Jump to content

inti inti ki inkudu guntha


Recommended Posts

ఇంటింటికీ ఇంకుడు గుంత
 
635973157246524356.jpg
  • రాష్ట్రంలోని 1.45 కోట్ల ఇళ్లలో తవ్వాలి
  • పది లక్షల పంట కుంటలు లక్ష్యం
  • జల సంరక్షణ పనులకు జియో ట్యాగింగ్‌
  • ఉదయం, సాయంత్రం మాత్రమే ఉపాధి పనులు
  • శాఖలన్నీ సమన్వయంతో ముందుకు సాగాలి
  • టెలి కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆదేశం
విజయవాడ, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): ‘ఇంటింటికీ ఇంకుడు గుంత’ నినాదంతో ప్రజల్ని చైతన్యపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని కోటీ 45లక్షల ఇళ్లలో ఇంకుడు గుంతలు తవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. ‘‘నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఎంతో కీలకం. వేసవిలో మరో ఐదువారాల సమయం మాత్రమే ఉంది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి’’ అని సీఎం సూచించారు. నీరు-చెట్టు, పంట సంజీవని పనులపై పదివేలమంది అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో మంగళవారం సీఎం విజయవాడ నుంచి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలాలు జూన్‌ నాటికి 8 మీటర్లు, డిసెంబర్‌ నాటికి 3 మీటర్లలో ఉండేలా పంట సంజీవని, నీరు-చెట్టు, ఎన్టీఆర్‌ జలసిరి వంటి కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు.
 
ఇందుకోసం అవసరమయ్యే నిధుల సమీకరణ బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాలని, పారదర్శకత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రమే ఉపాధి హామీ పనులు జరిగేలా చూడాలన్నారు. చెరువుల పూడికతీత, చెరువు కట్టలను బలోపేతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. జల సంరక్షణ పనుల అమలు కోసం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యానవన, జలవనరుల శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఒక్కో గ్రామంలో 100 చొప్పున పదివేల గ్రామాల్లో పది లక్షల పంటకుంటలు తవ్వాలన్నారు. ‘‘కష్టకాలంలో ఉన్నప్పుడు మన వంతు కర్తవ్యం నిర్వర్తించాలి. సమయం వృథా చేసుకుంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందరి సహకారం ఉంటే తక్కువ కాలంలో ఎక్కువ పనిచేయొచ్చు.
 
పట్టిసీమ, తాత్కాలిక సచివాలయం నిర్మాణాలను ఈ తరహాలోనే పూర్తి చేశాం’’ అని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో మానవ వనరులు, అవకాశాలున్నాయని... వాటిని సద్వినియోగం చేసుకోవడమే మన కర్తవ్యం అని తెలిపారు. పంట సంజీవని అమలులో కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో పురోగతి ఉందని చంద్రబాబు చెప్పారు. విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం జిల్లాలు వెనుకబడ్డాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో పనులు చురుగ్గా సాగాలన్నారు.
 
అలాగే నీరు-చెట్టు కార్యక్రమంలో... చిత్తూరు, అనంతపురం, కర్నూలు, కడప, ప్రకాశం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాలు ముందున్నాయని సీఎం తెలిపారు. నీరు-చెట్టుకు గతేడాది మే నెలలో రూ.670కోట్లు ఖర్చు చేశామని, ఈ ఏడాది రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేయాలని సూచించారు. ఎన్టీఆర్‌ జలసిరి కింద చిత్తూరు జిల్లాలో 200 బోర్లు వేస్తే 92శాతం విజయవంతం అయ్యాయని తెలిపారు. కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు. అన్ని జల సంరక్షణ పనులకు జియో ట్యాగింగ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.
 
ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలి
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖలకు జాతీయస్థాయిలో అవార్డులు రావడం అభినందనీయమని సీఎం అన్నారు. విద్యుత శాఖకు ఐదు జాతీయ అవార్డులు వచ్చాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల రాకలో గుజరాత తర్వాత ఏపీ ముందంజలో ఉందని సీఎం తెలిపారు. అన్ని శాఖల అధికారులు దీనిని స్ఫూర్తిగా తీసుకుని అంకిత భావంతో పనిచేస్తే అద్భుత ఫలితాలను సాధించవచ్చన్నారు. ఏపీ అన్ని రంగాల్లో ముందుండాలని ఆకాంక్షించారు.
Link to comment
Share on other sites

Pushkara kalam munde cheppadu Babu...

 

Inkudu gunthalu..watershed programmes....ivanni naa chinnapdu naku ippatikii gurtundi...congress vollu navvaru...dabbulu tagalestunadu..

CBN hi-tech city lu ani,,, inkudu guntalu aniii ee babu ni dincheyalli...ani

 

kani cut cehste ayina chesina panulu thone TG state ki revenue vachindi...manki bochu migilindi...

Link to comment
Share on other sites

Pushkara kalam munde cheppadu Babu...

 

Inkudu gunthalu..watershed programmes....ivanni naa chinnapdu naku ippatikii gurtundi...congress vollu navvaru...dabbulu tagalestunadu..

CBN hi-tech city lu ani,,, inkudu guntalu aniii ee babu ni dincheyalli...ani

 

kani cut cehste ayina chesina panulu thone TG state ki revenue vachindi...manki bochu migilindi...

