Jump to content

రామోజీ ఫిలింసిటీలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’


Ramesh39

Recommended Posts

15tollywood-12a.jpg

 

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రియ కథానాయిక. హేమామాలిని కీలక పాత్రలో కనిపించనున్నారు. వై.రాజీవ్‌రెడ్డి నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణ జరుగుతోంది. బాలకృష్ణ, శ్రియలపై నృత్య దర్శకురాలు బృంద నేతృత్వంలో ఓ గీతాన్ని తెరకెక్కించారు. దీంతో చిత్రీకరణ పూర్తయింది. మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. జనవరి 12న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. డిసెంబరు మొదటి వారంలో ప్రచార చిత్రాన్ని, రెండోవారంలో పాటల్నీ విడుదల చేస్తారు. కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. ‘‘తెలుగు జాతి గర్వించదగిన వీరుడి కథ ఇది. గౌతమిపుత్ర శాతకర్ణి గురించి చరిత్ర చెప్పిన విషయాలతో పాటు, మేం పరిశోధించిన అంశాల్నీ తెరపై ఆవిష్కరిస్తున్నాం. యుద్ధ నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆకట్టుకొంటాయ’’ని చిత్రబృందం తెలిపింది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...