Jump to content

రాష్ట్రానికి అప్పుల తిప్పలు


OnlyTDP

Recommended Posts

వచ్చే ఐదేళ్లలో రూ.3,05,364 కోట్లకు అప్పు

10 లక్షల కోట్లకు జీఎస్‌డీపీ

ఆర్థిక శాఖ అంచనాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు అప్పుల తిప్పలు తప్పేలా లేవు. విభజన వల్ల తలెత్తిన ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు ఎడాపెడా అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఐదేళ్ల తర్వాత అప్పటి వరకూ తీసుకున్న అప్పులు, వడ్డీలు చెల్లించేందుకే ప్రత్యేకంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని తాజాగా రూపొందించిన ఒక నివేదికలో ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ నివేదికను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబుకి కూడా సమర్పించారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రెండింతలకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాజాగా ఆర్థిక శాఖ రూపొందించిన అంచనాలు పరిశీలిస్తే అప్పు లేకపోతే రాష్ట్రం ముందుకు సాగని పరిస్థితి ఉన్నట్లు స్పష్టమవుతోంది. వేతనాలు, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించాలంటే అప్పులు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు. 2021-22 నాటికి పెరగనున్న రుణభారంపై ఆర్థిక శాఖ అంచనాలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న రుణాలు గరిష్ఠంగా 10 ఏళ్ల కాలపరిమితితో ఉన్నవి. ఇలా ఒకే కాలపరిమితితో తీసుకోవడం వల్ల ఖజానాపై భారం పెరిగిపోతుందని భావించిన ఆర్థిక శాఖ ఇటీవల వ్యూహం మార్చి మార్కెట్‌ బారోయింగ్స్‌ను 15 ఏళ్లు, 20 ఏళ్లు, ఐదేళ్ల కాలపరిమితితో తీసుకోవడం మొదలుపెట్టింది. మార్కెట్‌ సమీకరణాల ప్రకారం రాష్ట్రం తీసుకునే అప్పుపై తక్కువ వడ్డీ పడుతుందనుకున్న సమయంలో ఎక్కువ కాలపరిమితితో రుణాలు తీసుకుంటున్నారు. అప్పుల ఒత్తిడిని తట్టుకునేందుకు ఈ వ్యూహం పనిచేస్తుందని భావిస్తున్నారు. ఆర్థిక శాఖ సిద్ధం చేసిన అంచనాల ప్రకారం, 2021-22 నాటికి రాష్ట్రం అప్పులు రూ.3,05,364 కోట్లకు చేరుకోనున్నాయి.

 

ఇందులో మార్కెట్‌ బారోయింగ్‌ రుణాలే అధికమొత్తంలో ఉంటాయని అంచనా. ప్రస్తుత రూ.1.11 లక్షల కోట్ల వరకూ ఉన్న మార్కెట్‌ బారోయింగ్స్‌ 2021-22 నాటికి రూ.2.13 లక్షల కోట్లకు చేరే అవకాశాలున్నాయని ఆ అంచనాల నివేదికలో పేర్కొన్నారు. అలాగే, నాబార్డ్‌ రుణాలు రూ.3,579 కోట్ల నుంచి రూ.8442 కోట్లకు, పబ్లిక్‌ అకౌంట్స్‌ ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.35,105 కోట్ల రుణాలు రూ.42,109 కోట్లకు చేరుకోనున్నాయి. అయితే, చిన్న మొత్తాల పొదుపు, కేంద్రం నుంచి తీసుకునే రుణాలు మాత్రం 2022 నాటికి తగ్గుతాయని అంటున్నారు. చిన్న మొత్తాల ద్వారా ప్రస్తుతం ఉన్న రూ.16,528 కోట్ల రుణాలు 2022 నాటికి రూ.10,463 కోట్లకు తగ్గుతాయని అంచనాలు సిద్ధం చేశారు. కాగా, 2021-22 నాటికి రాష్ట్ర జీఎ్‌సడీపీ కూడా గణనీయంగా పెరగనుందని అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం రాష్ట్ర జీఎ్‌సడీపీ రూ.6.26 లక్షల కోట్లుగా ఉంది. అయితే, 2022 నాటికి జీఎ్‌సడీపీ ఏకంగా పది లక్షల కోట్లకు చేరుకుంటుందని తాజా అంచనాల్లో పేర్కొన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం... జీఎ్‌సడీపీలో 3శాతం మొత్తాన్ని రాష్ట్రం రుణంగా తీసుకునే వెసులుబాటు ఉంది. దీంతో రాష్ట్ర రుణ పరిమితి కూడా గణనీయంగా పెరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం జీఎ్‌సడీపీ మేరకు రూ.18,796 కోట్ల వరకూ రుణంగా తీసుకునే అవకాశం ఉంది. 2022 నీటికి అప్పటి అంచనా జీఎ్‌సడీపీ గణాంకాల మేరకు మార్కెట్‌ బారోయింగ్స్‌ రూ.30,271 కోట్లకు చేరుకుంటాయని అధికారులు అంచనాలు సిద్ధం చేశారు.

Link to comment
Share on other sites

Idi chala common nothing new

 

State form ayinapude telusu ga appulu techi govt run cheyali ani

 

Even rich state TG 60crores per day appu tho nadisindi last year mana poor state techukunte tappu em undi?

 

Appulu 10 years short term ade long term ayithe ne better deniki AJ bokkalo article

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...