Jump to content

బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్‌


sonykongara

Recommended Posts

బందరురోడ్డు విస్తరణ టెండర్‌ ఖరారు

ప్రాజెక్టు వ్యయం- 925 కోట్లు.. ఫ్లైఓవర్‌కు 67 కోట్లు
బెజవాడకు మంచి రోజులు వచ్చాయి. రాజధానిగా మారిన అదృష్టమో, ముఖ్యమంత్రి చంద్రబాబు నగరంలోనే ఉంటున్న కారణమో, ఏదేమైనా నగరానికి మహర్దశ పట్టింది. ఏళ్ల తరబడి నానిన సమస్యలు అన్నీ ఒక్కొక్కటిగా చకచకా పరిష్కారమవుతున్నాయి. దుర్గగుడి ఫ్లైఓవర్‌ వాస్తవ రూపం దాల్చినందుకు మురిసి పోతుండగానే పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు పట్టిన గ్రహణం కూడా వీడింది. విజయవాడ - మచిలీ పట్నం జాతీయ రహదారి విస్తరణకు పిలిచిన టెండర్‌ను మధ్యప్రదేశకు సంస్థ దక్కించుకుంది.
 

విజయవాడలోని బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ పనులకు గురువారం ఢిల్లీలో టెండర్‌ను ఖరారు చేసినట్టు తెలిసింది. ఫ్లైఓవర్‌, జాతీయ రహదారి విస్తరణ కలిపి మొత్తం 925 కోట్లకు డిఐబి సంస్థ దక్కించుకుంది. జాతీయరహదారుల శాఖ వేసిన అంచనా వ్యయం కన్నా కొంత తక్కువకే టెండర్‌ ఖరారైనట్టు సమాచారం.
గతంలో కాలయాపన
2004 లోనే ఈ రోడ్డు విస్తరణకు అప్పటి ప్రభుత్వం పిపిపి పద్ధతిలో టెండర్లు పిలవగా మధుకాన సంస్థ సుమారు 600 కోట్లకు దక్కించుకుంది. టెండర్‌ దక్కించుకున్న మధుకాన పనులు మొదలు పెట్టకుండా కాలయాపన చేసింది. ఆర్థిక సంస్థల నుంచి సహకారం లభించకపోవడంతో చివరికి చేతులెత్తేసింది. ఈ లోగా విస్తరణ పనుల అంచనా వ్యయం తడిసి మోపెడు అయింది. తరువాత అధికారంలోకి వచ్చిన ఎనడీఏ ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాలేదు. అంచనా వ్యయం పెరగడంతో పీపీపీ గిట్టుబాటు కాదని ఆయా సంస్థలు తేల్చి చెప్పాయి. ఈ పరిస్థితులలో జాతీయరహదారుల శాఖ తన ఆధ్వర్యంలోనే బిల్లులు చెల్లించే పద్ధతిలో పనులు చేపట్టాలని నిర్ణయించింది. తాజాగా ఆశాఖ తయారు చేసిన అంచనాల ప్రకారమే పనుల విలువ రూ.925 కోట్లకు చేరింది. ఇందులో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న 65 కిలోమీటర్ల రహదారిని వి స్తరించడంతో పాటు బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌ కూడా చేర్చారు.
పద్మవ్యూహంలా ట్రాఫిక్‌

 

విజయవాడ రాజధానిలో భాగమైన నాటి నుంచి ఈ రహదారిపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగింది. పదేళ్ళ క్రితం అప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ జాతీయ రహదారిని నాలుగు లేన్ల రహదారిగా విస్తరించటానికి సర్వే చేశారు. ఉయ్యూరు, పామర్రు ప్రాంతాలలో బైపాస్‌లను వేయటానికి అవసరమైన భూమిని కూడా 90 శాతం సేకరించారు. బెంజ్‌సర్కిల్‌ నుంచి కంకిపాడు వరకు ఉన్న రహదారిని 120 నుంచి 150 అడుగుల వరకు విస్తరించటానికి ప్లాన సిద్ధం చేశారు. బెంజ్‌సర్కిల్‌ వద్ద ఫ్లైఓవర్‌ లేకపోవడంతో ప్రస్తుతం ట్రాఫిక్‌ నిర్వహణ పద్మవ్యూహంలా తయారయింది. సహజంగా పెరిగిన ట్రాఫిక్‌ రద్దీతో పాటు నగరానికి తరచుగా వస్తున్న వీఐపీల తాకిడి కూడా పెనుసవాల్‌గా మారింది. గన్నవరం విమానాశ్రయానికి కూడా రద్దీ పెరగడంతో జాతీయ రహదారి మీద తరచూ ట్రాఫిక్‌ స్తంభించిపోతోంది.
అధికారుల ఉరుకులు పరుగులు
కనకదుర్గ ఫ్లైఓవర్‌ నిర్మాణాన్ని ఆరునెలలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. పుష్కరాలలోగా ఈ పనులు పూర్తి చేయించటానికి ఆయన అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. ఎంపి కేశినేని నాని ఈ పనుల టెండర్‌ విషయంలో ఢిల్లీలో లాబియింగ్‌ చేసి కేంద్రమంత్రి గడ్కరీపై ఒత్తిడి తెచ్చారు. ఢిల్లీలో ఆయన వెంటపడటం వల్లే బెంజ్‌సర్కిల్‌ ఫ్లైఓవర్‌కు త్వరగా మోక్షం వచ్చిందనటం అతిశయోక్తి కాదు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...