Jump to content

2398cr tho e-Pragati (AP)


Recommended Posts

రూ.2398 కోట్లతో ఈ-ప్రగతి

కాగిత రహిత ప్రభుత్వ కార్యకలాపాలు

ధ్రువీకరణ పత్రాలులేని పాలనే లక్ష్యం

అందుబాటులోకి సమీకృత సమాచారనిధి

ఈనాడు - హైదరాబాద్‌

10ap-panel9a.jpg

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పరిపాలనలో సమూల మార్పులకు ఈ-ప్రగతి, ఈ-కార్యాలయ ప్రాజెక్టులు కీలకం కానున్నాయి. సన్‌రైజ్‌ ఏపీ లక్ష్యసాధన, పారదర్శకపాలన కోసం ‘ఈ-ప్రగతి’ ప్రాజెక్టు చేపట్టనుంది. దాదాపు రూ.2,398 కోట్ల ఖర్చుతో దీనిని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. ఈ ప్రాజెక్టు అమలుతో అవినీతి రహిత పాలన, పారదర్శకంగా లబ్ధిదారులకు సేవలందించేందుకు వీలు కలుగుతుంది. రానున్న మూడేళ్లలో ఏపీ సర్కారు రూ.1,528 కోట్లు ఖర్చుచేయనుంది. మెరుగైన పౌరసేవల్లో ఇది కీలకం కానుంది.

10ap-panel9aa.jpg ఈ-ప్రగతిలో ఏముంటాయంటే...

* సమీకృత సమాచార నిధి (డేటాబేస్‌)తో అక్రమాలకు తావులేకుండా అర్హులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందుతాయి.

* పౌరుల వివరాలతో కూడిన సమాచారనిధి సిద్ధమవుతుంది. ఈ వివరాల నమోదుకు క్షేత్రస్థాయి అధికారులకు లక్ష ట్యాబ్‌లను పంపిణీ చేశారు.

* ఓటరు నమోదు వివరాలు, వాహనాల రిజిస్ట్రేషన్‌, డ్రైవర్‌ లైసెన్సు, నైపుణ్య శిక్షణ నమోదు, ఉద్యోగాలు, పొందుతున్న వేతనాలు, ఆదాయపన్ను చెల్లింపులు, పాస్‌పోర్టు వివరాలన్నీ నమోదు చేస్తారు.

* మనిషి పుట్టుక నుంచి మరణం వరకు జీవనంలో అవసరమైన పౌరసేవలన్నీ ఆన్‌లైన్లో పొందొచ్చు.

* ప్రస్తుతం ప్రజలకు వివిధ శాఖల నుంచి దాదాపు 103 ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయి.

* ప్రభుత్వ సేవల్లో సందేహాలు తలెత్తినప్పుడు నివృత్తి చేసుకునేందుకు, ప్రభుత్వ పథకాల్లో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారానికి, అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందించేందుకు కోసం డయల్‌ ఏపీ కేంద్రం ఉంటుంది.

ఈ-కార్యాలయం విశేషాలివీ....

* ఇప్పటికే కీలకమైన ప్రభుత్వ విభాగాలన్నిటిలో కాగిత రహిత పరిపాలన అమలు జరుగుతోంది. దీంతో ఒక అధికారి నుంచి మరో అధికారికి దస్త్రం తిరిగే సమయం తగ్గింది.

* దస్త్రం ఎప్పుడు...ఎవరి దగ్గర ఎన్నిరోజులుందో తెలుసుకోవచ్చు. నిర్ణీత గడువు దాటినా దస్త్రాన్ని ఎందుకు పరిష్కరించలేదో చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ విధానంతో అధికారుల్లో జవాబుదారీతనం పెంపొందుతుంది.

* ఉన్నతాధికారులు కార్యాలయంలో లేనప్పటికీ, అవసరమైన, అత్యవసరమైన దస్త్రాలను ఈ-కార్యాలయం సాఫ్ట్‌వేర్‌ ద్వారా వెంటనే పరిష్కరించవచ్చు.

తొలిదశలో 10 విభాగాలు...

