Jump to content

‘స్థానిక’ సమరంలో తెదేపా విజయకేతనం


Ramesh39

Recommended Posts

అమరావతి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. ఈ ఎన్నికలను తెదేపా, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుని తెదేపా.. ప్రతిపక్ష వైకాపాకు గట్టి షాకే ఇచ్చింది. 40 ఏళ్ల వైఎస్‌ కంచుకోటను తాము బద్దలు కొట్టామంటూ తెదేపా శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

కడప గడపలో తెదేపా పాగా 
కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెదేపా కైవసం చేసుకుంది. తెదేపా అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి(బీటెక్‌ రవి)... వైకాపా అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఓటింగ్‌ ప్రక్రియ పూర్తకాకముందే ఓటమి నిర్ధారణ కావడంతో వైకాపా శ్రేణులు ఓటింగ్‌ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 433 ఓట్లు రాగా.. వైకాపాకు 399 ఓట్లు వచ్చాయి.

కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను తెదేపా, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ పడ్డాయి. గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డాయి. ఓట్ల లెక్కింపులో తొలుత వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో కొనసాగగా.. అనంతరం తెదేపా అభ్యర్థి బీటెక్‌ రవి క్రమంగా ఓట్లను పెంచుకుంటూ ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. చివరకు బీటెక్‌ రవి 34 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు.

కర్నూలు ‘స్థానిక’ ఎమ్మెల్సీ తెదేపాదే 
కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై తెదేపా అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 64 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపాకు 565 ఓట్లు రాగా.. వైకాపాకు 501 ఓట్లు వచ్చాయి. 11 ఓట్లు చెల్లనివిగా ప్రకటించగా.. ఒకటి నోటా వచ్చింది.

నెల్లూరులో తెదే‘పాగా’ఘన విజయం 
నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా ఘనవిజయం సాధించింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైన గంటకే ఫలితాలను కలెక్టర్‌ ప్రకటించారు. ఈ ఫలితాలలో వైకాపా అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డిపై తెదేపా అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. మొత్తం ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 852 ఓట్లుండగా.. ఎన్నికల్లో 851 ఓట్లు పోలయ్యాయి. అందులో 465 ఓట్లు తెదేపాకు, 378 ఓట్లు వైకాపాకు వచ్చినట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు.

Link to comment
Share on other sites

ఏపీ సీఎం ఛాంబర్‌లో సంబరాలు

విజయవాడ: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక స్థానాలను తెదేపా గెలుచుకోవడంతో ఏపీ సీఎం ఛాంబర్‌లో నేతలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విజయం పట్ల నేతలు , మంత్రులు సీఎం చంద్రబాబునాయుడుకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావును చంద్రబాబు ప్రశంసించారు.

* స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంపట్ల తెదేపా యువనేత నారా లోకేశ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కార్యకర్తలదే అన్నారు. కడప జిల్లాలో బీటెక్‌ రవి విజయానికి నాయకులు, కార్యకర్తలు శ్రమించారన్నారు.

Link to comment
Share on other sites

చరిత్రను తిరగరాయబోతున్నాం: చంద్రబాబు

విజయవాడ: కసిగా పనిచేసి తెలుగుజాతి అంటే ఏమిటో నిరూపిస్తామని తెదేపా అధినేతమ చంద్రబాబునాయుడు అన్నారు. నేడు అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ప్రజలు కూడా మిమ్మిల్ని చూసి బాధపడే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రతిపక్షాలకు హితవు పలికారు. రాష్ట్రం విడిపోయినప్పుడు కట్టుబట్టలతో వచ్చామని.. తనపై నమ్మకంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని అన్నారు. మంచిమాట ఎవరు చెప్పినా విని ఆచరిస్తామన్నారు. తనను, ఎన్టీఆర్‌ను మాత్రమే నేరుగా ప్రజలు ఎన్నుకున్నారని.. మిగిలిన వారు దిల్లీని చూపించి ఓట్లు అడిగారని అన్నారు. ప్రతిపక్షాలు రాజధానికి భూములు ఇవ్వకుండా అడ్డుపడ్డాయని అన్నారు. అమరావతికి వాస్తుబలం ఉందన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...