Jump to content

71 లక్షల కుటుంబాలకు ‘వెలుగు’


Recommended Posts

71 లక్షల కుటుంబాలకు ‘వెలుగు’
 
  • 10 వేల ఆదాయానికి ప్రభుత్వ కార్యాచరణ
  • ఎక్కడి పరిశ్రమలకు అక్కడే మానవ వనరుల అందుబాటు
  • సాగు, డెయిరీ, రిటైల్‌లో శిక్షణ
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై దృష్టి
  • సెర్ప్‌ ద్వారా వ్మూహాత్మక ప్రణాళిక
  • 2 వేల మంది మహిళలకు శిక్షణ
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): సమాజ, కుటుంబ వికాసానికి నడుంబిగించిన సీఎం చంద్రబాబు ఆ దిశగా కార్యాచరణకు సిద్ధమయ్యారు. సమాజ వికాసానికి రాష్ట్రంలో ప్రతి కుటుంబం ఆర్థికాభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందని సీఎం భావిస్తున్నారు. దీనికిగాను ప్రతి కుటుంబానికీ నెలకు రూ.10 వేల ఆదాయం వచ్చేలా చర్యలకు ఉపక్రమించారు. పేదరిక నిర్మూలనా కార్యక్రమం కోసం ఉద్దేశించిన ‘వెలుగు’ పథకం ద్వారా వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తున్నారు. మహిళా సాధికారత ద్వారా ఈ లక్ష్యాలను సాధించాలని యోచిస్తున్నారు.
 
రాష్ట్రంలో ప్రస్తుతం 80 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్న సుమారు 71 లక్షల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నాయి. ఈ కుటుంబాల జీవనోపాధి, వారి జీవన ప్రమాణాలు పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధ్యయనం చేసి కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. 3 నెలల్లోపు ఒక దశ, దిశ కల్పించనున్నారు. రాష్ట్రంలో ఈ కుటుంబాలు ఏ జీవనోపాధులపై ఆధారపడ్డాయన్న దానిపై సర్వే నిర్వహించారు. ప్రధానంగా 22.58 లక్షల మంది వ్యవసాయ కూలిపై ఆధారపడి జీవిస్తున్నారు. వారందరికీ మెరుగైన జీవనోపాధులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే 11.63 లక్షల మంది పశుసంపదపై ఆధారపడి ఉన్నారు. పాడిపశువులతో పాటు మేకలు, గొర్రెలు మేపుకుంటున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి పరిశ్రమ ద్వారా ఎక్కువ మందికి ఉపాధి కల్పించేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ తరహా జీవనోపాదులు కలిగి న కుటుంబాలపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.
 
వీరి కి పాలిచ్చే మేలుజాతి పశువులను కొనుగోలు చేసి ఇవ్వడం, ఎక్కడికక్కడ పాలకేంద్రాలను ఏర్పాటు చేయడం, వాటికి అనుబంధంగా కోళ్ల పెంపకం తదితరాలను ప్రోత్సహిస్తే ప్రయోజనం ఉంటుంద ని భావిస్తున్నారు. సుమారు 60 లక్షల మంది మహిళల ఆదాయాన్ని పాడి, పశువుల యూనిట్లు నెలకొల్పడం ద్వారా పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. పాడి పశువుల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు భారతీయ ఆగ్రో ఇండసీ్ట్రస్‌ ఫౌండేషన్‌ శిక్షణ ఇస్తోంది. వారి సహకారంతో ఈ కుటుంబాలకు శిక్షణ ఇప్పించి పాల ఉత్పత్తులు, గొర్రెలు, మేకలతో పాటు కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. కోళ్ల సరఫరాకు సంబంధించి కెగ్‌ ఫార్మ్స్‌ ఇప్పటికే సేవలందిస్తోంది. ఈ సంస్థ ప్రతి జిల్లాలో ఒకటో, రెండో కోళ్ల హేచరీ్‌సను ఏర్పాటు చేయనుంది. పాడి, పశు సంపదతో పాటు వస్త్రపరిశ్రమపై కూడా దృష్టి సారించనున్నారు. ఈ క్రమంలో మహిళలకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఐఎల్‌ఎ్‌ఫఎస్‌ సంస్థ సెర్ప్‌తో ఒప్పందం చేసుకుని భారీ సంఖ్యలో శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతోంది.
 
2 వేల మంది మహిళలకు శిక్షణ
హిందూపూర్‌లో ఇండియా డిజైన్స్‌ సంస్థ ద్వారా 2 వేల మంది మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు శ్రీకా రం చుట్టారు. ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే అక్కడే ఆ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కల్పన జరగాలని భావిస్తున్నారు. పరిశ్రమల ను ఆకర్షించే ప్రాంతాల్లో మానవ వనరులు అభివృ ద్ధి చేయనున్నారు. వస్త్ర, నిర్మాణ పరిశ్రమలకు సం బంధించి చిత్తూరు, అనంతపురం జిల్లాలకు చెం దిన వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగవకాశాలు కల్పించనున్నారు. సేవారంగంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. అరకొర చదువులు చదువుకున్న మహిళలకు సైతం హౌస్‌కీపింగ్‌, హాస్పిటాలిటీ, సెక్యూరిటీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తారు. ఎల్‌ఈడీ బల్బులు అమర్చడం, ఎలకా్ట్రనిక్‌ వస్తువులు అమర్చడానికి సంబంధించి నిరుపేదలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు. అదేవిధంగా రిటైల్‌ రంగంపై దృష్టిసారిస్తారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...