Jump to content

రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న జై లవకుశ


Ramesh39

Recommended Posts

 
మొట్టమొదటిసారిగా త్రిపాత్రాభినయం చేసి.. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లో అన్న కల్యాణ్‌రామ్ నిర్మాతగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా జై లవకుశ. నివేథా థామస్, రాశిఖన్నా హీరోయిన్లుగా, సాయికుమార్, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి మొదలగువారు నటించిన ఈ సినిమా సూపర్ హిట్‌ టాక్‌‌ను సంపాదించి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలయిన మొదటిరోజు నుంచే క్లాస్, మాస్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఫిదా చేస్తోందీ సినిమా. అందుకు తగ్గట్టుగానే వారం రోజుల్లోనే వంద కోట్ల రూపాయల కలెక్షన్లు దాటేసి.. 150 కోట్ల మార్కు వైపు దూసుకెళ్తోంది. యూఎస్ తెలుగు మూవీ డిస్ట్రిబ్యూషన్‌లో అమెరికాలో కూడా ఈ సినిమా విడుదలయింది. దాదాపు 185కు పైగా స్క్రీన్లలో విడుదలయిన జై లవకుశ ఎన్నారైలను విపరీతంగా ఆకట్టుకుంటోంది..
 
అమెరికాలో మంగళవారం వరకు జై లవకుశ సినిమా 14 లక్షల 52వేల 048 డాలర్లను కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు మంగళవారం వరకు వచ్చిన కలెక్షన్ల వివరాలను సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. అమెరికాలో బుధవారం ఈ సినిమా ప్రీమియర్ల ద్వారా విడుదల అయింది. బుధవారం నుంచి మంగళవారం వరకు అమెరికాలో జై లవకుశ కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి. 
 
బుధవారం ప్రీమియర్లు+ గురువారం కలెక్షన్లు=== 7 లక్షల 44వేల 130 డాలర్లు
శుక్రవారం కలెక్షన్లు==== 2 లక్షల 64వేల 952 డాలర్లు
శనివారం కలెక్షన్లు===== 2 లక్షల 83వేల 593 డాలర్లు
ఆదివారం కలెక్షన్లు===== 1,01,935 డాలర్లు
సోమవారం కలెక్షన్లు===== 16వేల 388 డాలర్లు
మంగళవారం కలెక్షన్లు===== 38వేల 025 డాలర్లు
మొత్తం==== 14 లక్షల 52 వేల 049 డాలర్లు (9.54 కోట్ల రూపాయలు.)
 

అమెరికాలో రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా.. ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను రాబడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా జై లవకుశ సినిమా ఇప్పటివరకు 132 కోట్ల రూపాయలను కలెక్ట్  చేసినట్లు సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు ట్వీట్ చేశారు. బాహుబలి-2 తర్వాత ఈ యేడాది ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నింటిలోనూ రెండవ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా జై లవకుశ నిలిచిందంటున్నారు. విడుదలయిన మొదటి వారంలోనే 132 కోట్ల రూపాయల కలెక్ష్లను కొల్లగొట్టి రికార్డులను తిరగరాస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. లాంగ్‌రన్‌లో ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచే అవకాశముందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...