Jump to content

అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ తోడ్పాటు

Ramesh39

Recommended Posts

అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ తోడ్పాటు 

మోదీ 

0410brk97a.jpg

దిల్లీ: సింగపూర్‌ ప్రధాని లీ సియన్‌ భారత పర్యటన కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం దిల్లీలో ప్రధాని మోదీని కలిసిన లీ సియన్‌ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం సహా పలు అంశాలపై చర్చించారు. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై చర్చలు జరిపిన అనంతరం ఇరు దేశాల ప్రధానులు సంయుక్త మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ... భారత్‌, సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి సింగపూర్‌ తోడ్పడుతుందని వివరించారు. గతేడాది పర్యటనలోనే ఇరు దేశాల మధ్య ఒప్పందాలపై రోడ్‌ మ్యాప్‌ తయారుచేశామని పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ధి అంశంలో సింగపూర్‌తో ఒప్పందం కుదిరిందని ప్రకటించారు.

సింగపూర్‌ ప్రధాని లీ సియోన్‌ మాట్లాడుతూ.. గతేడాది భారత్‌- సింగపూర్‌ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరిందని వెల్లడించారు. ఇరు దేశాల వాణిజ్య సంబంధాలపై పరస్పరం చర్చించుకున్నామన్నారు. ఉరీ దాడి మృతులకు సింగపూర్‌ ప్రధాని నివాళులర్పించారు.

Link to comment
Share on other sites

CBN meeting leda??

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...