Link to comment
Share on other sites

గుంటూరు జిల్లాలో ఊరూరా ఇంకుడు గుంతల నిర్మాణాలు
 
  • సీఎం పిలుపునందుకుని కదులుతున్న ప్రజానీకం 
  • అన్ని నియోజకవర్గాల్లో నీరు చెట్టు కార్యక్రమాలు 
  • ముందుండి నడిపిస్తున్న ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
ఇది మహోద్యమం.. నీటి బొట్టును ఒడిసి పట్టే కార్యాచరణ పథం.. ఇంటికో ఇంకుడు గుంత.. పొలానికో నీటి కుంట అనే నినాదంతో ఊరూరా సాగుతున్న జలోద్యమం. భగభగమని మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా కదులుతున్న తీరు సర్వత్రా హర్షనీయం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఇంకుడు గుంత, ఫాంపాంట్ల నిర్మాణం.. నీరు చెట్టు కార్యక్రమం జిల్లాలో ఉధృతంగా కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారుల వెంట ప్రజానీకం వెన్నంటి నిలుస్తోంది.
ఆంధ్రజ్యోతి, గుంటూరు: నీటి విలువ ఇప్పుడు తెలిసొచ్చింది. వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్వచ్ఛంధ సేవా సంస్థల నిర్వాహకులు ఇంకుడుగుంతల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరోవైపు పంట సంజీవని కార్యక్రమం కింద ఉపాధి హామి నిధులతో జిల్లాలో లక్ష నీటి కుంటల నిర్మాణం వడివడిగా ముందుకు సాగుతోంది. పల్నాడులోనే కాకుండా డెల్టాలోనూ ఇంకుడు గుంతలు, నీటి కుంటలను పెద్దఎత్తున నిర్మిస్తోన్నారు. ఈ రెండు కార్యక్రమాలను జిల్లాలో ఉద్యమబాట పట్టించేందు కు నేతలు, అధికారులు విస్త్రృతంగా శ్రమిస్తున్నారు.
2004 సంవత్సరానికి ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఇంకుడుగుంతల నిర్మాణా నికి పిలుపునిచ్చారు. అప్పట్లో కార్యక్రమం ఒక మోస్తరుగా జరిగినా ఆ తర్వాత దానిని ముందుకు కొనసాగించలేక పోయారు. రెండేళ్ల నుంచి సగటు వర్షపాతం తక్కువగా నమోదు అవుతుండటంతో పాటు ఈ ఏడాది వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు నిర్మించిన ప్రాజెక్టులతో దిగువకు వరద నీరు ప్రవహించడం లేదు. ఎప్పుడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్‌ వద్ద కృష్ణానదిలో నీటిమట్టం కనిష్టంగా ఐదు అడుగులకు పడిపోయింది. కృష్ణానది ఎండిపోయి నెర్రెలిచ్చిన భూమితో బావురుమంటోన్నది. దీని ప్రభావం ప్రజల పైనే కాకుండా సకల జీవరాసులపై పడుతోన్నది. పల్నాడులోని అటవీ ప్రాంతం నుంచి దాహార్తిని తట్టుకోలేక జింకలు ఇతర వన్యప్రాణులు గ్రామాల్లోకి వస్తోన్నాయి. ఇప్పటికే కొన్ని మృత్యువాత పడ్డాయి.
పరిస్థితి కఠోరంగా మారడంతో సీఎం చంద్రబాబునాయుడు ఇంకుడుగుంతలు, నీటి కుంటల నిర్మాణానికి పిలుపునిచ్చారు. కనీసం వచ్చే వర్షాకాలం నాటికి వీటిని పూర్తి చేసుకొని నీటిని ఒడిసి పట్టుకొంటే తాగు, సాగునీటికి కొరత రాదని, అలానే కరువురహితంగా జిల్లా రూపుదిద్దుకొంటుందని స్పష్టం చేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీడీపీ నాయకులు బాధ్యత తీసుకొన్నారు. గురజాల, వినుకొండ, అమరావతి, గుంటూరు తూర్పు, పశ్చిమ, చిలకలూరిపేట, నరసరావు పేట, సత్తెనపల్లి తదితర నియోజకవర్గాల్లో బాధ్యత తీసు కొని ఇంకుడుగుంతల నిర్మాణాలను ప్రారంభించారు. పంట సంజీవని కార్యక్రమం కింద ప్రతీ మండలంలో రెండు వేలకు పైగా నీటి కుంటల నిర్మాణాలను ప్రారంభించారు. ఉపాధి హామీ కింద పనులకు వ్యవసాయ కూలీలు హాజరయ్యేలా చైతన్యపరుస్తున్నారు.
ఇందుకోసం పల్లె నిద్ర కార్యక్రమాలు కూడా చేపట్టారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు బుధవారం రాత్రి నియోజకవర్గంలో పల్లెనిద్ర చేశారు. ఇదే బాటలో ఇతర ఎమ్మెల్యేలు నడుస్తోన్నారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి, టీడీపీ గుంటూరు తూర్పు ఇనచార్జ్‌ మద్ధాళి గిరిధర్‌ గురువారం తూర్పు నియోజకవర్గంలో ఇంకుడుగుంటల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...