Jump to content

Balyya PA


MSDTarak

Recommended Posts

తెలుగుదేశం పెట్టిననాటినుంచి పార్టీకోసం కష్టపడి పనిచేస్తున్న నాయకులు సైతం శేఖర్‌ను కలవకుండా పనులు చేయించుకోలేని పరిస్థితి. శేఖర్ వసూళ్ల బాదుడు భరించలేక కొందరు టీడీపీ నేతలు బయటకు రావడం మానేసారు.. ఈ విషయం తెలిసినా బాలయ్య స్పందించట్లేదట.. శేఖర్ పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు వార్నింగులిస్తుంటారని, అన్ని కార్యాలయాలు ఆయన గ్రిప్ లో ఉంటాయని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శేఖర్ చంద్రబాబును, లోకేష్‌బాబులను కలిసి నియోజకవర్గ పనులపై చర్చిస్తున్నారట.. బాలయ్య సినిమాల్లో బిజీగా ఉండడమూ దీనికో కారణమే.. అయితే ఇప్పటివరకూ బాలయ్యపై భయభక్తులు, అభిమానంతో చూసి, చూడనట్టు వ్యవహరించిన టీడీపీ నేతలు ఇక తమ వల్ల కాదనే నిర్ణయానికి వచ్చారు. గతంలొ శేఖర్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ.. కరపత్రాల పంపిణీ కూడా జరిగింది.మండలంలోని కిరికెర వద్ద ఓ తోటలో హిందూపురం టీడీపీ నేతలు సమావేశమయ్యారు. శేఖర్ తమను ఎలా వేధిస్తున్నాడో ఒకరికొకరు చెప్పుకున్నారు. నిన్నకాక మొన్న పీఏ తమపై పెత్తనం చెలాయించడం ఏమిటని కొందరు ఫైర్ అయ్యారు.

 

ఇలాంటి బానిస బతుకులు బతకాల్సిన అవసరం తమకు లేదని, వెంటనే పీఏను తొలగించకపోతే అందరూ కలిసి మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇంతకాలం అన్నగారి కుటుబంమీద అభిమానంతో సర్దుకుపోయాం.. ఇకమావల్ల కాదు.. మాజీ ఎమ్మెల్యే వెంకటరాముడు వారిని శాంతింపచేసేందుకు ప్రయత్నించినా వారు మాట వినలేదట.. శేఖర్ వసూలు చేస్తున్న కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో తేల్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు. కానీ కొందరు మాత్రం బాలకృష్ణ ఎట్టిపరిస్థితుల్లో శేఖర్‌ను పీఏ స్థానం నుంచి తొలగించే అవకాశమే లేదంటున్నారు. స్థానిక టీడీపీ నేతలు, విపక్ష వైసీపీ ఆరోపిస్తున్నట్టు శేఖర్ వసూలు చేస్తున్న డబ్బంతా బాలయ్యకు చేరుతుందా.? లేకుంటే బాలయ్య ఎందుకు సపోర్ట్ చేస్తారనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై బాలకృష్ణ ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...