Jump to content

పవన్ రికార్డు బ్రేక్ చేసిన ఎన్.టి.ఆర్


swas

Recommended Posts

ఈ మధ్య కాలంలో ఓవర్సీస్ లో తెలుగు సినిమా అమార్కేట్ ఎక్కువైంది. చిన్న హీరోల సినిమాలు కూడా ఎక్కువ లొకేషన్స్ లో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. ప్రసతుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఓవర్సీస్ రారాజు అనే పేరుంది. ఎందుకంటే మహేష్ బాబు నుంచి వచ్చిన సినిమాల్లో 5 సినిమాలు అక్కడ 1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ 2 1 మిలియన్ మార్క్ సినిమాలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. గత ఏడాది ఎన్.టి.ఆర్ టెంపర్ తో రెండవ 1 మిలియన్ మార్క్ సినిమాని నమోదు చేసి, పవన్ పక్కన నిలిచాడు. అలాగే అల్లు అర్జున్, నానిలు కూడా రెండు రెండు 1 మిలియన్ మార్క్ సినిమాలను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ ఇప్పుడు తారక్ నాని, అల్లు అర్జున్ మరియు పవన్ కళ్యాణ్ లను వెనక్కి నెత్తి రేసులో ముందుకు వెళ్ళిపోయాడు. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమా యుఎస్ లో 1.5 మిలియన్ మార్క్ కి దగ్గరైంది. అంతే కాకుండా బాద్ షా, టెంపర్ ల తర్వాత నాన్నకు ప్రేమతో తారక్ మూడవ 1 మిలియన్ మార్క్ సినిమాగా నమోదైంది. దీంతో ఓవర్సీస్ మార్కెట్ లో మహేష్ బాబు తర్వాత ఎన్.టి.ఆర్ స్టార్ అయ్యాడు. యుఎస్ లో ఏ హీరో ఎన్నెన్ని 1 మిలియన్ మార్క్ సినిమాలు తమ ఖాతాలో వేసుకున్నారో ఆ వివరాలు మీకోసం..

హీరో పేరు 1 మిలియన్ మార్క్ మూవీస్

మహేష్ బాబు 5 సినిమాలు
ఎన్.టి.ఆర్ 3 సినిమాలు
పవన్ కళ్యాణ్ 2 సినిమాలు
అల్లు అర్జున్ 2 సినిమాలు
నాని 2 సినిమాలు
ప్రభాస్ 1 మూవీ

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...