాల పరిశీలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, ఆర్‌ఐఎన్‌ఎల్‌, ఎన్‌డీఎంసీ, మెకాన్‌, ఎంఎస్‌టీసీలకు చెందిన సభ్యులతో కార్యదళం ఏర్పాటైంది. సాధ్యమైనంత త్వరలో ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతుంది 
తెదేపా: ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విన్నవించినప్పటికీ పట్టించుకోలేదు. లాభసాటి కాదంటున్నారు. నివేదికను పక్కనలో పెట్టారు.

విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు 
భాజపా: ప్రస్తుతం దీని సవివర ప్రాజెక్టు నివేదిక కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ పరిశీలనలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని వివరణలను కేంద్రం కోరింది. విజయవాడ మెట్రోకు సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. 
తెదేపా: ఎలాంటి పురోగతి లేదు. 2018-19 బడ్జెట్‌లో నిధులే కేటాయించలేదు.

చట్టంలో పేర్కోనప్పటికి చేసిన అంశాలు 
భాజపా: రక్షణ రంగ సంస్థలు, నౌకాయన సంస్థల ఏర్పాటు, విద్యుత్తు రంగం, జాతీయ జలరవాణా మార్గాలు-4, బొగ్గు, గనులు శాఖ తరఫున భారీగా నిధులు కేటాయించాం. 
తెదేపా: చాలా సంస్థల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల విలువైన భూములను కేటాయించింది. ఇప్పటికీ వాటిలో చాలా ప్రారంభం కాలేదు. చిన్న చిన్న అంశాలను కూడా ఏదో పెద్ద మేలు చేసినట్లు చెబుతున్నారు.

ప్యాకేజీ, ఫారిన్‌ ట్రేడ్‌ సంస్థల ఏర్పాటు 
భాజపా: ఈ సంస్థలను ఒక్కోటి 25 ఎకరాల విస్తీర్ణంలో ఉండేలా ఏర్పాటు చేస్తున్నాం. 
తెదేపా: 25 ఎకరాల్లో అభివృద్ధి చేయాల్సిన సంస్థలకు 2018-19 కేంద్ర బడ్జెట్‌లో రూ.5 కోట్ల చొప్పున మంజూరు చేశారు. ఇలా అయితే ఆ సంస్థలు ఎప్పటికి పూర్తవుతాయి?

ప్రత్యేక ప్యాకేజీ 
భాజపా: ప్రత్యేక ప్యాకేజీ కింద ప్రకటించిన మొత్తాన్ని విదేశీ ఆర్థిక సంస్థల సాయంతో చేపట్టే ప్రాజెక్టుల రూపంలో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ఇవ్వడానికి ఉన్న అవకాశాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. అతి త్వరలో దీన్ని ప్రకటిస్తారు. 
తెదేపా: ప్రత్యేక హోదాతో చేకూరే అన్ని రకాల ప్రయోజనాలను ఏపీకి కలిగించేందుకు వీలుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు వెల్లడించినప్పటికీ ఇంతవరకూ నిధులు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.18,857 కోట్ల విలువైన ప్రతిపాదనలు పంపినా వాటికి ఆమోదం లభించలేదు. నాబార్డు, హడ్కో, వాణిజ్య బ్యాంకుల నుంచి రుణం పొందేందుకు అవకాశం కల్పించాలని, ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా చూడాలని కోరినా ఫలితం లేదు.
11ap-politics1b.jpg
రాజధాని అమరావతికి ఆర్థికసాయం 
భాజపా: రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.2,500 కోట్లు ఇచ్చాం. త్వరలో మరో రూ.1,000 కోట్లు ఇస్తాం. 
తెదేపా: రాజధాని నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.1,500 కోట్లే ఇచ్చారు. ఆ నిధులతో 6 లక్షల చదరపు అడుగల విస్తీర్ణంలో సచివాలయం, అసెంబ్లీ భవనాలు నిర్మించాం. 80 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధికారులు, సిబ్బంది నివాస భవనాలు, రహదారులు నిర్మాణంలో ఉన్నాయి. కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నాం. రాజభవన్‌, సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల నిర్మాణానికి రాబోయే అయిదేళ్లలో రూ.42,395 కోట్లు అవసరవమవుతాయి. వీటికి సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలు కూడా కేంద్రానికి సమర్పించాం. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థల పరిధిలో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి రూ.1,000 కోట్లు ఇచ్చారు. ఆ నిధులతో చేపట్టిన పనుల వినియోగ పత్రాలను కూడా కేంద్రానికి సమర్పించాం.

