Jump to content

హిందూపురంలో 'డిక్టేటర్' టికెట్ల వేలంపాట


crazyfanofnbk

Recommended Posts

హిందూపురం: హిందూపురం అంటే ఎవరికైనా ఇట్టే గుర్తుకు వచ్చేది.. ఎన్‌.టి.ఆర్, నందమూరి బాలకృష్ణ ఎందుకంటే ఈ నియోజకవర్గంతో నందమూరి కుటుంబానికి, తెలుగుదేశం పార్టీకీ విడదీయరాని బంధం ఉంది. ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి నందమూరి బాలకృష్ణ శాసనసభ్యులుగా ఉన్నారు. బాలయ్య సినిమా విడుదలవుతోందంటే హిందూపురంలో అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. తాజాగా.. బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డిక్టేటర్’ సంక్రాంతి కానుకగా గురువారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ‘డిక్టేటర్’ సినిమా టికెట్లకు బుధవారం పట్టణంలో వేలం పాట నిర్వహించి బాలయ్య అభిమానులు తమ ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు. ఈ వేలం పాటలో మొదటి టికెట్‌ను ఆలిండియా నందమూరి ఫ్యాన్స్‌ అధ్యక్షుడు నంబూరి సతీష్‌- రూ.13,500, రెండో టికెట్: నందమూరి ఫ్యాన్స్‌ హిందూపురం టౌన్ అధ్యక్షుడు బండారు బాలాజీ- రూ.13,000, మూడో టికెట్: కిరికెర సర్పంచ్ హెచ్‌.ఎన్‌ రాము- రూ.10,116లకు కైవసం చేసుకున్నారు. ఈ టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయంతో బాలకృష్ణ పేరు మీద సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...