Jump to content

‘ఉద్దానం’పై సర్కారు స్పీడు


sonykongara

Recommended Posts

‘ఉద్దానం’పై సర్కారు స్పీడు
 
636202147368288234.jpg
  • ఇంటింటి సర్వేకు నిర్ణయం
  • 19న మంత్రి, కమిటీ సభ్యుల పర్యటన
  • అదే రోజు ఢిల్లీకి మంత్రి కామినేని
  • ‘ఉద్దానం’పై కేంద్ర మంత్రికి నివేదిక
  • సోంపేట, పలాసలో డయాలసిస్‌ సెంటర్లు
అమరావతి, జనవరి 16 (ఆంధ్రజ్యోతి) : ఉద్దానంసమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం స్పీడు పెంచింది. అక్కడి కిడ్నీ వ్యాధిగ్రస్థులను ఆదుకోవడమే ప్రధాన ధ్యే యంగా ముందుకు కదులుతోంది. ఇప్పటికే రంగంలోకి దిగి న ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివా్‌స..మరోసారి ఆ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈసారి ఆయనతోపాటు ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులందరినీ రం గంలోకి దించాలని నిర్ణయించారు. ఈ నెల 19న ఆయనతో పాటు ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్యతో ఆ శాఖ ఉన్నతాధికారులందరూ ఉద్దానంలో పర్యటించనున్నారు. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి ప్రబలడానికి గల కారణాలు, అక్కడి పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై వీరు అధ్యయనం చేయనున్నారు. అనంతరం ఓ సమగ్ర నివేదిక రూపొందించనున్నారు. ఉద్దానంలో పర్యటన అనంతరం మంత్రి కామినేని శ్రీనివాస్‌ నేరుగా ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. అక్కడ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు. ఉద్దానం పర్యటన వివరాలు, వారు తయారు చేసిన నివేదికలను కేంద్రమంత్రికి కామి నేని అందిస్తారు. అంతేకాకుండా నడ్డా ఇచ్చిన హామీ ప్రకా రం కేంద్ర బృందాలు త్వరగా ఉద్దానంలో పర్యటించి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా కామినేని ఆయనను కోరనున్నారు.. 19నాటి పర్యటనపై ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య సోమవారం ఉన్నతాధికారులతో ఇక్కడ సమీక్ష నిర్వహించారు. ఉ ద్దానం సమస్యపై ప్రత్యేకంగా ఇం టింటి సర్వే చేయాలన్న విషయంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఉద్దానం ప్రాంతంలోని సుమారు వంద గ్రామాల్లో కిడ్నీ వ్యాధి సమస్య ఉంది. ఈ గ్రామాల్లో సుమారు లక్షా 20 వేల మంది ప్రజలు జీవిస్తున్నారు. ఆరోగ్య శాఖ సర్వే అనంతరం.. ఎంతమంది ఈ సమస్యతో బాధపడుతున్నారో సృష్టమైన సమాచారం లభిస్తుంది. ఈ సమాచారం ద్వారా ఆ ప్రాంతంలో ఎన్ని డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాట్లు చేస్తే కిడ్నీ సమస్యను నియంత్రించవచ్చనే దానిపై ప్రభుత్వానికి సృష్టత రానుంది.
 
మరో రెండు డయాలసిస్‌ సెంటర్లు
శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఉన్న మూడు డయాలసిస్‌ సెంటర్లతో పాటు మరో రెండింటిని ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సాధారణంగా ప్రతి జిల్లాకు రెండు డయాలసిస్‌ సెంటర్లు మాత్రమే ఉం టాయి. ఉద్దానంలో కిడ్నీ సమస్య వెలుగులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పాలకొండలో ఒక డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీనిని నెల రోజుల క్రితం మంత్రి కామినేని ప్రారంభించారు. ఈ మూడు డయాలసిస్‌ సెంటర్లతో పాటు మ రో రెండింటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం టెక్కలి, శ్రీకాకుళం రిమ్స్‌, పాలకొండలో డయాలసిస్‌ సెంటర్లు రోగులకు అందుబాటులో ఉన్నాయి. ప్రభు త్వం నూతనంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్న సెంటర్లు ఉద్దానానికి దగ్గరలో ఉంటే బాగుటుందని అధికారులు భావిస్తున్నారు. ఉద్దానానికి సమీపంలో ఉండే సోంపేట, పలాస ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే అందరికి అందుబాటులో ఉంటుందని అంటున్నారు. ఈరెండు డయాలసిస్‌ సెంటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఏర్పాటు చేస్తాయా.. లేదా రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రెండు డయాలసిస్‌ సెంటర్లు ఏర్పాటు చేసి, కేంద్ర సర్కారు మరికొన్ని ఏర్పాటు చేయాలని విన్నవిస్తుందా అన్న విషయంపై ఇంకా సృష్టత రాలేదు. ఉద్దానంలో ఉన్న పరిస్థితిని అంచనా వేసిన స్థానిక అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న మూడు డయాలసిస్‌ సెంటర్లతో పాటు మరో నాలుగు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించారు.
 
నిపుణుల కమిటీ నియామకం
ఉద్దానం కిడ్నీ సమస్యపై సమగ్ర ఆధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ వైస్‌ చాన్సలర్‌, ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ టి.రవిరాజును చైర్మన్‌గా నియమించింది. ఆయనతో పాటు జార్జ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వివేకానంద, చెన్నైకి చెందినప్రముఖ నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ జార్జ్‌ అబ్రహం, స్విమ్స్‌నెఫ్రాలజిస్ట్‌ డాక్టర్‌ వి.శివకుమార్‌, ఆంధ్రా మెడికల్‌ కళాశాల నెఫ్రాలజీ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ జి. ప్రసాద్‌, శ్రీకాకుళం రిమ్స్‌లో కమ్యూనిటీ మెడిసిన్‌ ఫ్రొఫెసర్‌ డాక్టర్‌ ఎ.కృష్ణవేణి ఈ కమిటీ సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు బెంగుళూరుని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌లో విధులు నిర్వహిస్తున్న ఎన్విరాన్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ ఒకరిని తీసుకుంటారు. ఈ కమిటీ కిడ్నీ వ్యాధులు రావడానికి గల కారణాలపై సమగ్రంగా ఆధ్యయనం చేయనుంది.
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...