11ap-politics1c.jpg
పోలవరం ప్రాజెక్టు 
భాజపా: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకూ రూ.4,622.68 కోట్లు చెల్లించాం. 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణానికయ్యే వ్యయమంతా పూర్తిగా కేంద్రమే భరిస్తుంది. 
తెదేపా: 2014-15 అంచనాల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.54 వేల కోట్ల వ్యయమవుతుందని ఆగస్టు 2016న కేంద్రానికి నివేదిక పంపించాం. దీనిలో పరిహారం, పునరావాసానికి రూ.33 వేల కోట్లువుతుంది. దానిపైన స్పష్టత ఇవ్వలేదు. గత నాలుగేళ్లలో పోలవరంపై రూ.7,780.07 కోట్లు ఖర్చు చేశాం. రాష్ట్రం వెచ్చించిన మొత్తంలో ఇంకా రూ.3,451 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. ఫలితంగా వడ్డీ రూపంలో రూ.300 కోట్లమేర ఏపీపైన భారం పడింది. ఎగువ కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణితో ప్రాజెక్టు పనుల్లో రెండు నెలలు ఆలస్యమయ్యింది.

వివిధ సంస్థల ఏర్పాటు, నిధుల కేటాయింపు 
భాజపా: ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఐటీడీఎం, ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐఎం, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐపీఈ, ఎయిమ్స్‌, ఎన్‌ఐడీఎం తదితర విద్యాసంస్థలకు సంబంధించి తాత్కాలిక ప్రాంగణాల్లో ఇప్పటికే తరగతులు కొనసాగుతున్నాయి. జాతీయ విద్యాసంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్‌ నిర్మాణానికి గత రెండేళ్లలో రూ.730.51 కోట్లు విడుదల చేశాం. 
తెదేపా: ఆయా ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.9,654.95 కోట్ల వ్యయమవుతుంది. అయితే ఇప్పటివరకూ కేంద్రం విడుదల చేసింది రూ.680.08 కోట్లే విడుదల చేసింది. ఆయా ప్రాజెక్టుల వ్యయంలో ఇప్పటివరకూ కేంద్రం 7 శాతం నిధులే విడుదల చేసింది. ఈ లెక్కన చూసుకుంటే వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుంది? రాష్ట్ర ప్రభుత్వం వీటి నిర్మాణానికి కేటాయించిన స్థలం విలువ, దాని చుట్టూ ప్రహారీ నిర్మాణానికి చేసిన వ్యయమే రూ.11,182.38 కోట్లు.

11ap-politics1d.jpg
జాతీయ రహదారులు, రోడ్డు అనుసంధానత 
భాజపా: వివిధ పథకాల కింద జాతీయ రహదారులు, రోడ్డు అనుసంధానత కోసం రూ.లక్ష కోట్లు నిధులు ఖర్చు చేస్తాం. 180 కి.మీ అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డుకు రూ.20 వేల కోట్లును కేంద్రమే భరిస్తుంది. 
తెదేపా: అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు ఇచ్చారు తప్పితే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకంగా ఏమీ ఇవ్వలేదు. అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణానికి భూ సేకరణ జరుగుతోంది. ప్రాజెక్టు అంచనా రూ.25 వేల కోట్లు. బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. భూసేకరణకయ్యే వ్యయాన్ని రాష్ట్రమే భరిస్తోంది. అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు ఇంకా డీపీఆర్‌ దశలోనే ఉంది. 
రైల్వే ప్రాజెక్టులకు 
భాజపా: 2009-14లో రైల్వేకు కేటాయించింది రూ.5,100 కోట్లు. 2014-19లో రాష్ట్ర రైల్వే ప్రాజెక్టులకు రూ.14,151 కోట్లు కేటాయించాం. రూ.47,989 కోట్ల విలువైన 5,010 కి.మీ. 32 ప్రాజెక్టులు ఇప్పటికే పని జరుగుతోంది. 
తెదేపా: ప్రాజెక్టు అంచనాలు, అవసరమైన నిధుల గురించి చెప్పారే తప్ప ఇప్పటివరకూ ఎన్ని మంజూరు చేశారు? ఇంకా ఎంత విడుదల చేయాలనేది చెప్పలేదు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...