Jump to content

భారత నావికాదళ నగరం విశాఖ


sonykongara

Recommended Posts

భారత నావికాదళ నగరం విశాఖ
సముద్ర వివాదాల పరిష్కారానికి ప్రత్యేక విభాగం అవసరం
సంపద సృష్టిలో సాగరం కీలకం
ఒకే హోదా ఒకే పింఛనుతో రూ.7,483 కోట్ల భారం
సియాచిన్‌లో ఇప్పటివరకు వెయ్యి మంది సైనికులు మృతి
భారత రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌
విశాఖపట్నం నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి
7ap-panel7a.jpg

సముద్ర సరిహద్దులకు సంబంధించి దేశాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించుకోవడం తక్షణ అవసరం అని భారత రక్షణశాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ అన్నారు. ఇలాంటి వివాదాలను పరిష్కరించుకొనేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేసే దిశగా కృషిచేయాలని సూచించారు. అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్షతో విశాఖ భారత నావికాదళ నగరంగా మారిపోయిందని ఆయన అన్నారు. ఆదివారం విశాఖపట్నంలో అంతర్జాతీయ మారిటైం సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సదస్సుకు వివిధ దేశాల నావికాదళాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పారికర్‌ కీలకోపన్యాసం చేస్తూ ‘‘భౌగోళికంగా నేలపై హద్దులు గీసుకోగలం. జలాలపై హద్దులు కుదరదు. సాగర జలాల ద్వారా అందరం కలసికట్టుగానే ఉన్నాం. ఏవైనా సమస్యలు, వివాదాలు ఉంటే పరిష్కరించుకొనే మార్గాలను మారిటైం సదస్సు వేదికగా అన్వేషించాలి. భూతాపం, కాలుష్యం మూలంగా సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ఇలాంటి సవాళ్లపై దృష్టి సారించాలి. దేశ అభివృద్ధిలో సాగర తీరం పాత్ర ఎంతో ఉంది. సాగర జలాలు, తీరం ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేవి మాత్రమే కాదు... సంపద సృష్టిలో కీలకంగా మారాయి. చమురు, ఖనిజాలు, భారఖనిజాలు, ఆహారాన్నీ సముద్రం అందిస్తోంది’’ అన్నారు. భారత నావికాదళ ప్రధాన అధికారి అడ్మిరల్‌ ఆర్‌.కె.ధోవన్‌ మాట్లాడుతూ సాగర జలాలతో అనుసంధానమై ఉన్న దేశాల మధ్య సమాచార మార్పిడి పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘70శాతం ప్రకృతి విపత్తులు హిందూ మహా సముద్రంలోనే సంభవిస్తున్నాయి. ఆయా సమయాల్లో భారత నావికాదళం తక్షణమే ప్రతిస్పందిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సముద్రమార్గాల్లో హిందూ మహాసముద్ర మార్గం ద్వారానే 33శాతం సరకు, 40 శాతం చమురు రవాణా అవుతోంది. అంతర్జాతీయ సముద్ర భాగస్వామ్యం ద్వారానే తీర రక్షణతోపాటు సముద్ర తలంపై శాంతిని కాపాడగలం’’ అన్నారు. కార్యక్రమంలో నావికాదళ విశ్రాంత ప్రధానాధికారి డి.కె.జోషి, తూర్పునౌకాదళం ప్రధానఅధికారి వైస్‌ అడ్మిరల్‌ సతీష్‌ సోని తదితరులు పాల్గొన్నారు.

7ap-panel7b.jpg

దశాబ్దాల సమస్యను పరిష్కరించింది మోదీ ప్రభుత్వమే
మారిటైం సదస్సు అనంతరం పారికర్‌ విలేకరులతో మాట్లాడారు. భారత సైనిక దళాల ఉద్యోగులకు సంబంధించి రెండు ముఖ్యమైన నిర్ణయాలను నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొందని తెలిపారు. ఒకే ర్యాంకు... ఒకే ఫించన్‌ సమస్య దశాబ్దాల తరబడి ఉంటే మోదీ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు.దీనిపై ఆడిట్‌ చేయిస్తే రూ.7,483 కోట్లు ఆర్థిక భారం పడుతుందని తేలిందని.. ఇప్పటికే రూ.500 కోట్లు విడుదల చేశారని చెప్పారు. ఇక బకాయిలకు రూ.10,980 కోట్లు అవసరమవుతుందని.. అవి నాలుగు విడతల్లో ఇస్తామన్నారు. సియాచిన్‌ దుర్ఘటనలో పదిమంది సైనికులు మరణించడం దురదృష్టకరమన్నారు. సియాచిన్‌లో ఇప్పటివరకు భారత సైన్యం 1000మంది సైనికులను కోల్పోయిందని పారికర్‌ తెలిపారు. అనూహ్య ప్రకృతి పరిస్థితులే అందుకు కారణమని చెప్పారు. పాక్‌తో ఉన్న సర్‌ క్రీక్‌ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవల్సి ఉందన్నారు. బాలీవుడ్‌ తారలు అక్షయ్‌కుమార్‌, కంగన రనౌత్‌లు అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్షకు ప్రచారకర్తలు కారని.. ఆహ్వానితులు మాత్రమే అని తెలిపారు.

7ap-panel7c.jpg

7ap-panel7d.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...