Jump to content

Recommended Posts

  • Replies 251
  • Created
  • Last Reply
Guest Urban Legend
జన్మభూమితో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టాం

టెలీ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

12213510BRK90A.JPG

అమరావతి: ఈ జన్మభూమి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచి సంతృప్తి స్థాయిని అధికం చేసిందని అభిప్రాయపడ్డారు. శాశ్వతమైన, మెరుగైన జీవన ప్రమాణాలకు  జన్మభూమి నాంది పలికిందన్నారు. తొమ్మిదో రోజు జన్మభూమి నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లాల కలెక్టర్లు  ఇందులో పాల్గొన్నారు. గత మూడున్నరేళ్లుగా అభివృద్ధిపై, ఆర్ధిక అసమానతల తగ్గింపుపై దృష్టి పెట్టామని స్పష్టం చేసిన సీఎం.. స్వల్పకాలిక, మధ్య తరహా, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేశామని గుర్తుచేశారు. ఇప్పటివరకు 9,51,822 ఫిర్యాదులు రాగా.. 6,85,104 అప్‌లోడ్ చేశారని, 2,16,272 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారని సీఎం వివరించారు. విద్యార్ధులు నెలకోసారి గ్రామాలను సందర్శించి గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.
ఐఎస్‌వో 9001 సర్టిఫికేషన్ సాధించిన కృష్ణా జిల్లా కలెక్టర్‌కు సీఎం అభినందనలు తెలిపారు. కృష్ణా జిల్లా స్ఫూర్తితో ప్రతి కలెక్టరేట్‌లో ప్రమాణాలు పెరగాలని సూచించారు. అత్యున్నత ప్రమాణాలు, ఫిర్యాదుల పరిష్కారం, ప్రజా సంతృప్తిలో కృష్ణా జిల్లా ముందుందని సీఎం అభినందించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...