Jump to content

Abbooo ee bussu chudandi


gaddamhemanth

Recommended Posts

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ హిల్లరీ క్లింటన్‌పై విజయం సాధించారు. ఈ విజయం ఓ తెలుగు వ్యక్తికి అమితమైన ఆనందాన్ని ప్రసాదిస్తోంది. ఆ తెలుగు వ్యక్తి పేరు అవినాష్. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టిన వెంటనే అవినాష్‌ను అరిజోనా గవర్నర్‌గా గానీ, పార్టీలో కీలక పదవిలో గానీ నియమించవచ్చునని అంటున్నారు. అవినాష్ ట్రంప్ వ్యూహ బృందంలో ఒకరు. ట్రంప్ విజయంతో అతని పంట పండే అవకాశం ఉంది. ఇంతకీ ఈ అవినాష్ ఎవరనే ఆసక్తి చెలరేగడం సహజం. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోనసీమ కుర్రవాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ అవినాష్ వ్యూహాలతో విజయం సాధించలేకపోవడానికి కారణం, ట్రంప్ విజయం సాధించడానికి కారణాలు ఏమిటనేది తెలియాల్సే ఉంది. మీడియా కథనలా ప్రకారం - తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు గ్రామానికి చెందిన ఇరగవరపు పాపారావుకు ఇద్దరు కుమారులు కాగా వారిలో అవినాష్‌ పెద్ద కుమారుడు. అవినాష్‌ తాత తమ్మిరాజు మునసబుగా ఉండేవారు. ఆయన దగ్గర ఓనమాలు దిద్దిన అవినాష్‌ ప్రస్తుతం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు కోసం వ్యూహాలు రచించాడు.
ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం - అవినాష్‌ విద్యాభ్యాసం రాజమహేంద్రవరంలో సాగింది. తాతయ్య, అమ్మమ్మ, మేనమామల పర్యవేక్షణలో ఆయన చదువుకున్నారు. సెంటెన్స్‌ స్కూల్‌లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన ఆయన విజయవాడ గీతాంజలిలో ఇంటర్‌, విశాఖపట్నంలో ఇంజనీరింగ్‌ పూర్తిచేసి ఆ తర్వాత లక్నో ఐఐఎంలో ఎంబీఏ పూర్తిచేశారు. రాజకీయ కుటుంబం కావడంతో అవినాష్ చిన్ననాటినుంచి రాజకీయాలపై మక్కువ పెంచుకున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన తర్వాత ఇన్‌టెల్‌లో ఉద్యోగం చేస్తూనే ఇండియాలో రాజకీయ పార్టీలపై ప్రజలకున్న అభిప్రాయాలు గురించి డాటా ఎనాలసిస్‌ చేస్తుండేవారు. ఈనేపథ్యంలో 2014లో తనకున్న పరిచయాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి వ్యూహకర్తగా వ్యవహరించారు. తదనంతరం అమెరికాలోనే ఆరిజోనా రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్న తన భార్య రంజనను కలుసుకునేందుకు వెళ్లిన సమయంలో ఆరిజోనా గవర్నర్‌ పదవి కోసం జరుగుతున్న ఎన్నికలను నిశితంగా పరిశీలించారు. డేటా ఎనాలసిస్ట్‌ కావడంతో గవర్నర్‌ పదవికి పోటీపడుతున్న జూసీకి గెలుపు వ్యూహాల గురించి ఈ-మెయిల్స్‌ పంపుతుండేవారు. ఆ ఎన్నికల అనంతరం అవినాష్‌ మేధాశక్తిని గుర్తించిన రిపబ్లికన్‌ పార్టీ ట్రంప్‌ ప్రచార వ్యూహబృందంలో ఆయనకు చోటు కల్పించింది. మొదట్లో రిపబ్లికన్‌ పార్టీకి డేటా ఎనలిస్టుగా, ఆ తర్వాత రాజకీయ పరిశీలకుడిగా విధులు నిర్వహించేవారు. అవినాష్‌ పదునైన వ్యూహాలను గుర్తించడంతో ఆరిజోనా రాష్ట్రం రిపబ్లికన్‌ పార్టీకి ఈడీ(ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌)గా నియమించారు. అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్‌లోను, సభలు, సమావేశాల్లోను అవినాష్‌ రాసిచ్చిన ఉపన్యాసాలకు ట్రంప్‌ అధిక ప్రాధాన్యమిచ్చారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...