ఈ-ప్రగతి ప్రాజెక్టును తొలిదశలో 10 విభాగాల్లో అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇప్పటికే ప్రాథమిక, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఈ-ప్రగతి ప్రాజెక్టు టెండరు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నెలాఖరు నాటికి పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రాజెక్టులకు టెండర్లు పిలవనుంది. 2016 డిసెంబరు నాటికి తొలిదశ పూర్తవుతుంది. రెండోదశలో నీటిపారుదల, రవాణా, మౌలిక సదుపాయాలు, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, కార్మిక, మహిళా శిశుసంక్షేమ, గృహనిర్మాణ తదితర శాఖల్లో అమలు చేస్తుంది. మిగతా ప్రభుత్వ విభాగాలకు సంబంధించి మూడోదశలో ప్రాజెక్టును 2017 డిసెంబరుకు పూర్తిచేయనుంది.

 

ఐటీకి తగ్గిన కేటాయింపులు

10ap-panel9c.jpg

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీలో ఐటీ అభివృద్ధికి 2016-17 ఆర్థికసంవత్సరానికి రూ.360.21 కోట్లు కేటాయించారు. ఇది గత కేటాయింపు(రూ.370 కోట్లు) కంటే స్వల్పంగా తక్కువ. ఐటీ కార్యకలాపాలు నిర్వహించేందుకు వీలుగా మౌలిక సదుపాయాలతో కూడిన ప్రైవేటు భవనాలను డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు (డీటీపీ)లుగా ప్రభుత్వం గుర్తించనుంది. ఈ పార్కుల్లో ఐటీ కంపెనీలు కార్యకలాపాలు వెంటనే ప్రారంభించేందుకు సర్కారు ప్రోత్సాహకాలు ప్రకటించింది. డీటీపీలను ప్రోత్సహించేందుకు, ఐటీ ప్రచారం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో భారీగానే కేటాయింపులు చేసింది. ఈ కేటగిరీలో రూ.123.65 కోట్లు పేర్కొంది. ఇంజినీరింగ్‌, ఎంసీఏ, ఎంబీఏ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు బడ్జెట్‌లో రూ.4 కోట్లు కేటాయించింది. విశాఖలో 600 ఎకరాల్లో, విజయవాడలో 500 ఎకరాల్లో, తిరుపతిలో 225 ఎకరాల్లో ఐటీ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.3 కోట్లు, ఏపీ ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్కిటెక్చర్‌కు (ఈ-ప్రగతి) రూ.17.53 కోట్లు, ఎలక్ట్రానిక్స్‌ ఐటీ ఏజెన్సీకి రూ.146.87 కోట్లు, జాతీయ ఈ-పరిపాలన ప్రణాళికకు రూ.49.40కోట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించింది. ఐటీ రంగం

10ap-panel9d.jpg

ఏం చెప్పారు

* రాష్ట్రస్థాయి ఎంటర్‌ప్రైజెస్‌ ఆర్కిటెక్ట్‌ నిర్మాణం

* రాష్ట్రానికి ప్రత్యేక డేటా కేంద్రం ఏర్పాటు

* అర్హులకు ప్రయోజనాలు.. అవినీతిరహిత, పారదర్శక పాలన.

* ఐటీ ప్రాజెక్టుల నిర్వహణకు నిధుల కేటాయింపు

10ap-panel9b.jpg ఏం చేశారు

ఐటీ, ఎలక్ట్రానిక్‌ పెట్టుబడులను ఆకర్షించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారు. చిత్తూరు జిల్లాను మొబైల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఐదు ఎలక్ట్రానిక్‌ తయారీ పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించారు. డిజిటల్‌ ఇండియాలో భాగంగా ఏపీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు ఐటీ ప్రగతిలో కీలకం కానుంది. ఏప్రిల్‌ నుంచి ఇంటింటికీ రూ.150కే అంతర్జాలం, కేబుల్‌ సేవలు అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండో విడత ప్రాజెక్టు సమగ్ర నివేదిక కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. రానున్న మూడేళ్లలో రూ.2,400 కోట్ల ఖర్చుతో ఈ-ప్రగతి ప్రాజెక్టు చేపట్టనున్నారు.

 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...